తిరుపతి : రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ మహిళను రైల్వే సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన తిరుపతిలోని ఆర్సీరోడ్డు సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... చీరాలకు చెందిన కాంతమ్మ(45) భర్త కొంతకాలం క్రితం మరణించాడు. ఇటీవలే కొడుకు కూడా మృతి చెందాడు. దీంతో ఆమె మనస్తాపం చెందింది.
దీంతో బుధవారం ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్సీ రోడ్డు వద్ద గల రైల్వే ట్రాక్పైకి చేరుకుంది. ఆ విషయాన్ని అటువైపుగా వస్తున్న లోకో పైలెట్లు అప్రమత్తమై రైలును ఆపి వేశారు. అనంతరం మహిళను అక్కడనుంచి రైల్వే స్టేషన్కు తరలించి... పోలీసులకు అప్పగించారు. అయితే గత కొద్ది రోజులుగా కాంతమ్మ కేన్సర్ వ్యాధితో బాధపడుతోందని తెలిసింది.