నటి ప్రియాంక చోప్రా
లాస్ ఏజెంల్స్: నటి ప్రియాంక చోప్రా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో ప్రియాంక నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఎపిసోడ్‌లో భారతీయులను ఉగ్రవాదులుగా చూపటం, అందులో ఆమె నటించటంతో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. సోషల్ మీడియా వేదిక ఆమెను తిట్టిపోస్తూ పలువురు ట్రోలింగ్ చేశారు.
ఈ నేపథ్యంలో సీరియల్ నిర్మాణ సంస్థ ఏబీసీ, నిర్మాతలు క్షమాపణలు తెలియజేయగా, తాజాగా ప్రియాంక స్పందించారు. ‘క్వాంటికో తాజా ఎపిసోడ్‌తో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఎవరినో కించపరచాలన్న ఉద్దేశం మాత్రం కాదు. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఓ భారతీయురాలిగా నేను ఎల్లప్పుడూ గర్వపడుతుంటా’ అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు.
జూన్ 1న ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ఇండియన్స్‌ను ఉగ్రవాదులుగా చూపించారు. ‘పాకిస్తాన్ ముసుగులో భారతీయులే న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో పేలుడుకు ప్రయత్నిస్తారని.. దానిని ఎఫ్‌బీఐ అధికారి హోదాలో ప్రియాంక చోప్రా అడ్డుకుంటుందనే కథాసారంతో తాజా ఏపిసోడ్‌ను చిత్రీకరించారు. హిందువులను ఉగ్రవాదులుగా చూపించటం, ఆ ఎపిసోడ్‌లో ఆమె నటించటంతో సోషల్ మీడియా వేదికగా ఆమె ట్రోలింగ్ ఎదుర్కున్నారు.
I’m extremely saddened and sorry that some sentiments have been hurt by a recent episode of Quantico. That was not and would never be my intention. I sincerely apologise. I'm a proud Indian and that will never change.
— PRIYANKA (@priyankachopra) 9 June 2018
Comments
Please login to add a commentAdd a comment