టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అవా ఎంటర్ టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవల కన్నప్ప కామిక్ బుక్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యానిమేటెడ్ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను మంచు విష్ణు విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది.
🌟 Unveil the saga of '𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚' 🌟
Dive into the epic tale of #Kannappa🏹 in our first Animated Comic Book—devotion, bravery, and sacrifice brought to life.
Episode 1 is streaming now on YouTube! 🎥✨
🔗Telugu: https://t.co/iolkS7zeS3
🔗Tamil: https://t.co/sQP4xKrQGG… pic.twitter.com/pqJf9ZXPSm— Vishnu Manchu (@iVishnuManchu) December 23, 2024
Comments
Please login to add a commentAdd a comment