రైల్వే సీబీటీలో 5లక్షల మందికి అర్హత | Indian Railways declares ALP, Technician exam results | Sakshi

రైల్వే సీబీటీలో 5లక్షల మందికి అర్హత

Nov 4 2018 4:33 AM | Updated on Nov 4 2018 4:33 AM

Indian Railways declares ALP, Technician exam results - Sakshi

న్యూఢిల్లీ: అసిస్టెంట్‌ లోకో పైలట్లు, టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) మొదటి దశలో మొత్తం 5, 88, 605 మంది అర్హత సాధించారని రైల్వే శాఖ తెలిపింది. డిసెంబర్‌ 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న రెండో దశ పరీక్షకు వీరు అర్హత పొందారని పేర్కొంది. పరీక్షకు 10రోజుల ముందు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష తేదీకి నాలుగు రోజులు ముందుగా ఈ–కాల్‌ లెటర్లు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. మొత్తం 64, 371 పోస్టులకు గాను ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పరీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement