Updates
► బిల్డింగ్ ఐదో అంతస్తులో హాస్పిటల్‌లో పనిచేసే నర్సులు హాస్టల్ ఉందని మంటలు అంటుకోవడంతో హుటాహుటిన కిందికి వచ్చేసామని సుమారు 100 మంది నర్సుల సర్టిఫికెట్స్ కూడా పైనే వదిలేసి వచ్చామని నర్సులు విలపిస్తున్నారు.
► షార్ట్ సర్య్కూట్ కారణంగా ఆస్పత్రి టెరస్ ఔట్ లైట్లకు మంటలు అంటుకున్నాయి: అంకుర ఆస్పత్రి యాజమన్యం
► అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటను అదుపు చేశారు.
► రోగులెవరికీ ఏ ప్రమాదం జరగలేదని ఆస్పత్రి అధికారుల వెల్లడి
► సకాలంలో మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేయడంతో పెను ముప్పు తప్పింది.
► క్షేమంగా బయటపడ్డ ఆస్పత్రిలోని రోగులు
► ఫైర్ సిబ్బంది స్థానికులు సహకరించారు.
► పదో అంతస్తులో ప్లాస్టిక్ మెటీరియల్ అధికంగా ఉండటం వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
► ఆస్పత్రి నేమ్ బోర్డుకు మంటలు అంటుకొని వ్యాపించాయి. పక్కనే ఉన్న ఫ్లెక్సీకి మంటలు అంటుకోవడంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
► షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.
► మంటలను గమనించి రోగులను ఆస్పత్రి సిబ్బంది బయటకు పంపించారు.
► ఆస్పత్రితో గర్భిణీలు, పిల్లలు ఎక్కువ శాతం ఉన్నట్లు తెలుస్తోంది.
Big blaze in Ankura Hospital near pillar no 68 of PVNR Expressway in Jyothinagar area. No information on casualties. pic.twitter.com/K5D2cfL2zc
— serish (@serish) December 23, 2023
►ఐదు అంతస్తుల్లో మంటలు విస్తరించాయి. ఘటనా స్థలానికి నాలుగు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. ఐదో ఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆస్పత్రితో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఆగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment