తను..టైగర్‌ అన్న హాలీవుడ్‌ డైరెక్టర్‌... ఎన్టీయార్‌తో సినిమా? | JR NTR Will Be Hollywood Movie With James Gunn | Sakshi
Sakshi News home page

తను..టైగర్‌ అన్న హాలీవుడ్‌ డైరెక్టర్‌... ఎన్టీయార్‌తో సినిమా?

Published Mon, Jan 20 2025 9:51 AM | Last Updated on Mon, Jan 20 2025 10:46 AM

JR NTR Will Be Hollywood Movie With James Gunn

జానియర్‌ ఎన్టీయార్‌(JR NTR) టాలీవుడ్‌లో టాప్‌ హీరో. త్వరలోనే హాలీవుడ్‌ సినిమాల్లో(Hollywood Movie) అడుగుపెట్టనున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం అప్పుడే అవునని చెప్పలేకపోయినా... ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడి మాటలే అందుకు నిదర్శనం.  ఇలాంటి చర్చకు కారణం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అని చెప్పక తప్పదు. హాలీవుడ్‌ చిత్ర ప్రముఖులపై ’ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంత ప్రభావం చూపిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ రాజమౌళి ఈ సినిమాలో ఎన్టీయార్‌లోని మహోన్నత నటరూపాన్ని ఆవిష్కరించాడు. 

నిజానికి ఎన్టీయార్‌తో ఎలాంటి సినిమా అయినా చేయవచ్చునని  తెలిసిన దర్శకుడు రాజమౌళి.  ’సింహాద్రి’  ’యమ దొంగ’ వంటి  చిత్రాలు పెద్ద హిట్‌ కొట్టడానికి ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంవచ్యాప్తంగా ఆదరణకు నోచుకోవడానికి అదే కారణం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ జూనియర్, రాజమౌళిలకు హ్యాట్రిక్‌ హిట్‌తో పాటు ఇంటర్నేషనల్‌ పాప్యులారిటీని కూడా అందించింది.  

టాలీవుడ్‌ టూ బాలీవుడ్‌ టూ హాలీవుడ్‌...
ఆర్‌ఆర్‌ఆర్‌ తో తెచ్చుకున్న క్రేజ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ను బాలీవుడ్‌ కూడా కోరుకునేలా చేసింది. ప్రస్తుతం జా.ఎన్టీయార్‌ ’వార్‌ 2’ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌తో కలిసి జూనియర్‌ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టే సినిమాగా సినీ పండితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌తో తన తదుపరి యాక్షన్‌ అడ్వెంచర్‌కు కూడా యంగ్‌ టైగర్‌ సిద్ధమవుతున్నాడు. ఈ నేపధ్యంలోనే హాలీవుడ్‌  చిత్రంలో ఎన్టీయార్‌ అనే వార్త రావడంతో అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

నేను రెడీ అంటున్న సూపర్‌ మ్యాన్‌ డైరెక్టర్‌...
ప్రముఖ హాలీవుడ్‌ చిత్రనిర్మాత జేమ్స్‌ గన్‌ (James Gunn) ’సూపర్‌మ్యాన్,’ ’సూసైడ్‌ స్క్వాడ్,’ గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వంటి గొప్ప అంతర్జాతీయ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్‌మ్యాన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత  పాప్యులర్‌ అనేది అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాకి దర్శకత్వం వహించిన ఆయన ఇటీవల ఆయన ఒక  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్‌ ఆర్‌ ఆర్‌ చిత్రం గురించి ప్రస్తావించారు మరీ ముఖ్యంగా తెలుగు స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఆయన నటన గురించి గొప్పగా మాట్లాడారు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని కొన్ని సన్నివేశాలను ప్రస్తావించి మరీ ఆయన జూనియర్‌పై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం. 

ముఖ్యంగా ‘బోనులలో నుంచి పులులతో పాటు బయటకు దూకిన ఆ నటుడు (ఎన్టీయార్‌)తో నేను పని చేయాలనుకుంటున్నాను. అతను అద్భుతమైన నటుడు.  నేను అతనితో ఏదో ఒక రోజు పని చేయాలనుకుంటున్నాను‘ అని ఆయన చెప్పారు.ఎన్టీఆర్‌ ఎంతగానో ఆకట్టుకున్నాడని జేమ్స్‌ అన్నారు. ఇప్పటి దాకా టాప్‌ హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌  ఓ తెలుగు హీరోని ఉద్దేశించి మాట్లాడడం ఇదే ప్రధమం కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement