
ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. లక్నో జిల్లా, కకోరిలో గల హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలో రెండంతస్తుల భవనంలో మంగళవారం అర్దరాత్రి మంటలు చెలరేగాయి. ఇంతలో ఇంటిలోని సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒక జంటతో సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు.
హతా హజ్రత్ సాహెబ్ నివాసి ముషీర్ అలీ (50) జర్దోసీ పనితో పాటు పటాకుల వ్యాపారం కూడా చేస్తుంటాడు. మంగళవారం రాత్రి ఆయన ఇంటి రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇంతలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చేంతలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి.
ముషీర్, అతని భార్య హుస్నా బానో (45), వారి బంధువుల పిల్లలు రాయ (5), హిబా (2), హుమా (3) మంటల్లో సజీవ దహనమయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న బనోయి అజ్మత్ (30), అనమ్ (17)ఇన్షా (16), లకబ్ (18)లను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment