దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ముచ్చటగా మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారు. ఈ స్వీకారోత్సవానికి దాదాపు ఎనిమిది వేల మందికి పైగా అతిథులు హాజరుకాబోతున్నారు. ఈ అతిథుల జాబితాలో ఇద్దరు మహిళా లోకో పైలట్‌లకు కూడా స్థానం దక్కింది. దేశాధినేతలు, అతిరథ మహారథులు విచ్చేయు ఈ వేడకకు ఈ మహిళా పైలట్‌లకు ఆహ్వానం దక్కడం విశేషం. ఆ మహిళలు ఎవరంటే..
రెండు లక్షల గంటలకు పైగా..
ఈ వేడుకలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్ పేరు ఐశ్వర్య ఎస్ మీనన్. మీనన్ దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్‌లో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్. దక్షిణ రైల్వే నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. ఆమె వందే భారత్, జన్ శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో లోకో పైలట్‌గా రెండు లక్షల గంటలకు పైగా పనిచేసిన మహిళగా ప్రసిద్ధి. ఈ ఘనతను సాధించడం అంత ఈజీ కాదు. ఇది మీనన్ అంకితాభావానికి నిదర్శనం. రైల్వే సిగ్నలింగ్‌పై ఆమెకున్న సమగ్ర పరిజ్ఞానం, వృత్తి పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతకు ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఆమె ప్రస్తుతం చెన్నై నుంచి విజయవాడ, చెన్నై-కోయంబత్తూరూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో పనిచేస్తుంది.
మరో మహిళా లోకో పైలట్..
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవునున్న మరో మహిళా లోకో పైలట్ పేరు సురేఖ యాదవ్. ఆమె ఆసియా తొలి మహిళా లోకో పైలట్ కూడా. యాదవ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి సోలాపూర్ వెళ్లే వందే భారత్ రైలులో లోక్ పైలట్‌గా పనిచేస్తున్నారు. ఈ రోజు (ఆదివారం జూన్ 9న) న్యూఢిల్లీలో జరగనున్న వేడుకకు ఆహ్వానించబడిన పదిమంది లోకో పైలట్లలో ఆమె కూడా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోని సతారాకు చెందిన యాదవ్ 1988లో భారతదేశపు తొలి మహిళా రైలు డ్రైవర్‌గా నిలిచింది.
ఆమె రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక అవార్డులను అందుకుంది. ముంబైలోని షోలాపూర్ నుంచి సీఎస్‌ఎంటీ మధ్య నడిచే సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి తొలి మహిళా లోకో పైలట్ కూడా. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో ఇద్దరు మహిళా లోకో పైలట్‌లకు పాల్గొనే అవకాశం రావడం విశేషం. కాగా, ఈ వేడుకలో బీజేపీ మిత్ర పక్షాలు, టీడీపీ, శివసేన, ఎల్‌జీపీ(ఆర్) తదితరులందరూ హాజరుకానున్నారు.
(చదవండి: ఒడిశా రాజకీయాల్లో సోఫియా సంచలనం.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్)
Comments
Please login to add a commentAdd a comment