19 కోట్లు పలికిన సూపర్మ్యాన్!! | first superman comic book fetches 3.2 million dollars | Sakshi
Sakshi News home page

19 కోట్లు పలికిన సూపర్మ్యాన్!!

Published Tue, Aug 26 2014 4:08 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

19 కోట్లు పలికిన సూపర్మ్యాన్!!

19 కోట్లు పలికిన సూపర్మ్యాన్!!

సాధారణంగా ఏదైనా పాత పుస్తకం ఎంత పెట్టి కొంటారు.. మహా అయితే పదో, ఇరవై రూపాయలో అవుతుంది కదూ. కానీ.. సూపర్మ్యాన్ కామిక్స్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అరుదైన పుస్తకం ఏకంగా 19 కోట్లకు పైగా పలికింది. తద్వారా ప్రపంచంలో అత్యంత ఖరీదైన కామిక్ పుస్తకంగా ఇది రికార్డులకెక్కింది. ఈ పుస్తకం అసలు ధర 10 సెంట్లు కాగా, ఇప్పుడది 3.2 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది.

తనవద్ద ఉన్న అత్యంత అరుదైన 'మ్యాన్ ఆఫ్ స్టీల్' పుస్తకం కాపీని అమ్మాలని దాని యజమాని డారెన్ అడమ్స్ నిర్ణయించుకుని, దాన్ని 'ఈబే'లో వేలానికి పెట్టాడు. దానికి ఆయన కేవలం 99 సెంట్లతోనే బిడ్ ప్రారంభం పెట్టాడు. అయితే.. కేవలం రెండు గంటలు కూడా గడిచాయో లేవో.. దాని ధర ఏకంగా 1.5 మిలియన్ డాలర్లకు ఎగబాకింది. చివరకు ఆదివారం రాత్రి వేలం ముగిసేసరికి ఏకంగా 3,207,852 డాలర్లకు అమ్ముడుపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement