గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
గుంటూరు (మంగళగిరి) : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గౌరమ్మ(56) అనే మహిళ సజీవ దహనమయ్యింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఫైరింజన్ వచ్చేసరికి ఇంట్లో ఉన్న పలు వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.