మైనర్‌పై లైంగిక దాడికి యత్నం | Attempted sexual assault of minors | Sakshi
Sakshi News home page

మైనర్‌పై లైంగిక దాడికి యత్నం

Published Fri, Aug 29 2014 1:39 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

మైనర్‌పై లైంగిక దాడికి యత్నం - Sakshi

మైనర్‌పై లైంగిక దాడికి యత్నం

 గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దిగువ మండ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల మైనర్‌పై 26 ఏళ్ల యువకుడు నిమ్మక రాజేష్ మంగళవారం లైంగికదాడికి యత్నించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎల్విన్‌పేట సీఐ జి.వేణుగోపాల్ అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బాలికలు పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు  ఓ బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలో ఉన్న పాడుపడిన పాఠశాల భవనం వద్దకు తీసుకెళ్లి, లైంగికదాడికి యత్నిస్తుండగా  బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో  దగ్గర్లో ఉన్న బావిలో నీరు తోడుకుంటున్న కొంతమంది మహిళలు అటుగా వెళ్లేసరికి వారిని చూసి యువకుడు పారిపోయాడు. ఈ విషయాన్ని ఆ బాలిక గురువారం సాయంత్రం తల్లిదండ్రులకు చెప్పడంతో ఎల్విన్‌పేట పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐ వేణుగోపాల్ గ్రామానికి వెళ్లి కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
 
 లైంగికదాడికి యత్నించిన వ్యక్తి అరెస్టు
 కొత్తవలస: మండలంలోని అప్పన్నదొరపాలెం గ్రామంలో ఈనెల 27 తేదీ సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగికదాడికి యత్నించిన యువకుడిని పోలీసులు గురువారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు  కొత్తవలస సీఐ ఈ.నరసింహమూర్తి మాట్లాడుతూ లైంగికదాడికి యత్నించిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఉగ్గిన లక్ష్మీనారాయణ బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా శిక్షణ పొందుతున్నాడని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement