Military ground
-
కాలిన గాయాలతో ముస్తఫా మృతి
హైదరాబాద్: మెహిదీపట్నం మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లి దుండగులు నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన ముస్తఫా (11) గురువారం ఉదయం డీఆర్డీఎల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో మిలిటరీ ఏరియాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, సిద్ధిఖీనగర్ బస్తీవాసులు మిలిటరీ గ్రౌండ్‌కు భారీగా తరలివచ్చారు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు సిద్దిఖీనగర్‌లో అతని ఇంటికి తీసుకెళ్తున్న సమయం లో స్థానికులు మిలిటరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జిచేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో స్థానిక పోలీసులు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా 92 శాతం కాలిన గాయాలతో ముస్తఫా మృతి చెందినట్లు ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ టకియుద్దీన్ మీడియాకు తెలిపారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముస్తఫా కుటుంబ సభ్యులను మంత్రి పద్మారావు పరామర్శించారు.మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. జీహెచ్ఎంసీ రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుడి కుటుంబం మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రాతినిధ్యం వహిస్తున్న అహ్మద్‌నగర్ డివిజన్లో ఉండటంతో మేయర్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ మేరాజ్ హుస్సేన్ బాలుడి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు. సుమోటోగా స్వీకరించిన మైనారిటీ కమిషన్ ముస్తఫా (11) మృతిపై రాష్ట్ర మైనారిటీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. గురువారం ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈమేరకు కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను ఈ నెల 18 లోగా అందించాలని నగర పోలీసు కమిషనర్, వెస్ట్‌జోన్ డీసీపీ, హుమాయూన్ నగర్ ఇన్స్పెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల న ష్టపరిహారం, ఇంటివసతి కల్పించాలని, ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
చికిత్స పొందుతున్న ముస్తఫా మృతి
-
ఆ ఘటనతో మాకు సంబంధం లేదు
హైదరాబాద్ : బాలుడుపై కిరోసిన్ పోసిన ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. సంఘటన జరిగిన సమయంలో ఆర్మీ అధికారులు ఎవరూ అక్కడ లేరని తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలో దోబీ కుటుంబం ఉందని, ఆ సమయంలో దోబీ కూడా నివాసంలో లేడని పేర్కొన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులపై వస్తున్న వార్తలు వదంతులేనని అన్నారు. కాగా మెహిదీపట్నం మిలటరీ క్యాంపులో షేక్ ముస్తఫా అనే బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ఈరోజు ఉదయం మృతి చెందాడు. ఆర్మీ జవాన్ల పనేనని స్థానికులు, బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మిలటరీ గ్యారిసన్ వద్ద ఉద్రిక్తత నెలకొనటంతో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఈ ఘటనపై రూమర్లు నమ్మవద్దని వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ సూచించారు. బాలుడి వాంగ్మూలం ఆధారంగా విచారణ జరుపుతున్నామన్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారని తెలిపారు. మూడు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. -
చికిత్స పొందుతున్న ముస్తఫా మృతి
హైదరాబాద్ : మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లిన బాలుడిపై దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ముస్తఫా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందటంతో మోహదీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. మెహిదీపట్నం మిలిటరీ ప్రాంతంలోని సిద్దిఖీనగర్ బస్తీలో నివాసం ఉంటున్న షేక్ ముఖీదుద్దీన్, షాకేరాబేగంలకు నలుగురు సంతానం. వీరిలో ముస్తఫా (12) ఫస్ట్ లాన్సర్‌లోని మదర్సాలో చదువుకుంటున్నాడు. బక్రీద్ కు సెలవు ఉండడంతో బుధవారం తన స్నేహితులతో కలసి సమీపంలోని మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లాడు. అక్కడ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముస్తఫాను ఓ గదికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలుతున్న ముస్తఫా మైదానంలోకి పరుగెత్తి రక్షించండంటూ కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి.. ముస్తఫాను నానల్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు అక్కడ నుంచి సంతోష్‌నగర్‌లోని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడుతూ ముస్తఫా ఈరోజు ఉదయం చనిపోయాడు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొటంతో మిలటరీ క్యాంప్ ఎదుట పోలీసులు మోహరించారు. మరోవైపు బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మిలిటరీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము విచారణ జరిపామని, అందులో తమ సిబ్బంది హస్తం లేదని తేలిందన్నారు. (ఇంగ్లీష్ కథనం కోసం) -
బాలుడి పై కిరోసిన్ పోసి.. నిప్పంటించి
మెహిదీపట్నం మిలిటరీ గ్రౌండ్లో ఘాతుకం ఆర్మీ వ్యక్తులే చేశారని బాలుడి వాంగ్మూలం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం హైదరాబాద్: మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లిన బాలుడిపై దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఏ పాపం ఎరుగని చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి యత్నించారు. ఈ దారుణం బుధవారం హైదరాబాద్‌లోని మెహిదీపట్నం మిలిటరీ ఏరియాలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మెహిదీపట్నం మిలిటరీ ప్రాంతంలోని సిద్దిఖీనగర్ బస్తీలో నివాసం ఉంటున్న షేక్ ముఖీదుద్దీన్, షాకేరాబేగంలకు నలుగురు సంతానం. వీరిలో ముస్తఫా (12) ఫస్ట్ లాన్సర్‌లోని మదర్సాలో చదువుకుంటున్నాడు. బక్రీద్ కు సెలవు ఉండడంతో బుధవారం తన స్నేహితులతో కలసి సమీపంలోని మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లాడు. అక్కడ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముస్తఫాను ఓ గదికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలుతున్న ముస్తఫా మైదానంలోకి పరుగెత్తి రక్షించండంటూ కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి.. ముస్తఫాను నానల్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు అక్కడ నుంచి సంతోష్‌నగర్‌లోని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముస్తఫా 92 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. స్టేట్మెంట్ రికార్డు చేసిన మేజిస్ట్రేట్... ముస్తఫా స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేశారు. ఆర్మీ వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తన కుమారుడు వాంగ్మూలమిచ్చాడని తండ్రి షేక్ ముఖీదుద్దీన్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్లు హైదరాబాద్ మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుమాయున్‌నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆర్మీ వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాలుడు పేర్కొనడంతో సిద్దిఖీనగర్ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా, బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మిలిటరీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము విచారణ జరిపామని, అందులో తమ సిబ్బంది హస్తం లేదని తేలిందన్నారు.