Superman
-
తను..టైగర్ అన్న హాలీవుడ్ డైరెక్టర్... ఎన్టీయార్‌తో సినిమా?
జానియర్ ఎన్టీయార్(JR NTR) టాలీవుడ్లో టాప్ హీరో. త్వరలోనే హాలీవుడ్ సినిమాల్లో(Hollywood Movie) అడుగుపెట్టనున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం అప్పుడే అవునని చెప్పలేకపోయినా... ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడి మాటలే అందుకు నిదర్శనం. ఇలాంటి చర్చకు కారణం ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పక తప్పదు. హాలీవుడ్ చిత్ర ప్రముఖులపై ’ఆర్ఆర్ఆర్’ ఎంత ప్రభావం చూపిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాలో ఎన్టీయార్‌లోని మహోన్నత నటరూపాన్ని ఆవిష్కరించాడు. నిజానికి ఎన్టీయార్‌తో ఎలాంటి సినిమా అయినా చేయవచ్చునని తెలిసిన దర్శకుడు రాజమౌళి. ’సింహాద్రి’ ’యమ దొంగ’ వంటి చిత్రాలు పెద్ద హిట్ కొట్టడానికి ఆర్ఆర్ఆర్ ప్రపంవచ్యాప్తంగా ఆదరణకు నోచుకోవడానికి అదే కారణం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ జూనియర్, రాజమౌళిలకు హ్యాట్రిక్ హిట్‌తో పాటు ఇంటర్నేషనల్ పాప్యులారిటీని కూడా అందించింది. టాలీవుడ్ టూ బాలీవుడ్ టూ హాలీవుడ్...ఆర్ఆర్ఆర్ తో తెచ్చుకున్న క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్‌ను బాలీవుడ్ కూడా కోరుకునేలా చేసింది. ప్రస్తుతం జా.ఎన్టీయార్ ’వార్ 2’ సినిమా ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్‌తో కలిసి జూనియర్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టే సినిమాగా సినీ పండితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి యాక్షన్ అడ్వెంచర్‌కు కూడా యంగ్ టైగర్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపధ్యంలోనే హాలీవుడ్ చిత్రంలో ఎన్టీయార్ అనే వార్త రావడంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.నేను రెడీ అంటున్న సూపర్ మ్యాన్ డైరెక్టర్...ప్రముఖ హాలీవుడ్ చిత్రనిర్మాత జేమ్స్ గన్ (James Gunn) ’సూపర్‌మ్యాన్,’ ’సూసైడ్ స్క్వాడ్,’ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వంటి గొప్ప అంతర్జాతీయ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్‌మ్యాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పాప్యులర్ అనేది అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాకి దర్శకత్వం వహించిన ఆయన ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి ప్రస్తావించారు మరీ ముఖ్యంగా తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన నటన గురించి గొప్పగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్లోని కొన్ని సన్నివేశాలను ప్రస్తావించి మరీ ఆయన జూనియర్‌పై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం. ముఖ్యంగా ‘బోనులలో నుంచి పులులతో పాటు బయటకు దూకిన ఆ నటుడు (ఎన్టీయార్)తో నేను పని చేయాలనుకుంటున్నాను. అతను అద్భుతమైన నటుడు. నేను అతనితో ఏదో ఒక రోజు పని చేయాలనుకుంటున్నాను‘ అని ఆయన చెప్పారు.ఎన్టీఆర్ ఎంతగానో ఆకట్టుకున్నాడని జేమ్స్ అన్నారు. ఇప్పటి దాకా టాప్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓ తెలుగు హీరోని ఉద్దేశించి మాట్లాడడం ఇదే ప్రధమం కావడం గమనార్హం. -
IPL 2024- MI Punishment Jumpsuit: ఆలస్యం చేశారో అందరికీ ఇదే పనిష్మెంట్! (ఫోటోలు)
-
జస్ట్ సూపర్ మేన్.. అంతే!
‘‘కథ రాయడం మొదలుపెట్టి, తొలి డ్రాఫ్ట్ పూర్తి చేసేవరకూ నా సినిమాకు ‘సూపర్‌మేన్: లెగసీ’ అనే టైటిల్‌నే అనుకున్నాను. కానీ ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తి చేశాక ‘లెగసీ’ని వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా సినిమా టైటిల్ జస్ట్ ‘సూపర్‌మేన్’... అంతే. మా ఈ సూపర్‌మేన్ వచ్చే ఏడాది జూలై 11న మీ ముందుకు వస్తాడు’’ అని సామాజిక మాధ్యమాల ద్వారా దర్శకుడు జేమ్స్ గన్ పేర్కొన్నారు. సూపర్‌మేన్ క్యారెక్టర్‌తో ఇప్పటివరకూ ‘సూపర్‌మేన్’ ఫ్రాంచైజీలను నిర్మించిన డీసీ స్టూడియోస్ తాజా సూపర్‌మేన్ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే సూపర్మేన్ని కొత్త రకంగా చూపించనున్నారు జేమ్స్ గన్. ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో సూపర్‌మేన్ ధరించిన సూట్‌కి భిన్నంగా తాజా చిత్రంలోని సూపర్‌మేన్ సూట్ ఉంటుందట. కాగా ఈ మధ్యకాలంలో సూపర్‌మేన్ అంటే నటుడు హెన్రీ కవిల్ గుర్తొస్తారు. 2013 నుంచి 2021 వరకూ డీసీ స్టూడియోస్ నిర్మించిన సూపర్‌మేన్ చిత్రాల్లో టైటిల్ రోల్లో అద్భుతంగా ఒదిగిపోయారు హెన్రీ. కానీ, తాజా చిత్రంలో ఈ పాత్రను డేవిడ్ కోరెన్స్వెట్ చేయనున్నారు. ‘‘సూపర్‌మేన్ జీవితంలోని పూర్వ భాగంపై ఈ చిత్రం ఉంటుంది. ఈ పాత్రను హెన్రీ కవిల్ చేయలేడు. అందుకే డేవిడ్ కోరెన్స్వెట్ని తీసుకున్నాం’’ అని జేమ్స్ గన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఇప్పటివరకూ మూడు నాలుగు చిత్రాల్లో మాత్రమే నటించిన 30 ఏళ్ల డేవిడ్ కోరెన్స్వెట్కి ‘సూపర్‌మేన్’ చాన్స్ రావడం అనేది గొప్ప విషయం అని హాలీవుడ్ అంటోంది. -
సరికొత్తగా రాబోతున్న సూపర్‌మ్యాన్.. షాక్‌లో ఫ్యాన్స్
ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌మ్యాన్ సినిమాలకి, కామిక్స్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ప్రపంచం ప్రమాదపు అంచుల్లో ఉన్నప్పుడల్లా వచ్చి కాపాడుతుంటాడు. అతనికి, లూయిస్ లేన్‌కి పుట్టిన కొడుకే జాన్ కెంట్. ఇప్పుడు కొత్త సూపర్‌మ్యాన్‌గా అవతారం ఎత్తబోత్తున్నాడు. హీరోలకి వారసులు రావడం ఎక్కడైనా జరిగేదే. కానీ ఈ వారసుడు మాత్రం నార్మల్‌గా రావట్లేదు. అదే ఇక్కడ షాకింగ్ విషయం. ఇప్పటి వరకూ ఉన్న సూపర్ మేన్ క్లార్క్ కెంట్‌కి విరుద్ధంగా ఈ సారి అతని కొడుకు ‘బైసెక్సువల్’ సూపర్‌మ్యాన్‌గా రాబోతున్నాడు. అదే సంచలనానికి దారి తీసింది. ఈ సూపర్ హీరో ‘బైసెక్సువల్’గా రానున్నట్లు తెలుపుతూ డీసీ కామిక్స్ రైటర్స్ ‘సూపర్‌మ్యాన్: ది సన్ ఆఫ్ కాల్-ఎల్’ ఓ పిక్‌ని విడుదల చేశారు. అందులో జాన్, తన ప్రియుడైన రిపోర్టర్ జై నకమూరాను కిస్ చేస్తున్నాడు. ‘చాలా మంది ఫ్యాన్స్ తమ ఫేవరేట్ హీరోలో తమను చూసుకోవాలనుకుంటారు. సూపర్‌మేన్ సింబల్ హోప్‌కి, నిజానికి, న్యాయానికి ప్రతీక నిలుస్తుంటుంది. ఈ మార్పు ఇకపై ఎక్కువ విషయాలకి ప్రతీకగా నిలువబోతోంది. ఇకపై మోస్ట్ పవర్ఫుల్ హీరోలో తమని తాము చూసుకోబోతున్నారని’ డీసీ కామిక్స్ రైటర్ టామ్ టేలర్ తెలిపాడు. అయితే ఈ విషయమై సూపర్ హీరో అభిమానులు, గతంలో ఈ క్యారెక్టర్ చేసిన నటులు విమర్శలు చేస్తున్నారు. చదవండి: జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం -
సూపర్ మ్యాన్ సృష్టికర్త కన్నుమూత
చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, సూపర్ మ్యాన్ సృష్టికర్త రిచర్డ్ డోనర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన సోమవారం మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. సూపర్ మ్యాన్, గూనీస్ వంటి ఎన్నో సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలను తెరకెక్కించారు రిచార్డ్ డోనర్. 960 టీవీల్లో ‘ట్విన్ లైట్ జోన్’ అనే స్పై థ్రిల్లర్ స్టోరీస్‌తో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1978లో క్రిష్టోఫర్ రీవేతో తెరకెక్కిన ‘సూపర్ మ్యాన్’ ఈయనకు ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో ఆ తర్వాత పలు చిత్రాలు తెరకెక్కాయి. తెలుగుతో పాటు హిందీలో సూపర్ మ్యాన్ స్టోరీతో పలు చిత్రాలు అదే టైటిల్‌తో తెరకెక్కాయి. 1985లో ఈయన డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన ‘గూనీస్’ ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. రిచర్డ్ మరణం పట్ల హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
వైరల్: బెడిసికొట్టిన సూపర్‌మ్యాన్ రియల్ స్టంట్
సూపర్‌మ్యాన్ అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. సూపర్‌మ్యాన్ చేసే విన్యాసాలు.. సాహసాలు ఆకట్టుకుంటాయి. రీల్ లైఫ్‌లో అలా ఉండగా రియల్ లైఫ్‌లో కూడా ఓ సూపర్‌మ్యాన్ వేషం వేసిన అతడు చేసిన ప్రయత్నం విఫలమైంది. తన బలం చూపించాలనుకుని ప్రయత్నించి బస్సు ముందు బెడిసికొట్టింది. అతడిని బస్సును ఢీకొట్టినా కూడా ఏం కాలేదు. ప్రయోగాత్మకంగా అతడు చేసిన విన్యాసం తెగ నవ్వులు తెప్పిస్తోంది. బ్రెజిల్‌కు చెందిన హాస్యనటుడు లూయిజ్ రిబీరో డి గ్రాండే తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. సూపర్‌మ్యాన్ వేషం ధరించి తన చేత్తో దాన్ని ఆపినట్లు నటించాడు. అయితే అతడిని బస్సును ఢీకొట్టడంతో కొంత గందరగోళం ఏర్పడింది. బ్రెజిల్ మునిసిపాలిటీ బార్రా డోస్ కోక్విరోస్లో ఈ షూటింగ్ చేశారు. లూయిజ్ ఒక క్లాసిక్ సూపర్‌మ్యాన్ స్టంట్‌ను అనుకరించేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగా తన సూపర్ బలాన్ని నిరూపించడానికి ఈ స్టంట్ చేశాడు. కదిలే వాహనాన్ని చేతితో ఆపడానికి ప్రయత్నించాడు. అయితే బస్సు ఢీకొట్టడంతో అతడు కొంచెం కదిలాడు. కెమెరా ఫోన్ చిత్రీకరించిన ఫుటేజ్ కూడా కొంత గందరగోళం ఏర్పడింది. "ఇప్పుడు నేను నిజంగా ఉక్కుతో తయారయ్యానని చూశాను" అని లూయిజ్ రిబీరో డి గ్రాండే చెబుతుండగా ఈ ఘటన జరిగింది. అతను బస్సును ఢీకొట్టి ముందుకు నెట్టడంతో విషయాలు అకస్మాత్తుగా పరిస్థితి తారుమారైంది. అయితే అతడిని బస్సును ఢీకొట్టినా కూడా అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయోగాత్మకంగా అతడు చేసిన విన్యాసంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. -
కరోనాను నాశనం చేసేస్తా! : అమితాబ్
తానే గనుక సూపర్ మ్యాన్‌లా మారగలిగితే భయంకరమైన కరోనా మహమ్మారిని నాశనం చేసేస్తా అంటున్నారు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. కొన్ని దశాబ్ధాల క్రితం దిగిన ఓ ఫొటోను అమితాబ్ షేర్ చేశారు. ఆ ఫొటోలో సూపర్ మ్యాన్ దుస్తుల్లో ఉన్నారాయన. ‘ చాలా ఏళ్ల క్రితం అభిషేక్ ఫ్యాన్సీ డ్రెస్ బర్త్‌డే పార్టీ సందర్భంగా వేసుకున్న డ్రెస్. సూపర్ మ్యాన్ థీమ్ డ్రెస్. నేను నిజజీవితంలో సూపర్ మ్యాన్‌లా మారగలిగితే భయంకరమైన కరోనా మహమ్మారిని నాశనం చేసేస్తా’నని పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో ఆదివారాలు అభిమానులను కలుసుకునే సాంప్రదాయానికి కూడా ఆయన సెలవు ప్రకటించారు. ప్రతీ ఆదివారం ముంబైలోని జల్సా బంగ్లా వద్దకు వచ్చి అభిమానులను పలకరిస్తుంటారు అమితాబ్. కొద్దిరోజుల క్రితం ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘ అభిమానులు, నా శ్రేయోభిలాషులకు నా విన్నపం! దయచేసి మీరు ఆదివారాలు జల్సా గేట్ దగ్గరకు రాకండి, నేను కూడా రావటం లేదు. జాగ్రత్తలు తీసుకోండ’ని విజ్ఞప్తి చేశారు. ( 'నేను రావడం లేదు.. మీరు రావద్దు') T 3476 - A fancy dress birthday party for Abhishek in his very early years .. dress theme 'SUPERMAN' .. काश की वास्तव में हम superman बन कर इस सभयंकर महामारी Corona Virus को सदा के लिए नष्ट कर सकते !! pic.twitter.com/DvT90WYs6f — Amitabh Bachchan (@SrBachchan) March 20, 2020 -
సూపర్ మ్యాన్ రంగు మార్చాడు!
లో దుస్తులంటేనే లోపల వేసుకునేవి. అది అందరికీ తెలిసిందే. కానీ, లోపల వేసుకోవాల్సిన దుస్తులను పైన వేసుకుంటే.. అప్పుడా వ్యక్తిని సూపర్ మ్యాన్ అంటారని ఓ జోక్. సూపర్‌మ్యాన్ ఎరుపు, నీలం, పసుపు రంగులున్న డ్రెస్ వేసుకుంటాడు . ఇప్పటివరకూ మనం చూసిన సినిమాల్లో ఈ రంగులున్న డ్రెస్సులోనే కనిపించాడు. కానీ, ఇప్పుడు వేరే రంగు డ్రెస్సులో కనిపించనున్నాడు. టాప్ టు బాటమ్ నలుపు రంగు డ్రెస్సులో అగుపించనున్నాడని సూపర్ మ్యాన్ యాక్టర్ హెన్రీ కావిల్ విడుదల చేసిన ఓ ఫొటో స్పష్టం చేసింది. 2013లో విడుదలైన ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’లోనూ, ‘బ్యాట్‌మ్యాన్ వెర్సస్ సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్’లోనూ సూపర్ మ్యాన్ పాత్రలు చేశారాయన. నిర్మాణంలో ఉన్న తాజా చిత్రం ‘జస్టిస్ లీగ్’లోనూ ఈ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలోనే హెన్రీ నలుపు రంగు సూట్లో కనిపించనున్నారు. కేవలం కాస్ట్యూమ్ మాత్రమే మార్చారా? లేక ఇంకా ఆసక్తికరమైన విషయాలేవైనా ఈ సినిమాలో ఉన్నాయా? అనేది తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే. వచ్చే ఏడాది నవంబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
కామిక్ అవతార్
స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్... ఇలా హాలీవుడ్ సూపర్‌హీరో సినిమాలన్నీ కామిక్స్ నుంచి పుట్టినవే. తొలిసారిగా ఓ వెండితెర హీరో కామిక్ బుక్‌లో సూపర్‌హీరోగా అలరించనున్నారు. జేమ్స్ కామెరూన్ తీసిన ‘అవతార్’... ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ అద్భుతం. ఆరేళ్ల క్రితం ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పండోరా అనే గ్రహాన్ని తన అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలంతో తెర మీద ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మూడు సీక్వెల్స్ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ‘అవతార్’ని కామిక్ బుక్‌లో హీరోగా పరిచయం చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ‘‘డార్క్ హౌస్ కామిక్స్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. మరి కొన్ని కొత్త కథలతో, పండోరా గ్రహంలోని మరికొన్ని కొత్త కోణాలను పదేళ్ల పాటు పుస్తక రూపంలో తీసుకురానున్నాం’’ అని చెప్పారు. -
సూపర్‌మ్యాన్ ఎప్పుడు పుట్టాడు?
సూపర్‌మ్యాన్... ఒక తరంలో పిల్లల కళ్లు మెరిపించిన పాత్ర. స్పైడర్‌మ్యాన్, బాట్మన్ వంటి పాత్రలు రూపొందకముందు కామిక్ పాత్రల ప్రపంచంలో సూపర్‌హీరో ఈ సూపర్‌మ్యాన్. 1938వ సంవత్సరం జూన్ నెలలో పుట్టింది సూపర్‌మ్యాన్ కామిక్ పాత్ర. జెర్రీ సీగెల్ అనే రచయిత, జో షష్టర్ అనే చిత్రకారుడు కలిసి రూపొందించిన పాత్ర ఇది. ఆ తర్వాత టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాల్లో ఈ పాత్ర అలరించింది. అసాధారణమైన శక్తి, అసాధారణమైన వేగం, అసాధారణమైన వేడి, డేగ లాంటి తీక్షణమైన దృష్టి... ఇలా ప్రతిదీ సాధారణంకంటే చాలారెట్లు ఎక్కువగా ఉంటాయి ఈ పాత్ర లక్షణాలు. నిజమే... సూపర్ క్రియేషన్. -
19 కోట్లు పలికిన సూపర్‌మ్యాన్!!
సాధారణంగా ఏదైనా పాత పుస్తకం ఎంత పెట్టి కొంటారు.. మహా అయితే పదో, ఇరవై రూపాయలో అవుతుంది కదూ. కానీ.. సూపర్‌మ్యాన్ కామిక్స్‌ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అరుదైన పుస్తకం ఏకంగా 19 కోట్లకు పైగా పలికింది. తద్వారా ప్రపంచంలో అత్యంత ఖరీదైన కామిక్ పుస్తకంగా ఇది రికార్డులకెక్కింది. ఈ పుస్తకం అసలు ధర 10 సెంట్లు కాగా, ఇప్పుడది 3.2 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. తనవద్ద ఉన్న అత్యంత అరుదైన 'మ్యాన్ ఆఫ్ స్టీల్' పుస్తకం కాపీని అమ్మాలని దాని యజమాని డారెన్ అడమ్స్ నిర్ణయించుకుని, దాన్ని 'ఈబే'లో వేలానికి పెట్టాడు. దానికి ఆయన కేవలం 99 సెంట్లతోనే బిడ్ ప్రారంభం పెట్టాడు. అయితే.. కేవలం రెండు గంటలు కూడా గడిచాయో లేవో.. దాని ధర ఏకంగా 1.5 మిలియన్ డాలర్లకు ఎగబాకింది. చివరకు ఆదివారం రాత్రి వేలం ముగిసేసరికి ఏకంగా 3,207,852 డాలర్లకు అమ్ముడుపోయింది. -
నిజాలు దేవుడికెరుక: సూపర్‌మ్యాన్ శాపగ్రస్తుడా?
విజ్ఞానం ఎంత పెరిగినా ఇప్పటికీ విజ్ఞతకు అందని విషయాలు చాలానే ఉన్నాయి ప్రపంచంలో. ఏది ఎందుకు జరుగుతుందో తెలీదు. దాన్ని జరక్కుండా ఎలా ఆపాలో తెలీదు. ఆపకపోతే ఏం అనర్థం జరుగుతుందో అంచనాకు అందదు. సూపర్‌మ్యాన్ పాత్ర విషయంలో అదే పరిస్థితి! ఆ పాత్ర వేసిన నటులను ఏదో శాపం వెంటాడుతోంది. వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పుతోంది. అలా ఎందుకు జరుగుతోంది? సూపర్‌మ్యాన్ పాత్రలు చాలామంది చేశారు. సూపర్‌మ్యాన్ చిత్రాలకు చాలామంది పని చేశారు. వారిలో చాలామంది జీవితాలు ఊహించని మలుపులు తిరిగాయి. కొందరు వ్యాధుల బారిన పడ్డారు. ప్రమాదాలకు గురయ్యారు. ప్రాణాలనూ కోల్పోయారు. అయితే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా జీవించినవారు, జీవిస్తున్నవారూ ఉన్నారు. మరి సూపర్‌మ్యాన్ శాపం ఉన్నట్టా? లేనట్టా? మే 27, 1995. ఆ రోజు అమెరికా అంతా తీవ్రమైన షాక్‌కి గురయ్యింది. ఎవరూ ఊహించని ఓ దుర్వార్త అందరినీ కలచి వేసింది. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, సామాజికవాది అయిన క్రిస్టఫర్ రీవ్ పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. అత్యంత వేగంగా గుర్రపు స్వారీ చేస్తూ పట్టు తప్పి పడిపోయాడు. మెడ ఎముక, వెన్నెముక, ఇంకా అక్కడక్కడా కొన్ని ఎముకలు విరిగిపోయాయి. తలకి తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్పృహ తప్పిపోయిన అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాణం దక్కింది. కానీ శరీరం పట్టు కోల్పోయింది. దాంతో రీవ్ చక్రాల కుర్చీకి పరిమితమవ్వాల్సిందే అని వైద్యులు తేల్చేశారు. సూపర్‌మ్యాన్ పాత్రలతో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన అతగాడికి... ఓ మామూలు వ్యక్తిగా కూడా జీవితాన్ని సాగించలేని దీన స్థితి ఏర్పడింది. ‘‘అయ్యో... ఎంత దారుణం జరిగిందిరా... పాపం రీవ్’’... నిట్టూర్పు విడిచాడు జాన్ టీవీ చూస్తూ. అతడు రీవ్కి వీరాభిమాని. పక్కనే కూర్చుని ఉన్న అతడి స్నేహితుడు నిక్సన్ భారంగా తలూపాడు. ‘‘సూపర్‌మ్యాన్ పాత్రలు చేసేవాళ్లకి ఆ గతి పట్టడంలో వింతేముంది?’’ అన్నాడు జాలిగా. చప్పున చూశాడు జాన్. ‘‘అదేంటి అలా అన్నావ్? ఆ పాత్రకీ యాక్సిడెంటుకీ సంబంధం ఏంటి?’’ అన్నాడు జాన్ ఆశ్చర్యంగా. ‘‘అదేంటంత ఆశ్చర్యపోతున్నావ్. సూపర్‌మ్యాన్ శాపం గురించి నీకు తెలియదా? ఆ పాత్ర చేయడమంటే ప్రాణాలతో ఆడుకోవడమే. ఇప్పటికే చాలామంది ఆ శాపానికి బలయ్యారు. ఇప్పుడు రీవ్ కూడా...’’ నిక్సన్ మాటలకు నిశ్చేష్టుడయ్యాడు జాన్. సూపర్‌మ్యాన్ శాపమా? ఆ పాత్ర చేస్తే ప్రాణాలకు ప్రమాదమా? ఇదంతా నిజమా లేక మూఢ నమ్మకమా? ఒక్క క్షణంలో వెయ్యి సందేహాలు తలెత్తాయతడికి. సూపర్‌మ్యాన్ శాపం గురించి చాలామందికి తెలుసు. కానీ అందులో ఎంత వాస్తవం ఉంది అన్నది మాత్రం ఎవరికీ కచ్చితంగా తెలియదు. కానీ జరిగిన సంఘటనలన్నీ పరిశీలిస్తే... దాన్ని వాస్తవం అని నమ్మడానికే ఎక్కువ అవకాశాలున్నాయనిపిస్తుంది. టెలివిజన్‌లో సూపర్‌మ్యాన్‌గా 1940 ప్రాంతంలో అదరగొట్టినవాడు కిర్క్ అలిన్. అతడు ఆ పాత్రని ఎంతగా పండించాడంటే... ఆ తర్వాత అతడు మామూలు రోల్స్ చేస్తే చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఓసారి విలన్ పాత్ర వేస్తే అందరూ మండిపడ్డారు. సూపర్‌మ్యాన్ ఏంటి, అలాంటి రోల్ చేయడమేంటి అంటూ వ్యతిరేకతను తెలియజేశారు. దాంతో అతడి కెరీర్ డల్ అయిపోయింది. అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత అతడు అల్జైమర్స్ వ్యాధి బారినపడ్డాడు. నాటి నుంచి చనిపోయేవరకూ నరకం చూశాడు. అయితే అతడు మరణించేలోపే మరికొందరు సూపర్‌మ్యాన్ పాత్రధారుల జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. 1951లో వచ్చిన ‘సూపర్‌మ్యాన్ అండ్ ద మోల్ మెన్’ చిత్రంలో సూపర్‌మ్యాన్‌గా నటించాడు జార్జ్ రీవ్స్. ఆ సినిమా అతణ్ని చాలా పాపులర్ చేసింది. కెరీర్ ఊపందుకుంది. అయితే అంతలోనే ఊహించని దారుణం జరిగింది. ఇంకొద్ది రోజుల్లో రీవ్స పెళ్లి జరుగుతుందనగా... తన గదిలో విగతజీవిగా కనిపించాడు రీవ్స్. తుపాకీ గుండు అతడి ప్రాణాలను తీసిందని తెలిసింది. అయితే ఆ బుల్లెట్‌ను పేల్చింది ఎవరన్నది తెలియకపోవడంతో ఆత్మహత్యగా నమోదు చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే... తుపాకీ మీద అతడి వేలిముద్రలు కూడా దొరకలేదు. మరి ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఆ తరువాత బడ్ కాల్యర్, లీ క్విగ్లీల మరణాలతో సూపర్‌మ్యాన్ కథ మలుపు తిరిగింది. బడ్ కాల్యర్ కార్టూన్ షోలలో సూపర్‌మ్యాన్ పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. బాగా పేరు వచ్చింది. సూపర్‌మ్యాన్ టీవీ షోలకి అతడు మాత్రమే డబ్బింగ్ చెప్పాలి అని దర్శకులంతా కోరుకునేంతగా సక్సెస్ అయ్యాడు. అయితే అంతుపట్లని అనా రోగ్యం అతణ్ని వేధించింది. రక్తప్రసరణలో సమస్యలు తలెత్తడంతో తన అరవయ్యవ యేట కన్ను మూశాడు. ఆ తరువాత లీ క్విగ్లీ వంతు. ఓ సినిమాలో బాల సూపర్‌మ్యాన్‌గా నటించాడు లీ. కొన్నేళ్ల తరువాత ఏదో అనారోగ్యానికి వేసుకున్న మందులు రియాక్షన్ ఇవ్వడంతో చనిపో యాడు. అప్పుడతడికి పద్నాలుగేళ్లు. ఈ సంఘటనలతో అందరిలోనూ అనుమానం రేకెత్తింది. సూపర్‌మ్యాన్ పాత్రతో సంబంధం ఉన్నవారందరినీ ఏదో శాపం వెంటాడుతోందని, అందుకే అందరూ ప్రాణాలు కోల్పోతున్నారనీ అనుకోవడం మొదలైంది. ఆ అనుమానం బలపడటానికి క్రిస్టఫర్ రీవ్స్ ఉదంతం దోహదపడింది. సూపర్‌మ్యాన్ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు రీవ్. సూపర్‌మ్యాన్-ద మూవీ, సూపర్‌మ్యాన్ 2, సూపర్‌మ్యాన్ 3, సూపర్‌మ్యాన్ 4-ద క్వెస్ట్ ఫర్ పీస్ చిత్రాలతో ప్రభంజనం సృష్టించాడతడు. అలాంటివాడు గుర్రం మీద నుంచి పడి, ఎముకలు విరిగిపోయి, శరీరం చచ్చుబడిపోయి, చక్రాల కుర్చీకే పరిమితమైపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు జనం. కచ్చితంగా సూపర్‌మ్యాన్ పాత్ర శాపగ్రస్తమైనదని, అందుకే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని నిర్ధారించేసుకున్నారు. 2004, అక్టోబర్‌లో రీవ్ హార్ట్ ఫెయిలై మరణించాడు. వీళ్లు మాత్రమే కాదు. సూపర్‌మ్యాన్ చిత్రాలు, సీరియల్స్‌తో సంబంధం ఉన్న చాలామంది జీవితాల్లో ఊహించని సంఘటనలు జరిగాయి. సూపర్‌మ్యాన్ చిత్రంలో క్రిస్టఫర్ రీవ్తో కలిసి నటించిన మార్లన్ బ్రాండో... రీవ్ మరణించడానికి సరిగ్గా నాలుగు నెలల ముందు చనిపోయాడు. అతడు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. బ్రాండో కొడుకు క్రిస్టియన్, తన చెల్లెలు షెయేన్ బాయ్‌ఫ్రెండ్‌ని కాల్చి చంపాడు. దాంతో అతడికి యావజ్జీవిత ఖైదు విధించారు. ఆ బాధతో షెయేన్ ఆత్మహత్య చేసుకుంది. ఇది బ్రాండోని కుంగదీసింది. ఆ బాధతోనే చనిపోయాడు. క్రిస్టఫర్ రీవ్ సరసన ఒక చిత్రంలో నటించిన మార్గట్ కిడ్డర్ ఓరోజు సడెన్‌గా కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తరువాత మతి చలించిన స్థితిలో ఉన్న ఆమెని పోలీసులు పట్టుకుని, ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె బై పోలార్ డిజార్డర్‌తో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించారు. అయితే తర్వాత మెల్లగా తేరుకుందామె. సూపర్‌మ్యాన్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులర్ అయిన రిచర్డ్ ప్రయర్ డ్రగ్స్‌కి బానిసయ్యాడు. ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడు. మానసిక వ్యాధి బారిన పడ్డాడు. చివరికి హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. సూపర్‌మ్యాన్ పాత్రను సృష్టించిన జెర్రీ సీగల్, అతడికి సహకరించిన జో షస్టర్లు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా చితికిపోయారు. దివాళా తీసి, బతకడం కోసం చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేయాల్సి వచ్చింది వారికి. జో అయితే అనారోగ్యంతో కంటిచూపును కూడా పోగొట్టుకున్నాడు. డీన్ కెయిన్, బ్రాండన్ రూత్, బాబ్ హాలీడే లాంటి వాళ్లయితే, సూపర్‌మ్యాన్ చిత్రాల్లో నటించాక తమ కెరీర్ నాశనమైపోయిందని అంటూ ఉంటారు. ఇవన్నీ చూసిన తరువాత సూపర్‌మ్యాన్ శాపం కచ్చితంగా ఉంది అని నమ్మేవాళ్ల సంఖ్య పెరిగింది. ఇన్ని సినిమాల్లో ఇంతమంది నటిస్తున్నారు, ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు, కేవలం సూపర్‌మ్యాన్ సినిమాల్లో నటించినవాళ్లకు మాత్రమే ఎందుకిలా జరుగుతోంది అంటూ వాళ్లు ప్రశ్నిస్తారు. అయితే దీన్ని కొట్టి పారేసేవాళ్లు కూడా బోలెడంత మంది ఉన్నారు. కిర్క్ అలిన్, బడ్ కాల్యర్ లాంటివాళ్లు వ్యాధుల బారిన పడినా, వయసు మీద పడిన తరువాతే చనిపో యారు, అప్పుడది శాపమెలా అవుతుంది అనేది కొందరి వాదన. చివరికి బైపోలార్ డిజార్డర్ బారినపడి, కొన్నాళ్లు కనిపించకుండా పోయిన మార్గట్ కూడా శాపం గీపం ఏదీ లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘అంతా ట్రాష్... ఓసారి నా కారుకు యాక్సిడెంట్ అయ్యి మూడు పల్టీలు కొట్టింది. అయినా నాకేమీ కాలేదు. శాపమనేదే ఉంటే నేను అప్పుడే చనిపోవాలి కదా, మతి చలించిన నేను మళ్లీ ఎలా కోలుకుంటాను’’ అందామె. కొందరు కాదంటారు. కొందరు అవునంటారు. ఎవరి మాట నమ్మాలి? ఈ శాపం నిజం కాదా? సూపర్‌మ్యాన్ పాత్ర వల్ల వచ్చిన ప్రమాదమేమీ లేదా? అది ఒక మూఢ నమ్మకమేనా? శాపమనేదే లేకపోతే ఇంతమంది జీవితాల్లో ఇన్ని అనర్థాలు ఎలా సంభవించాయి? శాపమే ఉండివుంటే... అందరికీ ప్రమాదాలు జరక్కుండా కొందరికే ఎందుకు జరిగాయి? ఏమో మరి... నిజాలు దేవుడికెరుక! - సమీర నేలపూడి -
ఫిలిపెన్స్లో సూపర్ మ్యాన్