
సాక్షి, చెన్నై : సీనియర్ నటి వాణిశ్రీ సోదరి కాంతమ్మ(70) గుండెపోటుతో మరణించారు. శనివారం ఉదయం చెన్నైలోని ఆమె స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. కాంతమ్మ స్వస్థలం నెల్లూరు. ప్రస్తుతం ఆమె బంధువులు అమెరికాలో ఉండటంతో వారు వచ్చిన తరువాతే అంత్యక్రియలు నిర్వహించే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు.