GummaLakshmipuram
-
ఆడుకుంటూ సజీవ దహనమయ్యారు
గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : పూరి గుడిసెలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు.. ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అడ్డాకుల రాకేష్(4) అనే చిన్నారి తమ పొలం వద్ద వేసిన పూరి గుడిసెలో తన మామయ్య కొడుకు రోహిత్(3)తో కలిసి ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు సమీపంలోని వరికుప్పలకు నిప్పు అంటుకుంది. దీంతో ఇద్దరు చిన్నారులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. దీంతో చిన్నారుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
యువతి బలవన్మరణం
గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : నిద్ర మాత్ర లు మింగి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం చీమలగూడలో శుక్రవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన సంధ్య(18) చదువు మధ్యలోనే వదిలేసి ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి
గుమ్మలక్ష్మిపురం: మండలంలోని దుడ్డుకల్లు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇమరిక ఆనంద్(14) అనే విద్యార్థి అనారోగ్యానికి గురై దుడ్డుకల్లు పీహెచ్సీలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆనంద్ మరణించాడని అతని కుటుంబ సభ్యులు, కొత్తూరు గ్రామస్తులు ఆరోపించారు. ఆస్పత్రి వద్ద పాఠశాల సిబ్బందిని గట్టిగా నిలదీశారు. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలం పెదమరిక పంచాయతీ పరిధి కొత్తూరుకు చెందిన ఆనంద్ ఆరవ తరగతి నుంచి ఈ ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఆనంద్‌కు జ్వరం రావటంతో వార్డెన్ తాకేటి బాలయ్య స్థానిక పీహెచ్సీలో వైద్యం చేయించారు. శనివారం ఉదయం ఆనంద్‌కు ఫిట్స్ రావడంతో దుడ్డుకల్లు పీహెచ్‌సికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో అక్కడ వైద్యాధికారి రమేష్ లేరు. స్టాఫ్‌నర్స్ వైద్యాధికారికి ఫోన్ చేసి ఆయన సలహా మేరకు బీపీ చూసి సెలైన్ ఎక్కించారు. కానీ ప్రయోజనం దక్కలేదు. ఆనంద్ మృతిచెందిన సంగతి తెలుసుకున్న తల్లి కమల, తమ్ముడు మన్మధరావు, ఇతర కుటుంబ సభ్యులు, కొత్తూరు గ్రామస్తులు దుడ్డుకల్లు పీహెచ్‌సికి చేరుకుని బోరున విలపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్లను గట్టిగా నిలదీశారు. సమయానికి వైద్యాధికారి రమేష్ ఆస్పత్రిలో లేకపోవటం వల్లే ఘోరం జరిగిందని వాపోయారు. ఐటీడీఏ పీవో, ఆర్డీవో, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, ఇతర ఉన్నతాధికారులు వచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేదిలేదని భీష్మించారు. విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆదేశాల మేరకు పార్వతీపురం ఆర్డీవో ఆర్ గోవిందరావు పీహెచ్సీకీ చేరుకుని ఆనంద్ మృతదేహాన్ని పరిశీలించారు. అందించిన చికిత్స గురించి వైద్యసిబ్బందిని, ఆనంద్ ఆరోగ్యం గూర్చి తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మృతుని బంధువులతో మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆనంద్ కుటుంబానికి జీవనోపాధి కల్పించడంతోపాటు ప్రభుత్వ పరంగా ఎక్స్‌గ్రేషియా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీడీఏ డీడీ ప్రభాకరరావు, డిప్యూటీ ఈవో రమణనాయుడు తదితరులు పీహెచ్‌సీకి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఆనంద్ తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నారని కొత్తూరు గ్రామస్తులు చెప్పారు. ఇంతలోనే ఘోరం జరగిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి
గుమ్మలక్ష్మీపురం/కురుపాం: కురుపాం మండలం పల్లంబారిడి గ్రామ సమీపంలోని మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం ఓ ట్రాక్టర్ బోల్తాపడటంతో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. కురుపాం మండలం మరిపల్లి గ్రామానికి చెందిన 16 మంది గిరిజనులు గుజ్జువాయి పంచాయితీ గోర్జిపాడు గ్రామానికి ఎగువన ఉన్న ఊటమానుగూడలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరగనున్న క్రైస్తవ పండగల కోసం ఈత కొమ్మలను తీసుకెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరిక సుబ్బారావు (16) అనే యువకుడు అక్కడి కక్కడే మృతిచెందాడు. సుబ్బారావు ఇటీవల పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 7.8 గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంతలోనే అతడు మరణించటంతో తల్లిదండ్రులు తులసి, యేసోన్, బంధువులు బోరున విలపించారు. ప్రమాదం గురించి తెలియగానే పల్లంబారిడి గ్రామస్తులు వచ్చి ట్రాక్టరు తొట్టెను లేపి దానికింద ఉన్న క్షతగాత్రులను మొండెంఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడినవారిలో ఆరిక అనూష, ఆరిక శ్రీను, బిడ్డిక ఎల్లంగు, ఆరిక తీజన్కుమార్, ఆరిక బెనితో, బిడ్డిక నవీన్‌కుమార్, ఎ.మాస, ఆరిక సురేష్, ఎన్.రామారావు, ఆరిక సరోజిని, కామరాజు, ఆరిక జయరాజు, కవిత ఉన్నారు. ప్రథమ చికిత్స అనంతరం వీరిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరిక అనూష అనే పదమూడేళ్ల బాలిక పరిస్ధితి విషమంగా ఉంది. మొండెంఖల్లు పీహెచ్సీ నుంచి క్షతగాత్రులు ముగ్గుర్ని మాత్రమే 108 వాహనంలో పార్వతీపురం తీసుకెళ్లగా మిగిలిన వారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు. అతివేగమే కారణం డ్రైవర్ రాజు ట్రాక్టర్‌ను అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు. సంఘటన స్ధలాన్ని ఎల్విన్‌పేట ఎస్సై ఐ.గోపి పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అందుబాటులో లేని వైద్యులు మొండెంఖల్లు పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులు పనిచేస్తున్నప్పటికీ క్షతగాత్రులు వచ్చేసరికి ఏ ఒక్కరూ అందుబాటులో లేరు. దీంతో వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. వైద్యుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గర్భశోకం
పార్వతీపురం: పార్వతీపురం ఏజెన్సీలో శిశు మరణ ఘోష ఆగడం లేదు. రక్తహీనతకు గురై, అనారోగ్యం బారిన పడుతున్న తల్లుల వల్ల, పుట్టిన కొన్ని రోజుల్లోనే పురిటి రక్తపు మరకలు ఆరకుండానే తల్లి పొత్తిళ్లలోనే శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఆదివారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు శిశువులు మృత్యువాత పడ్డారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని లుంబేసుకు చెందిన మండంగి మీనాక్షి శుక్రవారం గుమ్మలక్ష్మీపురం పీహెచ్సీలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి అనారోగ్యంతో ఉండడంతో పుట్టిన బాబుకూడా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో శుక్రవారం రాత్రి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆ శిశువు మృత్యువాత పడ్డాడు. దీంతో శిశువు తల్లిదండ్రులు మీనాక్షి, పకీరు తదితర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అలాగే గరుగుబిల్లి మండలంలోని సంతోషపురానికి చెందిన మూడునెలల బాలుడు గంట అవినాష్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. ఈ బాలుడు కూడా రక్త హీనతతో పాటు అనారోగ్యానికి గురికావడంతో మృత్యువాత పడినట్లు వైద్యులు చెబుతున్నారు. గత బుధవారం కూడా కురుపాం మండలం మొండెంఖల్‌కు చెందిన ఓ శిశువు అలాగే మృత్యువాత పడ్డాడు. తరచూ శిశువులు మృత్యువాత పడుతుండడంపట్ల తల్లులు గర్భశోకంతో కుమిలిపోతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం పౌష్టికాహారం అందక అవస్థలు పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత వర్గాలు గర్భిణీ స్త్రీలకు చక్కని వైద్య సేవలతోపాటు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటే శిశుమరణాలు తగ్గే అవకాశం ఉందని ఏజెన్సీ వాసులు అంటున్నారు. పౌష్టికాహార లోపమే కారణం.. గర్భిణీ స్త్రీలు అధికంగా రక్తహీనతకు లోనవ్వడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపమే. గర్భిణీ స్త్రీలకు అవసరమైన పౌష్టికాహారం గిరిజనులు తీసుకోకపోవడం వలన ప్రసవ సమయానికి రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనివల్ల తల్లికి పాలు లేక, పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు పాటించక పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. వీటన్నింటి పట్ల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి, తల్లీ, పిల్లల మరణాలు లేకుండా చర్యలు చేపట్టాం. - బి.ఉమా శంకర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, పార్వతీపురం. ఆహారపు అలవాట్ల వల్ల.. స్త్రీలలో సాధారణంగా 80శాతం వరకు రక్తహీనతతో ఉంటున్నారు. వీరిని దానిని నుంచి గట్టెక్కించడానికి, ముఖ్యంగా గర్భవతిగా ఉన్న ఆమెతోపాటు కడుపులో ఉన్న బిడ్డ, ఎదగడానికి పౌష్టికాహారం కావాన్న ఉద్దేశ్యంతో అమృత హస్తంలో భాగంగా ఒకపూట సంపూర్ణ భోజనంలో గుడ్డు, పాలు, అన్నం, పప్పు, కూర తదితరవి అందిస్తున్నాం. అరోగ్య తనిఖీలు చేపడుతున్నాం. నెల నెలా బరువు తూచడం తదితరవి చూస్తున్నాం. ప్రమాదకరంగా గుర్తించి, రక్తహీనత, తక్కువ బరువు, తక్కువ వయస్సుంటే, వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. తల్లీ బిడ్డలు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నాం. ఆస్పత్రి డెలివరీలను పెంచాం. వారి ఆహారపు అలవాట్లు, ఆచారాల వల్ల కొంత ఇబ్బందులు తప్పడం లేదు. - కె.విజయ గౌరి, సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు. -
హిజ్రాలకు ఐటీడీఏ చేయూత
కురుపాం: కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలకు చెందిన హిజ్రాలకు పార్వతీపురం ఐటీడీఏ ఆసరాగా నిలుస్తోంది. ఐటీడీఏ సౌజన్యంతో ఐఆర్‌పీడబ్ల్యూఏ సంస్థ నిర్వహణలో రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29న మొదలైన బ్యాచ్‌లో 43 మంది హిజ్రాలకు కురుపాం మండల కేంద్రంలో శిక్షణ ప్రారంభించారు. హిజ్రాలకు స్వయం ఉపాధి శిక్షణలు, అవకాశాలు లేకపోవడం వల్ల బిక్షాటన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలకు చెందిన హిజ్రాలంతా ఏకమై ఐటీడీఏ పీఓకు, కలెక్టర్‌కు కలిసి తమ ఇబ్బందులు చెప్పుకొని తమల్ని సమాజంలో థర్డ్ జెండర్‌గా ప్రభుత్వం గుర్తించిందని తమల్ని ఆదుకోవాలని విన్నవించుకున్నారు. ఈ మేరకు ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ సైనీ కురుపాం నియోజకవర్గంలోనే సుమారు 450 మంది వరకు హిజ్రాలు ఉన్నట్టు గుర్తించారు. వీరికి స్వయం ఉపాధి వైపు చైతన్యపరిచి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే 45 రోజుల పాటు 28 రకాలకు చెందిన టైలరింగ్ శిక్షణ, వసతి, భోజనం సౌకర్యం కల్పించి ట్రైనింగ్ సర్టిఫికేట్, హిజ్రా లు తమ ఆదాయాన్ని తామే సంపాదించుకొనేందుకు కుట్టుమిషన్ ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిపై హిజ్రాలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వినియోగించుకుంటాం ఐటీడీఏ మా హిజ్రాలకు ఉచితంగా ఇస్తున్న టైలరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం అవుతాం. అలాగే ఐటీడీఏ పీఓకు మేమంతా రుణపడి ఉంటాం. - కె.గీతావెంకట్‌రాణి, మెస్ ఇన్చార్జి గోర్లి గిరిజన గ్రామం మరిన్ని శిక్షణలు ఇప్పించాలి ఐటీడీఏ స్పందించి నియోజకవర్గంలోని ఉన్న హిజ్రాలందరికీ మరిన్ని స్వయం ఉపాధి శిక్షణలను ఇప్పించి ఆదుకోవాలి. ఇలాంటి శిక్షణల వలన మేం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. - బి.శృతి, తాడికొండ గిరిజన గ్రామం -
మైనర్‌పై లైంగిక దాడికి యత్నం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దిగువ మండ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల మైనర్‌పై 26 ఏళ్ల యువకుడు నిమ్మక రాజేష్ మంగళవారం లైంగికదాడికి యత్నించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎల్విన్‌పేట సీఐ జి.వేణుగోపాల్ అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బాలికలు పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు ఓ బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలో ఉన్న పాడుపడిన పాఠశాల భవనం వద్దకు తీసుకెళ్లి, లైంగికదాడికి యత్నిస్తుండగా బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో దగ్గర్లో ఉన్న బావిలో నీరు తోడుకుంటున్న కొంతమంది మహిళలు అటుగా వెళ్లేసరికి వారిని చూసి యువకుడు పారిపోయాడు. ఈ విషయాన్ని ఆ బాలిక గురువారం సాయంత్రం తల్లిదండ్రులకు చెప్పడంతో ఎల్విన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐ వేణుగోపాల్ గ్రామానికి వెళ్లి కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. లైంగికదాడికి యత్నించిన వ్యక్తి అరెస్టు కొత్తవలస: మండలంలోని అప్పన్నదొరపాలెం గ్రామంలో ఈనెల 27 తేదీ సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగికదాడికి యత్నించిన యువకుడిని పోలీసులు గురువారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కొత్తవలస సీఐ ఈ.నరసింహమూర్తి మాట్లాడుతూ లైంగికదాడికి యత్నించిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఉగ్గిన లక్ష్మీనారాయణ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా శిక్షణ పొందుతున్నాడని చెప్పారు. -
ప్రేమకథ విషాదాంతం
తొమ్మిదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట పెళ్లయిన నెలరోజులకే బలవన్మరణం వేర్వేరు ప్రాంతాల్లో మరో ఇద్దరి ఆత్మహత్య గజపతినగరం మండలంలో కడుపునొప్పి తాళలేక మహిళ... గుమ్మలక్ష్మీపురంలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లు ప్రేమించుకున్నారు. కలకాలం కలిసే బతకాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. వివాహమై నెల రోజులు కాకుండానే ఆ నవ దంపతుల జీవితం బలవన్మరణంతో ముగిసిపోయింది. అమ్మానాన్నలను బాధపెట్టానన్న బాధతో ఆ యువతి ఉరి వేసుకోగా, అమితంగా ప్రేమించిన భార్య లేని జీవితం తనకెందుకని ఆ యువకుడు కూడా బలవన్మరణం పొందాడు. వీరు కాకుండా జిల్లాలో మరో ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కడుపునొప్పి తాళలేక గజపతినగరం మండలం పట్రువాడలో ఓ మహిళ, గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఓ వ్యక్తి అర్ధంతరంగా జీవితాలను చాలించారు. వీరు తీసుకున్న నిర్ణయాలు ఆ కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేశాయి. గజపతినగరం,రూరల్: మండలంలోని పట్రువాడ ఎస్సీ కాలనీకి చెందిన పోలిపిల్లి నాగమణి(38) తీవ్రమైన కడుపు నొప్పిని తాళలేక మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారాన్ని గ్రామ రెవెన్యూ అధికారి తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నాగమణికి భర్త గురుమూర్తి, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఎల్లారావు(13) 4వతరగతి చదువుతున్న కుమార్తె దుర్గ (9)ఉన్నారు. నాగమణిమెరకపొలంలో పనులు ముగించుకుని మంగళవారం సాయంత్రం ఇం టికి చేరిన వెంటనే కడుపునొప్పితో తీవ్రంగా బాధపడింది. దీంతో ఆమెకు భర్త గురుమూర్తి సపర్యలు చేసిఓదార్చినట్లు గ్రామస్తులు తెలి పారు. ఎంతకీ కడుపునొప్పి తగ్గకపోవడంతో రాత్రి 11.30 గంటల సమయంలో బాధ భరిం చలేక కాలనీ పక్కనే ఉన్న నేలబావిలో దూకినట్లు భర్త గురుమూర్తి తెలిపాడు. బడి నుంచి రాగానే పిల్లలను ఒడిలో పెట్టుకొని గారం చేసే తల్లి ఇప్పుడు దూరమవడంతో ఆ పసిపిల్లలను చూస్తుంటే పలువురి గుండె తరుక్కుపోయింది. ఎస్సై డి.సాయికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
విజిలెన్స్ ఆకస్మిక దాడులు
గుమ్మలక్ష్మీపురం : మండల కేంద్రంలోని మూడు అపరాల షాపులపై శనివారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బుడుమూరు గోవిందరావు షాపులో ఎనిమిదిన్నర క్వింటాళ్ల పౌరసరఫరాల బియ్యం, పెద్దిన ప్రసాద్‌కు చెందిన క్వింటాన్నర పీడీఎస్ బియ్యం, కింతలి కృష్ణారావు షాపులో రెండు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ ఉమాకాంత్ తెలిపారు. పౌరసరఫరాల బియ్యం పక్కదారి పట్టకుండా.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో భాగంగా ఈ ఆకస్మిక దాడులు చేపట్టామని చెప్పారు. దాడుల తీరుపై విస్మయం గతంలో విజిలెన్స్ దాడులు నిర్వహిస్తే మూడవ కంటికి తెలియకుండా ఆకస్మికంగా చేపట్టేవారు. అరుుతే శనివారం గుమ్మలక్ష్మీపురంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఉదయం సుమారు తొమ్మిది గంటల సమయంలో ముందుగా సిబ్బంది(హెచ్‌సీ గౌరీశంకర్, కాని స్టేబుల్ ఈశ్వరరావు) దాడులు నిర్వహించవలసిన షాపుల వద్దకు చేరుకున్నారు. అక్కడే కూర్చొని షాపు యజమానులతో మాటామంతీ కొనసాగించారు. తమ ఉన్నత అధికారి వచ్చే దాకా.. అంటే సుమారు సాయంత్రం 4 గంటల వరకూ అక్కడే గడిపారు. ఈలోగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయన్న సమాచారం వ్యాపారులందరికీ చేరిపోరుుంది. దీంతో చాలామంది ముందుగానే షాపులు మూసివేశారు. అనంతరం సాయంత్రం 4 తర్వాత విజిలెన్స్ సీఐ ఉమాకాంత్ షాపుల వద్దకు చేరుకున్నారు. మూడు షాపుల్లో నిల్వ ఉన్న సరుకులను పరిశీలించారు. 12 క్వింటాళ్ల బియ్యూన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించి, వెళ్లిపోయూరు. బియ్యాన్ని స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిమ్మక శేఖర్, వీఆర్ఓ బోడమ్మలకు అప్పగించారు. వ్యాపారులపై 6ఏ కేసు నమోదుకు ఆదేశించారు. బియ్యం నిల్వలు స్వాధీనం గజపతినగరం : దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. పసుమర్తి కృష్ణ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉన్న ఎనిమిది క్వింటాళ్ల బియ్యం, 70 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉమాకాంత్ తెలిపారు. ప్రజా పంపిణీకి సరఫరా చేయూల్సిన బియ్యం, కిరోసిన్ ఈ వ్యక్తి వద్దకు ఎలా చేరుకున్నాయో విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు. అదే విధంగా అలాగే గ్రామంలోని రేషన్‌డిపోలో తనిఖీలు నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌డీటీ మల్లికార్జునరావు, హెచ్‌సీ రమణ, పెదకాద, చినకాద గ్రామాల రెవెన్యూ అధికారులు తిరుపతి, జి.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుడి హత్య
గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లైన్ : భూతగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సొంత పెదనాన్ననే ఓ యువకుడు బండరాయితో మోది దారుణంగా హతమార్చాడు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే చీకటిపడడంతో ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎల్విన్‌పేట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వనకాబడి పంచాయతీ వండిడి గిరిజన గ్రామానికి చెందిన నిమ్మక లక్ష్మయ్య (50) అదే గ్రామానికి చెందిన తన తమ్ముడు(సీతయ్య) కొడుకు నిమ్మక పరశురాంతో కలసి దేరువాడ గ్రామంలోని చర్చిలో ప్రార్థనకు వెళ్లాడు. ప్రార్థన ముగిసిన అనంతరం సాయంత్రం ఐదు గంటల సమయంలో స్వగ్రామానికి ఇద్దరూ కాలినడకన బయల్దేరారు. దేరువాడ, వనకాబడిగ్రామాలకు మధ్య గల గెడ్డ వద్దకు చేరుకోగానే.. పరశురాం పెద్ద రాయిని తీసుకుని లక్ష్మయ్య ముఖంపై బలంగా మోదాడు. దీంతో లక్ష్మయ్య కుప్పకూలిపోయూడు. మళ్లీ అదే రాయితో లక్ష్మయ్య తలపైన, ముఖంపైన తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సంఘటన స్థలంలోనే లక్ష్మయ్య ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని అక్కడ నుంచి గెడ్డలో పడేయడానికి పరశురాం ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో అటుగా వెళ్తున్న వండిడి గ్రామానికి చెందిన మండంగి శంకరరావు చూశాడు. దీంతో మృతదేహాన్ని పరశురాం అక్కడే వదిలి వెళ్లిపోయూడు. శంకరరావు సమాచారంతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని భోరుమన్నారు. భూతగాదాలే కారణమా? లక్ష్మయ్య హత్యకు భూ తగాదాలే కారణమై ఉండొచ్చని ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్ అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి వారసత్వంగా లక్ష్మయ్య, సీతయ్యలకు రెండున్నర ఎకరాల భూమి వచ్చింది. ఇందులో లక్ష్మయ్య ఎకరంన్నర, సీతయ్య ఎకరా భూమి సాగు చేస్తున్నారు. తనకంటే ఎక్కువ భూమి ఉందన్న అక్కసుతో సీతయ్య తన అన్నతో తరచూ గొడవలు పడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. సుమారు ఏడాదికాలంగా ఇదే విషయమై ఇరు కుటుంబాల మ ద్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బంధుత్వాన్ని మరచి, సొంత పెదనాన్ననే పరశురాం హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్, ఎస్సై గోపి ఘటనా స్థలికి సోమవారం చేరుకుని పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన రారుుని స్వాధీనంచేసుకున్నారు. అనంతరం గ్రామం లో ఉన్న నిందితుడు పరశురాంను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.