liplock Scenes
-
లిప్‌లాక్‌కు రెడీ!
ఈతరం కథానాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనతో ఉన్నారు. అవకాశాలు వచ్చేవరకు వాటి కోసం తంటాలు పడుతున్నారు. అవకాశాలు వస్తుంటే పారితోషకాలు పెంచే ఆలోచనలో ఉంటున్నారు. పైకి మాత్రం పాత్రలు నచ్చితేనే అంగీకరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎలాంటిదైనా వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. చాలామంది హీరోయిన్లది ఇదే తంతు. అనుపమ పరమేశ్వరన్ కూడా ఇందుకు అతీతం కాదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా పరిచయమైన నటి బ్యూటీ. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో వరుసగా అవకాశాలు రావడంతో బిజీగా మారారు. అయితే ఆరంభంలో మంచి కుటుంబ కథా చిత్రాల్లో నటించి పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకున్నారు. అలా తెలుగులో కార్తికేయ 2 చిత్రం వరకు అనుపమ పరమేశ్వరన్ తన పక్కింటి అమ్మాయి ఇమేజ్ను కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో అందాల ఆరిబోతకు గేట్లు ఎత్తేశారు. అలా ఇటీవల ఈమె టిల్లు స్క్వేర్ చిత్రంలో అందాలారబోతలో విజృంభించేశారు. ఇక లిప్‌లాక్ సన్నివేశాల్లోనూ రక్తి కట్టించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిర్మాతకు అనుపమ పరమేశ్వరన్ గట్టిగానే షాక్ ఇచ్చారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒక చిత్రంలో కథానాయకగా నటించడానికి నిర్మాత అనుపమ పరమేశ్వరన్‌ను సంప్రదించగా, కనీసం కథ కూడా వినకుండా. పాత్ర ఎలాంటిదైనా సరే పారితోషికం మాత్రం కోటి కావాలంటూ డిమాండ్ చేశారట. దీంతో నిర్మాత అక్కడి నుంచి తిరుగు ముఖం పట్టారు. అనుపమాకు తెలుగులో హిట్ చిత్రాలు ఉన్నాయి, కానీ తమిళనాడు మాత్రం ఇంకా మంచి సక్సెస్ కోసం పోరాడుతున్న నటినే. అలాంటి నటి కోటి పారితోషికం డిమాండ్ చేస్తే ఏ నిర్మాత అయినా చేసే పని ఇదే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. -
కథ డిమాండ్ చేస్తే అందుకు ఒకే!
సినిమానూ గ్లామర్‌నూ వేరు చేయలేం. ఇక హీరోయిన్ల నుంచి గ్లామర్‌ను ఆశించకుండా ఉండలేం. కాబట్టి ఏ నటితో చిట్‌చాట్ చేసినా, గ్లామర్ గురించి ప్రశ్న తలెత్తకుండా ఉండదు. అలాంటి ప్రశ్నకు నటి సుభిక్షకృష్ణన్ ఏం చెప్పారో చూదాం. అన్నక్కొడి చిత్రం ద్వారా భారతీరాజా పరిచయం చేసిన కన్నడ బ్యూటీ ఈ నటి. ఆ తరువాత గోలీసోడా 2, కన్నై నమ్మాదే, చంద్రముఖి 2 వంటి పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంతోపాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ బిజీగానే ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్‌గా ఉండే సుభిక్ష తన అందాలను కాపాడుకోవడానికి ఎక్కువగా జిమ్‌లోనే గడుపుతారు. కాగా ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ తనకు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, ఆంగ్లం తదితర ఐదు భాషలు తెలుసని చెప్పారు. భాష తెలియకుండా ఆయా చిత్రాల్లో నటించడం తనకు నచ్చదన్నారు. అందుకే ఇన్ని భాషలు నేర్చుకున్నట్లు చెప్పారు. సినిమా నటి అనగానే వదంతులు హల్చల్ చేస్తాయిగా, వాటిని ఎలా ఎ దుర్కొంటారు? అన్న ప్రశ్నకు సినిమా రంగం చాలా రక్షణ నిచ్చే రంగం అని పేర్కొన్నారు. ఇక్కడ సినిమా ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకూ చాలా కేర్‌గా చూసుకుంటారని, పారితోషికంతో పాటు సకల మర్యాదలు అందిస్తారని అన్నారు. అలాంటి సినిమా రంగంపై ఆరోపణలు చేయడం తప్పనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటి మీనాకు కళ్లు అందం, నటి రంభకు తొడలందం, సిమ్రాన్‌కు నడుమందం, మీలో ఏమి అందం అన్న ప్రశ్నకు తన ముఖారవిందం అని ఠక్కున చెప్పారు. అందరూ తన గురించి ఇదే చెబుతా రని అన్నారు. సినిమాల్లో గ్లామరస్‌గా నటించడం, లిప్‌లాక్ సన్ని వేశాలు తప్పనిసరి అని, అందుకు మీరు ఓకేనా? అన్న ప్రశ్నకు తాను కచ్చితంగా మోడరన్‌గా నటిస్తానని, ఇక కథ డిమాండ్ చేస్తే గ్లామరస్‌గానూ, లిప్‌లాక్ సన్నివేశాల్లోనూ నటించడానికి సిద్ధమేనని చెప్పారు. అయితే తనకు చెప్పిన కథను అలానే తెరపై ఆవిష్కరిస్తేనే గ్లామరస్‌గా నటించడానికి తాను తయార్ అని అన్నారు. గ్లామర్‌ను ఒక ఊరగాయలా వాడుకోవడం, అనవసరంగా చిత్రంలో జొప్పించడం వంటివి సమ్మతించనన్నారు. మీకు నచ్చిన హీరో ఎవరన్న ప్రశ్నకు నటుడు శింబు అని ఠక్కున చెప్పారు. ఆయన అంటే పిచ్చి అభిమానం అన్నారు. శింబు సరసన నటించాలని ఆశగా ఉందన్నారు. ఆయన నటన, శ్రమ తనను ఆశ్చర్యపరుస్తాయన్నారు. గోలీసోడా 2 చిత్రంలో తన నటనను తొలుత ప్రశంసించింది ఆయనేనని, అది తనకు జీవిత సాఫల్య అవార్డులాంటిదని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ అభినందనలను ఎప్పటికీ మరచిపోనని నటి సుభిక్ష కృష్ణన్ అన్నారు. -
87 ఏళ్ల వయసులో లిప్‌లాక్ సీన్.. అవసరమే అంటున్న నటుడు
నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు.. ఏమని చెప్పగలం? అన్నింటిలోనూ ఒక అడుగు ముందే ఉంటాడు ధర్మేంద్ర. ఆరు దశాబ్ధాలుగా బాలీవుడ్లో తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్న ఈయన ఇప్పటివరకు 300కు పైగా చిత్రాలు చేశాడు. ఇప్పటికీ వెండితెరపై తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న ఈయన తాజాగా రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలో నటించాడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న విడుదలైంది. ఈ మూవీలో ధర్మేంద్ర, అలనాటి నటి షబానా అజ్మీ.. లిప్‌లాక్ సీన్లో నటించారు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. 87 ఏళ్ల వయసులో ముద్దు సన్నివేశంలో నటించడమేంట్రా బాబూ అని ఆశ్చర్యపోయారు. కొందరైతే ముసలాడికి దసరా పండగలా ఉంది.. అస్సలు బాగోలేదు అని విమర్శించారు. తాజాగా ఈ సన్నివేశంపై ధర్మేంద్ర స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నేను, షబానా కిస్ సీన్‌తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసినట్లున్నాం. చాలామంది ఈ సీన్ చూసి చప్పట్లు కూడా కొట్టినట్లున్నారు. మా నుంచి జనాలిది అస్సలు ఊహించి ఉండరు కదా! అందుకే దీనికింతలా రెస్పాన్స్ వస్తోంది. నేను ఇంతకుముందు చివరిసారిగా లైఫ్ ఇన్ ఎ మెట్రో అనే సినిమాలో నఫీసా అలీతో ముద్దు సన్నివేశంలో నటించాను. అప్పుడు కూడా జనాలు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో మా ముద్దు సన్నివేశం గురించి డైరెక్టర్ కరణ్ జోహార్ మాకు ముందే చెప్పాడు. అప్పుడు నేనేమీ అంత సర్ప్రైజ్ అవలేదు. ఈ సినిమాకు అది అవసరం అనిపించింది. అందుకే నేను చేస్తానని చెప్పాను. అయినా రొమాన్స్‌కు వయసుతో పనేంటి? వయసు అనేది కేవలం నెంబర్స్ మాత్రమే సూచిస్తాయి. ఏ వయసు వాళ్లైనా ఇద్దరి మధ్య ప్రేమను ముద్దు ద్వారానే బయటపెడతారు. ఈ సీన్లో నటించేటప్పుడు నేను, షబానా ఏమాత్రం ఇబ్బందిగా ఫీలవలేదు' అని చెప్పుకొచ్చాడు ధర్మేంద్ర. చదవండి: ప్రేమకో దండం.. బ్రేకప్ చెప్పిన రీతూ వర్మ ఆ సినిమాకు రూ.250 కోట్లా? దాన్నెవరు చూస్తారు?: కంగనా -
రొమాన్స్‌కు వయసుతో పనేంటి?.. ట్రోల్స్‌పై హీరో స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ జంటగా నటించిన చిత్రం టిక్కు వెడ్స్ షేరు. ఈ చిత్రానికి సాయి కబీర్ దర్శకత్వం వహించగా.. కంగనా రనౌత్ నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ట్రైలర్లో హీరోయిన్ను నవాజుద్దీన్ కిస్ చేయడంపై విమర్శలొచ్చాయి. 50 ఏళ్ల నటుడితో 21 ఏళ్ల అమ్మాయికి రొమాంటిక్ సీన్స్ ఏంటని కొందరు ట్రోల్స్ చేశారు. తాజాగా ఆ సీన్‌పై వస్తున్న విమర్శలకు నవాజుద్దీన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవాజుద్దీన్ విమర్శలపై స్పందించారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి! ) నవాజుద్దీన్ మాట్లాడుతూ..'హీరో, హీరోయిన్లకి ఏజ్ గ్యాప్ అనేది పెద్ద సమస్య కాదు. రొమాన్స్‌కు వయసుతో సంబంధం లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్ రోల్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలు పనికిరాని వారు కాబట్టే. వారికేదో రొమాన్సే తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లవ్, బ్రేకప్ అన్నీ వాట్సాప్‌లోనే జరుగుతున్నాయి. దీని వెనుక ఓ కారణం ఉంది. జీవితంలో రొమాన్స్ ఎవరైతే చేస్తారో.. వాళ్లు మాత్రమే ఇలాంటి సీన్స్ చేయగలరు.' అని కాస్తా గట్టిగానే కౌంటరిచ్చారు. కాగా.. టికు వెడ్స్ షేరు మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23న విడుదల కానుంది. నవాజుద్దీన్ ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సైంధవ్‌లో విలన్‌గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వికాస్ మాలిక్‌గా కనిపించనున్నారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్ సంచలన నిర్ణయం.!) -
షూటింగ్‌కు ముందే హీరోతో లిప్‌లాక్ చేసిన హీరోయిన్
కోలీవుడ్‌లో మంచి స్థానం కోసం పోరాడుతున్న నటీమణులలో స్మృతి వెంకట్ ఒకరు. మొదట్లో హీరోలకు సిస్టర్ పాత్రలో నటిస్తూ వచ్చిన ఈమె ఇప్పుడు కథానాయికగా నటించే స్థాయికి ఎదిగింది. దీంతో సాదాసీదాగా నటిస్తే ప్రయోజనం ఉండదని గ్రహించిందేమో, అందాలారబోతతోనే కాకుండా ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాలకు సిద్ధమైపోయింది. అదీ చిత్ర షూటింగ్‌కు ముందే ఆ చిత్ర హీరోతో ఘాటు చుంబనానికి రెడీ అయిపోయారు. దీంతో మూవీ లోకేషన్‌లోని వారు ఆశ్చర్యానికి గురయ్యారట. (ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్) ఇంతకుముందు 'దేజావు' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు అరవింద్ శ్రీనివాసన్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం తరుణం. ఈ చిత్రంలో కిషన్‌దాస్ కథానాయకుడుగాను, స్మృతి వెంకట్ నాయకిగానూ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే అంతకుముందే ఒక టీజర్‌ను చిత్రీకరించి విడుదల చేశారు. అందులో స్మృతి వెంకట్, కిషన్దాస్తో లిప్‌లాక్ సన్నివేశంతో కూడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీంతో నెటిజనుల స్మృతి వెంకట్‌పై రకరకాల సైటెర్లు వేస్తున్నారు. టీజర్లోనే ఇంత ఘాటు చుంబనాల సన్నివేశం ఉంటే ఇంకా మెయిన్ పిక్చర్ ఎలా ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద దర్శకుడు టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేశారు. (ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్) -
అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట!
ప్రస్తుత సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య ఇంటిమేట్, లిప్ లాక్ సీన్స్ సాధారణం అయిపోయాయి. కానీ 80, 90లో మాత్రం ఇలాంటి సన్నివేశం అంటే సంచలనం. హీరోహీరోయిన్ల మధ్య ఇలాంటి సన్నివేశాలు ఉంటే చాలు దానిపై విపరీతమైన చర్చ జరిగేది. ఎక్కడికి వెళ్లిన ఆ నటీనటులకు దీనిపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉండేవి. టీవీల్లో, వార్తల్లో ఎక్కడ చూసిన దీనిపైనే రచ్చ. అలా ఇప్పటికీ తాను చేసిన లిప్‌లాక్ సీన్‌పై ప్రశ్నలకు ఎదుర్కొంటూనే ఉంటుంది అలనాటి బ్యూటీ క్వీన్, సీనియర్ హీరోయిన్ మాధురీ ధీక్షిత్. చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే.. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్, కానీ అవసరం లేకున్నా ఓ సినిమాలో హీరోతో డీప్ లిప్‌లాక్ సీన్ చేసి వార్తల్లోకి ఎక్కింది. అప్పుట్లో దీనిపై పెద్ద రచ్చే జరిగిందట. అసలు మాధురీ ఆ సన్నివేశం ఎందుకు చేసింది? తనకు అంత అవసరం ఏమొచ్చిందని అంతా చర్చించుకున్నారట. అయితే ఈ సీన్ కోసం మాధురీ కోటి రూపాయల పారితోషికం తీసుకున్న అంశం అప్పట్లో బచర్చనీయాంశమైంది. అంతేకాదు అంత్యంత విలువైన ముద్దు ఏదంటే మాధురిది అనేంతగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. డబ్బు కోసం ఇంత దిగజారాలా! అని ఫ్యాన్స్ సైతం ఆమెను విమర్శించారట. ఇక అసలు విషయానికొస్తే.. బాలీవుడ్ దర్శకుడు ఫిరోజ్ ఖాన్ డైరెక్షన్లో 1988లో విడుదలైన ‘దయావన్’ చిత్రంలో వినోద్ ఖన్నా-మాధురీ దీక్షిత్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: లవ్‌టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! ట్వీట్‌కి లైక్ కొడతావా? అంటూ ఫైర్ ఇందులో అవసరం లేకున్నా హీరోహీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సీన్‌తో పాటు లిప్‌కిస్ పెట్టారట. అయితే మొదట మాధురీ చేయనని చెప్పడంతో దర్శక-నిర్మాతలు ఆమెకు కోటీ రూపాయలు ఆఫర్ చేశారట. దీంతో ఆమె అయిష్టంగానే ఒకే చేప్పిందని సమాచారం. ఇక రీసెంట్గా ఓ మూవీ ఈవెంట్లో మీడియా నుంచి మాధురీకి ఈ లిప్‌కిస్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు. ఇంపార్టెంట్ కాకపోయినా సరే ఆ సీన్ పెట్టారనిపిస్తుంది. నేను దానికి నో చెప్పి ఉండాల్సింది’ అని వివరణ ఇచ్చింది. దీంతో 35 ఏళ్ల నాటి ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. -
ఆ ఒక్కటి తప్ప..
సినిమా: ఈ తరం హీరోయిన్లు అందాలారబోతకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. లిప్‌లాక్ సన్నివేశాల్తోనూ నటించడంలో తప్పేంటి అంటున్నారు. ఇక నటి తమన్నా విషయానికి వస్తే, ఈ అమ్మడు పూర్తిగా గ్లామర్‌నే నమ్ముకుని వచ్చింది. తొలుత హిందీలో ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ల్లోనే అవకాశాలు వరుసకట్టడంతో దక్షిణాది పరిశ్రమనే ఆశాజనకంగా ఉండడంతో ఇక్కడి చిత్రాలపైపే దృష్టి సారించింది. మొదటి నుంచి గ్లామర్‌నే నమ్ముకున్న ఈ గుజరాతీ బ్యూటీ దానితోనే స్టార్ హీరోయిన్ అంతస్తుకు ఎదిగింది. అలాంటిది బాహుబలి చిత్రంలో వీరనారి అవంతిక పాత్రలో చాలా మంచి అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. అయినాగానీ ఆ తరువాత అలాంటి నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు ఈ అమ్మడిని వరించలేదు. దీంతో తన గ్లామర్ పంథాలోనే పయనిస్తోంది. అలాంటిది ఇటీవల ఒక భారీ చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించాలనే ఆఫర్ వచ్చిందట. అందుకు అదనంగా పారితోషికాన్ని కూడా చెల్లించడానికి నిర్మాతలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే అందాలారబోతకు ఎంత దాకా అయినా వెళ్లడానికి రెడీ, ఈత దుస్తులు ధరించడానికీ రెడీ, కానీ లిప్‌లాక్ సన్నివేశాల్లో పారితోషికం ఎంత ఇస్తానన్నా నటించనని ఖరాఖండీగా చెప్పేసిందట. కొందరు నటీమణులు ముద్దు సన్నివేశాలే కాదు, నగ్న సన్నివేశాల్లోనూ నటించడానికి రెడీ అని గేట్లెత్తేస్తుంటే తమన్నా మాత్రం ఆ ఒక్కటీ తప్ప అనడం సినీ వర్గాలను విస్మయం పరుస్తున్నా, ఆమె అభిమానులు మాత్రం ప్రశంసిస్తున్నారట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చారిత్రక కథా చిత్రం సైరా నరసింహారెడ్డిలో చిరంజీవికి జంటగా నయనతార నటిస్తున్నా, తమన్నా కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రపై మిల్కీబ్యూటీ చాలా ఆశలు పెట్టుకుంది. బాహుబలి చిత్రానికి ముందు, ఆ తరువాత కూడా గ్లామర్ పాత్రల్లోనే నటించాల్సి వస్తున్న తమన్నాకు సైరా చిత్రంలో మరోసారి నటనకు అవకాశం ఉన్న పాత్ర అట. దీంతో బాహుబలి చిత్రంలో ఎంత పేరు వచ్చిందో, సైరారోనూ అంత మంచి పేరు వస్తుందనే నమ్మకంతో ఉంది. ఈ చిత్రం తనకు రెట్టింపు సంతోషాన్ని కలిగించిందని, సైరాలో నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించడం సంతోషం అయితే నయనతారతో కలిసి నటించడం రెట్టింపు సంతోషం అని తమన్నా పేర్కొంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో సుందర్.సీ దర్శకత్వంలో విశాల్‌కు జంటగా నటిస్తోంది. -
షరతులు వర్తిస్తాయి!
‘మేం చెప్పినట్లు చేయాల్సిందే. కాదు కూడదంటే సినిమా వదులుకోవాల్సిందే’... బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చే నటీనటులకు ఇలాంటి కండీషన్స్ ఉంటాయి. స్టార్ అయ్యాక సీన్ రివర్స్ అవుతుంది. సినిమా ఒప్పుకునే ముందు ‘ఇలాంటివి చేయం’ అని వీళ్లే కండీషన్లు పెడతారు. ప్రస్తుతం నయనతార ఆ స్థాయిలోనే ఉన్నారు. ఈ మధ్య తెలుగు సినిమాలు తగ్గించేసి, వరుసగా తమిళ సినిమాలు ఒప్పు కుంటున్నారు ఈ మలయాళ బ్యూటీ. అది కూడా తన కండీషన్లకు ఒప్పుకునే దర్శక– నిర్మాతలతోనే సినిమాలు చేస్తున్నారామె. ‘సినిమాలో నటిస్తా కానీ, ప్రచార కార్యక్రమాలకు పిలవొద్దు’ అని ఎప్పుడో కండీషన్ పెట్టారు. అందుకే ప్రచార కార్యక్రమాల్లో ఆమె కనిపించరు. తాజాగా మూడు నిబంధనలు పెట్టారట. వాటికి సమ్మతించినవాళ్లకే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని చెన్నై టాక్. ఆ మూడు నిబంధనల విషయానికొస్తే.. లిప్ లాక్ సీన్స్‌లో నటించనన్నది మొదటి కండీషన్, స్నానం చేసే సీన్స్‌కి నో అన్నది రెండోది, చిట్టిపొట్టి దుస్తులు వేసుకోనన్నది మూడో కండీషన్. కథ వినే ముందే నయనతార ఈ నిబంధనలను చెప్పేస్తున్నారట. స్టార్ హీరోయిన్ పెట్టే షరతులను కాదంటారా? అందుకే చిత్తం అని దర్శక–నిర్మాతలు అంటున్నారట. -
మరీ ఇలాగా....!
ప్రియాంకా చోప్రా నేషనల్ లెవెల్లో బెస్ట్ యాక్ట్రస్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి బాలీవుడ్లో నంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారామె. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతో పాటు గ్లామర్ వేషాలక్కూడా ఆమె వెనుకాడలేదు. టూ పీస్ బికినీలు, లిప్‌లాక్ సీన్స్‌లో కూడా ఆమె రెచ్చిపోయి నటించిన సినిమాలున్నాయి. అందుకే ప్రియాంకకు అటు క్లాస్‌లోనూ ఇటు మాస్‌లోనూ అభిమానులు ఉన్నారు. అందుకే హాలీవుడ్ వాళ్లు తమ ‘ క్వాంటికో’ టీవీ సీరియల్ కోసం ప్రియాంకను ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్లో చాలా బిజీగా ఉన్నా కూడా, హాలీవుడ్‌పై మక్కువతో ఆమె డేట్లు కేటాయించేశారు. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలనే సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్నట్టుగా ప్రియాంక, హాలీవుడ్ గ్లామర్ సిద్దాంతాన్ని బాగా ఫాలో అవుతూ రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు. ‘క్యాంటికో’ సీరియల్ ప్రమోషన్ ట్రైలర్లోనే ఆమె కార్ సెక్స్ సీన్లో నటించి , ఇండియన్ ఆడియన్స్‌కి షాకిచ్చారు. ఆ తర్వాత బికినీ సీన్లో కూడా కనబడ్డారు. ఇప్పుడేమో షవర్ కింద తన కోస్టార్‌తో కలసి స్నానం చేస్తూ విపరీతమైన గ్లామర్ ఒలకబోశారు. ముద్దులకు ఏమాత్రం హద్దుల్లేవని నిరూపించారు. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్లు ప్రియాంక మరీ ఇంతలా రెచ్చిపోవడంపై ఆశ్చర్యచకితులవుతున్నారు. మున్ముందు ప్రియాంక ఇంకెన్ని హొయలు పోతారో వేచి చూడాల్సిందే! -
లిప్‌లాక్ సీన్లో నెర్వస్‌గా ఫీలయ్యా!
‘కిక్-2’లో తన మనసుకి నచ్చిన పాత్ర చేశానని, అభిమానులందరూ ఈ పాత్ర గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారని రకుల్ ప్రీత్‌సింగ్ చెప్పారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విషయాలు. ► రవితేజతో వర్క్ చేయడం సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ఆయన తెరపై ఎంత ఎనర్జిటిగ్గా ఉంటారో, బయటా అలానే ఉంటారు. ► ఇందులో లిప్‌లాక్ సీన్ చేసేటప్పుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. కథకు అవసరం కాబట్టి ఆ సీన్‌ని వల్గారిటీ లేకుండా బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. ► హీరో కల్యాణ్‌రామ్ నిర్మించిన ఇంత భారీ బడ్జెట్ సినిమాలో నేనూ ఉన్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. కల్యాణ్‌రామ్ సరసన నటించే అవకాశం వస్తే వదులుకోను. ► ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నా. ఎన్టీఆర్‌తో సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, రామ్‌చరణ్‌తో శ్రీను వైట్ల డెరైక్షన్‌లో మరో సినిమా, బన్నీ-బోయపాటి కాంబినేషన్లో ఇంకో చిత్రం చేస్తున్నాను. ఇంకా కొత్తవేవీ కమిట్ కాలేదు. -
లిప్‌కిస్‌కు ఓకే
పెదవి ముద్దుకైనా, ఈత దుస్తులకయినా రెడీ అంటోంది వర్ధమాన తార అక్షర హాసన్. ఈ బ్యూటీ నేపథ్యం గురించి కొత్తగా ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు. నటనకు నడకలు నేర్పిన కుటుంబం నుంచి వచ్చింది అక్షర. విశ్వనాయకుడు కమలహాసన్ వారసురాలు అక్షర అక్క శ్రుతిహాసన్ ఇప్పటికే నాయకిగా దూసుకుపోతున్నారు. హీరోయిన్ పాత్రల్లో శ్రుతిమించిన రొమాన్స్, ఐటమ్ సాంగ్స్ అంటూ ఎడాపెడా నటించేస్తున్నారు. అక్షర కూడా అక్కబాటలోనే పయనించడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. తొలి చిత్రం షమితాబ్ (హిందీ)లో చక్కని పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నారు. అమితాబ్ లాంటి లెజెండ్, ధనుష్ లాంటి అనుభవజ్ఞుడైన నటులు మధ్య పరిచయ నటిగా మెప్పించడం అంత సులభమైన పని కాదు. అయితే అక్షర తన పాత్రను సమర్థవంతంగా పోషించి ప్రశంసలు అందుకుంటున్నారు. షమితాబ్ చిత్రం షూటింగ్ దశలోనే అక్షరకు పలు అవకాశాలు వచ్చినా తొలి చిత్రం విడుదల అనంతరమే అంగీకరిస్తానంటూ చెప్పుకుంటూ వస్తున్నారట. మరి ఇప్పుడెలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అక్క మాదిరిగా గ్లామర్ పాత్రలు పోషిస్తారా? అన్న ప్రశ్నలకు అక్షర బదులిస్తూ అవార్డు కోసం నటించాలన్న ఆశ లేదన్నారు. కమర్షియల్ కథా నాయకిగానే ఎదగాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. కథ డిమాండ్ చేస్తే ఈత దుస్తులు ధరించడానికైనా, లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి కైనా రెడీ అంటూ కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడించారు. -
విక్రమ్‌తో ప్రియా ఆనంద్
సియాన్ విక్రమ్ సరసన నటించే లక్కీ చాన్స్‌ను నటి ప్రియా ఆనంద్ కొట్టేసింది. ఈ చిత్రంలో విక్రమ్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్ధం అని కూడా ఈ అమ్మడు చెప్పిందట. తొలిరోజుల్లో ఐరన్‌లెగ్ హీరోయిన్గా ముద్రపడిన ఈ బ్యూటీ శ్రీదేవితో కలిసి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత శివకార్తికేయన్‌తో జత కట్టిన ఎదిర్‌నీచ్చల్ చిత్రం కోలీవుడ్‌లో సక్సెస్ రుచి చూపించింది. ఆ తరువాత వణక్కం చెన్నై, అరిమానంబి వంటి చిత్రాలు ఈ ముద్దుగుమ్మ స్థాయిని పెంచుకుంటూ వచ్చాయి. ప్రస్తుతం విమల్‌కు జంటగా ఒరు ఊర్ల రెండు రాజా చిత్రంలో నటించింది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. కాగా అరిమానంబి చిత్రంలో మద్యం తాగి హీరోతో పోటీ పడిన ప్రియా ఆనంద్ పలువురి విమర్శలకు గురైంది. అయినా వాటిని లెక్క చేయకుండా మద్యాన్ని మగవారు తాగితే ఒప్పు, ఆడవారు సేవిస్తే తప్పా? అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. అయినా అమ్మడికి కోలీవుడ్‌లో అవకాశాలు రావడం విశేషం. నటుడు విక్రమ్ నటించనున్న నూతన చిత్రంలో నటించే అవకాశం ప్రియా ఆనంద్‌కు వరించింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. అందాలారబోయడానికి ఏ మాత్రం వెనుకాడని ప్రియా ఆనంద్ అవసరం అయితే హీరో విక్రమ్‌తో లిప్‌లాక్ సన్నివేశాలలో నటించడానికి సిద్ధమేనని కథ వినిపించడానికి వచ్చిన దర్శకుడితో చెప్పిందట. పెద్ద హీరోతో నటించే అవకాశం ఎక్కడ జారిపోతుందోనన్న ముందుచూపుతోనే ప్రియా ఆనంద్ లిప్‌లాక్ ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది.