GBS disease
-
కర్నూల్ లో జీబీఎస్ కలకలం.. మహిళకు వైరస్ నిర్ధారణ
-
ఏపీలో GBS కలకలం
-
గుంటూరు జీజీహెచ్‌లో మరో జీబీఎస్ మరణం
సాక్షి, గుంటూరు: ఏపీలో జీబీఎస్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడి మరో మహిళ మృతి చెందింది. గుంటూరు జీజీహెచ్‌లో బుధవారం షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతిచెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత పెరిగి ఇవాళ సాయంత్రం మరణించింది. ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.భయపెడుతున్న జీబీ సిండ్రోమ్గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.ఇవీ లక్షణాలుమెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.⇒ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు.⇒జీవక్రియలు ప్రభావిమతమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకోవడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమన్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు.⇒శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి.ఎందుకిలా? ఎవరికి వస్తుంది?ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకాక పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పై వైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. గతంలో ఇది చాలా అరుదుగా కనిపించేది.ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. వాటి ప్రభావంతో వ్యాధి నిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. -
ఏపీలో ‘జీబీఎస్’ తొలి మరణం
సాక్షి,గుంటూరు:ఆంధ్రప్రదేశ్‌లో గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్)తొలి మరణం నమోదైంది. గులియన్ బారే సిండ్రోంన వైరస్ బారిన పడిన కమలమ్మ అనే మహిళ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం(ఫిబ్రవరి16) తుది శ్వాస విడిచారు.కమలమ్మది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిగా అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం కమలమ్మ వైరస్ బారిన పడ్డారు. తీవ్ర జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడి పోవడంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న మరికొందరికి గుంటూరు జీజీహెచ్‌లో డాక్టర్లు చికిత్సనందిస్తున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బాధితులకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో బాధితులకు జీబీఎస్ సోకినట్లు గుర్తించారు. నలుగురు బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా బాధితుల్లో జీబీఎస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు దీని గురించి ఆందోళన అవసరం లేదని డాక్టర్లు ఇప్పటికే ప్రకటించారు. -
భయపెడుతున్న జీబీ సిండ్రోమ్
సాక్షి ఫ్యామిలీ హెల్త్ డెస్క్ : గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. జీబీ సిండ్రోమ్ లక్షణాలు» ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించేదే జీబీఎస్. »మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికి ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. యాంటీబాడీస్ ఈ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి సిగ్నల్స్ అందక అవయవాలు అచేతనమవుతాయి.» మొదట కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా దేహమంతా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతన మైతే కళ్లు కూడా మూయలేడు. »ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. » గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం వస్తుంది. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితులు క్రమంగా కోలుకుంటారు. ఆ ప్రక్రియ రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు. »శరీరంలో పొటాషియం లేదా కాల్షియం పాళ్లు తగ్గినా జీబీఎస్ లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి. కలుషిత నీరు, ఆహారమే జీబీఎస్ రావటానికి ప్రధాన కారణమని గుర్తించారు.తక్కువ ఖర్చుతో చికిత్స ఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే వారికి తగిన మోతాదులో ఐదు రోజులపాటు ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి దేహంలో మైలీన్ పొరను ధ్వంసం చేసే యాంటీబాడీస్‌ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. మరో పద్ధతిలో రోగి బరువునుబట్టి ప్రతి కిలోగ్రాముకు 250 ఎంఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం మేలు. –డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
జీబీ సిండ్రోమ్ భయపెడుతోంది
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్/సాక్షి ఫ్యామిలీ హెల్త్ డెస్క్ : లక్ష మందిలో ఒకరికో, ఇద్దరికో అరుదుగా వచ్చే గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల నమోదు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరుగుతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఈ వ్యాధి కారణంగా శ్రీకాకుళం జిల్లాలో యువంత్ (10) అనే బాలుడు మృతి చెందాడు. గుంటూరు జీజీహెచ్‌లో ఏడుగురు బాధితులు ఈ సమస్యతో చేరగా, ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన ఐదుగురిలో గుంటూరు జిల్లా అలసనపల్లికి చెందిన బి.కమలమ్మ ఐసీయూలో, నరసరావుపేటకు చెందిన ఎస్.కె.రవీుజాన్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మిగతా ముగ్గురు.. గుంటూరు ఐపీడీకాలనీలోని వి.ఆశీర్వాదం, నెహ్రూనగర్‌కు చెందిన షేక్ గౌహర్జాన్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లికి చెందిన వి.నాగవేణి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరులో 5, విశాఖలో 6, కాకినాడలో 4, విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున మొత్తంగా 18 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కాకినాడ, విశాఖ జీజీహెచ్‌లలో నెలకు 10–15 చొప్పున కొత్త కేసులు నమోదు అవుతున్నాయని వైద్య శాఖ వెల్లడించింది. నెల్లూరులో ఇటీవల లోకల్ టీవీ రిపోర్టర్ ఒకరు ఈ వ్యాధి బారినపడి కోలుకున్నారు. గుంటూరులో ఏకంగా ఏడుగురు ఈ వ్యాధి బారిన పడటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు శుక్రవారం స్వయంగా జీజీహెచ్‌కు వచ్చి పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.వి.సుందరాచారితో మాట్లాడారు.మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీబీ సిండ్రోమ్ కేసుల గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సాధారణంగా వచ్చే వైరసేనని, గతంలో కూడా చాలా మంది చికిత్స పొంది రికవరీ అయ్యారని చెప్పారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు. ఇవీ లక్షణాలు» మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.» ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు. » జీవక్రియలు ప్రభావిమతమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకోవడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమన్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు. » శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి.ఎందుకిలా? ఎవరికి వస్తుంది?ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకాక పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పై వైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. గతంలో ఇది చాలా అరుదుగా కనిపించేది. ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. వాటి ప్రభావంతో వ్యాధి నిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. బాధితులు అచేతనం కావడం ఎందుకంటే.. మనిషి ప్రతి అవయవాన్నీ మెదడు నియంత్రిస్తుంటుంది. మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్ తమ సొంత మైలీన్ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అందక అవయవాలు చచ్చుబడి అచేతనమవుతాయి.వందలో 95 మందికి ప్రాణాపాయం ఉండదుజీబీఎస్ వ్యాధి చాలా ఏళ్లుగా ఉంటోంది. దీని అసలు పేరు ల్యాండ్రీ గులియన్ బ్యారీ సిండ్రోమ్. ప్రపంచ వ్యాప్తంగా లక్ష జనాభాలో ఒకరిద్దరు వ్యాధి బారిన పడుతుంటారు. గుంటూరు జీజీహెచ్‌లో నెలకు 10–15 కొత్త కేసులు మేం చూస్తుంటాం. సాధారణంగా వ్యాధి బారిన పడిన వందలో 75 మందికి ఆస్పత్రుల్లో చికిత్స కూడా అవసరం ఉండదు. 95 శాతం మంది రికవరీ అవుతారు. 5 శాతం మందికి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి.బాధితులకు రూ.5 లక్షల ఖరీదైన ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఐసీయూ, వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తుంటాం. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటు వ్యాధి కాదు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు. కాళ్లు, చేతులు చచ్చుబడటం, కండరాల బలహీన పడటం, స్వతహాగా నిలబడటానికి, నడవడానికి ఇబ్బంది వంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదిస్తే సరిపోతుంది. – డాక్టర్ ఎన్.వి. సుందరాచారి, సీనియర్ న్యూరాలజిస్ట్, ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాలతక్కువ ఖర్చుతో ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్సఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే రోగి శరీర బరువు ఆధారంగా వారికి తగిన మోతాదులో ఐదు రోజులపాటు ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి దేహంలో మైలీన్ షీత్‌ను ధ్వంసం చేసే యాంటీబాడీస్‌ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. మరో పద్దతిలో రోగి బరువునుబట్టి ప్రతి కిలోగ్రాముకూ 250 ఎంఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. అందులో ఐదు విడతలుగా రోజు విడిచి రోజు రక్తంలోని ప్లాస్మాను తీసేయడం ద్వారా ప్లాస్మాలోని యాంటీబాడీస్‌ను తొలగించడం జరుగుతుంది. ఇందులో ఇమ్యూనో గ్లోబ్యులిన్ చికిత్స ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స దాదాపు సగం ఖర్చులోనే అవుతుంది. యువత, టీనేజీ పిల్లలు వేగంగా కోలుకుంటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం అన్ని విధాలా మేలు.– డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
163కు చేరిన జీబీఎస్ కేసులు.. వెంటిలేటర్‌పై 21 మంది బాధితులు
పూణె: మహారాష్ట్రలోని పూణెను అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. తాజాగా మరో ఐదుగురు అరుదైన నాడీ సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో మహారాష్ట్రలో గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) అనుమానిత కేసుల సంఖ్య 163కి చేరింది. ఆరోగ్య శాఖ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందారని తెలిపారు.కొత్తగా జీబీఎస్(Guillain-Barré syndrome) కారణంగా ఎవరూ మరణించనప్పటికీ సోమవారం కొత్తగా మరో ఐదు కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి తెలిపారు. మొత్తం 127 మంది జీబీఎస్‌తో బాధపడుతున్నట్లు తేలిందని ఆయన తెలిపారు. పూణె నగరంలో 32, పూణె మునిసిపల్ కార్పొరేషన్‌కు కొత్తగా అనుసంధానించిన గ్రామాల నుండి 86, పింప్రి చించ్వాడ్లో 18, పూణె గ్రామీణ ప్రాంతంలో 19, ఇతర జిల్లాల్లో ఎనిమిది సహా 163 అనుమానిత కేసులు ఉన్నాయన్నారు. 163 మంది రోగులలో 47 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని 47 మంది ఐసియులో చికిత్స పొందుతున్నారని, 21 మంది వెంటిలేటర్లపై ఉన్నారని ఆ అధికారి వివరించారు.పూణె నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మొత్తం 168 నీటి నమూనాలను(Water samples) రసాయన, జీవ విశ్లేషణ కోసం ప్రజారోగ్య ప్రయోగశాలకు పంపినట్లు ఆయన తెలిపారు. దీనిలో ఎనిమిది నీటి వనరులు కలుషితమైనట్లు తేలిందని ఆయన అన్నారు. జీబీఎస్ అనేది ఒక అరుదైన రుగ్మత. ఇది సోకినప్పుడు శరీరంలోని వివిధ అవయవాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి. కండరాల బలహీనత ఏర్పడుతుంది. చేతులు, కాళ్లలో తీవ్రమైన బలహీనత ఏర్పడుతుంది. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా జీబీఎస్ వ్యాప్తికి కారణమని నిపుణులు తెలిపారు.ఇది కూడా చదవండి: ఎన్కౌంటర్లో ట్విస్ట్.. కంగుతిన్న పోలీసులు -
మహారాష్ట్రలో భయపెడుతోన్న జీబీఎస్ వైరస్
-
పేద కుటుంబానికి పెద్ద కష్టం
అయ్యో.. శివ! ♦ ప్రాణాంతకమైన జీబీఎస్‌తో బాధపడుతున్న బీటెక్ విద్యార్థి ♦ ఇది లక్షల్లో ఒకరికి వచ్చే అవకాశం అంటున్న వైద్యులు ♦ వైద్యానికి ఇప్పటి వరకు రూ. 5 లక్షల వరకు ఖర్చు ♦ రోజుకు రూ. 40 వేల ఖర్చుతో సెలైన్లు ఎక్కించాలి ♦ చేతిలో చిల్లిగవ్వలేక దిక్కుతోచని స్థితిలో కుటుంబం ♦ సీఎం కేసీఆర్ ఆపన్నహస్తం అందించాలని వేడుకోలు పేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంజనీరై ఇంటికి ఆధారం అవుతాడనుకున్న కొడుకు కళ్లెదుటే జీవచ్ఛవంలా మారి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే జీబీఎస్ జబ్బుతో బాధపడుతున్నాడా యువకుడు. రోజూ రూ.40 వేలు విలువ చేసే సెలైన్లు ఎక్కిస్తే తప్ప జబ్బు అదుపులోకి రాదని వైద్యులు చెబుతున్నారు. తమ కొడుకును బతికించుకోవడానికి అవసరమైన వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కుటుంబ సభ్యులు. సీఎం స్పందించి ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటున్నారు. సాక్షి భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం మీనానగర్‌కు చెందిన తంగెళ్లపల్లి శ్రీనివాస్, శ్రీదేవి దంపతులది నిరుపేద కుటుంబం. శ్రీనివాస్ వాచ్మెకానిక్గా శ్రీదేవి ఇంటి వద్ద టైలర్‌గా పనిచేస్తోంది. వీరి కుమారుడు శివప్రసాద్(20) రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ సమీపంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) చదువుతున్నాడు. శివప్రసాద్‌కు గతనెల 28వ తేదీన జీబీఎస్ (గ్విలియన్ బ్యారీ సిండ్రోమ్) అనే ప్రాణాంతక వ్యాధి సోకింది. ముందుగా జ్వరం లక్షణాలు కన్పించాయి. అటునుంచి కాలివేళ్లకు తిమ్మిరి వచ్చింది, అక్కడి నుంచి పాదాలు, మోకాళ్లు ఇలా శరీరం మొత్తం పాకింది. శరీరమంతా పక్షవాతం వచ్చింది. దీంతోపాటు నరాల వ్యవస్థ మొత్తం దెబ్బతింది. వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఐసీయూలో బెడ్లు లేకపోవడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకుపొమ్మని సలహా ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుపోతే రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల పైనే ఖర్చు అవుతుందని తెలి యడంతో విధిలేక గాంధీ ఆస్పత్రిలో చేర్పిం చారు. ఇప్పటి వరకు రూ. 5 లక్షల వరకు ఖర్చు అయింది. ఆస్పత్రిలో తెలుపు రేషన్‌కార్డుపై వైద్యం చేశారు. ఆస్పత్రిలో వారి పరిధి దాటిపోయింది. వైద్యం కొనసాగాలంటే డబ్బు లు కావాలని వైద్యులు చెబుతున్నారు. రోగ లక్షణాలు : జీబీఎస్ లక్షల మందిలో ఎవరో ఒకరికి వచ్చే జబ్బు. కాలి గోటి నుంచి తిమ్మిరి ప్రారంభమై మెడ వరకు ఇది పాకుతుంది. దీంతో శరీరం చచ్చుబడిపోయి, లేచి నిలబడి, కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. సకాలంలో వైద్యం అందించకపోతే తలకు ఎక్కి మెదడును పనిచేయకుండా చేస్తుంది. అలాగే శ్వాస ఆడకుండా చేస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం. దీన్ని నయం చేయడానికి సంవత్సర కాలం వైద్యం చేయాలి. ఇందుకోసం రోజూ కనీసం 40 వేల రూపాయలు విలువచేసే సెలైన్లు ఎక్కించాలి. ఈ జబ్బుకు ఇమ్యూనోగ్లోబులిన్ సెలైన్ రోజూ 5 రోగి శరీరంలోకి ఎక్కించాలి. గత నెల 28 నుంచి మందులు వాడుతున్నారు. ఆదివారంతో మందులు అయిపోతున్నాయి. సోమవారం నుంచి మందు ఇవ్వాలంటే రోజూ రూ.40 వేలు కావాలి. అంత డబ్బులేని పేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. సీఎం, మంత్రి, లేదా ఇతర దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు కోరుతున్నారు.