చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రామగానిపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు.
కురబలకోట: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రామగానిపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడ్ని కురబలకోట మండలం గట్టమీదపల్లికి చెందిన ఫిజియోథెరపీ నిపుణుడు మదన్‌మోహన్‌రెడ్డి (25)గా గుర్తించారు. మదన్‌మోహన్‌రెడ్డి బైక్‌పై కురబలకోట వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు.