ప్రేమకథ విషాదాంతం | Love marriage Couples died in gajapathinagaram | Sakshi
Sakshi News home page

ప్రేమకథ విషాదాంతం

Published Thu, Jul 24 2014 1:26 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

ప్రేమకథ విషాదాంతం - Sakshi

ప్రేమకథ విషాదాంతం

     తొమ్మిదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట
     పెళ్లయిన నెలరోజులకే బలవన్మరణం
     వేర్వేరు ప్రాంతాల్లో మరో ఇద్దరి ఆత్మహత్య
     గజపతినగరం మండలంలో కడుపునొప్పి తాళలేక మహిళ...
     గుమ్మలక్ష్మీపురంలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య

 
 ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లు ప్రేమించుకున్నారు. కలకాలం కలిసే బతకాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు.  వివాహమై నెల రోజులు కాకుండానే ఆ నవ దంపతుల జీవితం బలవన్మరణంతో ముగిసిపోయింది. అమ్మానాన్నలను బాధపెట్టానన్న బాధతో  ఆ యువతి ఉరి వేసుకోగా, అమితంగా ప్రేమించిన భార్య లేని జీవితం తనకెందుకని  ఆ యువకుడు కూడా బలవన్మరణం పొందాడు. వీరు కాకుండా జిల్లాలో మరో ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కడుపునొప్పి తాళలేక గజపతినగరం మండలం పట్రువాడలో ఓ మహిళ, గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఓ వ్యక్తి అర్ధంతరంగా జీవితాలను చాలించారు. వీరు తీసుకున్న నిర్ణయాలు ఆ కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేశాయి.
 
 గజపతినగరం,రూరల్: మండలంలోని పట్రువాడ ఎస్సీ కాలనీకి చెందిన పోలిపిల్లి నాగమణి(38) తీవ్రమైన కడుపు నొప్పిని తాళలేక మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారాన్ని గ్రామ రెవెన్యూ అధికారి తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నాగమణికి భర్త గురుమూర్తి, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఎల్లారావు(13) 4వతరగతి చదువుతున్న కుమార్తె దుర్గ (9)ఉన్నారు. నాగమణిమెరకపొలంలో పనులు ముగించుకుని మంగళవారం సాయంత్రం ఇం టికి చేరిన వెంటనే కడుపునొప్పితో తీవ్రంగా బాధపడింది.
 
 దీంతో ఆమెకు భర్త గురుమూర్తి సపర్యలు చేసిఓదార్చినట్లు  గ్రామస్తులు తెలి పారు. ఎంతకీ కడుపునొప్పి తగ్గకపోవడంతో రాత్రి 11.30 గంటల సమయంలో బాధ భరిం చలేక కాలనీ పక్కనే ఉన్న నేలబావిలో దూకినట్లు భర్త గురుమూర్తి తెలిపాడు. బడి నుంచి రాగానే పిల్లలను ఒడిలో పెట్టుకొని గారం చేసే తల్లి ఇప్పుడు దూరమవడంతో ఆ పసిపిల్లలను చూస్తుంటే పలువురి గుండె తరుక్కుపోయింది.  ఎస్సై డి.సాయికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement