ఆడుకుంటూ సజీవ దహనమయ్యారు | Two children burnt alive in Gummalakshmipuram | Sakshi
Sakshi News home page

ఆడుకుంటూ సజీవ దహనమయ్యారు

Published Fri, Jan 22 2016 6:03 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

ఆడుకుంటూ సజీవ దహనమయ్యారు - Sakshi

ఆడుకుంటూ సజీవ దహనమయ్యారు

గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : పూరి గుడిసెలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు.. ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన అడ్డాకుల రాకేష్(4) అనే చిన్నారి తమ పొలం వద్ద వేసిన పూరి గుడిసెలో తన మామయ్య కొడుకు రోహిత్(3)తో కలిసి ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు సమీపంలోని వరికుప్పలకు నిప్పు అంటుకుంది. దీంతో ఇద్దరు చిన్నారులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. దీంతో చిన్నారుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement