
వేలంకన్నిలో పెళ్లి చేసుకుని ప్రియుడితో భర్త హత్యకు స్కెచ్
నిందితురాలి సహా ప్రియుడు, మైనర్ బాలుడు అరెస్ట్
అన్నానగర్: తన మరో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. వివరాలు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన జనార్థన (22). అదే ప్రాంతానికి చెందిన ఎలన్ మేరీ(21) కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని వీరిద్దరూ నాగై జిల్లాలోని వేలంగన్నికి వచ్చి మాతా గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జిలో ఉంటున్నారు. అయితే ఆదివారం జనార్థన వేలంగన్ని రైల్వే స్టేషన్ సమీపంలో శవమై వెలుగులోకి రావడం కలకలం రేపింది.
అయితే జనార్థన, మేరీతో కలిసి ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైలులో తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని పట్టుకుని విచారణ చేశారు. వారు బెంగళూరు శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్య కుమారుడు జీవన్ (19), 15 ఏళ్ల బాలుడు అని తేలింది. జనార్థనను పక్కా ప్లాన్ చేసి కడతేర్చారని తేలింది. ఎలన్‌మేరీ ఓ వైపు జనార్థన ప్రేమిస్తూనే, మరోవైపు జీవన్‌తో కూడా ప్రేమాయణం వెలగబెడుతున్నట్టు వెల్లడైంది.
తమకు అడ్డుగా ఉన్న జనార్థనను కడతేర్చాలని ఎలన్ మేరి, జీవన్ వ్యూహం పన్నారు. దీని ప్రకారం వేలంగన్నిలో జనార్థనను వివాహం చేసుకున్న ఎలన్ మేరి, తన ప్రియుడు జీవన్‌తో కలిసి అతడిని హత్య చేసింది. వాస్తవానికి ఆమెకు రెండేళ్ల క్రితమే ధర్మపురిలో వివాహమైంది. ఆ తర్వాత జనార్థనను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత జీవన్‌ను పెళ్లిచేసుకునేందుకు హత్యకు స్కెచ్ వేసింది. ఈ హత్యకు సంబంధించి ఎలన్ మేరి, జీవన్‌తోపాటు 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment