
సాక్షి,గుంటూరు:ఆంధ్రప్రదేశ్‌లో గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్)తొలి మరణం నమోదైంది. గులియన్ బారే సిండ్రోంన వైరస్ బారిన పడిన కమలమ్మ అనే మహిళ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం(ఫిబ్రవరి16) తుది శ్వాస విడిచారు.
కమలమ్మది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిగా అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం కమలమ్మ వైరస్ బారిన పడ్డారు. తీవ్ర జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడి పోవడంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న మరికొందరికి గుంటూరు జీజీహెచ్‌లో డాక్టర్లు చికిత్సనందిస్తున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బాధితులకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో బాధితులకు జీబీఎస్ సోకినట్లు గుర్తించారు.
నలుగురు బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా బాధితుల్లో జీబీఎస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు దీని గురించి ఆందోళన అవసరం లేదని డాక్టర్లు ఇప్పటికే ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment