Quantico TV serial
-
నేను ఇండియన్నే.. క్షమించండి
లాస్ ఏజెంల్స్: నటి ప్రియాంక చోప్రా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో ప్రియాంక నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఎపిసోడ్లో భారతీయులను ఉగ్రవాదులుగా చూపటం, అందులో ఆమె నటించటంతో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. సోషల్ మీడియా వేదిక ఆమెను తిట్టిపోస్తూ పలువురు ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో సీరియల్ నిర్మాణ సంస్థ ఏబీసీ, నిర్మాతలు క్షమాపణలు తెలియజేయగా, తాజాగా ప్రియాంక స్పందించారు. ‘క్వాంటికో తాజా ఎపిసోడ్‌తో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఎవరినో కించపరచాలన్న ఉద్దేశం మాత్రం కాదు. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఓ భారతీయురాలిగా నేను ఎల్లప్పుడూ గర్వపడుతుంటా’ అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు. జూన్ 1న ప్రసారం అయిన ఎపిసోడ్లో ఇండియన్స్‌ను ఉగ్రవాదులుగా చూపించారు. ‘పాకిస్తాన్ ముసుగులో భారతీయులే న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో పేలుడుకు ప్రయత్నిస్తారని.. దానిని ఎఫ్‌బీఐ అధికారి హోదాలో ప్రియాంక చోప్రా అడ్డుకుంటుందనే కథాసారంతో తాజా ఏపిసోడ్‌ను చిత్రీకరించారు. హిందువులను ఉగ్రవాదులుగా చూపించటం, ఆ ఎపిసోడ్లో ఆమె నటించటంతో సోషల్ మీడియా వేదికగా ఆమె ట్రోలింగ్ ఎదుర్కున్నారు. I’m extremely saddened and sorry that some sentiments have been hurt by a recent episode of Quantico. That was not and would never be my intention. I sincerely apologise. I'm a proud Indian and that will never change. — PRIYANKA (@priyankachopra) 9 June 2018 -
ఊహించని వివాదం
హాలీవుడ్ చిత్రాలు, టీవీ సీరియళ్ల కోసం గత రెండున్నరేళ్లుగా విదేశాల్లో ఉంటున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆఖరి నిముషంలో అప్రతిష్టను మూటగట్టుకుని భారత్‌కు బయల్దేరి వస్తున్నారు! అమెరికన్ టెలివిజన్ డ్రామా థ్రిల్లర్ ‘క్వాంటికో’లో సి.ఐ.ఎ ఏజెంటుగా నటిస్తున్న ప్రియాంకను ఆ సీరీస్ తాజా ఎపిసోడ్ ‘ది బ్లడ్ ఆఫ్ రోమియో’లోని ఒక సన్నివేశం ఆమె ఊహించని విధంగా ‘దేశద్రోహి’గా నిలబెట్టింది! న్యూయార్క్‌పై అణ్వాయుధ దాడి చేయబోతున్న ఒక పాకిస్తానీ.. ప్రియాంకకు పట్టుబడినప్పుడు ఆ ఉగ్రవాది మెడలో రుద్రాక్షమాల బయటపడుతుంది! దర్యాప్తులో అతడొక దారితప్పిన భారతీయ ప్రొఫెసర్ అని తేలుతుంది. అయితే ఈ సన్నివేశంలో నటించడం ద్వారా ప్రియాంక.. భారతీయుల మనోభావాలను దెబ్బతీశారని, భారతీయులంటే ఉగ్రవాదుల అన్న భావన ప్రపంచ దేశాల్లో కలగడానికి ఆమె కారణం అయ్యారని జాతీయవాదులు మండిపడుతున్నారు. ‘‘భారతీయుల అభిమానం వల్ల స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు భారతీయులనే అవమానిస్తున్నావా ప్రియాంకా..?’’ అని ట్వీట్లు కూడా మొదలయ్యాయి. ఆన్లైన్లో ఈ నిరసనలు, ఆగ్రహ జ్వాలలు ‘క్వాంటికో’ను ప్రసారం చేస్తున్న ఎ.బి.సి.కి (అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ) తాకడంతో డిస్నీ నెట్వర్క్ సంస్థ అయిన ఎ.బి.సి. వెంటనే భారతీయులను క్షమాపణ కోరుతూ ‘వాషింగ్టన్ పోస్టు’కు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రధానంగా ప్రియాంక నిర్దోషి అని చెప్పడానికే ఎ.బి.సి. ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది. ‘‘ఆ సన్నివేశానికి మనసు నొచ్చుకున్న మా వీక్షకులకు మా స్టూడియోతో పాటు, ‘క్వాంటికో’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్లూ క్షమాపణ కోరుతున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాలన్న ఆలోచన ప్రియాంకది కాదు. స్క్రిప్టు, డైరెక్షన్ కూడా ఆమెవి కావు. స్టోరీ లైన్లో కానీ, క్యాస్టింగ్‌లో కానీ ఆమె ప్రమేయం లేదు. పూర్తిగా కల్పితం అయిన ఈ సీరీస్‌లోని సన్నివేశంలో అనుకోకుండా ఇలా కొందరి మనసులు గాయపడ్డాయి’’ అని ఎ.బి.సి. క్షమాపణతో పాటు, వివరణ కూడా ఇచ్చింది. లో రేటింగ్స్ రావడంతో ఇటీవల కొంతకాలం ‘క్వాంటికో’ ఆగి, మొదలైంది. త్వరలో ముగియబోతోంది కూడా. దాంతో జూౖలñ లో షూటింగ్ మొదలు కాబోతున్న ‘భరత్’ చిత్రం (సల్మాన్‌ఖాన్ హీరో)లో హీరోయిన్గా నటించడానికి ప్రియాంక ఇండియా బయల్దేరబోతుండగా ఈ వివాదం చుట్టుకుంది. -
మరీ ఇలాగా....!
ప్రియాంకా చోప్రా నేషనల్ లెవెల్లో బెస్ట్ యాక్ట్రస్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి బాలీవుడ్లో నంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారామె. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతో పాటు గ్లామర్ వేషాలక్కూడా ఆమె వెనుకాడలేదు. టూ పీస్ బికినీలు, లిప్‌లాక్ సీన్స్‌లో కూడా ఆమె రెచ్చిపోయి నటించిన సినిమాలున్నాయి. అందుకే ప్రియాంకకు అటు క్లాస్‌లోనూ ఇటు మాస్‌లోనూ అభిమానులు ఉన్నారు. అందుకే హాలీవుడ్ వాళ్లు తమ ‘ క్వాంటికో’ టీవీ సీరియల్ కోసం ప్రియాంకను ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్లో చాలా బిజీగా ఉన్నా కూడా, హాలీవుడ్‌పై మక్కువతో ఆమె డేట్లు కేటాయించేశారు. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలనే సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్నట్టుగా ప్రియాంక, హాలీవుడ్ గ్లామర్ సిద్దాంతాన్ని బాగా ఫాలో అవుతూ రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు. ‘క్యాంటికో’ సీరియల్ ప్రమోషన్ ట్రైలర్లోనే ఆమె కార్ సెక్స్ సీన్లో నటించి , ఇండియన్ ఆడియన్స్‌కి షాకిచ్చారు. ఆ తర్వాత బికినీ సీన్లో కూడా కనబడ్డారు. ఇప్పుడేమో షవర్ కింద తన కోస్టార్‌తో కలసి స్నానం చేస్తూ విపరీతమైన గ్లామర్ ఒలకబోశారు. ముద్దులకు ఏమాత్రం హద్దుల్లేవని నిరూపించారు. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్లు ప్రియాంక మరీ ఇంతలా రెచ్చిపోవడంపై ఆశ్చర్యచకితులవుతున్నారు. మున్ముందు ప్రియాంక ఇంకెన్ని హొయలు పోతారో వేచి చూడాల్సిందే!