సాక్షి, దైద (గురజాల రూరల్) : మద్యానికి బానిసైన భర్త తాగుడుకు డబ్బులివ్వలేదని ఆగ్రహించి భార్య తలపై రోకలి బండతో కొట్టడంతో ఆమె మృతిచెందిన ఘటన గురజాల మండలం దైద గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
దైద గ్రామంలో దూదేకుల సైదాబీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త చిన ఖాదర్ మద్యానికి బానిసై డబ్బులివ్వమని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో రోకలిబండతో కొట్టడంతో సైదాబి (50) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ వై. రామారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment