hotel fire
-
Mumbai Hotel Fire: ఒక్కటవ్వకుండానే ఒక్కటిగానే వెళ్లిపోయారు..
ముంబై: ఆదివారం రోజున నైరోబీ వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ఓ జంట శాంతాక్రూజ్ సమీపంలో గెలాక్సీ హోటల్లో బస చేశారు. అంతలో అక్కడ అగ్నిప్రమాదం జరగడంతో ఆ జంట సజీవ దహనమయ్యారు. వీరితోపాటు ఆ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని గెలాక్సీ హోటల్‌లోహోటల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒక జంట కథ అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. మృతుడి సొంతూరైన రామ్‌పార్ గ్రామ సర్పంచ్ సురేష్ కారా తెలిపిన వివరాల ప్రకారం ఎన్నారై కిషన్ హాలాయ్(28) అతడికి కాబోయే భార్య రూపాలు వెకారియా(25) ఇద్దరి కుటుంబాలు గుజరాత్‌లోని రామ్‌పార్ గ్రామానికి చెందినవారే అయినా వారి పూర్వీకులు నైరోబీలో స్థిరపడటంతో వీరు కూడా అక్కడే పెరిగి పెద్దయ్యారన్నారు. వీరిరువురికీ పెద్దలు పెళ్లి కూడా నిశ్చయించారు.. అయితే కిషన్ సోదరుడి వివాహం నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారని వివాహం పూర్తవగానే కొత్తగా పెళ్ళైన జంటతో పాటు ఈ జంట తల్లిదండ్రులు నైరోబీ వెళ్లిపోగా కిషన్ మాత్రం బంధువులను కలిసి వెళదామని ఆగిపోవడంతో అతడితోపాటు రూపాల్ కూడా ఉండిపోయినాట్లు తెలిపారు. అన్ని పనులను పూర్తిచేసుకుని ఆదివారం వీరు కూడా నైరోబీ తిరిగి వెళ్లాల్సి ఉండగా అహ్మదాబాద్ నుండి ముంబై చేరుకున్నారు. తీరా ముంబై వచ్చాక విమానం ఆలస్యమవుతుందని తెలియడంతో శాంతాక్రూజ్ సమీపంలోని గెలాక్సీ హోటల్లో బస చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ జంట ఒక్కటవ్వకుండానే ఒక్కటిగా వెళ్లిపోయారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు సురేష్ కారా. ఇది కూడా చదవండి: సినిమా చూసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి.. ఏమైందంటే? -
అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి
కొల్‌కత: కొల్‌కతలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటిష్ హై కమిషన్ సమీపంలోని గోల్డెన్ పార్క్ హోటల్లో గురువారం మధ్యాహ్నాం 2.55 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను ఆర్పి 31 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఎస్ఎస్కేఎమ్ ఆసుపత్రికి తరలించారు. అతిథులుగా హోటల్లో బస చేసిన అనూప్ అగర్వాల్, కిషోర్ గుప్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.హోటల్ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అగ్రిమాపక అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిందన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా హోటల్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోలేదని, కనీస పరికరాలు లేకుండా బిల్డింగ్ నిర్మించారని నగర మేయర్ సోవాన్ చటర్జీ ఆరోపించారు. -
ఆ చెత్త సెల్ఫీ జంటను ఎట్టకేలకు విడిచిపెట్టారు!
దుబాయ్: కొత్త సంవత్సరం సందర్భంగా దుబాయ్‌లో ఓ హోటల్ తగలబడుతుండగా.. దాని ముందు తాపీగా నిలబడి సెల్ఫీ తీసుకున్న ఓ జంటకు ఎట్టకేలకు విముక్తి లభించింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులను విడుదల చేసినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ శుక్రవారం తెలిపింది. దుబాయ్ ఎమిరెట్స్ అటార్నీ జనరల్ ఎస్సాం అల్ హుమైదన్ను ఉటంకిస్తూ ప్రభుత్వ వార్తాసంస్థ డబ్ల్యూఏఎం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్న 64 అంతస్తుల హోటల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. నూతన సంవత్సరం వేడుకలకు కొద్దిముందే జరిగిన ఈ ప్రమాదంతో హోటల్లోని వారు ఉరుకులు, పరుగులతో హాహాకారాలు చేశారు. ఈ సమయంలో ఓ జంట మాత్రం కాలుతున్న హోటల్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంది. 2015లో ఇదే అత్యంత చెత్త సెల్ఫీ నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే వారికి ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని తెలియడంతో వదిలేశారు. అనుమతి లేకుండా సంబంధిత సంస్థలు, వ్యక్తుల ఫొటోలు తీయడం దుబాయ్‌లో నేరం. ఇందుకు అరెస్టుచేసి జైల్లో వేసే అవకాశం కూడా ఉంది. అయితే ఆ జంటను అరెస్టు చేయడం పనిలేని వ్యవహారమని దుబాయ్ రాజకీయ పరిశీలకులు పోలీసుల చర్యను తప్పుబట్టారు. -
బోర్డు మాత్రమే మిగిలింది
శామీర్‌పేట్: గుర్తుతెలియని వ్యక్తులు ఓ హోటల్‌కు నిప్పంటించారు. ఈ సంఘటన శామీర్‌పేట్ మండలపరిధిలోని పెద్దచెరువు శివారులో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. శామీర్‌పేట్‌కు చెందిన ఎం. శ్రీనివాస్ కొన్నేళ్లుగా మేడ్చల్ మండల పరిధిలోని మెడిసిటీ సమీపంలో (శామీర్‌పేట్ పెద్ద చెరువు శివారులో) ఓ గది అద్దెకు తీసుకొని చిన్నపాటి హోటల్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిమాదిరిగా ఆదివారం రాత్రి ఆయన కొట్టు మూసివేసి ఇంటికి వ చ్చాడు. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఆయన హోటల్‌కు నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో శ్రీనివాస్ అక్కడికి వెళ్లేసరికి హోటల్ పూర్తిగా కాలిపోయి కేవలం బోర్డు మాత్రమే మిగిలి ఉంది. తన బతుకు రోడ్డున పడిందని, రూ.50 వేలు విలువైన ఆస్తినష్టం జరిగిందని బాధితుడు కన్నీటిపర్యంతమైంది. ఈమేరకు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.