మాచర్ల: గుంటూరు జిల్లాలో శుక్రవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. కుటుంబకలహాల నేపథ్యంలో మహిళను సమీప బంధువు అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. ఈ దారుణం మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసరావు భార్య కాంతమ్మ(40)కు ఆమె సోదరి కుటుంబంతో తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కాంతమ్మ ఇంటి ముందు ఉండగా సోదరి కొడుకు వెంకట్రావు గొడ్డలితో విచక్షణా రహితంగా నరకాడు. దీంతో కాంతమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం వెంకట్రావు అక్కడి నుంచి పరారయ్యాడు. సీఐ శివశంకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.