మరీ ఇలాగా....! | Priyanka Chopra Won't Return To Join Ranveer-Deepika! | Sakshi
Sakshi News home page

మరీ ఇలాగా....!

Published Mon, Nov 23 2015 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

మరీ ఇలాగా....!

మరీ ఇలాగా....!

ప్రియాంకా చోప్రా నేషనల్ లెవెల్‌లో బెస్ట్ యాక్ట్రస్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి బాలీవుడ్‌లో నంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారామె. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతో పాటు గ్లామర్ వేషాలక్కూడా ఆమె వెనుకాడలేదు. టూ పీస్ బికినీలు, లిప్‌లాక్ సీన్స్‌లో కూడా ఆమె రెచ్చిపోయి నటించిన సినిమాలున్నాయి. అందుకే ప్రియాంకకు అటు క్లాస్‌లోనూ ఇటు మాస్‌లోనూ అభిమానులు ఉన్నారు.

అందుకే హాలీవుడ్ వాళ్లు తమ ‘ క్వాంటికో’ టీవీ సీరియల్ కోసం ప్రియాంకను ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉన్నా కూడా, హాలీవుడ్‌పై మక్కువతో ఆమె డేట్లు కేటాయించేశారు. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలనే సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్నట్టుగా ప్రియాంక, హాలీవుడ్ గ్లామర్ సిద్దాంతాన్ని బాగా ఫాలో అవుతూ రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.

‘క్యాంటికో’ సీరియల్ ప్రమోషన్ ట్రైలర్‌లోనే ఆమె కార్ సెక్స్ సీన్‌లో నటించి , ఇండియన్ ఆడియన్స్‌కి షాకిచ్చారు. ఆ తర్వాత బికినీ సీన్‌లో కూడా కనబడ్డారు. ఇప్పుడేమో షవర్ కింద తన కోస్టార్‌తో కలసి స్నానం చేస్తూ విపరీతమైన గ్లామర్ ఒలకబోశారు. ముద్దులకు ఏమాత్రం హద్దుల్లేవని నిరూపించారు. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్లు ప్రియాంక మరీ ఇంతలా రెచ్చిపోవడంపై ఆశ్చర్యచకితులవుతున్నారు. మున్ముందు ప్రియాంక ఇంకెన్ని హొయలు పోతారో వేచి చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement