అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి | Two killed in Kolkata hotel fire | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

Published Thu, Mar 30 2017 5:14 PM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి - Sakshi

అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

కొల్‌కత: కొల్‌కతలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటిష్‌ హై కమిషన్‌ సమీపంలోని గోల్డెన్‌ పార్క్‌ హోటల్లో గురువారం  మధ్యాహ్నాం 2.55 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను ఆర్పి 31 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఎస్‌ఎస్‌కేఎమ్‌ ఆసుపత్రికి తరలించారు.  

అతిథులుగా హోటల్లో బస చేసిన అనూప్‌ అగర్వాల్‌, కిషోర్‌ గుప్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.హోటల్‌ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అగ్రిమాపక అధికారులు తెలిపారు. ఫైర్‌ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిందన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా హోటల్‌ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోలేదని, కనీస పరికరాలు లేకుండా బిల్డింగ్‌ నిర్మించారని నగర మేయర్‌ సోవాన్‌ చటర్జీ ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement