kanthamma
-
లక్ష్మీకాంతమ్మ సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
అనంతపురం క్రైం: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకాంతమ్మ సస్పెన్షన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆమె సస్పెన్షన్‌కు కలెక్టర్ గౌతమి సిఫారసు చేశారు. ఇటీవల ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామానికి చెందిన గర్భిణి కవిత(25)కు అబార్షన్ చేసి, మృతికి కారణమైందన్న ఆరోపణల్లో వెల్లువెత్తిన నేపథ్యంలో దీనిపై ‘అనంతలో దారుణం, చిదిమేస్తున్నారు, కదిలిన వైద్యురాలి అక్రమాల డొంక, అన్నీ అబాద్దాలే’ తదితర శీర్షికలతో ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వీరబ్బాయి, పీసీపీఎన్డీటీ యాక్ట్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ యుగంధర్, డెమో బృందం ఇటీవల అమ్మవారిపల్లి, చిగిచెర్ల గ్రామాలను సందర్శించి మృతురాలి కుటుంబీకులతో స్టేట్మెంట్ రికార్డు చేశారు. అంతేకాక ఘటనకు సంబంధించి డాక్టర్ లక్ష్మీకాంతమ్మ, రూత్ ఆస్పత్రిపై అనంతపురం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 99 మందికి అబార్షన్లు: వైద్యాధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతుల్లేకుండానే అనంతపురంలోని శ్రీనివాసనగర్‌లో రూత్ ఆస్పత్రిని డాక్టర్ లక్ష్మీకాంతమ్మ నిర్వహిస్తోందని గుర్తించారు. అంతేకాక మెడికల్ టర్నినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(అబార్షన్) చేయడానికి అనుమతులు లేకున్నా 2022 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 99 అబార్షన్లు చేసినట్లు (అభిజ్ఞ ఆస్పత్రిలో) బహిర్గతం కావడంతో విచారణాధికారులు విస్తుపోయారు. ఈ నేపథ్యంలో రూపొందించిన తుది నివేదికను సోమవారం కలెక్టర్‌కు సమర్పించారు. పరిశీలించిన కలెక్టర్ గౌతమి.. వెంటనే డాక్టర్ లక్ష్మీకాంతమ్మను సస్పెన్షన్‌కు సిఫారసు చేశారు. అయితే డాక్టర్ లక్ష్మీకాంతమ్మ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో ఉండడంతో కలెక్టర్ చేసిన సిఫారసుతో పాటు విచారణ నివేదికను వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి ద్వారా డీఎంఈకి చేర్చేలా డీఎంహెచ్ఓ డాక్టర్ వీరబ్బాయి చర్యలు తీసుకున్నారు. చట్టపరమైన చర్యలకు ఆదేశిస్తాం ఎంటీపీ అనుమతులు తీసుకోకుండా అబార్షన్లు చేసిన డాక్టర్ లక్ష్మీకాంతమ్మపై విచారణ కొనసాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో అబార్షన్లు చేశారు. ఎంటీపీ చట్టాన్ని అతిక్రమించిన డాక్టర్ లక్ష్మీకాంతమ్మపై చట్టపరమైన చర్యలకు ఆదేశిస్తాం. – డాక్టర్ యుగంధర్,పీసీపీఎన్డీటీ యాక్ట్ జిల్లా నోడల్ ఆఫీసర్ -
మహిళను బలిగొన్న కామాంధులు!
తుంగతుర్తి: భర్తను పోగొట్టుకుని భారంగా బతుకీడుతున్న ఓ అభాగ్యురాలిని కామాంధులు పొట్టనబెట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం లైంగికదాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు చికిత్స పొందుతూ కన్నుమూసింది. సూర్యాపేట జిల్లాలో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాకు చెందిన గుగులోతు కాంతమ్మ (35)కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాంతమ్మ భర్త వీరన్న పదేళ్లక్రితం మృతిచెందాడు. అప్పటి నుంచి కాంతమ్మ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. పని ఉందని తీసుకెళ్లి.. రామన్నగూడెం తండాకే చెందిన గుగులోతు సోమ్లా ఈ నెల 17న రాత్రి 9 గంటల సమయంలో కాంతమ్మను పని ఉందని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అదే సమయంలో మాలిపురం గ్రామానికి చెందిన శివ, లక్ష్మణ్‌లు సోమ్లా ఇంటికి వచ్చారు. అనంతరం శివ, లక్ష్మణ్‌లు కాంతమ్మను తండా పక్కన ఉన్న తోటలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. తిరిగి ఆమెను రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి పంపించారు. తీవ్ర అస్వస్థతకు గురై.. కాగా, కాంతమ్మ ఈనెల 20న తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుల సలహా మేరకు సూర్యాపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. దీంతో బంధువులు కాంతమ్మ మృతికి కారణమైన సోమ్లా ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి, ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సోమ్లాను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు. -
వాణిశ్రీ ఇంట విషాదం
సాక్షి, చెన్నై : సీనియర్ నటి వాణిశ్రీ సోదరి కాంతమ్మ(70) గుండెపోటుతో మరణించారు. శనివారం ఉదయం చెన్నైలోని ఆమె స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. కాంతమ్మ స్వస్థలం నెల్లూరు. ప్రస్తుతం ఆమె బంధువులు అమెరికాలో ఉండటంతో వారు వచ్చిన తరువాతే అంత్యక్రియలు నిర్వహించే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. -
రైలు ఆపి మహిళను రక్షించిన లోకో పైలెట్లు
తిరుపతి : రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ మహిళను రైల్వే సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన తిరుపతిలోని ఆర్సీరోడ్డు సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... చీరాలకు చెందిన కాంతమ్మ(45) భర్త కొంతకాలం క్రితం మరణించాడు. ఇటీవలే కొడుకు కూడా మృతి చెందాడు. దీంతో ఆమె మనస్తాపం చెందింది. దీంతో బుధవారం ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్సీ రోడ్డు వద్ద గల రైల్వే ట్రాక్‌పైకి చేరుకుంది. ఆ విషయాన్ని అటువైపుగా వస్తున్న లోకో పైలెట్లు అప్రమత్తమై రైలును ఆపి వేశారు. అనంతరం మహిళను అక్కడనుంచి రైల్వే స్టేషన్‌కు తరలించి... పోలీసులకు అప్పగించారు. అయితే గత కొద్ది రోజులుగా కాంతమ్మ కేన్సర్ వ్యాధితో బాధపడుతోందని తెలిసింది. -
కుటుంబకలహాలతో మహిళ దారుణ హత్య
మాచర్ల: గుంటూరు జిల్లాలో శుక్రవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. కుటుంబకలహాల నేపథ్యంలో మహిళను సమీప బంధువు అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. ఈ దారుణం మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసరావు భార్య కాంతమ్మ(40)కు ఆమె సోదరి కుటుంబంతో తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కాంతమ్మ ఇంటి ముందు ఉండగా సోదరి కొడుకు వెంకట్రావు గొడ్డలితో విచక్షణా రహితంగా నరకాడు. దీంతో కాంతమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం వెంకట్రావు అక్కడి నుంచి పరారయ్యాడు. సీఐ శివశంకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.