Burnt Alive
-
యూపీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం!
ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. లక్నో జిల్లా, కకోరిలో గల హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలో రెండంతస్తుల భవనంలో మంగళవారం అర్దరాత్రి మంటలు చెలరేగాయి. ఇంతలో ఇంటిలోని సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒక జంటతో సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. హతా హజ్రత్ సాహెబ్ నివాసి ముషీర్ అలీ (50) జర్దోసీ పనితో పాటు పటాకుల వ్యాపారం కూడా చేస్తుంటాడు. మంగళవారం రాత్రి ఆయన ఇంటి రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇంతలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చేంతలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ముషీర్, అతని భార్య హుస్నా బానో (45), వారి బంధువుల పిల్లలు రాయ (5), హిబా (2), హుమా (3) మంటల్లో సజీవ దహనమయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న బనోయి అజ్మత్ (30), అనమ్ (17)ఇన్షా (16), లకబ్ (18)లను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రాణాలు తీసిన రూమ్ హీటర్.. తండ్రితో సహా 3 నెలల చిన్నారి మృతి
చలి వణికిస్తోంది. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా చలి తీవ్రంగా ఉంది. ఈ కారణంగా చాలా మంది ఇంట్లో ఉపశమనం కోసం రూమ్ హీటర్లను ఉపయోగిస్తారు. అయితే రూమ్ హీటర్లు వాడే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా ప్రాణాలకే రిస్క్. ఈ మధ్య కాలంలో హీటర్ల వల్ల కలుగుతున్న ప్రమాదాల గురించి వింటూనే ఉన్నాం. రూమ్ హీటర్లు గాలిలో తేమను తగ్గించగలవు. దీంతో ఆక్సిజన్ తగ్గిపోయి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. కొన్నిసార్లు అగ్ని ప్రమాదానికి కారణమై ప్రాణాలు కోల్పోవం వంటి ఘటనలు కూడా జరిగాయి. తాజాగా రాజస్థాన్‌లోనూ వాటర్ హీటర్ ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. హీటర్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఓ తండ్రి, మూడు నెలల చిన్నారి మృత్యువాతపడ్డారు. భార్య చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఖైర్తాల్-తిజారా జిల్లాలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. దీపక్ యాదవ్ అనే వ్యక్తి స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో చలిగా ఉందని రూమ్ హీటర్ ఆన్ చేశాడు. ఈ క్రమంలో హీట్ ఎక్కువై ఇంట్లో ఉన్న దూదికి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు చెలరేగడంతో దీపక్, అతని మూడు నెలల కుమార్తె నిషిక సజీవ దహనమయ్యారు. భార్య సంజు తీవ్రంగా గాయడింది. వీరి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, దీపక్ మరియు నిషిక మరణించినట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
Mumbai Hotel Fire: ఒక్కటవ్వకుండానే ఒక్కటిగానే వెళ్లిపోయారు..
ముంబై: ఆదివారం రోజున నైరోబీ వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ఓ జంట శాంతాక్రూజ్ సమీపంలో గెలాక్సీ హోటల్లో బస చేశారు. అంతలో అక్కడ అగ్నిప్రమాదం జరగడంతో ఆ జంట సజీవ దహనమయ్యారు. వీరితోపాటు ఆ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని గెలాక్సీ హోటల్‌లోహోటల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒక జంట కథ అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. మృతుడి సొంతూరైన రామ్‌పార్ గ్రామ సర్పంచ్ సురేష్ కారా తెలిపిన వివరాల ప్రకారం ఎన్నారై కిషన్ హాలాయ్(28) అతడికి కాబోయే భార్య రూపాలు వెకారియా(25) ఇద్దరి కుటుంబాలు గుజరాత్‌లోని రామ్‌పార్ గ్రామానికి చెందినవారే అయినా వారి పూర్వీకులు నైరోబీలో స్థిరపడటంతో వీరు కూడా అక్కడే పెరిగి పెద్దయ్యారన్నారు. వీరిరువురికీ పెద్దలు పెళ్లి కూడా నిశ్చయించారు.. అయితే కిషన్ సోదరుడి వివాహం నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారని వివాహం పూర్తవగానే కొత్తగా పెళ్ళైన జంటతో పాటు ఈ జంట తల్లిదండ్రులు నైరోబీ వెళ్లిపోగా కిషన్ మాత్రం బంధువులను కలిసి వెళదామని ఆగిపోవడంతో అతడితోపాటు రూపాల్ కూడా ఉండిపోయినాట్లు తెలిపారు. అన్ని పనులను పూర్తిచేసుకుని ఆదివారం వీరు కూడా నైరోబీ తిరిగి వెళ్లాల్సి ఉండగా అహ్మదాబాద్ నుండి ముంబై చేరుకున్నారు. తీరా ముంబై వచ్చాక విమానం ఆలస్యమవుతుందని తెలియడంతో శాంతాక్రూజ్ సమీపంలోని గెలాక్సీ హోటల్లో బస చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ జంట ఒక్కటవ్వకుండానే ఒక్కటిగా వెళ్లిపోయారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు సురేష్ కారా. ఇది కూడా చదవండి: సినిమా చూసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి.. ఏమైందంటే? -
Manipur Violence: మణిపూర్‌లో సజీవదహనమైన తల్లీకొడుకులు..
ఇంఫాల్: మణిపూర్‌లో తవ్వేకొద్దీ దారుణాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ చేతికి మొత్తం 20 కేసులను అప్పగించగా తాజాగా వారికి మరో సంచలనాత్మక కేసును అప్పగించారు మణిపూర్ పోలీసులు. ఆనాటి అల్లర్లలో బులెట్ గాయమైన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని ఆసుపత్రికి తీసుకెళ్తోన్న తల్లి, మేనత్తలను బిడ్డతో సహా సజీవ దహనం చేసిన ఈ సంఘటన అధికారులను సైతం కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 4న టాన్సింగ్(7) సహాయక శిబిరంలో ఉండగా మెయిటీ అల్లరి మూకలు జరిపిన కాల్పుల్లో ఒక బులెట్ అతడి తలలోకి దూసుకెళ్లింది. వెంటనే సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు అక్కడి ఎస్పీతో మాట్లాడి బాలుడి తోపాటు తల్లి, మేనత్తలను మాత్రమే వెంట ఆసుపత్రికి పంపాల్సిందిగా సూచించారు. ఎందుకంటే బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కుకీ తెగకు చెందిన వారు కాగా తల్లి మీనా హాంగ్సింగ్ మాత్రం మెయిటీ తెగకు చెందింది. ఆమెనైతే మెయిటీలు ఏమీ చేయరన్న ఉద్దేశ్యంతో అలా చేసినట్టు ఆర్మీ అధికారి తెలిపారు. అధికారి చెప్పినట్టుగానే బాలుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు ఎస్పీ. అంబులెన్స్ కు తోడుగా ఇంఫాల్ వెస్ట్ సూపరింటెండెంట్ సహా పోలీసుల ఎస్కార్టును కూడా పంపించారు ఆర్మీ ప్రతినిధులు. సరిగ్గా ఇంఫాల్ సరిహద్దుకు చేరుకోగానే సుమారు 2000 మంది గుంపు చుట్టూ మూగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కొంచెం వెనక్కి తగ్గినట్టే తగ్గి అలరిమూక ఒక్కసారిగా దాడి చేసి అంబులెన్సుకు నిప్పు పెట్టేశారు. పోలీసులు చూస్తుండగానే అంబులెన్స్ మంటల్లో చిక్కుకోగా అందులోని బాలుడు, అతడి తల్లి, మేనత్త సజీవ దహనమయ్యారు. బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కాంగ్పోక్పి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా.. లాంఫెల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే కేసు నమోదైంది. దీంతో సీబీఐ ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించి రెండు కేసులు ఒక్కటేనని తేల్చి దర్యాప్తు చేసే పనిలో పడింది. మణిపూర్‌లో రెండున్నర నెలలుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 160 మంది మృతి చెందగా అల్లర్ల సమయంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు -
మణిపూర్‌లో మరో ఘోరం.. ఫ్రీడం ఫైటర్ భార్య సజీవ దహనం
ఇంఫాల్: మణిపూర్ ప్రజలు గడిచిన రెండున్నర నెలలుగా కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోందను కుంటున్న తరుణంలో అల్లర్ల సమయంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మరువక ముందే ఒక మహిళను ఇంట్లోనే పెట్టి సజీవ దహనం చేసిన మరో ఘటన సెరౌ పోలీస్ స్టేషన్లో నమోదైంది. మే 28న కక్చింగ్ జిల్లాలోని సెరౌ గ్రామంలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడి భార్య ఐబెతొంబి(80)ను అల్లర్ల సమయంలో ఇంట్లోనే బంధించి ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో బాధితురాలు ఎటూ తప్పించుకోలేక అగ్నికి సజీవ దహనమైంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మనవడు ప్రేమకంఠ(22) పై సాయుధులైన నిరసనకారులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో అతడి చేతుల్లోకి తొడభాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్చగా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆరోజున ప్రమాదాన్ని పసిగట్టిన మృతురాలు కొద్దిసేపైన తర్వాత తిరిగి రండని చెప్పి ఇంట్లో వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పి తాను మాత్రం ఇంట్లోనే ఉండిపోయి అగ్నికి ఆహుతైందని చెప్పుకొచ్చాడు ప్రేమకంఠ. రెండు నెలల తర్వాత తిరిగొచ్చిన అతను శిధిలమైన ఇంటి నుండి జ్ఞాపకాలను తన వెంట తీసుకుని వెళ్ళాడు. వాటిలో మృతురాలి భర్త ఎస్. చురాచంద్ సింగ్(లేటు) భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా గౌరవ పురస్కారాన్ని స్వీకరించిన ఫోటో ఫ్రేము కూడా ఉంది. మణిపూర్ అల్లర్లలో అత్యధికంగా నష్టపోయిన గ్రామాల్లో సెరౌ గ్రామం కూడా ఒకటి. రాజధానికి 45 కి.మీ దూరంలో ఉండే ఈ ప్రాంతం హింసాకాండలో బాగా ప్రభావితమైంది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సగం కాలిపోయిన ఇళ్ళు.. తూటాల రంధ్రాలతో నిండిన గోడలు దర్శనమిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ప్రధాని పదవి నుండి తప్పుకుని సమర్ధులకి అప్పగించాలి.. అశోక్ గెహ్లాట్ -
రైలులో మంటలు..ఏడుగురు సజీవదహనం
కరాచీ: పాకిస్తాన్లో ఎక్స్‌ప్రెస్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న రైలు ఏసీ బోగీలో బుధవారం అర్ధరాత్రి తర్వాత మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే టాండో మస్తి ఖాన్ స్టేషన్లో రైలును ఆపేసి, మంటలు అంటుకున్న బోగీని వేరు చేశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఆరు మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీలు లేనంతగా కాలిపోయాయి. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. -
కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
సాక్షి, మేడ్చల్: కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మృతులంతా వరంగల్ జిల్లా ఒకే కుటుంబానికి చెందిన నరేష్, సుమ, బాబుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను నియంత్రించారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్‌గా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. చదవండి: సవాల్ విసురుతున్న గుండెపోట్లు.. -
మెదక్ జిల్లా : వ్యక్తి సజీవదహనం కేసులో పురోగతి
-
కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం
-
బతికుండగానే కారులో వ్యక్తి సజీవ దహనం.. ఏం జరిగింది?
సాక్షి, మెదక్ జిల్లా: అప్పటి వరకు బంధువులతో మాట్లాడిన వ్యక్తి.. అంతలోనే మృత్యుఒడికి చేరుకున్నాడు. అక్కా వస్తున్నా అని చెప్పిన తమ్ముడి రాక కోసం రాత్రంతా ఎదురుచూసి తెల్ల వారగానే అతని మరణ వార్త తెలియడంతో ఆమె తల్లడిల్లిపోయింది. తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ధర్మా అనే వ్యక్తి సజీవదహనం కావడంతో టేక్మాల్ మండలం భీమ్లా తండాలో విషాదం నెలకొంది. టెక్మాల్ మండలం వెంకటాపురం గ్రామ శివారులో కారులో వ్యక్తి సజీవదహనం కావడం సంచలనంగా మారింది. కారు డోర్ వద్ద మృతుడి కాలు బయటకు రావడంతో ఇది ప్రమాదమా? లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధర్మాకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ధర్మా మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. గత అర్థరాత్రి వ్యక్తిని కారులో వేసి ప్రెటోల్ పోసి నిప్పు పెట్టినట్లు ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. కారు నంబర్‌ను దుండగులు పూర్తిగా దహనం చేశారు. కారు వద్ద బ్యాగుతో పాటు చెట్ల పొదల్లో పెట్రోల్ డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురు సజీవ దహనం
సాక్షి, మంచిర్యాల: అర్ధరాత్రి ఇంట్లో మంటలు చెలరేగి కుటుంబం మొత్తం సజీవ దహనమైన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పెంకుటిల్లు కావడం, మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడిన క్రమంలో నిద్రలోనే మాంసం ముద్దలుగా మారిపోయారు. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ఆరుగురు మరణించగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతులు శివయ్య, ఆయన భార్య పద్మ, చిన్నారులు ప్రీతి(4), హిమబిందు(2) మరో వ్యక్తి కాంతయ్యగా గుర్తించారు. మృతదేహాలను గుర్తించిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. వీడియోలు వైరల్.. నవీన్‌రెడ్డి సోదరుడి అరెస్ట్ -
భర్త వేధింపులతో విసిగి కూతురుసహా తల్లి సజీవదహనం
ములుగు(గజ్వేల్): కుటుంబకలహాలు రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. ఒకవైపు భర్త వేధింపులు.. మరోవైపు మానసిక వికలాంగురాలైన కూతురుకు పెళ్లి కాదేమోననే బెంగ.. కొంతకాలంగా మానసిక వేదన అనుభవిస్తున్న ఓ తల్లి కూతురుతోసహా నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు మండలం వాగునూతి గ్రామానికి చెందిన సగ్గు అవిలయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య గంగవ్వ(40)కు జ్యోతి, హారతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్నకూతురు వివాహం జరగ్గా మానసిక వికలాంగురాలైన పెద్ద కూతురు జ్యోతి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. రెండో భార్యకు కొడుకు, కూతురు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆరునెలల నుంచి అవిలయ్య, గంగవ్వకు మధ్య కుటుంబకలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అవిలయ్య ఆమెను కొట్టడంతో గురువారం ఉదయం 10 గంటలకు తన సోదరుడు మానుక అవిలయ్యకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు అతడు బావకు ఫోన్ చేయగా గంగవ్వ, జ్యోతి కనపడటం లేదని చెప్పాడు. ఆందోళనకు గురైన మానుక అవిలయ్య వారి కోసం వెతకడం ప్రారంభించాడు. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు జప్తిసింగాయిపల్లి అటవీ ప్రాంతంలో నీలగిరి చెట్ల మధ్య కాలినస్థితిలో గంగవ్వ, జ్యోతి మృతదేహాలు కనిపించాయి. అక్కడ సమీపంలోనే గంగవ్వ బంగారు, వెండి అభరణాలు మూటకట్టి ఉన్నాయి. భర్త వేధింపులు భరించలేకనే తన సోదరి గంగవ్వ కూతురితో కలసి నిప్పంటించుకుని బలవన్మరణం చెందిందని మానుక అవిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. గంగవ్వ భర్త అవిలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మూడు పెళ్లిళ్లు.. సవతుల మధ్య పోరు.. చివరికి షాకింగ్ ట్విస్ట్
తిరువొత్తియూరు(తమిళనాడు): కృష్ణగిరి జిల్లాలో సవతుల మధ్య జరిగిన పోరులో ఓ తల్లీ, కుమారుడు సజీవదహనం అయిన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఊతంకరై సమీపంలో ఉన్న కల్లావి చెంగల్ పట్టికి చెందిన సెందామరై కన్నన్ (55) వీధి నాటకం కళాకారుడు. ఇతను ధర్మపురి జిల్లా స్వామియార్ పురానికి చెందిన సెల్విని మొదట వివాహం చేసుకున్నాడు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. పెళ్లికి ఒప్పుకోలేదని.. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఆ తరువాత సెందామరై కన్నన్ కీల్‌కుప్పం ప్రాంతానికి చెందిన కమల (47)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అందులో కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు గురు (17) ప్లస్ టూ చదివి ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను సత్య (30) అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముత్తు అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో రెండో భార్య కమల, మూడో భార్య సత్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల, గురు బుధవారం రాత్రి ఇంటిలో భోజనం చేసి నిద్రపోయారు. గురువారం వారు ఎంతకీ ఇంటిలో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి చూశారు. అనంతరం కల్లావి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, అక్కడ కాలిపోయిన స్థితిలో కమల, గురు మృతదేహాలు ఉన్నాయి. విచారణలో ఇద్దరూ సజీవ దహనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న ఊతంకరై డీఎస్పీ అలెగ్జాండర్ విచారణ చేపట్టి, ఇద్దరి మృతదేహాలను శవ పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సవతుల గొడవలో ఇద్దరు సజీవదహనం కావడంపై సెందామరై కన్నన్, సత్యను పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అస్సాంలో అమానుషం.. క్షుద్రపూజల నెపంతో.. అందరూ చూస్తుండగా..
గువాహటి/మోరిగావ్: అస్సాంలో క్షుద్రపూజలతో మహిళను హత్యచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గ్రామస్థులు సజీవ దహనంచేశారు. నాగోవ్ జిల్లాలోని సమగురి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం సరస్సులో విగతజీవిగా పడిఉన్న 22 ఏళ్ల మహిళను 35 ఏళ్ల రంజిత్ బొర్డోలోయ్ హతమార్చాడని బోర్లాలుంగో, బర్హామ్‌పూర్ బముని ప్రాంతంలోని గ్రామసభలో ఒక బహిరంగ విచారణ చేపట్టారు. ఆమెను రంజితే హతమార్చాడని తీర్మానించి పట్టపగలే అందరూ చూస్తుండగా సజీవదహనం చేశారు. తర్వాత మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా గ్రామంలోని పురుషులంతా పారిపోయారు. మృతదేహాన్ని పోలీసులు తవ్వి తీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. సజీవదహనం కేసులో ముగ్గురు మహిళలుసహా ఐదుగురిని అరెస్ట్‌చేసినట్లు జిల్లా ఎస్పీ లీనా డోలే చెప్పారు. -
ఘోర ప్రమాదం
సాక్షి, పుట్టపర్తి, అమరావతి/తాడిమర్రి/సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూలీలు ప్రయాణిస్తున్న ఆటోపై విద్యుత్ తీగలు తెగి పడటంతో మంటలు చెలరేగి ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం 7.30 గంటలకు ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికులు, కూలీలు తెలిపిన వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన గుండ్లమడుగు మెకానిక్ రాజా ఇటీవల 2 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. కలుపు తొలగించేందుకు ఇతని భార్య కుమారి (28).. గుడ్డంపల్లికి చెందిన మరో 11 మంది కూలీలను తీసుకుని కునుకుంట్ల గ్రామానికి చెందిన పోతులయ్య ఆటోలో పొలానికి బయలుదేరింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఆటో చిల్లకొండయ్యపల్లి సమీపంలోకి రాగానే 11 కేవీ విద్యుత్ తీగ ఉన్నట్లుండి తెగి ఆటోపై పడింది. దీంతో ఆటోకు విద్యుత్ ప్రవహించి మంటలు చెలరేగాయి. దీంతో గుండ్లమడుగు కుమారితో పాటు కొంకా మల్లికార్జున భార్య రామలక్ష్మి (30), కొంకా చిన్న మల్లన్న భార్య పెద్ద కాంతమ్మ (45), కొంకా కిష్టయ్య భార్య రత్నమ్మ (40) కొంకా ఈశ్వరయ్య భార్య లక్ష్మీదేవి (41) సజీవ దహనమయ్యారు. కొంకా మంజునాథ్ భార్య గాయత్రికి తీవ్ర గాయాలు కాగా, కొంకా మధుసూదన్ భార్య అరుణ, కొంకా పెద్దన్న భార్య నాగేశ్వరమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ పోతులయ్యతో పాటు కొంకా ఈశ్వరమ్మ, శివరత్నమ్మ, రమాదేవి, ఎ.రత్నమ్మలు ఆటోలోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తీవ్రంగా గాయపడిన గాయత్రిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. మృతుల్లో కుమారి పెద్ద కోట్ల గ్రామానికి చెందగా.. మిగతా నలుగురు గుడ్డంపల్లి వాసులు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అధికారులను అప్రమత్తం చేసి.. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంప ముంచిన ఉడుత స్థంభంపై ఇనుప రాడ్డుకు, విద్యుత్ వైరు తగలకుండా మధ్యలో పింగాణీ పరికరాన్ని అమర్చుతారు. కానీ ఉడుత పొడవు ఆ పరికరాన్ని దాటి ఉండటంతో వైరును తాకింది. విద్యుత్ తీగకు స్తంభంపై ఉన్న ఇనుప రాడ్డుకి మధ్య ఉడుత పడటంతో దాని శరీరం గుండా విద్యుత్ ప్రవహించింది. ఆ వెంటనే షార్ట్ సర్క్యూట్, ఎర్త్ కారణంగా స్పార్క్ ఏర్పడి వైరు తెగిపోయింది. అప్పుడే అటుగా వచ్చిన ఆటోపై ఆ వైరు పడింది. అయినప్పటికీ ఆటోకి ఉండే టైర్లు ఎర్త్ అవ్వకుండా అడ్డుకోగలవు. కానీ ఆటోపై ఇనుప మంచం ఉంది. అదీగాక ఆ కంగారులో ఆటోలో ఉన్నవారెవరో కిందకు దిగే ప్రయత్నం చేశారు. వారు ఒక కాలు నేలపై, మరోకాలు ఆటోలో ఉంచడం వల్ల ఎర్త్ అయ్యి ఆటోకి వేల వాట్ల హై టెన్షన్ విద్యుత్ ప్రసరించి క్షణాల్లో కాలి బుగ్గయ్యింది. కాగా, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ హరినాథరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాఖ పరమైన విచారణకు ఆదేశించామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు (సీఎం ప్రకటించిన పరిహారం కాకుండా), తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల తక్షణ సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. ఇటీవలే కొత్త లైన్లు వేశాం కరెంటు పోళ్లు గానీ, వైర్ల విషయంలో గానీ ఎక్కడా లోపం లేదని, ఆరుమాసాల కిందటే కొత్త ఫీడర్లు వేశామని విద్యుత్ శాఖ అనంతపురం ఎస్ఈ నాగరాజు తెలిపారు. విద్యుత్ సరఫరా నిర్వహణలో లోపంగానీ, సాంకేతిక సమస్యలు గానీ ఎక్కడా లేవన్నారు. ఈ ఘటనపై విచారణాధికారిగా ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ రషీద్‌ను నియమించారు. ఆయన శుక్రవారం ఘటన స్థలికి చేరుకుని పరిశీలించనున్నారు. ఉడుతలతో ప్రమాదం విద్యుత్ తీగలపై ఉడుతలు, తొండలు, పాములు, పక్షులు వంటివి పడటం సాధారణంగా తరచూ జరుగుతుంటుంది. పవర్ గ్రిడ్లలో వీటివల్ల అనేక సార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంటుంది. ప్లాస్టిక్ యానిమల్ గార్డ్లను దాటేసి, చిన్న సందు దొరికితే చాలు సబ్‌స్టేషన్‌లోకి ఇవి దూరిపోతుంటాయి. ఇవి మోషన్ డిటెక్టర్లను దాటి కంచెల కింద సొరంగం కూడా చేయగలవు. టన్నెలింగ్, ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ ద్వారా కొరకడం, నమలడం, వేర్వేరు విద్యుత్ పొటెన్షియల్స్లో ఉన్న రెండు కండక్టర్లపై ఏకకాలంలో పడటం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా షార్ట్ సర్క్యూట్ జరిగి తీగలు తెగిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఏకకాలంలో జరుగుతుంది. ఇంటర్నెట్, మౌలిక సదుపాయాలు వంటి సేవలకు ఉడుతల వల్ల కలిగే ముప్పు సైబర్, ఉగ్ర దాడుల వల్ల కలిగే ముప్పు కంటే ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ భద్రత సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఉడుతలు అనేక దేశాల్లో పవర్ గ్రిడ్లను నిర్వీర్యం చేయగలవని రుజువైంది. గవర్నర్, సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చిల్లకొండయ్యపల్లిలో జరిగిన ప్రమాదంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. సీఎంఓ ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. -
బతికుండగానే భార్యను తగులబెట్టాడు
భివండీ (ముంబై): స్పృహ తప్పిన భార్యను బతికుండగానే తగలబెట్టాడు ఓ భర్త. ఈ సంఘటన స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. సంతోశ్ చౌరసియా తన భార్య కవిత ఇద్దరు పిల్లలతో కలిసి చావింద్రలోని మహం కాళి దాబా ప్రక్కనే ఉన్న గుడిసెలో నివసిస్తున్నారు. కూలి పనిచేసే సంతోష్ వ్యసనాల కారణంగా పనికిపోక తరుచుగా భార్యతో గొడవ పడేవాడు. మంగళవారం మద్యం సేవించిన సంతోశ్ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో ఆవేశంతో సంతోశ్ కవిత తలపై కర్రతో కొట్టడంతో ఆమె స్పహతప్పిపోయింది. దీంతో గుడిసె బయట నిల్వ చేసిన కర్రల కుప్ప దగ్గరకు కవితను లాకొచ్చి ప్రాణంతో ఉన్న కవితపై కట్టెలు పేర్చి నిప్పు అంటించి హత్యచేసి పారిపోయాడు. పోలీసులు నిందుతున్ని అరెస్ట్ చేశారు. చదవండి: (పెళ్లయిన యువతికి తల్లిదండ్రులు మరో పెళ్లి.. భర్తకు తెలిసి..) -
మైనర్‌పై అఘాయిత్యం.. బైక్‌తో సహా సజీవ దహనం చేసిన గ్రామస్తులు
తెలిసిన వ్యక్తే కదా! అని నమ్మి కూతురిని కూడా పంపించారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ కీచకుడు.. మరోకరితో కలిసి దాష్టికానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి ఊరు ఊరంతా రగిలిపోయింది. నిందితులకు ‘చావే సరైన శిక్ష’ అనుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఇంటి దగ్గర దిగబెడతాం అంటూ మైనర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని.. సజీవ దహనం చేశారు గ్రామస్తులు. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్, గుమ్లాలో జరిగింది. బుధవారం బంధువుల ఇంటికి వెళ్లిన ఓ కుటుంబం.. సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాప్‌లో ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఆ కుటుంబం పక్క ఊరిలో ఉండే సునీల్ ఉన్‌రావ్ అనే వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చాడు. అతని కూడా బైక్ మీద స్నేహితుడు కూడా ఉన్నాడు. బాగా ఆలస్యం అయ్యేట్లు ఉందని, కనీసం అమ్మాయినైనా తమతో పంపించమని అడిగాడు. బాగా దగ్గరి వాడే కదా నమ్మి కూతురిని అని బైక్ మీద పంపించారు ఆ తల్లిదండ్రులు. అయితే ఆ తల్లిదండ్రులు ఇంటికి చేరినా.. ఎంతసేపటికి కూతురు మాత్రం రాలేదు. దీంతో సునీల్‌కు ఫోన్ చేశారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి గాలించారు. ఈలోపు పక్క ఊరి శివారులో ఒక అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉందన్న సమాచారం వీళ్లకు అందింది. వెళ్లి చూస్తే.. అది వాళ్ల కూతురే. తనపై అఘాయిత్యం జరిగిందని చెప్పింది బాధితురాలు. విషయం తెలిసి బాధితురాలి గ్రామస్తులు చిర్రెత్తి పోయారు. పొరుగూరికి వెళ్లి మరీ నిందితులను దొరకబుచ్చుకుని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరినీ తమ ఊరికి లాక్కొచ్చారు. వాళ్ల బైక్‌తో సహా పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనలో సునీల్ మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కేసు బుక్ చేసుకున్న పోలీసులు.. ఆరుగురిపై హత్య కేసు నమోదు చేశారు. -
బోయిగూడలో అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవదహనం
-
హఠాత్తుగా ఇంట్లో మంటలు.. దంపతుల సజీవదహనం
పీలేరు రూరల్(చిత్తూరు జిల్లా): అగ్ని ప్రమాదంలో దంపతులు సజీవ దహనమైన సంఘటన సోమవారం ఉదయం పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, ఎర్రావారిపాళెం మండలం, కోటకాడపల్లెకు చెందిన భుక్కే నాగేశ్వరనాయక్ (46), బి.సిద్ధేశ్వరి (40)కి 20 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత 17 సంవత్సరాలుగా పీలేరు పట్టణం సైనిక్ నగర్లో కాపురం ఉంటున్నారు. నాగేశ్వరనాయక్ సీఆర్పీఎఫ్ జవాన్‌గా శ్రీనగర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వారం క్రితం శ్రీనగర్ నుంచి పీలేరుకు వచ్చాడు. చదవండి: ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. ఎంత పనిచేశావ్ తరుణ్.. సోమవారం ఉదయం హఠాత్తుగా ఇంట్లో మంటలు ఎగిసిపడుతుండగా కేకలు వినిపించాయి. దీంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే నాగేశ్వర్‌నాయక్ మృతి చెందాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సిద్ధేశ్వరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. అగ్నిప్రమాదంలో భార్య భర్తలిద్దరూ మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. కుమారుడు విష్ణువర్ధన్ నాయక్ ఇంటరీ్మడియెట్ ద్వితీయ సంవత్సరం, కుమార్తెలు అంజలి టీటీసీ, శ్రీచైతన్య బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు రూరల్ సీఐ తులసీరామ్, ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. -
కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?
-
కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేట్ సమీపంలోని పొలాల్లో ఓ కారు పూర్తిగా దగ్ధమై కనిపించింది. కారులో ఉన్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యా? లేక ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
వెనక నుంచి వచ్చే ప్రమాదాన్ని గమనించలేదు.. రైతు సజీవదహనం
జగిత్యాల క్రైం: మంటల నుంచి గడ్డి వామును కాపాడుకునే ప్రయత్నంలో ఓ రైతు సజీవ దహనమయ్యాడు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్‌గౌడ్ (60) మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. పోతుగంటి లక్ష్మణ్ గౌడ్ గ్రామ శివారులోని తన రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కులవృత్తి చేస్తాడు. ఇటీవల పంట కోశాడు. యాసంగిలో మళ్లీ సాగు చేసేందుకు మంగళవారం ఉదయం వరి కొయ్యకాలుకు నిప్పు పెట్టాడు. పొలం సమీపంలోనే గడ్డివాము ఉంది. దానికి నిప్పు అంటుకోకూడదని పొలంలోని మంటల్ని కర్రలతో కొడుతూ ఆర్పుకుంటూ ముందుకు సాగాడు. కానీ వెనక నుంచి వచ్చే మంటల్ని గమనించలేదు. ఈక్రమంలోనే లక్ష్మణ్‌గౌడ్ చుట్టూ మంటలు వ్యాపించాయి. తప్పించుకునే మార్గం లేక అందులోనే చిక్కుకుని కాలిపోయాడు. రూరల్ ఎస్ఐ అనిల్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: Telangana: కొత్తగా 205 మందికి కరోనా ) -
ప్రాణం తీసిన చుట్ట.. సజీవ దహనం
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): మంచానికి మంటలు వ్యాపించి వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డి దుర్గారావు కూలి పనులు చేసుకుంటూ తల్లి రెడ్డి సీతమ్మ(71)తో కలసి జామి అప్పన్నవీధి, సత్యనారాయణపురం సీతన్నపేటగేటు సమీపంలో నివాసముంటున్నాడు. తల్లి అనారోగ్యంతో కొంతకాలంగా మంచానికే పరిమితమైంది. రోజు తల్లికి టిఫిన్ తినిపించి సపర్యలు చేసి, ఆమెకు చుట్ట తాగే అలవాటు ఉండటంతో కొన్ని చుట్టలు మంచం పక్కనే పెట్టి పనికి వెళ్తుంటాడు. సోమవారం ఉదయం తల్లికి టిఫిన్ తినిపించి పనికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి పొగ వస్తుండటంతో చుట్టుపక్కల వారు దుర్గారావుకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అతను ఇంటికి వచ్చి చూడగా తల్లి పడుకున్న మంచానికి మంటలు వ్యాపించాయి. నీళ్లు చల్లి మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే మంటల్లో పూర్తిగా కాలిపోయి సీతమ్మ చనిపోయింది. చుట్ట తాగి కింద పడేయడంతో మంచం కింద ఉన్న బట్టలకు మంటలు వ్యాపించి నవ్వారు మంచం కాలిపోయిందని, కదలలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు మంటల్లో కాలిపోయి మృతి చెంది ఉండొచ్చని భావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వివాహిత సజీవ దహనం: హత్యా.. ప్రమాదమా?
హస్తినాపురం: అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని మొదట స్థానికులు భావించారు. కానీ భర్తే ఆమెను హత్యచేసి..పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈమేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వనస్థలిపురంలో సోమవారం జరిగిన ఈఘటనపై పోలీసులు, మృతురాలి బంధువులు తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన చెల్లం బాలకృష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. అతని మొదటి భార్య చనిపోవడంతో నల్గొండ జిల్లా డిండి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన ఎర్ర సరస్వతి (42)ని 20 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం సరస్వతికి ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం రావడంతో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ మొదటి భార్యకు కుమారుడు వెంకటరమణ జన్మించగా, సరస్వతికి కూతురు అక్షిత (15) ఉంది. వనస్థలిపురంలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న ఇల్లు సరస్వతి పేరు మీద ఉండగా..తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని బాలకృష్ణ ఇటీవల ఒత్తిడి చేయడంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరు గొడవ పడ్డారని కూతురు అక్షిత పోలీసులకు తెలిపింది. సోమవారం ఉదయం కూడా మళ్లీ గొడవ పడ్డారని, తల్లిపై బాలకృష్ణ చేయి చేసుకున్నాడని అక్షిత పేర్కొంది. కొద్దిసేపటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన తన తండ్రి టిఫిన్ తీసుకొచ్చారని, ఆ తర్వాత తాను ఆన్లైన్ క్లాస్‌లు వినేందుకు బెడ్రూంలోకి వెళ్లానని చెప్పింది. కొద్దిసేపటికి పెద్దశబ్ధం రావడంతో తాను బయటకి వచ్చి చూడగా..తన తల్లి మంటల్లో చిక్కుకుని కన్పించిందని, తనను దగ్గరకు రావొద్దని చెప్పారని తెలిపింది. అప్పటికే తన తల్లి మొత్తం మంటల్లో కాలిపోయినట్లు అక్షిత చెప్పిందని పోలీసులు వివరించారు. మంటలు అంటుకున్న సమాచారం అందుకున్న హయత్‌నగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి మంటలార్పారు. కాగా తాము సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మృతురాలి భర్త బాలకృష్ణ స్వల్పగాయాలతో 108లో యశోద ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు సీఐ మురళీమోహన్ తెలిపారు. అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హత్యచేసి అగ్నిప్రమాదంగా చిత్రీకరించాడు.. తన చెల్లెల్ని ఆమె భర్త బాలకృష్ణ హత్యచేసి..ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి అక్కలు సులోచన, వెంకటమ్మ, రమణలు ఆరోపించారు. ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయని, కొద్దికాలంగా సరస్వతిని బాలకృష్ణ తీవ్రంగా వేధిస్తున్నాడని వారు పేర్కొన్నారు. హత్యచేసి..అగ్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు కుట్రపన్నారని, అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనుమానాస్పద కేసు... సోమవారం ఉదయం సజీవ దహనమైన సరస్వతి ఆత్మహత్య చేసుకుందా, హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వనస్థలిపురం సీఐ మురళీ మోహన్ తెలిపారు. మృతురాలి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశామని, భర్త బాలకృష్ణను విచారించనున్నట్లు తెలిపారు. చదవండి: మూడు రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం Lockdown: సారు.. లాఠీల జోరు.. -
విషాదం: స్టౌని అలాగే ఉంచి అగ్గిపుల్లతో వెలిగించడంతో..
సామర్లకోట: వంట చేయడానికి వంట గదిలోకి వెళ్లిన ఓ మహిళ గ్యాస్ మంటలకు ఆహుతైన విషాద సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బ్రౌన్ పేట కుమ్మర వీధికి చెందిన గుబ్బల భవాని (35) శనివారం వంట చేయడానికి గ్యాస్ స్టౌను అగ్గిపుల్లతో వెలిగిస్తోంది. స్టౌ వెలగకపోవడంతో అలాగే ఉంచి పలుమార్లు అగ్గిపుల్లలు వెలిగింది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో గ్యాస్ లీకైంది. ఆ సమయంలో అగ్గిపుల్ల వెలగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి, భవాని సజీవ దహనమైంది. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న భర్త చిన్న కుమారుడిని తీసుకొని బయటకు వెళ్లాడు. ఇంటి సమీపంలో భవాని ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తోంది. షాపు వద్ద పెద్ద కుమారుడు, అత్తను ఉంచి, మధ్యా హ్నం వంట చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటి నుంచి మంటలు రావడం, భవాని కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న ఆమె బావ కుమారుడు గమనించి, భవాని పెద్ద కుమారుడిని తీసుకుని అక్కడకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న నీటితో మంటలు అదుపు చేశారు. అప్పటికీ గ్యాస్ లీకవడం గమనించి వారు అదుపు చేశారు. విషయం తెలిసిన వెంటనే పెద్దాపురం సీఐ వి.జయకుమార్, ఎస్సై వీఎల్‌వీకే సుమంత్, వార్డు కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్టౌ వద్ద ఐదు అగ్గిపుల్లలు ఉండటం గమనించారు. వెంటనే స్టౌ వెలగకపోవడం, గ్యాస్ వ్యాపించి ఉన్న సమయంలో మరో అగ్గిపుల్ల వెలగడంతో మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాకినాడ రూరల్ పెనుమర్తికి చెందిన భవానీకి 16 ఏళ్ల క్రితం సామర్లకోట బ్రౌన్‌పేటకు చెందిన గుబ్బల రామకృష్ణతో వివాహమైంది. అత్త లక్ష్మి, పెద్ద కుమారుడు అర్జున్ గణేష్, చిన్న కుమారుడు వేణుతేజ ఉన్నారు. కుమార్తె మరణ వార్త తెలుసుకొని తల్లిదండ్రులు దెయ్యాల మహలక్ష్మి, కామరాజులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం తరలించి, ఎస్సై సుమంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’ సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు