'మా కొడుకు మరణానికి కారణం నువ్వేనం'టూ 90 ఏళ్ల వృద్ధురాలిని ఆమె పక్కింటివాళ్లు సజీవ దహనం చేశారు!
'మా కొడుకు మరణానికి కారణం నువ్వేనం'టూ 90 ఏళ్ల వృద్ధురాలిని ఆమె పక్కింటివాళ్లు సజీవ దహనం చేశారు! మానవీయమైన ఈ ఘటన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చోటుచేసుకుంది. 8 నెలల కిందట జరిగిన ఓ యాక్సిడెంట్లో శంకర్ అనే యువకుడు మరణించాడు.
శంకర్ వాళ్ల పక్కింట్లో ఉండే రత్నా కూడా ఆ సమయంలో అతనితోనే ఉన్నాడు. కొడుకు మరణానికి కారణం రత్నాయే కారణమని భావించిన శంకర్ కుటుంబం అదునుచూసి రత్నా ఇంటిపై దాడిచేశారని, రత్నా తల్లి జగుదీని బంధించి ఇటికి నిప్పుపెట్టి సజీవదహనం చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల్ని అరెస్టుచేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు,