హైదరాబాద్ : బాలుడుపై కిరోసిన్ పోసిన ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. సంఘటన జరిగిన సమయంలో ఆర్మీ అధికారులు ఎవరూ అక్కడ లేరని తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలో దోబీ కుటుంబం ఉందని, ఆ సమయంలో దోబీ కూడా నివాసంలో లేడని పేర్కొన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులపై వస్తున్న వార్తలు వదంతులేనని అన్నారు.
కాగా మెహిదీపట్నం మిలటరీ క్యాంపులో షేక్ ముస్తఫా అనే బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ఈరోజు ఉదయం మృతి చెందాడు. ఆర్మీ జవాన్ల పనేనని స్థానికులు, బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మిలటరీ గ్యారిసన్ వద్ద ఉద్రిక్తత నెలకొనటంతో భారీగా పోలీసులు మోహరించారు.
మరోవైపు ఈ ఘటనపై రూమర్లు నమ్మవద్దని వెస్ట్జోన్ డీసీపీ సత్యనారాయణ సూచించారు. బాలుడి వాంగ్మూలం ఆధారంగా విచారణ జరుపుతున్నామన్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారని తెలిపారు. మూడు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు.
ఆ ఘటనతో మాకు సంబంధం లేదు
Published Thu, Oct 9 2014 10:35 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement