Justice League
-
ఆ డైరెక్టర్ నన్ను బెదిరించాడు: నటి
డీసీ సినిమాటిక్ యూనివర్స్ మూవీ ‘వండర్ వుమెన్’తో హాలీవుడ్ నటి గాల్ గాడెట్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆ సినిమా సమయంలో ఈ బ్యూటీకి ఎదురైన చేదు అనుభవాలన తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించింది. డీసీ సూపర్ హీరో మూవీ ‘జస్టిస్ లీగ్’కి మొదట హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాక్ స్నైడర్ దర్శకత్వం వహించాడు. అనంతరం వివిధ కారణాలతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన ప్లేస్‌లో ఫిల్మ్ మేకర్ జాస్ వెడాన్ దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన ఈ దర్శకుడు సినిమా షూటింగ్లో ఉండగా తన కెరీర్ గురించి బెదిరించాడని నటి గాల్ గాడెట్ తెలిపింది. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదని, అయితే మూవీ ప్రొడ్యూసర్స్ అయితే వార్నర్ బ్రదర్స్ నాకు అభయం ఇచ్చారని చెప్పింది. గాల్ గాడెట్ డైరెక్టర్ వెడాన్పై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అతను ఎంతో మందితో డిఫరెంట్‌గా బిహేవ్ చేసేవాడని.. గతంలో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టులు పెట్టింది. కాగా ఈ బ్యూటీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్, జస్టిస్ లీగ్, క్రిమినల్, కీపింగ్ అప్ విత్ ది జోన్స్, బాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్ వంటి చిత్రాల్లో నటించింది. చదవండి: పిక్‌ని పోస్ట్ చేసిన ‘స్పైడర్ మ్యాన్’.. ఎమోషనల్ అయిన ప్రియురాలు Joss Wheadon’s on-set treatment of the cast and crew of Justice League was gross, abusive, unprofessional, and completely unacceptable. He was enabled, in many ways, by Geoff Johns and Jon Berg. Accountability>Entertainment — Ray Fisher (@ray8fisher) July 1, 2020 -
పోర్న్ మూవీ తీద్దామనుకున్నా: జాక్ స్నైడర్
హాలీవుడ్ స్టార్ దర్శకుడు జాక్ స్నైడర్.. స్లో మోషన్ విజువల్స్ స్పెషలిస్ట్. ఒక కథను ఎంతగా ప్రేమించి తీస్తాడో ఆయన డైరెక్షన్లోనే తెలిసిపోతుంటుంది. కానీ, అంత టాలెంట్ ఉన్నా... స్టోరీ టెల్లర్గా మాత్రం ఆయనకు తక్కువ మార్కులే పడుతుంటాయి. అయితే తనలో చాలాకాలంగా అణుచుకున్న ఓ కోరికను టెలిగ్రాఫ్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడాయన. నాకు ఎప్పటి నుంచో పోర్న్ మూవీ తీయాలని కోరిక. కానీ, ఇంతవరకు ఆ అవకాశం రాలేదు. మనిషి శరీరం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ఎక్కువ. ‘300’ సినిమా చూశాక చాలామంది అదే ప్రశ్న అడిగారు. ‘ఏం సార్.. మీరు పోర్న్ మూవీ తీయబోయి ఇది తీశారా?’ అని. అలాగే జస్టిస్ లీగ్ కట్‌లోనూ కొన్ని సీన్లు పోర్న్ మూవీస్ మాదిరి ఎఫెక్ట్‌తో ఉన్నాయని కొందరు అన్నారు. అడల్ట్ సినిమా తీయాలన్న నా కొరికే అలా చూపించిందేమో. నా దృష్టిలో శారీరక వాంఛలతో మనిషి రగిలిపోతుంటాడు. వాటిని అణుచుకోవడం ఎందుకనే ఫిలాసఫీ మీదే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తుంటా. గతంలో పోర్న్ తీయాలని రెండు, మూడుసార్లు ప్రయత్నించా. కానీ, ప్రొడక్షన్ హౌజ్‌లు ఒప్పుకోకపోవడంతో అది కుదరలేదు. ఛాన్స్ దొరికితే తప్పకుండా తీస్తా. అలాగే ఆధ్యాత్మికం నేపథ్యంలోనూ ఓ సినిమా తీయాలని ఉంది” అని జాక్ స్నైడర్ తెలిపాడు. ఇక స్నైడర్ డైరెక్ట్ చేసిన ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. అందులో ఓ బోల్డ్ సన్నివేశాన్ని కావాలనే పెట్టినట్లు ఇంటర్వ్యూలో ఈ స్టార్ దర్శకుడు చెప్పడం విశేషం. కాగా, హాలీవుడ్లో 2004 నుంచి డాన్ ఆఫ్ ది డెడ్‌తో మొదలైన స్నైడర్ ప్రస్థానం.. 300, వాచ్మెన్, లెజెండ్ ఆఫ్ ది గార్జియన్స్, మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్లతో కొనసాగింది. 2017లో 'జస్టిస్ లీగ్' మేజర్ పోర్షన్ జాక్ స్నైడర్ డైరెక్ట్ చేశాడు. అయితే కూతురి మరణంతో ఆయన ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో మిగతా పోర్షన్‌ను వేరేవాళ్లు డైరెక్ట్ చేశారు. ఆ మూవీ నిరాశపర్చడంతో అప్పటి నుంచి ‘స్నైడర్ కట్’ కావాలంటూ డీసీ ఫ్యాన్స్ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో జాక్ స్నైడర్స్ జస్టిస్ లీగ్ మార్చ్ 18న హెచ్‌బీవో ద్వారా రిలీజ్ అయ్యింది. అయితే రన్ టైం ఎక్కువగా ఉండడంతో పాటు ఈ సినిమాలోని సీన్లపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. The Time is Now. #ForAutumn pic.twitter.com/kmaXuJqGPv — Zack Snyder (@ZackSnyder) March 14, 2021 చదవండి: ఆమె ఒంటి నిండా.. -
సూపర్ మ్యాన్ రంగు మార్చాడు!
లో దుస్తులంటేనే లోపల వేసుకునేవి. అది అందరికీ తెలిసిందే. కానీ, లోపల వేసుకోవాల్సిన దుస్తులను పైన వేసుకుంటే.. అప్పుడా వ్యక్తిని సూపర్ మ్యాన్ అంటారని ఓ జోక్. సూపర్‌మ్యాన్ ఎరుపు, నీలం, పసుపు రంగులున్న డ్రెస్ వేసుకుంటాడు . ఇప్పటివరకూ మనం చూసిన సినిమాల్లో ఈ రంగులున్న డ్రెస్సులోనే కనిపించాడు. కానీ, ఇప్పుడు వేరే రంగు డ్రెస్సులో కనిపించనున్నాడు. టాప్ టు బాటమ్ నలుపు రంగు డ్రెస్సులో అగుపించనున్నాడని సూపర్ మ్యాన్ యాక్టర్ హెన్రీ కావిల్ విడుదల చేసిన ఓ ఫొటో స్పష్టం చేసింది. 2013లో విడుదలైన ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’లోనూ, ‘బ్యాట్‌మ్యాన్ వెర్సస్ సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్’లోనూ సూపర్ మ్యాన్ పాత్రలు చేశారాయన. నిర్మాణంలో ఉన్న తాజా చిత్రం ‘జస్టిస్ లీగ్’లోనూ ఈ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలోనే హెన్రీ నలుపు రంగు సూట్లో కనిపించనున్నారు. కేవలం కాస్ట్యూమ్ మాత్రమే మార్చారా? లేక ఇంకా ఆసక్తికరమైన విషయాలేవైనా ఈ సినిమాలో ఉన్నాయా? అనేది తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే. వచ్చే ఏడాది నవంబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.