చిత్తూరు : రోడ్డు మీద తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి సజీవంగా కాలిపోయిన హృదయ విదారక సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం గరిడేయసత్రం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బళ్లారి నుంచి కృష్ణపట్నం వెళ్లే జాతీయ రహదారి పై తెల్లవారుజామున కూరగాయల లోడుతో వెళ్తున్న వ్యాన్ గరిడేయసత్రం గ్రామ సమీపంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం నేలకొరిగింది.
అయినప్పటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోకపోవడంతో స్కూటర్ పై అదే రహదారిలో బద్వేల్ నుంచి గోపవరం వెళ్తున్న కోటంరెడ్డి రమణారెడ్డి(49) విద్యుత్ షాక్‌తో సజీవ దహనం అయ్యాడు. స్కూటర్‌తో సహా వ్యక్తి కాలిపోతున్న సంఘటనను చూసిన కొందరు స్థానికులు వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేలోపే రమణారెడ్డి కాలి బూడిదయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నడిరోడ్డుపై కాలి బూడిదైన వ్యక్తి
Published Sun, Jul 5 2015 8:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement
Advertisement