గురు పూజోత్సవంలో పాల్గొన్న సింధు | Badminton p.v sindhu visits Teachers days celebrations | Sakshi
Sakshi News home page

గురు పూజోత్సవంలో పాల్గొన్న సింధు

Published Fri, Sep 6 2013 12:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

గురు పూజోత్సవంలో పాల్గొన్న సింధు

గురు పూజోత్సవంలో పాల్గొన్న సింధు

 మెహిదీపట్నం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు తాను చదువుకునే కళాశాల వేడుకల్లో పాలుపంచుకుంది. క్రీడల్లో ఎంత బిజీగా ఉన్నా గురువారం మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాలకు వచ్చి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇటీవలి విజయాలను పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ డాక్టర్ ఆంథోనమ్మ సింధూను అభినందించారు.
 
  కళాశాలలో నిర్వహించిన టీచర్స్ డేలో సింధు పాల్గొని తోటి విద్యార్థులతో ఆడి పాడింది. చాలా రోజుల తర్వాత తను కళాశాలకు రావడంతో తోటి విద్యార్థులు సింధుతో ముచ్చటించడానికి ఆసక్తి ప్రదర్శించారు. అంతేకాకుండా ఆమె చేసిన డాన్సులను విద్యార్థులు తమ కెమెరాల్లో బంధించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో కాంస్య పతకాన్ని సాధించిన అనంతరం కళాశాలకు ఇదే మొదటిసారి రావడంతో అధ్యాపకులు, విద్యార్థులు ఆమెను ప్రశంసించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement