సూపర్ మ్యాన్ రంగు మార్చాడు! | Henry Cavill Teases Black Superman Suit for Justice League | Sakshi
Sakshi News home page

సూపర్ మ్యాన్ రంగు మార్చాడు!

Published Tue, Aug 16 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

సూపర్ మ్యాన్ రంగు మార్చాడు!

సూపర్ మ్యాన్ రంగు మార్చాడు!

లో దుస్తులంటేనే లోపల వేసుకునేవి. అది అందరికీ తెలిసిందే. కానీ, లోపల వేసుకోవాల్సిన దుస్తులను పైన వేసుకుంటే.. అప్పుడా వ్యక్తిని సూపర్ మ్యాన్ అంటారని ఓ జోక్. సూపర్‌మ్యాన్ ఎరుపు, నీలం, పసుపు రంగులున్న డ్రెస్ వేసుకుంటాడు . ఇప్పటివరకూ మనం చూసిన సినిమాల్లో ఈ రంగులున్న డ్రెస్సులోనే కనిపించాడు. కానీ, ఇప్పుడు వేరే రంగు డ్రెస్సులో కనిపించనున్నాడు. టాప్ టు బాటమ్ నలుపు రంగు డ్రెస్సులో అగుపించనున్నాడని సూపర్ మ్యాన్ యాక్టర్ హెన్రీ కావిల్ విడుదల చేసిన ఓ ఫొటో స్పష్టం చేసింది.
 
2013లో విడుదలైన ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’లోనూ, ‘బ్యాట్‌మ్యాన్ వెర్సస్ సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్’లోనూ సూపర్ మ్యాన్ పాత్రలు చేశారాయన. నిర్మాణంలో ఉన్న తాజా చిత్రం ‘జస్టిస్ లీగ్’లోనూ ఈ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలోనే హెన్రీ నలుపు రంగు సూట్‌లో కనిపించనున్నారు. కేవలం కాస్ట్యూమ్ మాత్రమే మార్చారా? లేక ఇంకా ఆసక్తికరమైన విషయాలేవైనా ఈ సినిమాలో ఉన్నాయా? అనేది తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే. వచ్చే ఏడాది నవంబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement