Episode
-
కాంగ్రెస్ ఫైల్స్ అంటూ వీడియో రిలీజ్ చేసిన బీజేపీ
కాంగ్రెస్ హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణలు, కుంభకోణాలకు సంబంధించి ‘కాంగ్రెస్ ఫైల్స్’ అనే వీడియో ట్రైలర్‌ని బీజేపీ విడుదల చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అంటే అవినీతి అనే సిరీస్ పేరుతో కాంగ్రెస్ ఫైల్స్ అనే మొదటి ఎపిసోడ్‌ను ఆదివారం విడుదల చేసింది బీజేపీ . ఆ వీడియోలో కాంగ్రెస్ తన 70 ఏళ్ల హయాంలో ప్రజల నుంచి దాదాపు రూ. 4 లక్షల కోట్ల రూపాయలు వరకు దోచుకుందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ అంటే అవినీతి సిరీస్‌కి సబంధించిన వీడియోని రిలీజ్ చేసింది. కాంగ్రెస్ దోచుకున్న మొత్తాన్ని ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పౌర భద్రత కోసం ఉపయోగించవచ్చని బీజేపీ పేర్కొంది. ఈ మేరకు బీజేపి ట్విట్టర్ వేదికగా ఆ వీడియో రిలీజ్‌ను ప్రకటిస్తూ.. అందుకు సంబంధించిన వీడియో ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో.. ఈ మొదటి ఎపిసోడ్లో కాంగ్రెస్ పాలనలో ఒకదాని తర్వాత ఒకటిగా కుంభకోణాలు ఎలా జరిగాయో చూడండి. కాంగ్రెస్ కొట్టేసిన డబ్బుతో 24 ఐఎన్ఎస్ విక్రంత్, 300 రాఫెల్ జెట్లు, వెయ్యి మంగళ్ మిషన్లు కొనుగోలు చేయగలిగేవాళ్లం. కాంగ్రెస్ చేసిన మోసం కారణంగా దేశం అవన్నీ నష్టపోవడంతో విజయంలో వెనకబడిపోయిందని బీజేపీ విమర్శలు చేసింది. 2004 నుంచి 2014 వరకు సాగిన కాంగ్రెస్ పాలనను బీజేపీని కోల్పోయిన దశాబ్దంగా అభివర్ణించింది. "ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయన హాయంలో జరిగిన అవినీతిని చూసి చూడనట్లు వదిలేసారని, ఫలితంగా వార్తపత్రికలన్నీ స్కామ్ వార్తలతో నిండిపోయాయి. దేశం సిగ్గుతో తలవంచుకుంది. అని వీడియోలో పెద్ద ఎత్తున విమర్శిలు చేసింది బీజేపీ. అంతేగాదు ఆ వీడియోలో ఇంకా బొగ్గు, 2జీ స్పెక్ట్రం వంటి పలు కుంభకోణాలు గురించి కూడా ప్రస్తావించింది. వీడియో చివర్లో సినిమా ఇంకా అయిపోలేదని ఓ ట్విస్ట్ కూడా ఇచ్చింది బీజేపీ. Congress Files के पहले एपिसोड में देखिए, कैसे कांग्रेस राज में एक के बाद एक भ्रष्टाचार और घोटाले हुए… pic.twitter.com/vAZ7BDZtFi — BJP (@BJP4India) April 2, 2023 (చదవండి: ఆ దేశాలకు అదోక చెడ్డ అలవాటు!పశ్చిమ దేశాలపై జైశంకర్ ఫైర్) -
ఘంటసాలకు ‘భారతరత్న’ కార్యక్రమం: 200 టీవీ ఎపిసోడ్స్ పూర్తి
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా ఘంటశాలకు ‘భారతరత్న’ అనే నినాదంతో యూఏఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 200 టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా అమెరికా గానకోకిల శారద ఆకునూరి వ్యాఖ్యాతగా 8 జనవరి 2023, జనవరి 8న నాడు జరిగిన అంతర్జాల (జూమ్) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పని ఒత్తిడి కారణంగా "200 వ టీవీ ఎపిసోడ్" ఉత్సవాల నిమిత్తం అమెరికాకు రాలేక పోతున్నప్పటికీ న్యూఢిల్లీ నుంచే ఘంటసాలకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుతో పాటు అనేక భాషలలో వేలాది మధురమైన పాటలు అందించిన ఘంటశాల గారి గళం ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే సుప్రభాతం కానీ, అనేక భక్తి గీతాలు కానీ, లేక భగవద్గీతగా వినినిపిస్తుందన్నీరు. వీటన్నిటికీ మించి ఈ దేశ స్వాత్రంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో పాల్గొన్న స్వతంత్ర పోరాట యోధుడు... చిన్నప్పుడు గాంధీజీ సిద్ధాంతాలకు స్పందించి స్వాతంత్ర పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతదేశానికి స్వాత్రంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తియైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆజాద్ కా అమృతోత్సవ్ పేరుతో ప్రపంచం అంతా కూడా ఈ ఉత్సవాలు జరగాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే ఘంటసాల శతజయంతి జన్మ ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో కూడా జరపాలని నిర్ణయించామనీ, 4 డిసెంబర్ 4న, చెన్నైలో భారత ప్రభుత్వం తరపున ప్రారంభించడంతోపాటు, రానున్న రోజుల్లో ఒక సంవత్సరం పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, దేశ రాజధానిలో లాంటి అనేక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తరపున శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అనేక దేశాలలో కూడా మన ఘంటసాల అభిమానులు, కళాకారులు, అనేకమంది ప్రముఖులు వారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారనీ, మీ ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. మరొక్క సారి భారత ప్రభుత్వం , సాంస్కృతిక శాఖ తరపున ఆయన ఘనమైన నివాళులర్పించారు. రక్షణ శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి, మాట్లాడుతూ ఘంటసాల అంటే తెలియని తెలుగు వారు ఉండరు, ఉదయాన్నే లేవగానే వారి గాత్రాన్ని భక్తి గీతాల రూపంలో, భగవద్గీత రూపంలో, సినిమా పాటలు రూపంలో వింటూ ఉంటాము. చిన్నతనంలో తండ్రి గారు మరణించిన చాలా కష్టాలు పడి విజయనగం వెళ్లి వారాలు ఉండి సంగీతం నేర్చుకొని, వారికి సంగీతం నేర్పించిన గురువు గారు అయినా సీతారామ శాస్త్రి గారిని జీవితాంతం స్మరించుకున్నారు. 10వేల పైగా పాటలు, 110 ఎక్కువ సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాల్లాంటి పాటలను అందించారు. పిన్న వయస్సులోనే దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా 18 నెలల జైలు శిక్షను అనుభవించారు, తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గాయకుడు అని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో 10 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయిన బిలియనీర్ వ్యాపారవేత్త డాక్టర్ MS రెడ్డి (జున్ను రాజు), ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు కోదండరామి రెడ్డి, నటుడు మురళీ మోహన్, ఘంటసాల కుటుంబం నుంచి కృష్ణకుమారి, నాటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, TTA మాజీ అధ్యక్షుడు భరత్ మాదాడి, శంకర నేత్రాలయ ట్రస్టీ, SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు భాస్కర్ గంటి, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు, NRIVA ఛైర్మన్, డాక్టర్ జయసింహ సుంకు, శంకర నేత్రాలయ ట్రస్టీ, శ్యామ్ అప్పాలి తదితరులు పాల్గొని మాట్లాడుతూ, ఘంటసాల గారి పాటలతో వారికున్న అనుబంధాన్ని పంచుకొని ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ఆ మహనీయుడికి భారతరత్న గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా కోరారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం విచారం వ్యక్తం చేశారు. ఘంటసాలకి కేంద్రం తగిన రీతిలో గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు, అందుకు 33 దేశాల్లో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలు కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. 33 దేశాలను చేరుకోవడానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే 200 TV కార్యక్రమాలకి సాంకేతిక సహాయాన్ని అందచేసిన శ్యాం అప్పాలి, ప్రమీల గోపు, హరీష్ కోలపల్లికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలకి వ్యాఖ్యాతలుగా నిర్వహించిన శారద ఆకునూరి, రత్న కుమార్, శ్యామ్ అప్పాలి , విజు చిలువేరు, నీలిమ గడ్డమనుగు, Dr. రెడ్డి ఉరిమింది, జయ పీసపాటి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్క, శ్రీలత మగతలకు ప్రత్యేక అభినందనలందించారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, -
Devatha serial: నందా అసలు స్వరూపాన్ని బయటపెట్టేసిన కమల
సత్య-ఆదిత్యల ప్రేమాయణంబయటపెట్టాస్తానంటూనందా బెదిరిస్తుండటం, సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో తెలుసుకోవాలని రాజేశ్వరి ఆరాటపడుతుంటంతో ఎపిసోడ్ రోజు రోజుకి ఆసక్తిగా మారిపోయింది. మరోవైపు సత్య-నందాలకి పెళ్లి చేయాలని దేవుడమ్మ నిర్ణయించడం, ఈ గండం నుంచి సత్యను ఎలా బయటపడేయాలో అని ఆదిత్య ఆరాటపడుతుండం ప్రేక్షకులను రక్తి కట్టిస్తుంది. ఈ నేపథ్యంలో దేవత సీరియల్ నేడు (మే 5)న 225వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయిపోయింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం కారణం ఎవరో తెలుసుకోవాలని రాజేశ్వరి తెగ ఆరాటపడుతుంటుంది. ఈ నిజం తెలుసుకొని దేవుడమ్మను దెబ్బకొట్టాలని నందాతో కలిసి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై నందాను పిలిపించి అడుగుతుంది. సత్య కడుపుకి కారణం ఎవరో చెప్పు? ఈ నిజం నాకు తెలియాలి అంటూ నందాను నిలదీస్తుంది. అయితే రహస్యాలు చెప్పుకునేంత ర్యాపో ఇద్దరి మధ్యా లేదని, ఇలాంటి ఆణిముత్యాలాంటి నిజాల్ని చెప్పాలంటే ముందు మీపై నాకు నమ్మకం కలగాలి అని నందా బదులిచ్చాడు. దీంతో ఆ నమ్మకం ఎలా వస్తుంది అంటూ ఒకింత ఫైర్ అవుతుంది రాజేశ్వరి. ఓ 50 వేల రూపాయలు ఇవ్వండి మీరిచ్చిన డబ్బు చూసినప్పుడల్లా మీకు నిజం చెప్పానిపిస్తుంటుంది అని నందా పేర్కొనగా.. కడుపుకి అన్నం తింటావా? లేక డబ్బులు తింటావా అంటూ రాజేశ్వరి ఫైర్ అయ్యింది. సీన్ కట్ చేస్తే.. సత్య.. భాగ్యమ్మ కూతురు కాదన్న నిజం నందాకి తెలిసిపోయిందని, అంతేకాకుండా సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యే అన్న నిజం కూడా బయటపెడ్తానని నందా బెదిరిస్తున్నాడని చెబుతూ కమల బాధ పడుతుంటుంది. మా అక్కా చెల్లెళ్లకు ఏదో దరిద్రం పట్టినట్లుంది అందుకే మా తలరాత ఇలా అయ్యింది అంటూ కుమిలిపోతుంటుంది. నందా నిజ స్వరూపం తెలుసుకున్న భాషా అతడిని చావబాదుతుంటగా నేను సత్యకి కాబోయే భర్తను.. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని అంటూ నందా అమాయకుడిలా నటిస్తుంటాడు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన భాషా.. నీ బాగోతం ఏంటో తనకు తెలుసని అసలు నీ వెనకున్నది ఎవరో చెప్పాలని నందాని అడుతుతాడు. అయితే దీనికి ఆన్సర్ ఇవ్వక పోగా తనతో చేతులు కలిపితే లెక్కలేనంత డబ్బు ఇస్తానని నందా డీల్ మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దీంతో రుక్కు కోసం తాను ప్రాణాలు ఇస్తానని, అలాంటిది నీ బెదిరింపులకు లొంగనని చెప్పాడు. నిజం చెబుతా అని బెదిరిస్తున్నావ్ కదా అసలు నిన్నే లేకుండా చేస్తే నిజం ఎలా చెబుతావంటూ నందాని బాష కత్తితో పొడిచాడు. అయితే ఇదంతా నిజం కాదు. కేవలం కల మాత్రమే. తనకు వచ్చిన పీడకలతో గట్టిగా అరుస్తుంది కమల. దీంతో ఏమైందని భాగ్యమ్మ అడిగినా జవాబు చెప్పకుండా దాటవేస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే నందా పెడుతున్న టాచ్చర్ నుంచి కొన్ని రోజులు తప్పించుకోవాలని, తన ఇంటికెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుందని సత్య ఆలోచిస్తుంటుంది. ఈలోగా నందా వచ్చి 'ఏంటీ అంత డీప్‌గా ఆలోచిస్తున్నావ్? నన్ను ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తున్నావా? అంతలా ఆలోచించకు దీనికి నీ మాజీ ప్రియుడు, మీ బావ ఆదిత్య వద్దే చాలా ప్లాన్స్ ఉంటాయ్ అంటూ' మాటలతో హింసిస్తుంటాడు.. ఇక ఓ అద్భుతం చూపిస్తానని, బయటకు రావాలంటూ సత్యని అడుగుతాడు. మరి ఆ ఆద్బుతం ఏంటి? సత్యని నందా ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు అన్నది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. -
నేను ఇండియన్నే.. క్షమించండి
లాస్ ఏజెంల్స్: నటి ప్రియాంక చోప్రా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో ప్రియాంక నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఎపిసోడ్లో భారతీయులను ఉగ్రవాదులుగా చూపటం, అందులో ఆమె నటించటంతో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. సోషల్ మీడియా వేదిక ఆమెను తిట్టిపోస్తూ పలువురు ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో సీరియల్ నిర్మాణ సంస్థ ఏబీసీ, నిర్మాతలు క్షమాపణలు తెలియజేయగా, తాజాగా ప్రియాంక స్పందించారు. ‘క్వాంటికో తాజా ఎపిసోడ్‌తో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఎవరినో కించపరచాలన్న ఉద్దేశం మాత్రం కాదు. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఓ భారతీయురాలిగా నేను ఎల్లప్పుడూ గర్వపడుతుంటా’ అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు. జూన్ 1న ప్రసారం అయిన ఎపిసోడ్లో ఇండియన్స్‌ను ఉగ్రవాదులుగా చూపించారు. ‘పాకిస్తాన్ ముసుగులో భారతీయులే న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో పేలుడుకు ప్రయత్నిస్తారని.. దానిని ఎఫ్‌బీఐ అధికారి హోదాలో ప్రియాంక చోప్రా అడ్డుకుంటుందనే కథాసారంతో తాజా ఏపిసోడ్‌ను చిత్రీకరించారు. హిందువులను ఉగ్రవాదులుగా చూపించటం, ఆ ఎపిసోడ్లో ఆమె నటించటంతో సోషల్ మీడియా వేదికగా ఆమె ట్రోలింగ్ ఎదుర్కున్నారు. I’m extremely saddened and sorry that some sentiments have been hurt by a recent episode of Quantico. That was not and would never be my intention. I sincerely apologise. I'm a proud Indian and that will never change. — PRIYANKA (@priyankachopra) 9 June 2018 -
పీతల ఎపిసోడ్ ఏం చెబుతోంది
సీన్-1: ఫ్లాష్‌బ్యాక్ సుమారు ఆరు నెలల క్రితం ఏలూరు ఆటోనగర్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణంను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయన ఇంటి వద్ద జరిగిన సీన్ అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. పొద్దుపోయాక వెళ్లిన పోలీసులకు టీడీపీ నేతలు అర్ధరాత్రి వరకు సినిమా చూపించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, పెద్దసంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హల్చల్ చేశారు. ఆయన అరెస్ట్‌ను అడ్డుకుని నానాయాగీ చేశారు. నాగభూషణం తెలుగుదేశం పార్టీ నాయకుడా అంటే.. కనీసం కార్యకర్త కూడా కాదు. పార్టీ సభ్యత్వమన్నా ఉందా అంటే.. అదీ ప్రశ్నార్థకమే. మరి టీడీపీ నేతలంతా కట్టకట్టుకుని ఎందుకు వెళ్లారంటే.. కేవలం సామాజికవర్గ కోణంలోనే అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. సీన్-2 : తాజా దృశ్యం నాలుగు రోజుల కిందట మంత్రి పీతల సుజాత ఇంటి వాకిట్లో నోట్ల కట్టలు బయటపడి ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో పార్టీపరంగా మద్దతిచ్చేందుకు ఏ ఒక్క నాయకుడూ ముందుకు రాలేదు. జరిగిన ఎపిసోడ్‌పై సెల్ఫ్‌గోల్ మాదిరిగా మంత్రి సుజాత స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కనీసం విచారణ పూర్తయ్యే వరకైనా ఆమెకు ఎవరూ మద్దతు పలకలేదు. విచారణ కొలిక్కి(?) వచ్చిన తర్వాత ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మార్కెట్ కమిటీ చైర్మన్ కె.రామ్ ప్రసాద్ మొహమాటానికి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కానీ.. టీడీపీలో బలమైన సామాజికవర్గ నేతలు మాత్రం ఇంతవరకు పెదవి విప్పలేదు. మద్దతు మాట దేవుడెరుగు ఆ ఘటన జరిగిన తర్వాత కనీసం అమెతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదని సీఎం చంద్రబాబు వేల్పూరులో పర్యటించిన సందర్భంలో బయటపడింది. ఎందుకీ వివక్ష? సుజాత పార్టీపరంగా జిల్లాకు చెందిన ఏకైక మంత్రి. పైగా దళిత వర్గానికి చెందిన మహిళ. అయినాసరే టీడీపీలో బలమైన వర్గ నేతలు ఆమెను ఎందుకు దూరంగా పెట్టారంటే.. కేవలం సామాజికవర్గ కోణంలోనే అన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో టీడీపీకి పెట్టని కోటగా నిలిచిన జిల్లానుంచి ఒకటి రెండు మంత్రి పదవులు తమకే వస్తాయని ఆ నేతలు భావించారు. అనూహ్యంగా సుజాత మంత్రి పదవి దక్కించుకున్నారు. పైగా ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉండే కీలకమైన గనుల శాఖను సొంతం చేసుకున్నారు. దీంతో అహం దెబ్బతిన్న ఆ వర్గ నేతలు ఆమెకు అన్నివిధాలా సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గంలో పెత్తనం చేయాలని చూశారు. తొలినాళ్లలో అందరితో కలిసి ముందుకు వెళ్లాలని చూసిన సుజాత.. సామాజికవర్గ పరిణామాలతో విసిగిపోయి కొన్నాళ్లుగా స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అన్ని వ్యవహారాలు చక్కబెట్టేందుకు ఏలూరులో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశారు. పార్టీలోని బడాబాబులకు చెక్‌పడుతూ తనదైన శైలిలో రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఆ బాబు వదిలినా.. ఈ ‘బాబు’లు వదులుతారా పార్టీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకుంటే చాలు. మధ్యలో వీళ్లంతా ఎందుకు అన్న ధోరణిలో మంత్రి వ్యవహారశైలి కొనసాగింది. చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఏకైక మార్గంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలే అస్త్రంగా ఎంచుకున్నారు. సందర్భం ఉన్నా.. లేకపోయినా వైఎస్సార్ సీపీపై నిప్పులు చెరగడంతో చంద్రబాబు వద్ద ఆమెకు ఎన్ని మార్కులు పడ్డాయో గానీ.. జిల్లాలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం సొంత పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలోనే సుజాత ప్రస్తావన వస్తేనే రగిలిపోతున్న టీడీపీ నేతలు అదును కోసం ఎదురుచూసి ట్రాప్ చేశారని అంటున్నారు. మంత్రి కోటరీలో అక్రమాలను పక్కా సాక్ష్యాలతో బయటపెట్టేందుకే నోట్ల కట్టల వ్యవహారాన్ని సెల్‌ఫోన్‌తో వీడియో తీశారని అంటున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి వ్యవహారంతో తలబొప్పి కట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీలో పార్టీ పరువు బజారున పడకూడదని మంత్రి సుజాతను కేసు నుంచి బయటపడేసినా వర్గ నేతలు మాత్రం ఆమెను ఎంతవరకు వదులుతారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. మరోపక్క దళిత నేతలు టీడీపీకి ఎంతకొమ్ముకాసినా ‘మా పరిస్థితి ఇంతేనా.. పార్టీలో అగ్రవర్ణాల మోచేతి కింద ఉండాల్సిందేనా. లేదంటే ఇలా ట్రాప్ చేసి నరకం చూపిస్తారా..’ అని ఆందోళన చెందుతున్నారు. పీతల సుజాత ఎపిసోడ్‌తో టీడీపీకి చెందిన దళిత నేతలు, కార్యకర్తల్లో నివురుగప్పిన నిప్పులా రాజుకున్న అసంతృప్తి ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు