పేద వృద్ధురాలు పట్ల సితార తీరు.. నెటిజన్స్‌ ఫిదా! | Sitara Ghattamaneni Help To Old Women, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Sitara Ghattamaneni: పేద వృద్ధురాలు పట్ల సితార తీరు.. నెటిజన్స్‌ ప్రశంసల వర్షం

Published Sun, Oct 1 2023 1:19 PM | Last Updated on Sun, Oct 1 2023 2:50 PM

Sitara Ghattamaneni Help To Old Women, Video Goes Viral - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు రీల్‌ హీరోనే కాదు రియల్‌ హీరో కూడా. చాలా మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేయించి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నాడు. తండ్రికి తగ్గట్లే పిల్లలు అన్నట్లుగా.. మహేశ్‌ కొడుకు, కూతురు కూడా సామాజిక సేవలో ముందుంటారు. ముఖ్యంగా సితార అయితే తన వయసుకు మించిన సహాయాన్ని అందిస్తూ.. అందరి మనసులు గెలుచుకుంటుంది. పెద్దలు అంటే ఆమెకు ఎనలేని గౌరవం. ధన, పేద అనే తేడా లేకుండా అందరిని గౌరవిస్తుంది. తాజాగా జరిగిన సంఘటననే దానికి ఉదాహారణ. 

అసలేం జరిగింది?
తాజాగా సితార హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కి తల్లి నమ్రతతో కలిసి వెళ్లింది. ఈ సందర్భంగా సదరు షాపింగ్‌ మాల్‌ యాజమాన్యం పలువురు పేద వృద్ధులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. చాలా మంది వృద్ధ మహిళలు ఆ బహుమతులు అందుకోవడానికి వచ్చారు.

అయితే ఓ వృద్ధురాలు మాత్రం స్టేజ్‌ పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడింది. ఇది గమనించిన సితార.. వెంటనే స్టేజ్‌ పై నుంచి దిగొచ్చి.. ఆమె చేయి పట్టుకొని వేదికపైకి తీసుకెళ్లింది. అనంతరం..అక్కడి వారందరితో ప్రేమగా మాట్లాడింది. సితార మంచి మనసుకు మురిసిపోయిన వృద్ధురాలు.. అపురూపంగా ఆమెను ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.  ‘తండ్రి లాగే సితారది కూడా మంచి మనసు’అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement