ముంబై: ఆదివారం రోజున నైరోబీ వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ఓ జంట శాంతాక్రూజ్ సమీపంలో గెలాక్సీ హోటల్‌లో బస చేశారు. అంతలో అక్కడ అగ్నిప్రమాదం జరగడంతో ఆ జంట సజీవ దహనమయ్యారు. వీరితోపాటు ఆ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా చనిపోయారు.
ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని గెలాక్సీ హోటల్‌లోహోటల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒక జంట కథ అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.
మృతుడి సొంతూరైన రామ్‌పార్ గ్రామ సర్పంచ్ సురేష్ కారా తెలిపిన వివరాల ప్రకారం ఎన్నారై కిషన్ హాలాయ్(28) అతడికి కాబోయే భార్య రూపాలు వెకారియా(25) ఇద్దరి కుటుంబాలు గుజరాత్‌లోని రామ్‌పార్ గ్రామానికి చెందినవారే అయినా వారి పూర్వీకులు నైరోబీలో స్థిరపడటంతో వీరు కూడా అక్కడే పెరిగి పెద్దయ్యారన్నారు.
వీరిరువురికీ పెద్దలు పెళ్లి కూడా నిశ్చయించారు.. అయితే కిషన్ సోదరుడి వివాహం నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారని వివాహం పూర్తవగానే కొత్తగా పెళ్ళైన జంటతో పాటు ఈ జంట తల్లిదండ్రులు నైరోబీ వెళ్లిపోగా కిషన్ మాత్రం బంధువులను కలిసి వెళదామని ఆగిపోవడంతో అతడితోపాటు రూపాల్ కూడా ఉండిపోయినాట్లు తెలిపారు.
అన్ని పనులను పూర్తిచేసుకుని ఆదివారం వీరు కూడా నైరోబీ తిరిగి వెళ్లాల్సి ఉండగా అహ్మదాబాద్ నుండి ముంబై చేరుకున్నారు. తీరా ముంబై వచ్చాక విమానం ఆలస్యమవుతుందని తెలియడంతో శాంతాక్రూజ్ సమీపంలోని గెలాక్సీ హోటల్‌లో బస చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ జంట ఒక్కటవ్వకుండానే ఒక్కటిగా వెళ్లిపోయారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు సురేష్ కారా.
ఇది కూడా చదవండి: సినిమా చూసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి.. ఏమైందంటే?
Comments
Please login to add a commentAdd a comment