లిప్‌కిస్‌కు ఓకే | Akshara Haasan ready for Bikini and Liplocks | Sakshi
Sakshi News home page

లిప్‌కిస్‌కు ఓకే

Published Thu, Feb 12 2015 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

లిప్‌కిస్‌కు ఓకే

లిప్‌కిస్‌కు ఓకే

పెదవి ముద్దుకైనా, ఈత దుస్తులకయినా రెడీ అంటోంది వర్ధమాన తార అక్షర హాసన్. ఈ బ్యూటీ నేపథ్యం గురించి కొత్తగా ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు. నటనకు నడకలు నేర్పిన కుటుంబం నుంచి వచ్చింది అక్షర. విశ్వనాయకుడు కమలహాసన్ వారసురాలు అక్షర అక్క శ్రుతిహాసన్  ఇప్పటికే నాయకిగా దూసుకుపోతున్నారు. హీరోయిన్ పాత్రల్లో శ్రుతిమించిన రొమాన్స్, ఐటమ్ సాంగ్స్ అంటూ ఎడాపెడా నటించేస్తున్నారు. అక్షర కూడా అక్కబాటలోనే పయనించడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

తొలి చిత్రం షమితాబ్ (హిందీ)లో చక్కని పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నారు. అమితాబ్ లాంటి లెజెండ్, ధనుష్ లాంటి అనుభవజ్ఞుడైన నటులు మధ్య పరిచయ నటిగా మెప్పించడం అంత సులభమైన పని కాదు. అయితే అక్షర తన పాత్రను సమర్థవంతంగా పోషించి ప్రశంసలు అందుకుంటున్నారు.

షమితాబ్ చిత్రం షూటింగ్ దశలోనే అక్షరకు పలు అవకాశాలు వచ్చినా తొలి చిత్రం విడుదల అనంతరమే అంగీకరిస్తానంటూ చెప్పుకుంటూ వస్తున్నారట. మరి ఇప్పుడెలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అక్క మాదిరిగా గ్లామర్ పాత్రలు పోషిస్తారా? అన్న ప్రశ్నలకు అక్షర బదులిస్తూ అవార్డు కోసం నటించాలన్న ఆశ లేదన్నారు. కమర్షియల్ కథా నాయకిగానే ఎదగాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. కథ డిమాండ్ చేస్తే ఈత దుస్తులు ధరించడానికైనా, లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి కైనా రెడీ అంటూ కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement