చదువు వల్ల విజ్ఞానం పెరుగుతుంది. అయితే చదువు లేకపోతే జీవితమే లేదు అనుకోవడం కూడా సరికాదు. పెద్దగా చదువుకోని వారు కూడా జీవితంలో అనుకున్నది సాధించారు, సాధిస్తున్నారు. ఎవరి దాకో ఎందుకు అంబానీ వంటి వారి గురించి కాకుండా, మనందరికీ స్ఫూర్తిదాయకుడు అయిన లోకనాయకుడిగా పిలవబడుతున్న నటుడు కమలహాసన్‌నే తీసుకుంటే ఆయన ఉన్నత విద్య చదువుకోలేదు. ఆయన జీవితమనే పాఠశాలలో చదువుకుంటూ తనే ఒక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతున్నారు. పలు ప్రాంతీయ భాషలతో పాటు ఆంగ్ల భాషను అద్భుతంగా మాట్లాడగలరు.
ఇక ఆయన రెండో వారసురాలు అక్షరహాసన్ కూడా చదువులో కాస్త వెనుకే ఉండేవారు. కమలహాసన్, సారిక దంపతుల వారసులు శ్రుతిహాసన్, అక్షరహాసన్. అక్షరహాసన్ కమలహాసన్ ముద్దుల కూతురు. ఈమె నటిగా మారింది ఎలా అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనకు చదువు పెద్దగా అబ్బలేదన్నారు. తాను పది ఫెయిల్ అని, రెండు సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణత కాలేకపోయానని చెప్పారు. దీంతో తనకు చదువుపై ఆసక్తి లేదని తన తండ్రితో చెప్పానన్నారు. మరో విషయం ఏమిటంటే తన తండ్రి పెద్దగా చదువుకోలేదని, తల్లి సారిక కూడా చిన్న వయసు నుంచే నటించడంతో ఉన్నత చదువులు చదువుకోలేదని చెప్పారు. తాను డాన్స్‌పై ఆసక్తితో సింగపూర్ వెళ్లి అక్కడ పరీక్ష రాసి నాట్య కళాశాలలో చేరానన్నారు.
అయితే దాన్ని కొనసాగించలేకపోయానన్నారు. తరువాత తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బాలీవుడ్‌లో నటించడానికి ప్రయత్నించానని, అయితే అక్కడ పలు అవకాశాలు మిస్ చేసుకోవడంతో తిరిగి తమిళ చిత్ర పరిశ్రమకు వచ్చినట్లు చెప్పారు. అలా అజిత్ కథానాయకుడిగా నటించిన వివేకం చిత్రం ద్వారా నటిగా పరిచయమైనట్లు చెప్పారు. ఆ తరువాత విక్రమ్ హీరోగా నటించిన కడియారం కొండాన్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించినట్లు చెప్పారు. ఇప్పటికీ నటిగా బిజీగా ఉన్నట్లు అక్షరహాసన్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరింతగా శ్రమిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment