Loco Pilots
-
‘ఆపుకోలేని’ ఆవేదన!
రైలింజన్లలో వాష్‌రూంలు లేక మహిళా లోకోపైలట్ల యాతనఒక్కసారి ఊహించుకోండి.. మీరు బిజీ సెంటర్లో ఉన్నారు. చాలా అర్జెంటు.. ఎక్కడా వెళ్లే పరిస్థితి లేదు. మీకెలా అనిపిస్తుంది? నరకయాతన కదూ.. ఒక్క రోజుకే మన పరిస్థితి ఇలా ఉంటే.. దేశంలో రైళ్లను నడిపే మహిళా లోకోపైలట్లు రోజూ ఈ నరకయాతనను అనుభవిస్తున్నారు. అదీ ఎన్నో ఏళ్లుగా.. దేశవ్యాప్తంగా..లోకోపైలట్లు 86,000దక్షిణమధ్య రైల్వేలో 12,000మహిళలు 3,000 మహిళలు 500భారతీయ రైల్వే.. గతంతో పోలిస్తే ఎంతో మారింది. మన రైళ్లలోనూ ఎన్నో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అదే రైళ్లను నడిపే లోకోపైలట్లకు కనీస సదుపాయమైన వాష్‌రూం మాత్రం నేటికీ అందు బాటులోకి రాలేదు. వీటిని ఏర్పాటు చేయాలని 2016లోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినా.. నేటికీ అది సాకారం కాలేదు. దీంతో చేసేది లేక.. కొందరు మహిళా లోకోపైలట్లు అడల్ట్ డైపర్లు వాడుతున్నారు.. మరికొందరు డ్యూటీకెళ్లేటప్పుడు నీళ్లు తాగడం మానేస్తున్నారు. ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.మా సమస్యను పట్టించుకునేవారేరి?వాష్‌రూం లేకపోవడం వల్ల స్త్రీ, పురుష లోకోపైలట్లు ఇద్దరికీ ఇబ్బంది అయినా.. తమ సమస్యలు వేరని తమిళనాడుకు చెందిన సీనియర్ మహిళా లోకోపైలట్ ఒకరు చెప్పారు. ‘మెయిన్ జంక్షన్లలో తప్పితే.. చాలా స్టేషన్లలో 1–5 నిమిషాలు మాత్రమే రైలును ఆపుతారు. ఆ టైంలోనే వెనుక ఉన్న బోగీకి లేదా స్టేషన్‌లోని వాష్‌రూంకు వెళ్లి.. పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమయానికి తిరిగి రాకపోతే.. ట్రైన్ నిర్ణిత సమయం కన్నా ఎక్కువ సేపు ఆగితే.. వివరణ ఇచ్చుకోవాలి.దాని కన్నా.. వెళ్లకపోవడమే బెటరని చాలామంది భావిస్తారు’అని ఆమె చెప్పారు. ఇలాంటి పరిస్థితుల వల్ల తాను కూడా మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్ బారిన పడ్డానని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. తమ సమస్యలను పట్టించుకునేవారేరి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా.. ఒకసారి ఇంజన్ క్యాబిన్లోకి ప్రవేశిస్తే విధులు ముగిసేవరకు బయటకు వెళ్లడం సాధ్యం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లవలసి వస్తే వాకీటాకీల్లో పై అధికారులకు సమాచారం అందజేయాలి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మహిళా లోకోపైలట్లు చెబుతున్నారు.పైగా కొన్ని చోట్ల స్టేషన్లు చాలా ఖాళీగా ఉంటాయి. అలాంటి స్టేషన్లలో వాష్‌రూంను వినియోగించడమంటే తమ భద్రతను పణంగా పెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎనిమిది గంటల డ్యూటీ అంటారు. కానీ ఒక్కసారి బండెక్కితే పదకొండు గంటలు దాటిపోతుంది.అప్పటి వరకు ఆపుకోవాల్సిందే’అని దక్షిణ మధ్య రైల్వేలో విధులు నిర్వహిస్తున్న ఒక సహాయ మహిళా లోకోపైలట్ ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రాన్ని ఆపుకోవడం లేదా నీళ్లు తక్కువగా తాగడం వల్ల మహిళల్లో మూత్రనాళం, కంటి సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయని, ఇది ప్రమాదకరమని ప్రముఖ గైనకాలజిస్ట్ శాంతి రవీంద్రనాథ్ హెచ్చరించారు.రైలు నడుపుదామనుకున్నా.. కానీ.. ⇒ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది లోకో పైలట్ అవ్వాలని వచి్చ.. డెస్క్ జాబ్‌లో సర్దుకుంటున్నారు. .. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని ఉండేది. లోకో పైలట్ క్వాలిఫై అయి ఐదేళ్లయింది. వాష్‌రూం లేని చోట పనిచేయడం ఇబ్బందని.. డెస్క్ జాబ్ చేస్తున్నాను’అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మహిళ చెప్పారు. తాను లోకోపైలట్ అయినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యానని.. అయితే మహిళలు శానిటరీ న్యాప్కిన్లు ధరించి డ్యూటీకి రావాల్సిన దుస్థితిని కల్పిస్తున్న ఇలాంటి పని వాతావరణంలోకి రావడానికి ఎందరు ఇష్టపడతారని ఓ లోకోపైలట్ ప్రశ్నించారు.నెలసరి సమయంలో మరిన్ని ఇబ్బందులు పడలేక.. సెలవు పెట్టడమే బెటరని భావిస్తున్నట్లు చెప్పారు. రన్నింగ్ డ్యూటీలు చేయలేని వాళ్లకు స్టేషన్డ్యూటీలు అప్పగించే వెసులుబాటు ఉంది. కానీ అధికారులు అంతగా ఇవ్వడం లేదు. ప్రెగ్నెన్సీతో విధులకు హాజరయ్యే మహిళలకు మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తున్నారు. ‘గతంలో చాలాసార్లు స్టేషన్ డ్యూటీ ఇవ్వాలని అధికారులను వేడుకున్నా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కావడం వల్ల స్టేషన్ డ్యూటీ ఇచ్చారు’అని సికింద్రాబాద్‌కు చెందిన రేవతి చెప్పారు. చేస్తామని చెప్పి.. చేయలేదురైలింజన్లలో వాష్‌రూంలు లేకపోవడంపై ద ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్స్ ఆర్గనైజేషన్ మాజీ అధ్యక్షుడు అలోక్ వర్మ అప్పట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో ప్రతి ఇంజన్ క్యాబిన్లో ఏసీ సదుపాయంతో పాటు వాష్‌రూమ్‌ను ఏర్పాటు చేయాలని హక్కుల కమిషన్ 2016లో ఆదేశించింది. దీనికి సమాధానంగా అన్ని రైళ్లలో వాష్‌రూంను ఏర్పాటు చేస్తామని రైల్వే చెప్పింది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదు. దేశంలో కొన్ని డివిజన్లలోని ఇంజన్లలో వీటి ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ.. క్లీనింగ్ తదితర నిర్వహణ సమస్యలతోపాటు ఇంజిన్లోకి లోకోపైలట్ మినహా ఎవరినీ అనుమతించ రాదనే నిబంధనలు వంటి కారణాలతో దాన్ని అమలు చేయలేదని అధికారులు చెబుతున్నారు.ఇది లోకోపైలట్ల కనీస హక్కులను హరించడమేనని అలోక్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం వస్తున్న వందేభారత్‌లలో ఈ సమస్య పెద్దగా లేదని చెప్పారు. మిగతావాటి పరి స్థితి ఏమిటని ప్రశ్నించారు. అమెరికా, యూరప్, బ్రిటన్లలో లోకోపైలట్లకు ప్రతి 4 గంటలకు 20–25 నిమిషాల బ్రేక్ ఉంటుందని చెప్పారు. – సాక్షి, హైదరాబాద్/సాక్షి, సెంట్రల్డెస్క్కమిటీ వేసినా.. ముందడుగు పడలేదు..రైలింజన్లలో వాష్‌రూంలు, సరైన విశ్రాంతి గదులు వంటి సదుపాయాలు కల్పించాలని ఇప్పటికి అనేక సార్లు రైల్వేబోర్డుకు విన్నవించాం. 3 నెలల క్రితమే రైల్వే బోర్డు ఒక కమిటీని వేసింది. అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అధ్యయనం చేయలేదు. – మర్రి రాఘవయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) -
రైలు ప్రమాదాలకు చెక్.. ఏఐ కెమెరాలతో నిఘా
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిమూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000 ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్‌లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్‌కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది. -
మోదీ ప్రమాణా స్వీకారోత్సవానికి అతిధులుగా మహిళా లోకో పైలట్లు!
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ముచ్చటగా మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారు. ఈ స్వీకారోత్సవానికి దాదాపు ఎనిమిది వేల మందికి పైగా అతిథులు హాజరుకాబోతున్నారు. ఈ అతిథుల జాబితాలో ఇద్దరు మహిళా లోకో పైలట్లకు కూడా స్థానం దక్కింది. దేశాధినేతలు, అతిరథ మహారథులు విచ్చేయు ఈ వేడకకు ఈ మహిళా పైలట్లకు ఆహ్వానం దక్కడం విశేషం. ఆ మహిళలు ఎవరంటే..రెండు లక్షల గంటలకు పైగా..ఈ వేడుకలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్ పేరు ఐశ్వర్య ఎస్ మీనన్. మీనన్ దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్లో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్. దక్షిణ రైల్వే నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. ఆమె వందే భారత్, జన్ శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో లోకో పైలట్‌గా రెండు లక్షల గంటలకు పైగా పనిచేసిన మహిళగా ప్రసిద్ధి. ఈ ఘనతను సాధించడం అంత ఈజీ కాదు. ఇది మీనన్ అంకితాభావానికి నిదర్శనం. రైల్వే సిగ్నలింగ్‌పై ఆమెకున్న సమగ్ర పరిజ్ఞానం, వృత్తి పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతకు ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఆమె ప్రస్తుతం చెన్నై నుంచి విజయవాడ, చెన్నై-కోయంబత్తూరూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో పనిచేస్తుంది.మరో మహిళా లోకో పైలట్..మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవునున్న మరో మహిళా లోకో పైలట్ పేరు సురేఖ యాదవ్. ఆమె ఆసియా తొలి మహిళా లోకో పైలట్ కూడా. యాదవ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి సోలాపూర్ వెళ్లే వందే భారత్ రైలులో లోక్ పైలట్‌గా పనిచేస్తున్నారు. ఈ రోజు (ఆదివారం జూన్ 9న) న్యూఢిల్లీలో జరగనున్న వేడుకకు ఆహ్వానించబడిన పదిమంది లోకో పైలట్లలో ఆమె కూడా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోని సతారాకు చెందిన యాదవ్ 1988లో భారతదేశపు తొలి మహిళా రైలు డ్రైవర్‌గా నిలిచింది. ఆమె రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక అవార్డులను అందుకుంది. ముంబైలోని షోలాపూర్ నుంచి సీఎస్ఎంటీ మధ్య నడిచే సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి తొలి మహిళా లోకో పైలట్ కూడా. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో ఇద్దరు మహిళా లోకో పైలట్లకు పాల్గొనే అవకాశం రావడం విశేషం. కాగా, ఈ వేడుకలో బీజేపీ మిత్ర పక్షాలు, టీడీపీ, శివసేన, ఎల్జీపీ(ఆర్) తదితరులందరూ హాజరుకానున్నారు. (చదవండి: ఒడిశా రాజకీయాల్లో సోఫియా సంచలనం.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్) -
పంజాబ్‌లో రైలు ప్రమాదం.. ఇద్దరు లోకోపైలట్ల పరిస్థితి విషమం
పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్హింద్ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలోని మాధోపూర్ చౌకీ సమీపంలో ఈరోజు (ఆదివారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తొలుత రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలుకు చెందిన ఇంజన్ బోల్తా పడి, ప్యాసింజర్ రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి.బాధితులను యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన వికాస్ కుమార్ (37), హిమాన్షు కుమార్ (31)గా గుర్తించారు. వారిని 108 అంబులెన్స్‌లో ఫతేఘర్ సాహిబ్‌లోని ఆసుపత్రికి తరలించారు. వికాస్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని రాజింద్ర ఆసుపత్రికి తరలించారు. వికాస్ కుమార్ తలకు బలమైన గాయమైందని డాక్టర్ ఈవెన్‌ప్రీత్ కౌర్ తెలిపారు. హిమాన్షు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. #WATCH | Punjab: Two goods trains collided near Madhopur in Sirhind earlier this morning, injuring two loco pilots who have been admitted to Sri Fatehgarh Sahib Civil Hospital. pic.twitter.com/0bLi33hLtS— ANI (@ANI) June 2, 2024 ఈ ప్రమాదంలో పెద్దగా ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గూడ్స్ రైళ్ల కోసం నిర్మించిన న్యూ సిర్హింద్ స్టేషన్ సమీపంలోని డీఎప్‌సీసీ ట్రాక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ మార్గంలో అప్పటికే బొగ్గు లోడుతో కూడిన రెండు గూడ్స్ రైళ్లను నిలిపి ఉంచారు. అయితే ఒక గూడ్స్ రైలుకు చెందిన ఇంజిన్ విడిపోయి మరో గూడ్సును ఢీకొంది. తరువాత అది అంబాలా నుంచి జమ్ముతావికి వెళ్తున్న సమ్మర్ స్పెషల్ ప్యాసింజర్ రైలును ఢీకొంది.దీంతో ఆ రైలులోని ప్రయాణికులు ఆందోళనతో కేకలు వేశారు. వెంటనే రైలు నిలిచిపోవడంతో ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదు. ఈ ఘటన నేపధ్యంలో అంబాలా నుంచి లూథియానా వైపు వెళ్లే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అంబాలా డివిజన్ డీఆర్ఎంతోపాటు రైల్వే, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. -
పట్టాలపై పొగమంచు
రామగుండం/ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–బల్లార్షా సెక్షన్ల మధ్య బుధవారం రైలు పట్టాలపై పొగమంచు కమ్ముకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు విఘాతం కలిగింది. ప్రధానంగా సికింద్రాబాద్–బల్లార్షా–న్యూఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్ల వేగం తగ్గించి నడిపించారు. సిగ్నల్స్‌ను పొగమంచు కమ్మేయడంతో లోకో పైలట్లు అప్రమత్తమయ్యారు. వేగం బాగా తగ్గించి నడపడంతో రైళ్లు నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపైకి వచ్చేవరకూ రైళ్లు కనిపించక ప్రయాణికులు సైతం తికమకపడ్డారు. కాజీపేట– బల్లార్షా సెక్షన్ల మధ్య పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట, ఓదెల, పొత్కపల్లి, కొలనూర్, బిజిగిరిషరీఫ్, హసన్‌పర్తి మధ్య ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. ఉదయం 11 గంటల తర్వాత సూర్యుడు రావడంతో రైల్వేసిగ్నలింగ్ వ్యవస్థ, పట్టాలు యథాతథస్థితికి చేరుకున్నాయి. దీంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
రైళ్లను వదిలేసి వెళ్లిపోయిన లోకోపైలట్లు.. ప్రయాణికులకు గంటలకొద్దీ నరకం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని బుర్వాల్ జంక్షన్లో బుధవారం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటలకొద్దీ ఆగిపోయాయి. తమ డ్యూటీ అయిపోయిందని ఒక లోకోపైలట్, ఒంట్లో నలతగా ఉందని మరో లోకోపైలట్ రైళ్లను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో రెండు రైళ్లలోని సుమారు 2,500 మంది ప్రయాణికులు గంటల కొద్దీ నరకం చేశారు. రైలు లోపల నీరు, ఆహారం, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు నిరసనకు దిగారు. రైలు పట్టాల మీదకు వచ్చి ఇతర రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ఫేర్ ఛత్ పూజ స్పెషల్ (04021), బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ (15203) రైళ్లలో ఈ సంఘటన జరిగింది. కొన్ని గంటల తర్వాత పరిస్థితిని శాంతింపజేయడానికి ఈశాన్య రైల్వే ఆగిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గోండా జంక్షన్ నుంచి సిబ్బందిని పంపించింది. రైల్వే ప్రకారం.. సహర్సా నుంచి నవంబర్ 27న రాత్రి 7.15 గంటలకు బయలుదేరాల్సిన సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ట్రైన్ నవంబరు 28న ఉదయం 9.30 గంటలకు బయలుదేరింది. దీంతో ఈ రైలు 19 గంటలు ఆలస్యంగా గోరఖ్‌పూర్ చేరుకుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు బుర్వాల్ జంక్షన్లో హాల్ట్ లేదు, కానీ మధ్యాహ్నం 1:15 గంటలకు షెడ్యూల్ లేకుండా ఆగింది. మరో రైలు బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ అప్పటికే 5.30 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది. సాయంత్రం 4.04 గంటలకు ఈ ట్రైన్ బుర్వాల్ జంక్షన్‌కు చేరుకుంది. ఇక్కడే ఈ రైలు సిబ్బంది కూడా వెళ్లిపోయారు. 25 గంటల 20 నిమిషాల్లో తమ ప్రయాణం ముగియాల్సి ఉండగా రైలు ఆలస్యం కారణంగా మూడో రోజూ రైలులోనే గడపాల్సి వచ్చిందని సహర్సా నుంచి తన బంధువులతో కలిసి న్యూఢిల్లీకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు వాపోయారు. నిద్రమత్తు కారణంగా లోకో పైలట్లు, రైలు గార్డ్ రైలు వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. రైల్లో నీరు, ఆహారం కోసం ప్యాంట్రీ కారు లేదని, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడినట్లు ఆయన పేర్కొన్నారు. -
రైలుబండి నడిపే వారెక్కడ?
సాధారణంగా ఏ సంస్థలోనైనా సరే వంద మంది సిబ్బంది అవసరమైన చోట కనీసం మరో 10 మందిని అదనంగా నియమించుకుంటారు. సంస్థ నిర్వహణలో ఆటంకాలు లేకుండా ఉండాలంటే అదనపు సిబ్బంది అవసరం. కానీ దక్షిణమధ్య రైల్వేలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రైళ్లు నడిపేందుకు డ్రైవర్లు కరువవుతున్నారు. వాస్తవానికి రైళ్ల నిర్వహణకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు లోకోపైలెట్లు, అసిస్టెంట్ లొకోపైలెట్లు తదితర సిబ్బంది కనీసం 30 శాతం అదనంగా ఉండాలి. అదనపు సిబ్బంది సంగతి పక్కనపెడితే.. ఉండాల్సిన వారిలోనే 30 శాతం సిబ్బంది కొరత ఉంది. దీంతో పనిభారంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. చివరకు అనారోగ్యం ఉన్నా సెలవులు లభించడం లేదంటూ లోకోపైలెట్లు వాపోతున్నారు. –సాక్షి, హైదరాబాద్ విరామమెరుగని విధులు.. దక్షిణమధ్య రైల్వేలో రోజూ సుమారు 600 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 10 లక్షల మందికిపైగా ప్రయాణం సాగిస్తుంటారు. అన్ని డివిజన్ల పరిధిలో 3,800 వరకు లోకో పైలెట్లు, సహాయ లోకోపైలెట్లు, షంటర్లు పని చేయవలసి ఉండగా ప్రస్తుతం 2384 మంది మాత్రమే ఉన్నారు.1,416 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే కనీసం వెయ్యి మంది అదనంగా ఉండాల్సిన చోట వెయ్యి మందికిపైగా కొరత ఉండడం గమనార్హం. కొంతకాలంగా లోకోపైలెట్ల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో ఉన్నవాళ్లపైనే పనిభారం అధికమవుతోంది. ‘లింక్’ లేని డ్యూటీలు సాధారణంగా ఒక లోకోపైలెట్ తన విధి నిర్వహణలో 8 గంటలు పనిచేసి 6 గంటల విశ్రాంతి తీసుకోవాలి. తరువాత మరో 8 గంటలు పని ఉంటుంది. తిరిగి 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటల పాటు విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక రోజు సెలవు చొప్పున, ప్రతి 14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున లోకోపైలెట్ లింక్ (విధి నిర్వహణ) ఉండాలి. కానీ ఈ లింక్‌కు పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతే లభిస్తోందని లోకోపైలెట్లు అంటున్నారు. వరుసగా రాత్రిళ్లు పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి ఒకరోజు రాత్రి పూర్తిగా విశ్రాంతి ఉండాలి. కానీ ప్రస్తుతం రాత్రి పూట నిద్రకు నోచని ఎంతోమంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పనిచేస్తున్నారు. ‘అనారోగ్యం కారణంగా కూడా సెలవులు లభించడం లేదు. లాలాగూడ రైల్వే ఆసుపత్రి డాక్టర్లు ఫోన్లోనే ఫిట్నెస్ సరి్టఫికెట్లు ఇచ్చేస్తున్నారు. బాగానే ఉన్నావు డ్యూటీకి వెళ్లొచ్చని చెబుతున్నారు.’.. అని సికింద్రాబాద్ డిపోకు చెందిన అసిస్టెంట్ లోకోపైలెట్ ఒకరు చెప్పారు. ‘సేఫ్టీ’ ఎలా.. సిగ్నల్స్ కనిపెట్టడం, కాషన్ ఆర్డర్స్‌ను అనుసరించడం, ట్రాక్‌లు మార్చడం, వేగాన్ని అదుపు చేయడం.. ఇలా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు లోకోపైలెట్లకు ఏకాగ్రత, ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. కానీ ప్రతి క్షణం వెంటాడే ఒత్తిడి, నిద్ర లేమి వల్ల రైల్వే మాన్యువల్‌కు విరుద్ధమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నామని రైఅంటున్నారు. ఒత్తిడే ప్రమాదాలకు కారణం? తరచూ హెచ్చరిక సిగ్నళ్లను (సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్) సైతం ఉల్లంఘిస్తూ రైలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పే సందర్భాల్లో ఇలాంటి ఒత్తిడే ప్రధాన కారణమవుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సికింద్రాబాద్ డిపోలోనూ కొరత దక్షిణమధ్య రైల్వేలోనే కీలకమైన సికింద్రాబాద్ డిపోలో 578 మంది లోకోపైలెట్లు పని చేయవలసి ఉండగా 343 మంది మాత్రమే ఉన్నారు. 235 ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో గూడ్స్ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్లు ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు. -
ఏకంగా రైలునే ఆపేసిన ‘కచోరి’.. ప్రతిరోజూ ఇదే తంతు!
ఇష్టమైనవాటి కోసం ఎంతదూరమైనా వెళ్తుంటారు కొందరు! అవి తమ చెంతకే వస్తే!. ఇక్కడో లోకోపైలట్ ఏం చేస్తున్నాడో తెలుసా? కచోరిలను చాలా ఇష్టంగా బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ రూపంతో తింటుంటారు. కానీ, కచోరి కోసం ఆ రైల్వే లోకోపైలట్ రైలునే ఆపేశాడు.ఇలా ఒక్కరోజే కాదు..ప్రతీ రోజూ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్తాన్‌లోని జైపూర్ రైల్వే డివిజన్ లోకో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆ లోకోపైలట్.. అల్వార్ సమీపంలోని దౌద్పూర్ క్రాసింగ్ వద్ద ప్రతి రోజు ట్రైన్‌ను ఆపుతుంటాడు. అదే సమయంలో క్రాసింగ్ వద్దకు కచోరిలు అమ్మే వ్యక్తి .. ట్రైన్ ఇంజన్ బోగీ వద్దకు వచ్చి లోకోపైలట్‌కు కచోరిలు ఇచ్చి వెళ్తుంటాడు. అయితే ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు దౌద్పూర్ క్రాసింగ్ వద్ద ఇలా జరగడంతో.. రైలు ప్రయాణికులు, క్రాసింగ్ దాటే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ రైలులోని ఇద్దరు లోకోపైలట్లు, ఇద్దరు గేట్‌మన్లు, ఇన్స్ట్రక్టర్ను జైపూర్ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర కుమార్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై అల్వార్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఆర్ఎల్ మీనా మాట్లాడుతూ.. లోకోపైలట్ చేస్తున్నపనిని తీవ్రంగా ఖండించారు. లోకో పైలట్లు రైలను తమ వ్యక్తిగతమైన అవసరాల కోసం ఎక్కడా నిలపకూడని అన్నారు. కచోరి కోసం కదులుతున్న రైలును ఆపడం సరైన పని కాదని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. @AshwiniVaishnaw @RailMinIndia @GMNWRailway @DRMJaipur @drm_dli यह वीडियो एकwhatsappग्रुप के माध्यम से आज ओर अभी देखने को मिला है क्या यह रेलवे नियमानुसार सही है अगर गलत है तो एक्शन लीजिए और सम्बंधित सभी व्यक्तियों पर कार्यवाही करें@vishalmrcool @JAGMALSINGH_MON @vasudhoot pic.twitter.com/Tw5dtkozzn — NARENDRA KUMAR JAIN (@NarendraJainPcw) February 18, 2022 -
మృత్యువు నుంచి వృద్ధుడిని కాపాడిన లోకో పైలట్లు!
ముంబై: ముంబై-వారణాసి ప్రత్యేక రైలు డ్రైవర్లు సకాలంలో స్పందించి అత్యవసర బ్రేకులు వేయడంతో ముంబై సమీపంలోని కళ్యాణ్ స్టేషన్ వద్ద పట్టాలు దాటుతున్న ఒక వృద్ధుడు నేడు చావు నోటి నుంచి తప్పించుకొని బయటపడ్డారు. థానేలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం నంబర్ 4 సమీపంలో మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. "రైల్వే ట్రాక్ లను దాటడం చట్టవిరుద్ధం, ప్రమాదకరం. కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయే అవకాశం ఉండవచ్చు. ముంబై-వారణాసి స్పెషల్ రైలు 02193కు చెందిన ఎల్ పీఎస్ కె. ప్రధాన్, ఏఎల్ పీ రవిశంకర్ పైలెట్లు కళ్యాణ్ స్టేషన్ వద్ద ట్రాక్ దాటుతున్న సీనియర్ పౌరుడిని అత్యవసర బ్రేకులు వేసి కాపాడారు. సంతోష్ కుమార్ సీపీడబ్ల్యుఐ వారిని హెచ్చరించినట్లు" సెంట్రల్ రైల్వే తన ట్వీట్ లో పేర్కొంది. కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫారం నంబర్ 4 సమీపంలో 70 ఏళ్ల హరి శంకర్ రైలు వస్తున్నప్పుడు పట్టాలు దాటుతుండగా ఆకస్మికంగా పడిపోయారు. అతను పడిపోవడం గమనించిన చీఫ్ పర్మనెంట్ వే ఇన్ స్పెక్టర్(సీపీడబ్ల్యుఐ) సంతోష్ కుమార్, డ్రైవర్లు లోకో పైలట్ ఎస్ కె ప్రధాన్, అసిస్టెంట్ లోకో పైలట్ జీ. రవిశంకర్ లను హెచ్చరిస్తూ పట్టాలపై దాటుతున్న వృద్ధుడికి తెలిసేలా హెచ్చరికలు చేయాలని అరిచారు. ఆ హెచ్చరికను కాదని వెంటనే ఇద్దరు లోకో పైలట్లు అత్యవసర బ్రేకులు వేసి వృద్ధుడిని కాపాడి తర్వాత రైలు కింద నుంచి అతనిని బయటకు తీశారు. ఇప్పడు ఈ వీడియొ సామాజిక మాధ్యమాలలో ట్రెండ్ అవుతుంది. సకాలంలో స్పందించి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఇద్దరు లోకోమోటివ్ పైలట్లు, సీపీడబ్ల్యుఐకి సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అలోక్ కన్సల్ ఒక్కొక్కరికి ₹2,000 నగదు బహుమతిని ప్రకటించారు. Shri Alok Kansal, @GM_Crly announced on the spot cash award of ₹2,000/- each to LP, ALP and CPWI (Chief Permanent Way Inspector) for their timely act of saving the precious life of human being (2/2) — Central Railway (@Central_Railway) July 18, 2021 -
ఆ జంక్షన్‌కి కొత్త మహిళా అసిస్టెంట్ లోకోపైలెట్లు..
సాక్షి, కాజీపేట: కాజీపేట రూరల్ జంక్షన్‌లోని రైల్వే డ్రైవర్ల కార్యలయం కేంద్రంగా శిక్షణ పొందిన మహిళా అసిస్టెంట్ లోకోపైలేట్లు విధుల్లో చేరారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఈ ఆరుగురు మహిళా లోకో పైలేట్లకు కాజీపేట- డోర్నకల్ సెక్షన్లో అప్ అండ్ డౌన్ రూట్లలో గూడ్స్ రైళ్ల విధులు కేటాయించారు. కాగా, ఆర్ఆర్బీ ద్వారా నియామకమైన మరో నలుగురు మహిళ అసిస్టేంట్ లోకోపైలేట్లను కాజీపేటకు కేటాయించారు. వీరు కూడా ఇక్కడ శిక్షణ పొందాక విధుల్లో చేరనున్నారు. -
ఒత్తిడే చిత్తు చేస్తోందా?
సాక్షి, హైదరాబాద్: ‘ట్రైన్ నడిపించే లోకోపైలెట్ అంటే చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ, పనిఒత్తిడి చూస్తే ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. అలా అనుకొని తిరిగి వెళ్లిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఒకవైపు పని భారం ఉంటే మరోవైపు సిగ్నల్స్ కనిపెట్టడం, కాషన్ ఆర్డర్స్‌ను అనుసరించడం, ట్రాక్‌లు మార్చడం, వేగాన్ని అదుపు చేయడంతో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. విధి నిర్వహణలో రెప్పపాటు ఏమరుపాటుగా ఉన్నా కాచిగూడ స్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు హంద్రీ ఇంటర్‌సిటీని ఢీకొనడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఎంఎంటీఎస్ లోకోపైలెట్ చంద్రశేఖర్‌ను ఇటీవల హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు బదిలీ చేశారు. కుటుంబ అవసరాల దృష్ట్యా అక్కడికి వెళ్లడం అతనికి ఇష్టం లేదు. ఒకవైపు పనిభారం, మరోవైపు బదిలీ అంశంతో ప్రమాదానికి ముందు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. సరిగ్గా సిగ్నల్ గమనించలేకపోయాడు. దురదృష్టవశాత్తు చనిపోయాడు కూడా.. ఇటీవల జరిగిన ఎంఎంటీఎస్ ప్రమాదం నేపథ్యంలో కొంతమంది లోకోపైలెట్లు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘విధి నిర్వహణలో చంద్రశేఖర్ వల్ల క్షమించరాని పొరపాటు జరిగింది. కానీ దానివెనుక ఉన్న కారణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్క ఎంఎంటీఎస్ రైళ్లే కాదు, భద్రతా విభాగంలో సిబ్బంది కొరత లేకుండా ఉంటే ప్రమాదకరమైన పరిస్థితులను అదుపు చేయడం పెద్ద సమస్య కాదు..’ అని ఒక లోకోపైలెట్ అభిప్రాయపడ్డారు. సిబ్బంది కొరత వల్లే పనిభారం.. ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ రైళ్లు నడపడంలో భద్రతా సిబ్బంది విధి నిర్వహణ ఎంతో కీలకం. వందల కొద్దీ కిలోమీటర్ల దూరం రైళ్లు నడిపే సమయంలో లోకోపైలెట్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. నిద్రాహారాలకు దూరమై యుద్ధం చేసే సైనికుల్లాగే లోకోపైలెట్లు సైతం విరామానికి, విశ్రాంతికి నోచక నిర్బంధంగా విధులు నిర్వహిస్తున్నారు. ఏటా లక్షలాది మంది ప్రయాణికులను, వేల టన్నుల సరుకును ఒక చోట నుంచి మరో చోటకు రవాణా చేస్తూ రైల్వేకు రూ.వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టే దక్షిణమధ్య రైల్వే లోకోపైలెట్లు కనీస అవసరాలను సైతం అందుకోలేకపోతున్నారు. సిబ్బంది కొరత కారణంగా పనిభారం పెరిగి నిత్యం అభద్రత, తీవ్రమైన మానసిక ఒత్తిడి నడుమ ప్రయాణికులను సురక్షితంగా ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తున్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రమాదం .. సకాలంలో సెలవులు లభించక, విశ్రాంతి దొరక్క గంటల తరబడి విధులు నిర్వహించే లోకోపైలెట్లు సొంత కుటుంబ అవసరాలను సైతం తీర్చలేకపోతున్నారు. ఎంఎంటీఎస్ లోకోపైలెట్ చంద్రశేఖర్‌కు ప్రమాదానికి 20 రోజుల ముందే ఒక బాబు పుట్టాడు, మూడేళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు. ప్రమాదం నాటికి భార్యా పిల్లలు ఏలూరులో ఉన్నారు. ఈ క్రమంలో తరచుగా అక్కడికి వెళ్లి రావడానికి అవకాశం లభించకపోవడం వల్ల కూడా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు అతని సహోద్యోగులు తెలిపారు. ఒక్కోసారి దగ్గరి బంధువులో, మిత్రులో చనిపోయినా, మరే ఆపద వచ్చినా వెళ్లి పలకరించలేకపోతున్నట్లు విస్మయం వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత కారణంగా గూడ్స్ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్లు (ఇంజన్లను ఒక చోట నుంచి మరో చోటకు మార్చే వారు)ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇది ప్రమాదకరమే. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. దక్షిణమధ్య రైల్వేలో భద్రతా విభాగంలో పని చేసే లొకోపైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్లు, గార్డులు, పాయింట్స్‌మెన్, షంటర్లు తదితర సిబ్బంది సుమారు 9242 మంది పనిచేయవలసి ఉండగా, ప్రస్తుతం 7,482 మంది మాత్రమే ఉన్నారు. 1760 పోస్టులు తక్షణమే భర్తీ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా ఏటేటా పెరుగుతున్న కొత్త రైళ్లు, అదనపు ట్రిప్పుల కారణంగా మరో 1000 పోస్టులు అదనంగా భర్తీ చేయాలని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు నియమాక ప్రక్రియలో జాప్యం కూడా ఒక కారణం. లోకోపైలెట్లుగా చేరేందుకు రాతపరీక్షలో, మానసికస్థాయి, ఆరోగ్యం వంటి అంశాల్లో ఉత్తీర్ణులైతేనే శిక్షణ పొందేందుకు అర్హత సాధిస్తారు. ఈ ప్రక్రియకు కనీసం ఏడాది సమయం పడుతుంది. ఆ తరువాత మరో ఏడాది శిక్షణనిస్తారు. అనంతరం షంటర్‌గా పని అప్పగిస్తారు. ఇలా వివిధ స్థాయిల్లో పని చేసిన తరువాతనే ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు అనుమతినిస్తారు. ఇదంతా జరిగేందుకు కనీసం 5 ఏళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలో బీటెక్, ఎంటెక్ వంటి అదనపు అర్హతలు ఉన్న వారు తిరిగి వేరే ఉద్యోగాల్లోకి వెళ్లిపోతున్నారు. ఇలా లొకోపైలెట్లుగా అర్హత సాధించిన తిరిగి బయటకు వెళ్తునవారు 20 శాతానికి పైగా ఉండవచ్చునని అంచనా. ఒత్తిడి..నిద్రలేమితో చిక్కులు ఎంఎంటీఎస్ దుర్ఘటన నేపథ్యంలో ప్రయాణికుల భద్రత మరోసారి సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజానికి రైళ్లు నడిపే సమయంలో ఎంతో ఏకాగ్రత, ప్రశాంతత, సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి. కానీ ప్రతిక్షణం వెంటాడే ఒత్తిడి, నిద్రలేమి కారణంగా చాలామంది రైల్వే విధించిన ఆరోగ్య సూత్రాలకు విరుద్ధమైన పరిస్థితుల్లో పని చేస్తున్నారు. ఇది ప్రయాణికుల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది. దీంతో తరచుగా హెచ్చరిక సిగ్నళ్లను (సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్)సైతం ఉల్లంఘిస్తూ రైలు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘రైళ్లు పట్టాలు తప్పే అనేక సందర్భాల్లో ఇలాంటి ఒత్తిడే ప్రధాన కారణమవుతుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ ఒత్తిడి వల్లనే తమ ప్రమేయం లేకుండానే సిగ్నళ్లను దాటేస్తున్నట్లు పేర్కొన్నారు. సెలవులు కష్టమే.. నిబంధనల ప్రకారం ఒక లోకోపైలెట్ ఒక డ్యూటీలో 8 గంటలు మాత్రమే పని చేయాలి. ఆ తరువాత 6 గంటల విశ్రాంతి తీసుకోవాలి. తిరిగి 8 గంటలు పని చేసి మరో 6 గంటలు చొప్పున విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటల పాటు విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక రోజు సెలవు చొప్పున, ప్రతి 14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున లోకోపైలెట్ లింక్ (విధి నిర్వహణ) ఉండాలి. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతికే పరిమితమవుతున్నారు. 16 గంటల విశ్రాంతి పొందవలసిన సమయంలో 12 గంటలకే అది పరిమితమవుతుంది. వరుసగా రాత్రిళ్లు పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి ఒక రోజు రాత్రి పూర్తిగా విశ్రాంతి ఉండాలి. రాత్రి పూట నిద్రకు నోచని ఎంతోమంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పని చేస్తున్నారు. ‘సెలవులు లభించకపోవడంతో కుటుంబాలతో తగినంత సమయం గడపడం లేదు. పిల్లల ఆలన పాలన, చదువులు, వాళ్ల అభివృద్ధి వంటి అంశాల్లో భాగస్వాములు కాలేకపోతున్నారు. క్రమంగా అనుబంధాలకు, ఆత్మీయతలకు దూరమవుతున్నార’ని ఒక సీనియర్ లోకోపైలెట్ ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత కారణంగా ఆరోగ్యరీత్యా రైళ్లు నడిపేందుకు సమర్ధులు (ఫిట్నెస్లేకపోయినా) కాకపోయినప్పటికీ పని చేయవలసి వస్తుందని పేర్కొన్నారు. లొకోపైలెట్ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఏ–1 ఫిట్నెస్ను కలిగి ఉండాలి. కానీ సిబ్బంది కొరత కారణంగా కొంతకాలంగా దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
రైల్వే ఉద్యోగులకు ‘సీజీహెచ్ఎస్’ చికిత్స
న్యూఢిల్లీ: భద్రతా ప్రమాణాలను పెంచడంలో భాగంగా రైల్వే ఉద్యోగులకు పలు చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. లోకో పైలట్లు, ట్రాక్మెన్లు, గ్యాంగ్మెన్లకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) కింద ఫిజియో థెరపీ, వృత్తి సంబంధ థెరపీ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలను అందించనున్నారు. ఇప్పటి వరకు ఈ చికిత్సలు రైల్వే ఉద్యోగులకు అందుబాటులో లేవు. ఒక వేళ బయట వేరే చోట చికిత్స చేయించుకున్నా వారికి రీయింబర్స్మెంట్ ఉండేది కాదు. ‘రైల్వేలో పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, ట్రాక్మెన్లు, గ్యాంగ్మెన్లు పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ప్రయాణికుల భద్రత వీరిపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో వారికి మెరుగైన చికిత్స అందించాలని నిర్ణయించాం’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
రైల్వే సీబీటీలో 5లక్షల మందికి అర్హత
న్యూఢిల్లీ: అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) మొదటి దశలో మొత్తం 5, 88, 605 మంది అర్హత సాధించారని రైల్వే శాఖ తెలిపింది. డిసెంబర్ 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న రెండో దశ పరీక్షకు వీరు అర్హత పొందారని పేర్కొంది. పరీక్షకు 10రోజుల ముందు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీకి నాలుగు రోజులు ముందుగా ఈ–కాల్ లెటర్లు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. మొత్తం 64, 371 పోస్టులకు గాను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించారు. -
ఎడమ కుడైతే ప్రాణాంతకమే..!
- రైల్వేలో సిగ్నళ్ల తారుమారుతో ప్రమాద ఘంటికలు - ముందే గుర్తించే సూచిక బోర్డులు కనిపించవు.. - గుర్తించకుండా ముందుకెళ్తున్న లోకో పైలట్లు - ట్రాఫిక్ రద్దీతో ప్రయాణ నిడివి పెరిగి తగ్గుతున్న విశ్రాంతి సమయం - దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లోకో పైలట్ల ఫిర్యాదు - సిగ్నళ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు.. సాక్షి, హైదరాబాద్: రెడ్ సిగ్నల్ పడ్డా సిగ్నళ్లను చూసుకోకుండా లోకోపైలట్లు రైలును ముందుకు పోనిస్తే.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపం కావాల్సిందే.. ఇటీవల వరంగల్‌లో రెడ్ సిగ్నల్ పడినా రైలు ముందుకు వెళ్లిన విషయం ఇప్పుడు రైల్వే శాఖలో కలకలం సృష్టిస్తోంది. అయితే దీని వెనుక కారణాలు అన్వేషించేందుకు రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ నేరుగా లోకోపైలట్‌తో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా లోకోపైలట్లు వారి ఇబ్బందులు, సమస్యలను జీఎంతో చెప్పుకొన్నారు. లోకోపైలట్లు చెప్పిన అంశాలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 40 మంది లోకోపైలట్లతో భేటీ అయ్యారు. లోకోపైలట్లు చెప్పిన అంశాలు.. సాధారణంగా పట్టాలకు ఎడమవైపు సిగ్నల్ స్తంభాలు ఉంటా యి. సిగ్నళ్లను గమనిస్తూ లోకోపైలట్లు రైళ్లను నడుపుతారు. అయితే కొన్నిచోట్ల ఎడమవైపు స్థలం లేదనో, మరే ఇతర సమస్యలతోనో వాటిని కుడివైపు ఏర్పాటు చేశారు. కుడివైపు సిగ్నళ్లుండే విషయం ముందుగానే పైలట్లు గమనించేలా సూచికలను ఏర్పాటు చేయాలి. ఆ సూచికలు కనిపించట్లేదని లోకోపైలట్లు చెప్పారు. అవి సులభంగా కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. సూచికలు కనిపించకపోవడంతో కుడివైపు సిగ్నళ్లు ఉన్న విషయం ఆలస్యంగా గుర్తిస్తున్నట్లు కొందరు జూనియర్ లోకోపైలట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్‌తో విశ్రాంతి కొరవ.. రెండో లైన్ అందుబాటులో లేని చోట్ల రైళ్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండి గమ్యం చేరటంలో జాప్యం జరుగుతోంది. దీంతో డ్యూటీకి డ్యూటీకి మధ్య విరామం తగ్గి విశ్రాంతి సమయం సరిపోవట్లేదని లోకోపైలట్లు పేర్కొన్నారు. లోకోపైలట్లు కొరత వల్ల కూడా కొన్ని చోట్ల విశ్రాంతి లేకుండానే వెంటనే డ్యూటీలకు రావాల్సిన పరిస్థితులు అప్పుడప్పుడు ఉంటున్నాయని కొందరు వాపోయారు. వీటితోపాటు సెలవులు, ఆరోగ్య సమస్యలు, క్యాబిన్లో వేడిమి, చలిలాంటి వాతావరణాలను తట్టుకునే ఏర్పాటు లేకపోవటం చాలా ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. సిగ్నలింగ్ విభాగంతో సమన్వయ లోపం వంటి అంశాలను జీఎం దృష్టికి తెచ్చారు. దీంతో తన పరిధిలో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించేందుకు ఆయా విభాగాధిపతులతో జీఎం భేటీ అయి ఆదేశాలు జారీ చేశారు. పెద్ద సమస్యల పరిష్కారంపై రైల్వేబోర్డును ఆశ్రయించాలని నిర్ణయించారు. -
రైలు ఆపి మహిళను రక్షించిన లోకో పైలెట్లు
తిరుపతి : రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ మహిళను రైల్వే సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన తిరుపతిలోని ఆర్సీరోడ్డు సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... చీరాలకు చెందిన కాంతమ్మ(45) భర్త కొంతకాలం క్రితం మరణించాడు. ఇటీవలే కొడుకు కూడా మృతి చెందాడు. దీంతో ఆమె మనస్తాపం చెందింది. దీంతో బుధవారం ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్సీ రోడ్డు వద్ద గల రైల్వే ట్రాక్‌పైకి చేరుకుంది. ఆ విషయాన్ని అటువైపుగా వస్తున్న లోకో పైలెట్లు అప్రమత్తమై రైలును ఆపి వేశారు. అనంతరం మహిళను అక్కడనుంచి రైల్వే స్టేషన్‌కు తరలించి... పోలీసులకు అప్పగించారు. అయితే గత కొద్ది రోజులుగా కాంతమ్మ కేన్సర్ వ్యాధితో బాధపడుతోందని తెలిసింది. -
'ఇక రైలు డ్రైవర్ల హలో.. హలోకు స్పీడ్ బ్రేక్'
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు పెంచే చర్యల్లో భాగంగా ఓ వినూత్న కార్యక్రమానికి భారతీయ రైల్వే తెరతీసింది. ఇక నుంచి తమ సంస్థలో పనిచేస్తున్న లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల ఫోన్ కాల్ రికార్డుల వివరాలు పరిశీలించనుంది. రైలు నడుపుతున్న సమయంలో ఫోన్లు వాడుతున్నారా లేదా అనే అంశం తెలుసుకునేందుకు కాల్ డేటాను సేకరించనుంది. ఇందుకోసం ఇక నుంచి రైల్వేలో పని చేస్తున్న మొత్తం లోకో పైలెట్లకు, అసిస్టెంట్ లోకో పైలెట్లకు తామే సీయూజీ సిమ్ కార్డులను అందించడమే కాకుండా ప్రత్యేక నెంబర్లు కేటాయించి వారి కాల్ డేటాను పరిశీలించనుంది. ఈ మేరకు రైల్వేశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. రైల్వే నిబంధనల ప్రకారం రైలు నడుపుతున్నప్పుడు రైలు డ్రైవర్లు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 70 వేలమంది రైలు డ్రైవర్లు ఉన్నారు. -
బస్సు సడెన్‌గా వచ్చింది
నాందేడ్ ప్యాసింజర్ లోకోపెలైట్లు సాక్షి,హైదరాబాద్: ‘‘ట్రాక్ పైన బస్సు కనిపించేటప్పటికి బస్సుకు మాకు మధ్య దూరం వంద మీటర్లే ఉంది. అప్పటికి కొద్దిసేపటి నుంచి హారన్ మోగిస్తూనే ఉన్నాం. ఆ సమయంలో ట్రైన్ 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. సడెన్‌గా ట్రాక్‌పై బస్సు కనిపించింది. ఆ హఠాత్పరిణామాన్ని ఊహించలేకపోయాం. అయినా ఎమర్జెన్సీ బ్రేక్ అప్లయ్ చేశాం. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. బస్సును ఢీకొట్టిన మా ట్రైన్ 400 మీటర్ల దూరంలో ఆగిపోయింది. కేవలం 22 సెకన్లలోనే అంతా అయిపోయింది. ’’ గురువారం నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ నడిపిన లోకోపెలైట్ కె.ఎం. వెంకటసత్యనారాయణ, సహాయ లోకోపెలైట్ కోటేశ్వర్‌రావులు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. కానీ, ఏం లాభం... ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పకుండా అత్యంత క్లిష్టపరిస్థితుల్లో పనిచేసిన వారిద్దరిని మాత్రం గ్రామస్తులు వదిలిపెట్టలేదు. చిన్నారులను కోల్పోయామన్న బాధలో రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం గాయపడ్డ ఆ ఇద్దరు లోకోపైలట్లు లాలాగూడలోని కేంద్రీయ రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.