
సాక్షి, గుంటూరు: గుంటూరు ఆసుపత్రిలో జీబీఎస్ వైరస్‌తో మరో మహిళ మృతి చెందింది. వారం క్రితం వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలోకి చేరిన మహిళ.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా, గుంటూరు జీజీహెచ్‌లో గత నెల.. షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతి చెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత మరణించింది.
కాగా, ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.
భయపెడుతున్న జీబీ సిండ్రోమ్
గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment