Gastrodynia
-
డొంక కదిలింది
► అనవసరపు ఆపరేషన్ల కేసులో సర్జన్ సురేష్, ఆర్ఎంపీ గణేష్ అరెస్ట్ ► కొనసాగుతున్న కేసు విచారణ ► మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ► వైద్యులు, ఆర్‌ఎంపీల్లో గుబులు కాసులకోసం కక్కుర్తిపడి కడుపు‘కోత’లు కోసిన వ్యవహారంలో చర్యలు మొదలయ్యాయి. అవసరం లేకున్నా కమీషన్ల కోసం పలువురు ఆర్ఎంపీలు, వైద్యులు కలిసి అపెండిసైటిస్, గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కథలాపూర్ మండలంలో మొదట వెలుగుచూసిన ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారుల కోసం అన్వేషించిన పోలీసులు జగి త్యాల వైద్యుడు టి.సురేష్‌కుమార్‌ను, కథలాపూర్ మండలం తాండ్య్రాల ఆర్ఎంపీ జక్కని గణేష్‌ను మంగళవారం అరెస్టు చేయడంతో ఈ దందాలో డొంక కదలినట్లయింది. - కథలాపూర్/జగిత్యాల అర్బన్/కోరుట్ల అనవసరపు ఆపరేషన్ల వ్యవహారం మానవహక్కుల కమిషన్‌కు వెళ్లగా కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్, రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు వేర్వేరుగా విచారణ చేపట్టి నివేదిక అందించారు. దీని ప్రకారం... కథలాపూర్ మం డలంలో 2011 నుంచి 2016 వరకు 620 అపెండిసైటిస్, 422 గర్భసంచుల ఆపరేషన్లు తొలగించినట్లు తేలింది. తర్వాత సారంగాపూర్, రాయికల్ మండలాల్లోనూ ఈ దందా సాగినట్లు వార్తలు వచ్చాయి. జగిత్యా ల, కోరుట్లలోని ఇద్దరు ముగ్గురు వైద్యులే ఈ ఆపరేషన్లు చేసినట్లు తేలింది. ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోరుట్ల సీఐ రాజశేఖరరాజు, కథలాపూర్ ఎస్సై నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేసి మంగళవారం అరెస్టుల ప్రక్రియ ప్రారంభించారు. వైద్యుల్లో గుబులు డాక్టర్ సురేశ్‌కుమార్, ఆర్ఎంపీ గణేశ్‌ను అరెస్టు చేయడంతో పలువురు వైద్యుల్లో గుబులు మొదలైంది. మరికొందరికి సైతం ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు వెల్లడి కాగా, ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. రాయికల్ మండలం మూటపల్లి, గొల్లపల్లి మండలం యశ్వంతరావుపేట, సారంగాపూర్ మండలం బీర్పూర్ తదితర చోట్ల సైతం పలువురు ఆర్ఎంపీలు, వైద్యులు అపెండిసైటిస్, గర్భసంచి ఆపరేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో కేసుకు తమకు వచ్చే రూ.6 నుంచి రూ.8 వేల కమీషన్ కోసం ఆర్ఎంపీలు పలువురిని ఈ ఆపరేషన్లకు ప్రోత్సహించినట్లు తేలిన విషయం తెలిసిందే. రాజకీయ ఒత్తిళ్లతో జాప్యం! అనవసరపు ఆపరేషన్ల వ్యవహారం బహిర్గతమైనప్పటినుంచి 40 రోజుల్లోగా ఏం జరుగుతుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. వ్యవహారం మానవహక్కుల కమిషన్ దృష్టికి వెళ్లడం, విచారణలు, నివేదికలతో చర్చనీయాంశంగా మారింది. చివరకు ఇద్దరి అరెస్టుతో కీలక మలుపు తిరిగినట్లయింది. మరింత లోతుగా విచారణ చేపట్టి... ఈ దందాలో పాత్ర ఉన్న గ్రామీణ వైద్యులను మరికొందరిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 10 మంది ఆర్ఎంపీల పాత్ర ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చినా... రాజకీయ పలుకుబడితో పలువురిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే దర్యాప్తులో జాప్యం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. అతని రూటే సప‘రేటు’ డాక్టర్ టి.సురేశ్‌కుమార్ మొదటినుంచి తన రూటే సప‘రేటు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జగిత్యాలలో విజయలక్ష్మి నర్సింగ్‌హోం, కోరుట్లలో పల్లవి ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. పల్లవి ఆస్పత్రికి డీఎంహెచ్‌వో అనుమతి లేదని విచారణలో తేలింది. ఈ విషయంపై పోలీసులు డీఎంహెచ్‌వోకు లేఖ రాశారు. సర్జన్ సురేశ్ ఇచ్చే కమీషన్ల ఆశతో కడుపునొప్పితో వచ్చే రోగులను కథలాపూర్ మండలం తాండ్య్రాలకు చెందిన ఆర్ఎంపీ గణేశ్ తప్పుదోవ పట్టించి ఆపరేషన్లు చేయించినట్లు తేలింది. ఆర్ఎంపీ గణేశ్ సిఫారసుతో ఒక్క తాండ్య్రాలలోనే 50 మందికి అపెండిసైటిస్ ఆపరేషన్లు చేశారు. సురేశ్‌కుమార్ గతంలో ధర్మారంలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో శస్త్రచికిత్స చేయగా, అనస్తీషియా సైతం సురేశ్‌కుమారే ఇవ్వడంతో మందు వికటించి రోగి ఆపరేషన్ థియేటర్లోనే మరణించినట్లు ఆరోపణలొచ్చాయి. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించి, ఒత్తిడి తీసుకువచ్చి కేసు మాఫీ చేసినట్లు సమాచారం. కొనసాగుతున్న విచారణ అనవసరపు ఆపరేషన్ల వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని కోరుట్ల సీఐ రాజశేఖరరాజు వెల్లడించారు. మరికొందరు వైద్యులు, ఆర్ఎంపీలు కూడా ఈ తతంగంలో పాలుపంచుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. విచారణ నిక్కచ్చిగా జరిపిన ఎస్సై నిరంజన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు జలీల్, రాజ్‌కుమార్, సురేశ్‌ను సీఐ అభినందించారు. బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. మోసాలు చేస్తున్న ఆర్ఎంపీలపై నిఘా ఉంచామన్నారు. -
వేర్వేరు చోట్ల నలుగురి ఆత్మహత్య
మున్ననూరులో డిగ్రీ విద్యార్థి బలవన్మరణం కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో డిగ్రీ విద్యార్థి, వలస కూలీ, గుర్తుతెలియని వృద్ధుడు, యువకుడు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వలస కూలీ.. గద్వాల : బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌కు చెందిన వెంకటన్న (45) మూడునెలల క్రితం భార్యాపిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం గద్వాల పట్టణానికి వచ్చాడు. అప్పటి నుంచి నదిఅగ్రహారం వెళ్లే దారిలో తోటలో కూలీగా పనిచేస్తున్నాడు. కాగా, ఈయన తరచూ కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో మనస్తాపానికి గురై శనివారం ఉదయం తోట దగ్గర ఉన్న చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని టౌన్ ఎస్ఐ సైదాబాబు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం గద్వాల ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించారు. గోపాల్పేట : మండలంలోని మున్ననూరుకు చెందిన లక్ష్మి, వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు స్థానికంగా ఉపాధిహామీ పథకంలో కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరిలో చిన్నకొడుకు తిరుపతి (19) వనపర్తి పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా, రెండురోజుల క్రితం గ్రామంలోని ఓ కిరాణ షాపులో దొంగతానికి పాల్పడ్డాడంటూ అక్కడివారు మందలించారు. అలాగే వారంరోజుల క్రితం మరో సంఘటనలో ఈ విద్యార్థిని దూషించారు. దీంతో మనస్తాపానికి గురై శనివారం మధ్యాహ్నం ఇంటి తలుపునకు కర్టెన్ వేసి ఊయలకొండికి ఉరేసుకుని చనిపోయాడు. మధ్యాహ్నం పని ముగించుకుని తిరిగొచ్చిన తల్లిదండ్రులు చూసి బోరుమన్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని సర్పంచ్ శేఖర్‌యాదవ్ పరామర్శించారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సైదులు తెలిపారు. కడుపునొప్పి భరించలేక.. కోస్గి : ఇంకో సంఘటనలో కోస్గి మండలం ముశ్రీఫాకు చెందిన నర్సిములు (35) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వివిధ ఆస్పత్రుల్లో చూపించుకున్నా ఎంతకూ తగ్గలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం సాయంత్రం శివారులోని పొలానికి వెళ్లి పురుగుమందు తాగాడు. కొద్దిసేపటికి అటుగా వెళుతున్న కొందరు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే సరికి అతను మృతి చెంది ఉన్నాడు. ఈ విషయమై శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్ఐ వెంకటయ్య కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కోయిల్‌కొండ : ఓ వృద్ధుడికి ఏ కష్టం వచ్చిందోగాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం కోయిల్‌కొండ మండలంలోని మల్కాపూర్ శివారులో ఓ గుర్తుతెలి యని వ్యక్తి (60) చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. మధ్యాహ్నం అ టువైపు వెళ్లిన బాటసారులు గమనించి వెంటనే పోలీసులతోపాటు వీఆర్ఓ లక్ష్మీకాంత్‌రెడ్డికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ మురళి పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి ఒంటిపై తెల్ల చొక్కా, బేబులో రూ.330లతోపాటు మద్దూరు నుంచి మల్కాపూర్‌కు తీసుకున్న ఆర్టీసీ బస్ టికెట్టు ఉన్నాయి. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
ప్రేమకథ విషాదాంతం
తొమ్మిదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట పెళ్లయిన నెలరోజులకే బలవన్మరణం వేర్వేరు ప్రాంతాల్లో మరో ఇద్దరి ఆత్మహత్య గజపతినగరం మండలంలో కడుపునొప్పి తాళలేక మహిళ... గుమ్మలక్ష్మీపురంలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లు ప్రేమించుకున్నారు. కలకాలం కలిసే బతకాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. వివాహమై నెల రోజులు కాకుండానే ఆ నవ దంపతుల జీవితం బలవన్మరణంతో ముగిసిపోయింది. అమ్మానాన్నలను బాధపెట్టానన్న బాధతో ఆ యువతి ఉరి వేసుకోగా, అమితంగా ప్రేమించిన భార్య లేని జీవితం తనకెందుకని ఆ యువకుడు కూడా బలవన్మరణం పొందాడు. వీరు కాకుండా జిల్లాలో మరో ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కడుపునొప్పి తాళలేక గజపతినగరం మండలం పట్రువాడలో ఓ మహిళ, గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఓ వ్యక్తి అర్ధంతరంగా జీవితాలను చాలించారు. వీరు తీసుకున్న నిర్ణయాలు ఆ కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేశాయి. గజపతినగరం,రూరల్: మండలంలోని పట్రువాడ ఎస్సీ కాలనీకి చెందిన పోలిపిల్లి నాగమణి(38) తీవ్రమైన కడుపు నొప్పిని తాళలేక మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారాన్ని గ్రామ రెవెన్యూ అధికారి తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నాగమణికి భర్త గురుమూర్తి, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఎల్లారావు(13) 4వతరగతి చదువుతున్న కుమార్తె దుర్గ (9)ఉన్నారు. నాగమణిమెరకపొలంలో పనులు ముగించుకుని మంగళవారం సాయంత్రం ఇం టికి చేరిన వెంటనే కడుపునొప్పితో తీవ్రంగా బాధపడింది. దీంతో ఆమెకు భర్త గురుమూర్తి సపర్యలు చేసిఓదార్చినట్లు గ్రామస్తులు తెలి పారు. ఎంతకీ కడుపునొప్పి తగ్గకపోవడంతో రాత్రి 11.30 గంటల సమయంలో బాధ భరిం చలేక కాలనీ పక్కనే ఉన్న నేలబావిలో దూకినట్లు భర్త గురుమూర్తి తెలిపాడు. బడి నుంచి రాగానే పిల్లలను ఒడిలో పెట్టుకొని గారం చేసే తల్లి ఇప్పుడు దూరమవడంతో ఆ పసిపిల్లలను చూస్తుంటే పలువురి గుండె తరుక్కుపోయింది. ఎస్సై డి.సాయికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రైలు కిందపడి యువకుని ఆత్మహత్య
కోనేరుసెంటర్( మచిలీపట్నం), న్యూస్‌లైన్ : కడుపునొప్పి తాళలేక పట్టణానికి చెందిన ఓ యువకుడు మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ డి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన తాడికొండ వెంకటకిరణ్‌కుమార్ (20) రామానాయుడుపేటలో ప్రియాంక పేరుతో ఫొటోస్టూడియో నడుపుతున్నాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మంగళవారం యథావిధిగా షాపునకు బయలుదేరిన కిరణ్ నేరుగా రాడార్కేంద్రం సమీపాన ఉన్న రైలు ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. స్థానికులకు అనుమానం రాకుండా కాసేపు ఆ ప్రాంతంలో ఫొటోలు తీస్తున్నట్లు నటించాడు. సుమారు 9.30 గంటల సమయంలో గుడివాడ నుంచి మచిలీపట్నం వైపు రైలు వస్తుండగా అప్పటి వరకు ఫొటోలు తీస్తున్న కిరణ్ స్థానికులు చూస్తుండగానే ఒక్కసారిగా రైలు కిందపడిపోయాడు. ఈ ఘటనలో కిరణ్ తల, చేతులు, మొండెం వేర్వేరు భాగాలుగా విడిపోయి చూసేందుకు కూడా వీలులేని విధంగా తయారయ్యాయి. జరిగిన సంఘటనపై తెలిసిన వారు కుటుంబసభ్యులకు తెలియజేయటంతో అక్కడకు చేరుకున్న తండ్రి వెంకటవరప్రసాద్ కిరణ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. బంధువులు బోరున విలపించారు. కాగా కిరణ్ మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని రైల్వే హెచ్‌సీ శ్రీనివాస్ తెలిపారు. యువకుని మృతిపై భిన్న కథనాలు... కాగా కిరణ్‌కుమార్ మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కడుపునొప్పి తాళలేకే కిరణ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు రైల్వే పోలీసులకు వెల్లడించగా... ప్రేమ వ్యవహారం కారణంగానే కిరణ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్నేహితులు మాట్లాడుకోవటంపై పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.