Akshara Haasan
-
పేరెంట్స్ విడాకులు.. మేమూ మనుషులమే: అక్షర హాసన్
తల్లిదండ్రులు కమల్ హాసన్- సారిక పేరు మోసిన యాక్టర్స్. అక్క శృతి హాసన్ కూడా సౌత్‌లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. అక్షర హాసన్ మాత్రం సినీ ఫీల్డులో కాస్త వెనుకబడే ఉంది. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఈ బ్యూటీ షమితాబ్ మూవీతో నటిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. వివేగం, కరం కొందాన్, అచ్చం మేడమ్ నానమ్ పయిరప్పు వంటి చిత్రాలతో కోలీవుడ్‌లోనూ పేరు సంపాదించుకుంది. కానీ స్టార్ స్టేటస్‌కు మాత్రం దూరంగానే ఉండిపోయింది.ఒంటరిగా వదిలేయలేదుతాజాగా ఈ బ్యూటీ తన పేరెంట్స్ విడాకులు తమను ఎంత బాధపెట్టాయో వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సెలబ్రిటీ పిల్లలమైనంత మాత్రాన మాకు ఎమోషన్స్ ఉండవా? మేమూ మనుషులమే! తల్లిదండ్రులు విడిపోతే అందరూ ఎలా బాధపడతారో మేమూ అలాగే బాధపడ్డాం. కానీ వారు మమ్మల్ని ఒంటరిగా వదిలేయలేదు. ఎంతో ప్రేమ చూపించారు. ఇద్దరి మధ్య ఎన్ని ఉన్నా పేరెంట్స్‌గా మాకు అండగా నిలబడ్డారు.అండగా నిలబడ్డ శ్రుతి హాసన్కొన్నిసార్లు నాకేదైనా అవసరమైతే మా అక్క దగ్గరకు వెళ్లేదాన్ని. స్కూల్లో కొందరు ఏడిపిస్తున్నారని, కొట్టాలని ఉందని చెప్తే హింస వద్దని సూచించేది. తను రంగంలోకి దిగి పరిస్థితులు చక్కబెట్టేది. మేము ఒకరి కోసం ఒకరం నిలబడతాం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే మా కుటుంబంలో అందరం ఒకరికొకరు సపోర్ట్‌గానే ఉన్నారు. ఆ ప్రేమానురాగాలను అలాగే కొనసాగించాం' అని పేర్కొంది. కాగా కమల్- సారిక 2002లో విడిపోగా 2004లో విడాకులు తీసుకున్నారు.చదవండి: ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్ -
రెండుసార్లు పరీక్షలు రాశాను.. అయినా ఫెయిల్ కావడంతో..: అక్షర
చదువు వల్ల విజ్ఞానం పెరుగుతుంది. అయితే చదువు లేకపోతే జీవితమే లేదు అనుకోవడం కూడా సరికాదు. పెద్దగా చదువుకోని వారు కూడా జీవితంలో అనుకున్నది సాధించారు, సాధిస్తున్నారు. ఎవరి దాకో ఎందుకు అంబానీ వంటి వారి గురించి కాకుండా, మనందరికీ స్ఫూర్తిదాయకుడు అయిన లోకనాయకుడిగా పిలవబడుతున్న నటుడు కమలహాసన్‌నే తీసుకుంటే ఆయన ఉన్నత విద్య చదువుకోలేదు. ఆయన జీవితమనే పాఠశాలలో చదువుకుంటూ తనే ఒక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతున్నారు. పలు ప్రాంతీయ భాషలతో పాటు ఆంగ్ల భాషను అద్భుతంగా మాట్లాడగలరు.ఇక ఆయన రెండో వారసురాలు అక్షరహాసన్ కూడా చదువులో కాస్త వెనుకే ఉండేవారు. కమలహాసన్, సారిక దంపతుల వారసులు శ్రుతిహాసన్, అక్షరహాసన్. అక్షరహాసన్ కమలహాసన్ ముద్దుల కూతురు. ఈమె నటిగా మారింది ఎలా అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనకు చదువు పెద్దగా అబ్బలేదన్నారు. తాను పది ఫెయిల్ అని, రెండు సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణత కాలేకపోయానని చెప్పారు. దీంతో తనకు చదువుపై ఆసక్తి లేదని తన తండ్రితో చెప్పానన్నారు. మరో విషయం ఏమిటంటే తన తండ్రి పెద్దగా చదువుకోలేదని, తల్లి సారిక కూడా చిన్న వయసు నుంచే నటించడంతో ఉన్నత చదువులు చదువుకోలేదని చెప్పారు. తాను డాన్స్‌పై ఆసక్తితో సింగపూర్ వెళ్లి అక్కడ పరీక్ష రాసి నాట్య కళాశాలలో చేరానన్నారు. అయితే దాన్ని కొనసాగించలేకపోయానన్నారు. తరువాత తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బాలీవుడ్లో నటించడానికి ప్రయత్నించానని, అయితే అక్కడ పలు అవకాశాలు మిస్ చేసుకోవడంతో తిరిగి తమిళ చిత్ర పరిశ్రమకు వచ్చినట్లు చెప్పారు. అలా అజిత్ కథానాయకుడిగా నటించిన వివేకం చిత్రం ద్వారా నటిగా పరిచయమైనట్లు చెప్పారు. ఆ తరువాత విక్రమ్ హీరోగా నటించిన కడియారం కొండాన్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించినట్లు చెప్పారు. ఇప్పటికీ నటిగా బిజీగా ఉన్నట్లు అక్షరహాసన్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరింతగా శ్రమిస్తానన్నారు. -
ఖరీదైన ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్ కుమార్తె!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, సారికల కూతురు అక్షర హాసన్ గురించి చాలామందికి తెలియదు. అక్షర సినిమాల్లో నటించినప్పటికీ శృతిహాసన్‌లా గుర్తింపు రాలేదు. 2015లో షమితాబ్ సినిమాతో అక్షర ఎంట్రీ ఇచ్చింది. ఆమె హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించింది. వివేగం, లాలీకీ షాదీ మే లాడ్డూ దీవానా అనే సినిమాల్లో కనిపించింది. అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న అక్షర హాసన్.. ఖార్ ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. దాని విలువ దాదాపు రూ.15.75 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 అంతస్తులున్న టవర్‌లో 13వ ఫ్లోర్లో ఇంటిని కొనుగోలు చేసింది. కాగా.. అక్షర ప్రస్తుతం తన తల్లి సారికతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. కమల్ హాసన్‌తో 2004లో సారిక ఠాకూర్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అక్షర 2015లో బాలీవుడ్ చిత్రం షమితాబ్లో అమితాబ్ బచ్చన్, ధనుష్‌లతో కలిసి నటించింది. ఆమె చివరిగా తమిళ చిత్రం అచ్చం మేడం నానం పయిర్పులో కనిపించింది. అక్షర హాసన్ కేవలం నటనే కాదు.. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. మహిళల హక్కుల కోసం, లింగ సమానత్వం, మహిళ మానసిక ఆరోగ్యం వంటి సమస్యలపై పోరాటం చేస్తోంది. View this post on Instagram A post shared by Akshara Haasan (@aksharaa.haasan) -
అక్క శ్రుతి హాసన్ బాటలో చెల్లి అక్షర..
సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే బ్యూటీ శృతి హాసన్. బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోలు, గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటారు. ఆమె చెల్లెలు అక్షర హాసన్ కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ మాదిరిగానే ఈమె కూడా తొలుత బాలీవుడ్లో కథానాయకిగా పరిచయం అయ్యారు. అక్కడ చిత్రాలు చేశారు. ఆ తరువాత తమిళంలో అజిత్ కథానాయకుడుగా నటించిన వివేకం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒక కీలక పాత్రను పోషించారు. చదవండి: స్పెయిన్‌లో జెండా ఎగురవేసిన నయనతార దంపతులు ఆ తరువాత తన తండ్రి కమలహాసన్ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నటుడు విక్రమ్ హీరోగా నిర్మించిన గడారం కొండాన్ చిత్రంలో ఒక యువకుడికి ప్రేయసిగా ప్రేమ సన్నివేశాల్లోనూ, గర్భిణీగా అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత అచ్చం మడం నాణెం పయిర్పు అనే చిత్రంలో కథానాయికగా నటించారు. ఇందులో ప్రముఖ గాయనీమణులు ఉషా ఊతప్, మాల్గుడి శుభ ముఖ్యపాత్రలు పోషించడం విశేషం. అమెజాన్ ప్రైమ్‌టైంలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అగ్ని చిరగుగల్ చిత్రంలో అక్షరహాసన్ గ్లామర్ విషయంలో తన అక్క శృతిహాసన్‌ను ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా దిగిన ఫొటోలను సామాజిక మాద్యమాల్లో విడుదల చేశారు. అవికాస్తా నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. -
రానాతో శ్రుతిహాసన్..సీక్రెట్ ప్రాజెక్టా?
Shruti Haasan Meets Rana Daggubati: హీరో రానా, హీరోయిన్లు శ్రుతీహాసన్, అక్షరా హాసన్ కలిసి మాట్లాడుకున్నారు. ‘‘మంచివాళ్లతో మంచి రోజు. రానాతో పాటు నా చెల్లెలు అక్షరతో కలిసి స్పెండ్ చేసిన ఈ సమయం నాకు చాలా ప్రత్యేకం’’ అనే క్యాప్షన్‌తో శ్రుతీహాసన్ ఓ ఫొటో షేర్ చేశారు. ఇంతకీ ఈ ముగ్గురూ ఎందుకు కలుసుకున్నట్లు? ఏదైనా సినిమాలో కలిసి నటించనున్నారా? లేక వెబ్ సిరీస్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారా? అనే చర్చలకు ఈ ఫొటో దారి తీసింది. మరి.. వీరిది క్యాజువల్ మీటింగా? లేక ప్రొఫెషనల్ మీటింగా? వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Hyderabad Times (@hyderabad_times) -
తీన్మార్ స్టెప్పులేసిన కమల్ కూతురు, సుహాసిని
-
కమల్ హాసన్ కూతురితో నటి తీన్మార్ స్టెప్పులు!
సాక్షి, చెన్నై: విశ్వనటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని కూడా సుడిగాలి ప్రచారంలో భాగమయ్యారు. వీరికి తోడుగా కమల్ కూతురు అక్షర హాసన్ కూడా క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌కు ఓటేయడంటూ అక్షర, సుహాసిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ డప్పు చప్పుళ్లకు తీన్మార్ డ్యాన్స్‌లు చేసి జనాలను ఆకట్టుకున్నారు. బ్యాండ్ సౌండ్‌కు ఎంతో ఎనర్జిటిక్‌గా స్టెప్పులేసిన వీరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: కమల్ పార్టీ అభ్యర్థి ఇంట్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం ఒకే వేదికపై మామ అల్లుడు (రజనీకాంత్, ధనుష్)కు అవార్డులు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1691347313.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓ అమ్మాయి ప్రయాణం
కమల్‌హాసన్ చిన్న కుమార్తె, శ్రుతీహాసన్ సోదరి అక్షరాహాసన్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ‘అచ్చమ్ మడమ్ నానమ్ పయిర్పు’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ తమిళ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు అక్షర. ఇది ఆమెకు తొలి లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇందులో ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్ అక్షరాకు బామ్మా పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఓ మధ్యతరగతి అమ్మాయి చేసే ప్రయాణమే ఈ చిత్రకథ. రాజా రమణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ట్రెండ్‌లౌడ్ బ్యానర్ నిర్మిస్తోంది. ‘ఈ కథ మీ అందరికీ చూపించాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అన్నారు అక్షరాహాసన్. -
సునయన నుంచి అక్షర హాసన్ వరకూ..
సవ్యంగా సాగుతున్న జీవితాల్లో ఊహించిన మలుపులా దూసుకొచ్చింది కరోనా వైరస్. ఎంతో మంది జీవితాలను ఈ మహమ్మారి అతాలకుతలం చేసింది. కరోనా ధాటికి అనేక పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిలో సినీ పరిశ్రమ ఒకటి. కొన్ని కొత్త సినిమాలు ఆరంభంలోనే ఆగిపోతే మరి కొన్ని షూటింగ్ మధ్యలో నిలిచిపోయాయి. ఇక అనేక సినిమాలు విడుదలకు నోచుకోక వాయిదా పడ్డాయి. పని లేకపోవడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో కొత్త ఫిట్నెస్, వంటలు, కొత్త వ్యాపకాలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తమ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. (సోనూసూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?) ఈక్రమంలో కొన్ని ఛాలెంజ్‌లను స్వీకరిస్తున్నారు. అలా వచ్చిందే ‘బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్’. ఎప్పుడూ కలర్ ఫుల్ ఫోటోలే కాకుండా నలుపు, తెలుపు రంగులో ఉండే ఫోటోలను womensupportingwomen అనే హ్యష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఈ ఛాలెంజ్. దీని ద్వారా మహిళలు తమలోని ఆత్మ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, మహిళా సాధికారికతను పెంపొందించే ఉద్ధేశ్యంతో ఈ ఛాలెంజ్ నడుస్తోంది. ఈ సవాల్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన కోలీవుడ్ తారలపై ఓ లుక్కేద్దాం. (పెళ్లికి రెడీ అవుతోన్న 'పహిల్వాన్' విలన్) 1... సునయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎంచుకున్న పాత్రల్లో తన అద్భుతమైన నటన నైపుణ్యాలను నిరూపించుకుంది. తన స్నేహితురాలు, నటి మంజిమా మోహన్ ఇచ్చిన సవాలును అంగీకరించిన సునాయన బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని పంచుకుంది. సునైనా సాదా చీరతో, తక్కువ అభరణాల అలంకరణ ఆమెకు సరిగ్గా సరిపోయింది. 2. మంజిమా మోహన్ తమిళ నటుడు శింబు సరసన రొమాంటిక్ థ్రిల్లర్ 'అచ్చం యెన్భాధు మదమైయాడ' చిత్రంలో నటించిన మంజిమా మోహన్ తన నటనకతో ప్రేక్షకులలో మంచి ఆదరణ సంపాదించుకుంది.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలతోపాటు పరిశ్రమలో మంచి స్నేహితులను కూడా సంపాదించింది. నటి వరలక్ష్మి చేసిన సవాలును అంగీకరించిన మంజిమా బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో ఫోటోను షేర్ చేసింది. 3. వరలక్ష్మీ సినీ పరిశ్రమలో ధైర్యవంతులైన నటీమణులలో వరలక్ష్మి ఒకరు. ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టదినట్లు మాట్లడటంలో ఆమె ఎన్నడూ వెనకాడదు. మహిళలపై లైంగిక వేధింపుల కోసం పోరాడటానికి వరలక్ష్మి ఒక ప్రచారాన్ని కూడా నడుపుతుంది. తాజాగా ఈ సవాలను స్వీకరించిన వరలక్ష్మీ బ్లాక్ అండ్ వైట్‌లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేగాక లాక్ డౌన్ సమయంలో ఆమె బరువు తగ్గినట్లు తెలుస్తోంది. 4. నివేధిత సతీష్ 'మాగలీర్ మాట్టం', 'సిల్లు కరుపట్టి' వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాలలో నివేదిత సతీష్ తన పాత్రలతో అబ్బురపరిచింది. బోల్డ్ పాత్రలు స్వీకరించే నటీమణులలో నివేదిత ఒకరు. ఆమెకున్న పెద్ద కళ్ళు తనకు ప్లాస్ పాయింట్‌గా చెప్పుకుంటారు. ఆమెకు బాగా సరిపోయే చీరతో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను అభిమానులతో పంచుకుంది. 5. సుజా వరుణీ సుజా వరుణీ 2018లో శివ కుమార్‌ను వివాహం చేసుకున్నారు, ఈ జంటకు గత ఏడాది (2019) ఆగస్టులో పండంటి మగబిడ్డ జన్మించాడు. సుజా వరుణీ అనేక పాపులర్ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించింది, అయితే టెలివిజన్ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు ఈ నటికి మరింత ఖ్యాతి వచ్చింది. మహిళల ఛాలెంజ్‌కు మద్దతు ఇచ్చే మహిళల్లో సుజా వరుణీ ఒకరు. ఈ ఛాలెంజ్‌ను అంగీకరించిన, ఆమెతన గతంలో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పంచుకున్నారు. 6.. అక్షర హాసన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్. అయితే వారసత్వ నటిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం నవీన్ దర్శకత్వం వహించే 'అగ్ని సిరగుగల్' చిత్రంలో అక్షర ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం తమిళ సినిమా పరిశ్రమలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సవాలును స్వీకరించిన అక్షర బ్లాక్ అండ్ వైట్‌లో ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. -
వేడుక చేద్దాం.. లవ్ యూ పప్పా: శృతిహాసన్
చెన్నై : సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి.. విలక్షణ నటుడు కమల్ హాసన్. విభిన్న పాత్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. దశావతరంలో పది పాత్రలు పోషించి తను చేయలేని క్యారెక్టర్ లేదని నిరూపించుకున్నాడు. మరో చరిత్ర, భారతీయుడు, స్వాతి ముత్యం వంటి చిత్రాల్లో నటించి లెజెండ్ అనిపించుకున్నాడు. నవంబర్ 7(గురువారం) లోక నాయకుడి పుట్టిన రోజు. 65వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోడానికి కమల్ తన స్వగ్రామమైన ‘పరమక్కుడి’ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆయన 60 ఏళ్ల సినీ ప్రస్థానానికి జ్ఞాపకంగా మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. ఈ ట్రిప్‌కి కుటుంబ సభ్యులతోపాటు తన టీం మొత్తం వెళ్లారు. ఈ క్రమంలో ఊరుకు వెళ్లే ముందు ఎయిర్‌పోర్టులో కుటుంబంతో దిగిన ఫోటోలను అక్షర హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. ఇక శ్రుతి హాసన్ సైతం తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యపీ బర్త్‌డే బాపూజీ. ఈ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం మీ 60 ఏళ్ల సినీ ప్రయాణానికి ఓ నిదర్శనం. పుట్టిన రోజుకి మన స్వగ్రామానికి వచ్చాం. అక్కడ వేడుక చేసుకున్నాం. అలాగే మీ జీవితంలో మేము కూడా భాగమయ్యాం. లవ్ యూ లాట్స్ పప్పా’ అంటూ విషేస్ తెలిపారు. కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌తో సహా అన్నయ చారు హాసన్ ట్రిప్‌కు వెళ్లగా అక్కడ కమల్ తండ్రి శ్రీనివాసన్ విగ్రహన్నిఆవిష్కరించనున్నారు. వృత్తి పరంగా శ్రీనివాసన్ న్యాయమూర్తి అలాగే స్వాతంత్య్ర సమర మోధుడు. ఇక ఈ వేడుకల్లో పాల్గొనడానికి లజెండ్ శివాజీ గణేశన్ కొడుకు నటుడు ప్రభు సైతం పరమక్కుడికి వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకల అనంతరం కమల్ నవంబర్ 8న తిరిగి చెన్నైకి వచ్చి తన కార్యలయంలో సినీ గురువు, లెజెండరీ ఫిల్మ్‌మేకర్ కె.బాల చందర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక కమల్ హసన్ 1954లో తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమక్కుడిలో జన్మించారు. స్వతహాగా తమిళనటుడైనా తన విలక్షణ నటనతో దేశమంతటికీ సుపరిచితులయ్యారు. బాల నటుడిగా నటించిన(కలకత్తూర్ కన్నమ్మ) మొదటి చిత్రానికే కమల్ జాతీయ పురస్కరం అందుకున్నారు. అనంతరం మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కించుకున్నారు. నటుడిగానే కాకుండా నృత్యంలోనూ ముఖ్యంగా భారత నాట్యంలోనూ కమల్‌కి మంచి ప్రావీణ్యం ఉంది. 1960లోనే సినిమాల్లో ఆరంగేట్రం చేసిన కమల్ 1977లో తెలుగు చిత్రం(అంతులేని కథ)తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తెలుగులో నటించిన మరో చరిత్ర, సాగర సంగమం, స్వాతిముత్యం, విచిత్ర సోదరులు, భామనే సత్యభామనే వంటి హిట్ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కలైమామణి(కళాకారుల్లో మాణిక్యం) బిరుదుతో సత్కరించింది. ఈయన పద్మశ్రీ గ్రహీత. -
ప్రెగ్నెంట్ అయితేనే అవన్నీ తెలుస్తాయి
అక్షర ఒడ్డున ఉంది. ఒడ్డున ఉందంటే ఒడ్డున పడిందని కాదు. ఈదాల్సిన సముద్రం ఉంది. రెండు పడవలు ఉన్నాయి.యాక్షన్ ఒకటి.. డైరెక్షన్ ఇంకోటి. కన్ఫ్యూజనేం లేదు. క్లారిటీ ఉంది. సినిమాల్లోనే టేక్‌లకు చాన్స్ ఉంటుందనీ.. లైఫ్‌లో దేనికైనా ఒకే టేక్ ఉంటుందనీ..అక్షరకు క్లారిటీ ఉంది. ఏ పడవైనా.. లైఫ్‌కి పనికొచ్చేదే ఆమె టేక్!చదవండి.. ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్. ‘షమితాబ్’తో హీరోయిన్ అయ్యారు. నాలుగేళ్లల్లో నాలుగే సినిమాలు చేశారు. సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మంచి స్క్రిప్ట్స్ రాలేదా? అక్షరా హాసన్: అలా ఏం లేదు. స్క్రి‹ప్ట్స్ ఉన్నాయి. అయితే ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు. కారణం ఏంటంటే నేనెలాంటి యాక్టర్ అనిపించుకోవాలో తెలుసుకోవడానికి కొంచెం టైమ్ పట్టింది. ఏది పడితే అది తీసుకొని కన్ఫ్యూజ్ కావద్దని నాకు నేను చెప్పుకున్నాను. ‘క్లియర్‌గా ఉండాలి’ అని మాత్రం ఫిక్స్ అయ్యాను. అలా ఫిక్స్ అవ్వకపోతే టైమ్, డబ్బు, ఎనర్జీ వృథా అయిపోతాయి. దానికి తోడు పేరు కూడా పాడైపోతుంది. ‘తనకు ఎలాంటి సినిమాలు చేయాలో తనకే తెలియదు.. పాపం’ అనే కామెంట్స్ వినాలనుకోలేదు. తనకో ఐడియా ఉందనుకుంటే చాలు. అందుకే ‘టేకిట్ ఈజీ అక్షరా.. ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు. మనసుకి నచ్చినది, మనకు సూట్ అయ్యేది చేశామా? లేదా? అన్నదే ముఖ్యం’ అని నాకు నేను చెప్పుకుంటాను. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. డైరెక్టర్ అవుతారేమో అనుకుంటే హీరోయిన్ అయ్యారు. ‘క్లియర్‌గా ఉంటా’ అన్నారు. ఏం కావాలో నిజంగానే క్లియర్‌గా ఉన్నారా? నిజానికి నేను డ్యాన్సర్ కావాలనుకున్నాను. ఆ లక్ష్యం నెరవేరలేదు. నా కాలికి గాయం కావడంతో సంవత్సరం పాటు డ్యాన్స్ చేయలేకపోయాను. అప్పటివరకూ చెన్నైలో ఉండేదాన్ని. ఏడాది పాటు డ్యాన్స్ కష్టం అనే పరిస్థితిలో ముంబైకి షిఫ్ట్ అయ్యా. అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను. నాలుగేళ్లు వర్క్ చేశాను. నా కెరీర్లో ఏడీ (అసిస్టెంట్ డైరెక్టర్)గా వర్క్ చేసిన ఆ నాలుగేళ్లు ఎంతో విలువైనవి. స్క్రీన్ మీద మనం ఏదైనా సృష్టించాలంటే దాన్ని ఎలా స్క్రీన్ మీదకు తీసుకురావాలో అర్థం అయింది. ఆ తర్వాత అనుకోకుండా యాక్టర్‌ని అయ్యాను. ఓ డ్రామా చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్‌కి ఆరోగ్యం బాగాలేకపోతే నేను తన పాత్ర చేశాను. యాక్టింగ్‌ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఆ విషయాన్నే నా ఫ్రెండ్‌తో చెప్పాను. అలా యాక్టింగ్‌తో ప్రేమలో పడిపోయాను. సరిగ్గా అప్పుడే ‘షమితాబ్’ సినిమాకి చాన్స్ వచ్చింది. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి? నటిగానేనా? డైరెక్షన్ వైపు వెళ్లాలనుకుంటున్నారా? నాకు వీలున్నంత కాలం నటిగా కొనసాగుతాను. అలాగే డైరెక్టర్ కూడా అవ్వాలనుంది. రెండిటినీ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను.. చూద్దాం. ‘రజనీకాంత్‌గారిని, మా నాన్నగారిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడూ అదే చెబుతారా? వాళ్లతో సినిమా చేయాలనేది మంచి ఐడియానే. కానీ చాలా పెద్ద బాధ్యత. ఆలోచిస్తుంటే భయంగా ఉంది. అయితే ఇప్పుడు వాళ్లిదర్నీ హ్యాండిల్ చేసేంత అనుభవం నాకు లేదనుకుంటున్నాను. అలాగే ఆన్‌స్క్రీన్ కూడా కమల్‌హాసన్ కూతురిగా నటించాలని ఉందన్నారు.. నాన్నతో కలిసి నటించే అవకాశం అంటే ఎగిరి గంతేస్తాను. అంత పెద్ద ఆర్టిస్ట్ కాంబినేషన్లో సినిమా చేస్తే యాక్టర్‌గా నేను చాలా నేర్చుకోగలుగుతాను. మరి.. మా ఇద్దరికీ కుదిరే కథ ఎవరు తెస్తారో? చూడాలి. కమల్, సారికల కూతురిగా ప్లస్సులు, మైనస్సులు? అమ్మానాన్న మల్టీ టాలెంటెడ్. అలాంటి వ్యక్తులు పక్కన ఉంటే ఎంతైనా నేర్చుకోవచ్చు. నాకు, అక్కకు ఉన్న అడ్వాంటేజ్ అది. డిస్అడ్వాంటేజ్ ఏంటంటే... వాళ్లెప్పుడూ బిజీగా ఉంటారు. అందుకని తక్కువ నేర్చుకోవడానికి కుదురుతుంది. వాళ్లతో టైమ్ స్పెండ్ చేసేది చాలా తక్కువ. అలాగే మీ అక్కచెల్లెళ్లిద్దరూ కూడా ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉంటారు కాబట్టి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయరేమో? అది కూడా నిజమే. అయితే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మేం ఫోన్ చేసి, మాట్లాడుకుంటాం. బయట వ్యక్తులు దగ్గర షేర్ చేసుకోలేని విషయాలు ఏమైనా ఉంటే అక్కతోనే చెబుతాను. అక్క కూడా అంతే. మరి.. మైఖేల్ కోర్సలే నుంచి బ్రేకప్ అయిన మీ అక్కను కారణం అడిగారా? లేదు. అడగాలనిపించలేదు. ఆ విషయం గురించి మాట్లాడను. తక్కువ సినిమాలు చేశారు కానీ, ‘ప్రైవేట్ పిక్స్ లీక్’, ప్రేమ వ్యవహారం వంటి వాటితో బాగానే వార్తల్లో ఉంటారు. లీకైన ఆ ఫొటోల గురించి? నేనో విషయాన్ని నమ్ముతాను. భవిష్యత్ అంతా ‘ప్రస్తుతం’ మీద ఆధారపడి ఉన్నప్పుడు గతం గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ఈ ఆలోచనను నేను చాలా విషయాలకు ఆపాదిస్తాను. అందుకే గడిచిపోయిన విషయాల గురించి మాట్లాడను. నేనేం చెప్పాలనుకున్నానో అప్పుడే చెప్పేశాను. ఇలాంటి చేదు అనుభవాల వల్ల సెలబ్రిటీగా ఉండటం పెద్ద ఒత్తిడి అని భావిస్తారా? నేను పుట్టి పెరిగిందంతా సినిమా వాతావరణమే. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. మనం మనంలా ఉన్నప్పటికీ చాలాసార్లు అపార్థం చేసుకునే అవకాశం ఉన్న చోటిది. ఏ పబ్లిక్ ఫిగర్కైనా ఇది కామనే. అమ్మానాన్నల కెరీర్‌ని చూస్తూ పెరిగాను కాబట్టి సెలబ్రిటీల లైఫ్ గురించి కొంచెం అవగాహన ఏర్పడింది. ఒత్తిడి ఉంటుందని తెలుసు. అందుకే టేక్ ఇట్ ఈజీ అన్నట్లుగా ఉండటం అలవాటు చేసుకుంటున్నాను. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆ మూమెంట్లో ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఇంటర్వ్యూ అనుకుందాం. షూటింగ్లో సరిగ్గా చేయకపోతే ‘ఇంకో టేక్ తీసుకోనా?’ అనొచ్చు. ఇక్కడ కుదరదు. అప్పటికప్పుడు ఏమనిపిస్తే అది చెప్పాలి. అలాగే పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఇంకో టేక్‌కి చాన్స్ ఉండదు. అప్పటికప్పుడు అనిపించినది చేస్తాం. అందులో తప్పు వెతికితే ఏమీ చేయలేం. ఫైనల్లీ.. జీవితంలో మీరు పాటించే ఓ విషయం గురించి చెబుతారా? ‘నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు.. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అన్నది ముఖ్యం. నిన్ను ఇతరులు ఎలా చూస్తున్నారు? నీ గురించి ఏమనుకుంటున్నారు? అనేది ముఖ్యం కాదు’. నేను పాటించేది ఇదే. మనకున్నది ఒకే ఒక్క లైఫ్. ఆ జీవితాన్ని వీలైనంత ఆనందంగా, అద్భుతంగా మలుచుకోవాలి కానీ వాళ్ల గురించి వీళ్ల గురించి ఆలోచిస్తూ, వాళ్లేమనుకుంటున్నారో వీళ్లేమనుకుంటున్నారో అని కంగారుపడుతూ బతకకూడదు ‘ఫింగర్ టిప్’ వెబ్ సిరీస్‌లో నటించారు. ఆ అనుభవం ఎలా ఉంది? మంచి కంటెంట్ ఉన్న సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టినందుకు హ్యాపీగా ఉంది. సెల్‌ఫోన్స్‌తో కాకుండా మనుషులతో మింగిల్ అవ్వండి అనేది ఈ సిరీస్ ప్రధానాంశం. హైటెక్ మొబైల్స్‌కి బానిస కావడం ద్వారా ఏర్పడే నష్టాన్ని చెబుతున్నాం. అసలు ఇవాళ మన జీవితంలో సోషల్ మీడియా ఓ భాగమైపోయింది. ఇలాంటి సమయంలో దానివల్ల కలిగే నష్టాలను చెబుతున్నాం. వెబ్ సిరీస్ షూటింగ్ ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఎంజాయ్ చేశాను. మీరు చేసిన నాలుగు సినిమాల్లో రెండు సినిమాల్లో (లాల్ కీ షాదీ మే లడ్డూ దీవానా’, మిస్టర్ కేకే’) గర్భవతిగా నటించారు. ఆ పాత్ర చేయడానికి మీ అమ్మగారి నుంచి సలహాలు తీసుకున్నారా? మొదటిసారి గర్భవతిగా నటించినప్పుడు ఆ సెన్సిబులిటీస్ అర్థం కాలేదు. కానీ బేసిక్‌గా ఎలా ఉంటుందో అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. మనం నిజంగా ప్రెగ్నెంట్ అయితేనే పూర్తిగా అర్థమవుతుంది (నవ్వుతూ). ఎలా నడుస్తారు, ఎలా కూర్చుంటారు.. ఇలాంటి విషయాలన్నీ మా అమ్మను అడిగాను. ప్రెగ్నెంట్ ఉమెన్ టక్కున లేచి కూర్చోలేరు. చాలా మెల్లిగా లేవాలి. బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు అదో స్టేట్ ఆఫ్ మైండ్. దాన్ని అర్థం చేసుకున్నాను. ఆ భయాలు, ఎగై్జట్‌మెంట్ అన్నీ తెలుసుకున్నప్పుడే ఆ క్యారెక్టర్లోకి వెళ్లగలం. ప్రెగ్నెంట్‌గా ఉండటం అనేది కేవలం శారీరక విషయం మాత్రమే కాదు మానసికమైనది కూడా. మదర్‌హుడ్ మీద ఏదైనా ఫీలింగ్ ఏర్పడిందా? కచ్చితంగా రెస్పెక్ట్ ఏర్పడింది. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో వాళ్ల ఆలోచనా విధానంలో ఎటువంటి మార్పు వస్తుంది అనేది తెలిసింది. మా అమ్మకు ఎన్ని ఇబ్బందులు కలిగించానో అనిపించింది. ప్రపంచంలో ఉన్న అద్భుతాల్లో పేరెంట్స్‌గా ఉండటం ఒకటి. మరీ ముఖ్యంగా మదర్‌గా ఉండటం. మీ అమ్మగారికి మీరేం ఇబ్బందులు కలిగించారో చెబుతారా? చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని. మీ అమ్మాయి క్లాసులు బంక్ కొడుతుందని టీచర్స్ కంప్లయింట్ చేసేవాళ్లు. నేను అందర్నీ ఆటపట్టించేదాన్ని. అన్నీ సరదావే. టెన్షన్ పడేంత సీరియస్ విషయాలేం లేవు. చిన్నప్పుడు అందరు పిల్లలు ఎలా అల్లరి చేస్తారో అలానే. మీ అమ్మానాన్న, అక్క (సారిక, కమల్‌హాసన్, శ్రుతీహాసన్) అందరూ యాక్టర్సే. వాళ్ల నుంచి ఏమైనా టిప్స్ తీసుకుంటారా? తీసుకుంటాను. కన్ఫ్యూజన్లో ఉన్నా, కాన్ఫిడెంట్‌గా లేకపోయినా అడుగుతాను. స్క్రిప్ట్ చదివినప్పుడు యూనిట్‌తో క్రియేటవ్ డిస్కషన్ ఉంటుంది. ఆ చర్చల్లో నాకేదైనా సరిగ్గా అనిపించకపోతే అడుగుతాను. అలాగే ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకడంలేదు అనిపించినప్పుడు నాకు గుర్తొచ్చేది ఈ ముగ్గురే. 3 గంటలకు ఫోన్ చేసినా ‘ఏంటీ.. ఏమైంది’ అని నా క్షేమసమాచారాలు అడిగి తెలుసుకుంటారు. మేం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా.. మనవాళ్లు ఉన్నారు కదా అనే ధైర్యం. ఆ ధైర్యం అనేది చాలా బెస్ట్ ఫీలింగ్. మీ చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు. మిమ్మల్ని ఎప్పటికీ బాధపెట్టే విషయాల్లో ఇదొకటి అయ్యుంటుందేమో? ఈ ఇద్దరిలో మీకు ఎవరెక్కువ అంటే? బాధ డెఫినెట్‌గా ఉంటుంది. ఏ పిల్లలనైనా బాధపెట్టే విషయమే ఇది. ఇంతకుముందు కూడా ఓ సందర్భంలో చెప్పాను. అమ్మానాన్న విడిపోయినప్పుడు నాకు ప్రపంచం ముగిసిపోయినట్లుగా అనిపించింది. అయితే ఆ చేదు అనుభవమే నన్ను చాలా స్ట్రాంగ్ గాళ్‌ని చేసింది. ఇక ఇద్దరిలో ఎవరు ఎక్కువ అంటే.. ఒక్కరి పేరు చెప్పలేను. నాకు ఇద్దరూ ముఖ్యమే. అమ్మానాన్న దగ్గర్నుంచి నేర్చుకున్న విషయాలు? ఇద్దరికి ఇద్దరూ విలక్షణమైన వ్యక్తులు. ఎదుటివాళ్లు వాళ్ల దగ్గర్నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఇద్దరి ప్రతిభ వేరు. అయితే ఏ పని చేసినా ఇద్దరూ మనసు పెడతారు. ఆ విషయం నేర్చుకున్నాను. – డి.జి. భవాని -
వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్
సినిమా: కమలహాసన్ ఇద్దరు కూతుళ్లు శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లు తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. వీరిలో శ్రుతీహాసన్ ఇప్పటికే స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. రెండో కూతురు అక్షరహాసన్ సైతం ఇదే ప్రయత్నంలో ఉంది. అయితే ఇద్దరూ హిందీ చిత్రాలతోనే నటిగా ఎంట్రీ ఇచ్చారు. శ్రుతీహాసన్ లక్ చిత్రంతో పరిచయం కాగా, అక్షరహాసన్ సమితాబ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే అమితాబ్‌బచ్చన్, తమిళ నటుడు ధనుష్‌తో కలిసి నటించింది. అయినా ఆ తరువాత ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. ఆ మధ్య అజిత్ హీరోగా నటించిన వివేగం చిత్రంలో గెస్ట్‌గా మెరిసింది. ఆ తరువాత ఇటీవల తన తండ్రి కమలహాసన్ నటుడు విక్రమ్ హీరోగా నిర్మించిన కడారం కొండాన్ చిత్రంలో కీలక పాత్రను పోషించింది. ఇలా ముఖ్య పాత్రల్లోనే కానీ హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో నటి అక్షరహాసన్‌కు కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. అయితే అది సినిమాలో కాదు. వెబ్ సిరీస్‌లో. నేడు వెబ్ సిరీస్‌లు సినిమాలకు ధీటుగా నిర్మాణం జరుగుతున్నాయి. కాజల్ అగర్వాల్ లాంటి టాప్ హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ వైపు దృష్టిసారిస్తున్నారు. శ్రుతీహాసన్ సైతం ఇటీవల ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్‌కు సై అంది. అక్షరహాసన్ తమిళ వెబ్ సిరీస్‌లో నటించబోతోంది అంతే తేడా. ఈ వెబ్ సిరీస్ ద్వారా నవ దర్శకుడు శివశంకర్ పరిచయం కానున్నాడు. ఇందులో నటి అక్షరహాసన్‌తో పాటు నటి సునైనా, గాయత్రి నటిస్తున్నారు. దీన్ని దర్శకుడు విష్ణువర్ధన్ నిర్మించడం విశేషం. ఈయన ఇంతకు ముందు అరిందుమ్ అరియామలుమ్, అజిత్ హీరోగా ఆరంభం, బిల్లా వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా అక్షరహాసన్ నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ సెల్‌ఫోన్ ఇతి వృత్తంతో సాగే సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందనుందని సమాచారం. మరి ఈ వెబ్ సిరీస్ అక్షరహాసన్ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. -
‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..
‘షమితాబ్’ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన అక్షర హాసన్... తొలి సినిమాతోనే అక్షరాలా అందమైన నటి అనిపించుకుంది. అక్షర పాండేగా ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఎడా పెడా కాకుండా ఏరి కోరి సినిమాలు చేస్తున్న అక్షర, తాజాగా ‘మిస్టర్ కేకే’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అక్షర హాసన్ ముచ్చట్లు ఆమె మాటల్లోనే... అలా అయితేనే... నేను చెన్నైలోనే పుట్టి పెరిగాను. నా పదో యేట అమ్మా, నాన్నలు విడిపోయారు. 2002లో అమ్మతో పాటు ముంబై వెళ్లిపోయాను. ఇక్కడ రెండు సంవత్సరాలు చదివిన తరువాత బెంగళూరు బోర్డింగ్ స్కూలో చేర్పించారు. అయితే అక్కడ చదువు సజావుగా సాగలేదు. చదవాలి కాబట్టి చదవాలి అని నేను అనుకోను. చదువుకు వందశాతం న్యాయం చేయగలిగినప్పుడే చదువుకోవాలి. అంతేగానీ, వాళ్లు వీళ్లు ఏమనుకుంటారో అని చదువుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఆరోప్రాణం డ్యాన్స్ అంటే నాకు ఆరోప్రాణం. ఎనిమిదో యేట డ్యాన్స్ నేర్చుకోవడం మొదలైంది. సల్సా, పాప్, భరతనాట్యం, కూచిపూడి...ఇలా రకరకాల డ్యాన్సులు వచ్చు. ఒకసారి కాలికి గాయం వల్ల సంవత్సరం పాటు డ్యాన్స్‌కు దూరంగా ఉండాల్సివచ్చింది. ఊపిరి ఆగినంత పనైంది. ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లాను. గాయం నుంచి బయటపడిన తరువాత కమర్శియల్ యాడ్స్, స్టేజీపై నృత్యరూపకాలు చేశాను. ఆ సమయంలోనే నటించాలనే కోరిక మొదలైంది. అలా మొదలైంది... రాహుల్ ఢోలకియా ‘సొసైటీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. నా చిన్నప్పుడు అప్పుడప్పుడు ఆయన షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. వ్యాన్‌లో కూర్చొని హోంవర్క్ చేసుకునేదాన్ని. ఒకసారి ఒక యాడ్ చేసి వస్తున్నప్పుడు స్టూడియో దగ్గర డైరెక్టర్ బాల్కి కనిపిస్తే పలకరించాను. ఆ సమయంలోనే ‘షమితాబ్’ సినిమా గురించి చెప్పారు. అలా ఆ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. రాహుల్, బాల్కీలను గురువులుగా భావిస్తాను. ఆమె మహారాణి ‘ఈ ప్రపంచంలో నువ్వు అత్యంత ప్రేమించే వ్యక్తి ఎవరు?’ అని అడిగితే మొదటి స్థానం నాకు ఇచ్చుకుంటాను, రెండో స్థానంలో అమ్మ ఉంటుంది. నా జీవితానికి అమ్మ మహారాణి. ఆమె ఎప్పుడూ నాకు ఆదర్శమే. అమ్మ ఆలోచన తీరు, నాది ఒకే తీరుగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఆందోళనపడదు, ఒత్తిడిని దరి చేరనివ్వదు. స్పోర్టివ్‌గా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే...అమ్మది స్వీట్హార్ట్. అమ్మ శక్తిమంతమైన స్త్రీ. ఆమె నుంచి నాకు కావలసిన శక్తిని తీసుకుంటాను. -
‘మిస్టర్ కెకె’ మూవీ రివ్యూ
టైటిల్ : మిస్టర్ కెకె జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : విక్రమ్, అక్షర హాసన్, అభి హసన్, వికాస్ సంగీతం : గిబ్రాన్ దర్శకత్వం : రాజేష్ ఎం సెల్వ నిర్మాత : కమల్ హాసన్ చాలా కాలంగా విక్రమ్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించటం లేదు. అయితే విక్రమ్ నటించిన సినిమాలు ఫెయిల్ అయినా విక్రమ్ మాత్రం ఫెయిల్ కాలేదు. అందుకే ఈ విలక్షణ నటుడి సినిమా వస్తుందంటూ కాస్తో కూస్తో హైప్ ఉంటుంది. దానికి తోడు విక్రమ్ హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ సినిమా నిర్మించటంతో ‘మిస్టర్ కెకె’పై అంచనాలు ఇంకాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను మిస్టర్ కెకె అందుకున్నాడా..? ఈ సినిమాతో అయినా విక్రమ్ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా? కథ : వాసు (అభి హసన్), అధీరా (అక్షరా హాసన్) పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని మలేషియా వెళ్లిపోతారు. ఓ హాస్పిటల్లో డాక్టర్ అయిన వాసు, అధీరా గర్భవతి కావటంతో నైట్ డ్యూటీస్‌కు వెళుతూ ఉదయం అధీరాకు తోడుగా ఉంటుంటాడు. అదే సమయంలో ఓ ఇండస్ట్రీయలిస్ట్‌ను చంపిన కేసులో ముద్దాయి అయిన కెకె (విక్రమ్) అదే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. వాసు డ్యూటీలో ఉన్న సమయంలోనే కెకె పై హాత్యాయత్నం జరుగుతుంది. అప్పుడు వాసునే కెకెను కాపాడతాడు. కానీ కొంతమంది దుండగులు అధీరాను కిడ్నాప్ చేసి కెకెను హాస్పిటల్ నుంచి బయటకు తీసుకురావాలని వాసును బెదిరిస్తారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వాసు.. కెకెను తప్పిస్తాడు. అసలు కెకె ఎవరు..? కెకెను విడిపించే ప్రయత్నం చేసింది ఎవరు..? ఇండస్ట్రియలిస్ట్ చావుకు కెకెకు సంబంధం ఏంటి? చివరకు అధీరా, వాసులు ఏమయ్యారు? అన్నదే మిగతా కథ. నటీనటులు : విలక్షణ నటుడు విక్రమ్ మరోసారి స్టైలిష్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కథా పరంగా పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం లేకపోవటంతో సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితమయ్యాడు. లుక్స్, మేనరిజమ్స్ పరంగా మాత్రం బాగానే మెప్పించాడు. కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరాహాసన్ కూడా మంచి నటన కనబరిచారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన కంటతడిపెట్టిస్తుంది. ఇతర పాత్రలో కనిపించిన నటీనటులంతా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారే. వారంత తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : కేవలం ఒక చిన్నపాయింట్‌ను తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో రెండు గంటల సినిమాగా మార్చే ప్రయత్నం చేసిన దర్శకుడు రాజేష్ ఎం సెల్వ. పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్ చేసే అంశాలు పెద్దగా లేకపోవటమే పెద్ద మైనస్. అసలు కథ ప్రారంభించకుండానే ఫస్ట్ హాఫ్ పూర్తి కావటం ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. దీనికి తోడు సుధీర్ఘంగా సాగే సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. సినిమా క్లైమాక్స్‌కు వచ్చే సరికి విక్రమ్, కమల్ హాసన్ ఏం నచ్చి ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారన్న అనుమానం కలుగుతుంది. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో జరిగే క్లైమాక్స్ సీన్ ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని ఫైట్స్, చేజ్ సీన్స్, హీరో ఎలివేషన్ షాట్స్ మెప్పిస్తాయి. సంగీత దర్శకుడు గిబ్రాన్ కొంత వరకు సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : విక్రమ్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : కథ స్క్రీన్ ప్లే సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్ స్కిల్స్ తీసుకున్నాను..
♦ నేను నటించాలనుకునే హీరోల జాబితాలో విక్రమ్ సార్ పేరు ముందువరుసలో ఉంటుంది. ఈ సినిమాలో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ. ఆయన రియల్ హీరో. యాక్టింగ్ పరంగా నాకు సెట్లో సహాయం చేశారు. ఈ సినిమాలో గర్భవతిగా నటించాను. మా నాన్నగారి బ్యానర్ (రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్)లో నటించడం హ్యాపీ. ఎన్నో స్ఫూర్తిదాయక చిత్రాలు ఈ నిర్మాణసంస్థ నుంచి రావడం వచ్చాయి. మా నాన్నగారి బ్యానర్లో నటించినప్పటికీ పారితోషికం తీసుకున్నాను. ఎందుకంటే పని పనే. (నవ్వుతూ). ♦ ఇందులో గర్భవతిగా నటించాల్సి వచ్చింది కాబట్టి మా అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్ సలహాలు తీసుకున్నాను.. హోమ్ వర్క్ చేశాను. ఈ పాత్రను చాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. కొన్ని వర్క్‌షాప్స్ కూడా చేశాం. దర్శకుడు రాజేష్‌కి టెక్నికల్‌గా చాలా నాలెడ్జ్ ఉంది. ♦ హిందీ చిత్రం ‘షమితాబ్’ సినిమాలో అమితాబ్ బచ్చన్‌గారితో కలిసి నటించాను. కొన్ని సన్నివేశాల్లో ఈజీ, మరికొన్ని సన్నివేశాల్లో కష్టం అనిపిచింది. దర్శకుడు బాల్కీసార్, అమితాబ్సార్, ధనుష్... ఇలాంటి అనుభవజ్ఞులతో చేయడంతో నా పని సులభంగా తోచింది. కానీ వారి యాక్టింగ్ స్టైల్‌కు తగ్గుట్లుగా నా నటన ఎలా ఉంటుందోనన్న విషయం కష్టంగా అనిపించింది. ఆ సమయంలో కాస్త ఆందోళన అనిపించింది. నా సినిమాలను ఎంచుకునే ఫ్రీడమ్ ఉంది నాకు. కాకపోతే నేను మా అమ్మనాన్నల సలహాలు తీసుకుంటాను. ♦ ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచన లేదు. హీరోయిన్గా నా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను. యాక్టింగ్ కాకుండా.. నేను బొమ్మలు వేస్తాను. కథలు రాస్తాను. -
నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!
‘‘ప్రతి నటుడు హిట్ సాధించాలనే సినిమా చేస్తాడు. నా కెరీర్‌నే ఓసారి పరిశీలించుకుంటే.. ‘సేతు’ విజయం అందుకోవడానికి ముందు దాదాపు పన్నెండేళ్లు ఫెయిల్యూర్స్ చూశాను. ఆ సమయంలో నేను చేసిన ప్రతి సినిమా బ్రేక్ సాధిస్తుందనే చేశాను. కానీ రాలేదు. అయితే నటుడిగా ప్రతిసారి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సబ్జెక్టే ఎంచుకున్నాను. అందుకే ఇండియన్ సినిమాలో నాకంటూ ఓ గుర్తుంపు ఉందని భావిస్తున్నాను’’ అన్నారు విక్రమ్. రాజేష్ ఎం. సెల్వ దర్శకత్వంలో విక్రమ్, అక్షరా హాసన్, అభిహసన్ (నటుడు నాజర్ తనయుడు) ముఖ్య తారాగణంగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘కడరమ్ కొండాన్’. ఈ చిత్రానికి నటుడు కమల్‌హాసన్ ఒక నిర్మాత. టి. అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ ఈ సినిమాను ‘మిస్టర్ కేకే’ టైటిల్‌తో ఈ నెల 19న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా విక్రమ్, అక్షరా హాసన్ చెప్పిన విశేషాలు. ♦ ఇంటర్నేషనల్ స్టైల్లో తెరకెక్కిన చిత్రం ‘కేకే’. ఈ చిత్రంలో నేను చేసిన పాత్ర నా సినిమా జీవితంలోనే వన్నాఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాను. అయితే నా పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. సినిమాలో నా క్యారెక్టర్ పాజిటివ్‌నా? నెగటివా? అనే విషయం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. ♦ కొన్ని సినిమాలకు క్యారెక్టర్ పేరే సినిమా టైటిల్‌గా ఉంటుంది. అంటే సినిమాలో ఆ పాత్ర ఎంత బలమైనదో ఊహించుకోవచ్చు. ఈ సినిమా అలాంటిదే. అందుకే అలా టైటిల్ పెట్టాం. ఒక రోజులో జరిగే కథ కాబట్టి స్క్రీన్‌పై కథ స్పీడ్‌గా నడుస్తుంటుంది. ఈ సినిమాలో యాక్షన్ రియల్‌గా ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన గిల్ ఫైట్స్‌ను బాగా డిజైన్ చేశారు. దర్శకుడు రాజేష్‌కు మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. సెట్లో తనకు ఏం కావాలన్న విషయంపై ఫుల్ క్లారిటీతో ఉంటాడు. ♦ ఇది ఇంటర్నేషనల్ స్టైలిష్ మూవీ అయినప్పటికీ మన ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందనే అనుకుంటున్నాను. నేను చేసిన ‘శివపుత్రుడు’ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అయినా కేవలం నేటివిటి కారణంగానే మూవీ ఆడియన్స్‌కు కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, టైటానిక్’ వంటి సినిమాలకు మన ప్రేక్షకుల ఆదరణ దక్కడం ఆ సినిమాల్లోని ఎమోషనల్ కంటెంటే. అలాగే ‘బాహుబలి’ కూడా. మంచి కథ, సరైన ఎమోషన్స్ ఉంటే ఆడియన్స్ సినిమాలను ఆదరిస్తారు. అలాగే ఒక నటుడిగా బాక్సాఫీస్ నంబర్స్ కూడా ముఖ్యంగా భావిస్తాను. ♦ ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అందుకే ఏ ఒక్క భాషకే నేను పరిమితం కావాలనుకోవడం లేదు. తెలుగు, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లో నాకు గుర్తింపు తెచ్చిన సినిమాలు ఉన్నాయని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. నంబర్ 1 యాక్టర్ కావాలనే ఆశ లేదు. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి. ♦ నిజానికి ఈ సినిమాలో కమల్‌హాసన్‌గారు నటించాల్సింది. ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కమల్‌సార్ బ్యానర్లో నేను ఈ సినిమా చేశాను. వాస్తవానికి కమల్‌గారు ఎవరి గురించీ ఎక్కువగా మాట్లాడరు. కానీ ఈ సినిమా తమిళ ఆడియో వేడుకలో నా గురించి ఆయన చెప్పిన మాటలు నన్ను భావోద్వేగానికి గురి చేశాయి. ♦ నా కొడుకు ధృవ్ నటించిన ‘ఆదిత్యవర్మ’ (తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్) షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా చాన్స్ వచ్చినప్పుడు ధృవ్ అమెరికాలో మెథడ్ యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. చాలా నేచురల్‌గా నటించాడనిపించింది. కొన్ని సీన్స్‌లో అయితే నా కంటే బాగా చేశాడనిపించింది. రొమాంటిక్ సీన్స్ చేసే సమయంలో, డబ్బింగ్ చెప్పే సమయంలో ‘నాన్నా.. నువ్వు బయటికి వెళ్లు’ అన్నాడు. నేను ఇక్కడ లేను.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడనుకుని వర్క్ చేయమన్నాను. ♦మణిరత్నంగారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నాను. అలాగే అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటించబోతున్నాను. గౌతమ్ మీనన్‌గారి దర్శకత్వంలో నేను చేస్తున్న ‘ధృవనక్షత్రం’ ఫైనల్ షెడ్యూల్ జరగాల్సి ఉంది. ‘మహావీర్ కర్ణ’ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతుంది. -
మిస్టర్ థ్రిల్
విక్రమ్ హీరోగా, అక్షరాహాసన్, అభిహసన్ కీలక పాత్రల్లో రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘కదరమ్ కొండన్’. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.రవిచంద్రన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ‘మిస్టర్ కెకె’ పేరుతో తెలుగులో విడుదలవుతోంది. టి.అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ ఈ నెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. టి.నరేష్ కుమార్, టి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులకు థ్రిల్‌ని అందించేలా సెల్వ తెరకెక్కించారు. సమర్థుడైన కమాండర్‌గా విక్రమ్ యాక్షన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ట్రైలర్లో విక్రమ్ గెటప్ చాలా బాగుందని అందరూ ఒకే మాట చెబుతున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందించిన ఈ చిత్రంలో అక్షరాహాసన్ కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించారు’’ అన్నారు. -
‘మిస్టర్ కెకె’ మూవీ స్టిల్స్
-
యాక్షన్ థ్రిల్లర్
విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హీరోల్లో విక్రమ్ ఒకరు. కెరీర్లో ఇప్పటికే ఎన్నో యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన మరో యాక్షన్ చిత్రానికి పచ్చజెండా ఊపారు. ‘డిమాంట్ కాలనీ, ఇమైక్క నొడిగల్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమారి నిర్మిస్తారు. వయాకామ్ 18 సంస్థ ఈ చిత్రానికి సహ–నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే కమల్‌హాసన్ ప్రొడక్షన్లో విక్రమ్ హీరోగా రూపొందిన ‘కడరమ్ కొండాన్’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇందులో కమల్ రెండో కుమార్తె అక్షరా హాసన్ కథానాయిక. ఈ సినిమా కాకుండా ‘మహావీర్ కర్ణ, ధృవనక్షత్రం’ సినిమాలతో బిజీగా ఉన్నారు విక్రమ్. -
అశ్లీల దృశ్యాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడా?
పెరంబూరు: నటి అక్షరహాసన్ మాజీ ప్రియుడే ఆమె అశ్లీల దృశ్యాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడా? అనే అంశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. నటుడు కమల్‌హాసన్ రెండవ కూతురు అక్షరహాసన్. బాలీవుడ్, కోలీవుడ్‌ల్లో నటిగా పరిచయం అయిన ఈ అమ్మడు కొంత కాలం నటుడు తనూజ్‌తో ప్రేమ కలాపాలను సాగించింది. గత ఏడాదే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో నటి అక్షరహాసన్ ఆంతరంగ దృశ్యాలు ఇంటర్నెట్లో ప్రసారం అయ్యి కలకలం రేపాయి. దీంతో ఆ అశ్లీల ఫొటోల వ్యవహారంలో అక్షరహాసన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్షరహాసన్, తనూజ్ ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనూజ్ ఎవరో కాదు ఒకప్పుడు హీరోయిన్గా వెలిగిన నటి రతీఅగ్నిహోత్రి పుత్రుడు. అతను, అక్షరహాసన్ 2013లోనే ప్రేమలో మునిగిపోయారు. అలా ఐదేళ్ల పాటు సాగిన ఈ సంచలన జంట ప్రేమ 2017లో బ్రేకప్ అనే మూడక్షరాల పదంతో ముగిసింది. అయితే వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలిన సమయంలో తీసుకున్న ఆంతరంగిక ఫోటోలు ఒకరి సెల్‌ఫోన్‌కు మరోకరు షేర్ చేసుకున్నారట. ఆ ఫోటోలను ఇప్పుడు అక్షరహాసన్ మాజీ ప్రియుడు ఇంటర్నెట్లో విడుదల చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై తనూజ్ తరఫు వ్యక్తి మీడియాకు వివరణ ఇచ్చాడు. తనూజ్ అక్షరహాసన్ ప్రేమించుకున్న మాట నిజమేనన్నారు. అదే విధంగా వారిద్దరూ ఆంతరంగిక దృశ్యాలను సెల్ఫోన్లో పొందుపరిచిన విషయం వాస్తవమేనన్నారు. అయితే తనూజ్, అక్షర్‌ల విడిపోయినా వారి మధ్య ఇప్పటీకి స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. అందుకు రెండు రోజుల క్రితం వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నట్లు ఆధారాలు కావాలంటే చూపడానికి సిద్దం అని పేర్కొన్నారు. అక్షర ఆంతరంగిక దృశ్యాలను తనూజ్ ఎలాంటి సోషల్ మాధ్యమాల్లోనూ విడుదల చేయలేదన్నారు. పోలీసులు తనూజ్‌ను విచారించలేదన్నారు. ఒక వేళ విచారించినా, తన నిజాయితీని నిరూపించుకోవడానికి తనూజ్ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
నటి ఫొటోలు లీక్; అతడికి సంబంధం లేదు!
యూనివర్సల్ హీరో కమల్‌హాసన్ చిన్న కుమార్తె, నటి అక్షరాహాసన్ పర్సనల్ ఫొటోలు ఇటీవల లీక్ అయిన సంగతి తెలిసిందే. తన మాజీ ప్రియుడు తనూజ్ విర్వానీతో గతంలో దిగిన ఫొటోలను ఆమె ఫోన్లో నుంచి అజ్ఞాత వ్యక్తి హ్యాక్ చేసి ఇంటర్నెట్లోకి వదిలాడు. ఈ విషయమై అక్షర ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ క్రమంలో... 2013లో తనూజ్‌తో అక్షర షేర్ చేసుకున్న ఫొటోలు హ్యాక్‌కు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా తనూజ్‌ని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వార్తలపై తనూజ్ మేనేజర్ స్పందించాడు. అక్షర ఫొటోల లీక్‌తో తనూజ్‌కు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. ఆమె పరువును బజారుకు ఈడ్చాలని చూసిన వారెవరైనా వదిలిపెట్టవద్దని, అందుకోసం తనూజ్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపాడు. కాగా బాలీవుడ్ నటి రతి అగ్రిహోత్రి తనయుడు తనూజ్ విర్వానీ, అక్షర చాలా ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. మనస్పర్ధల కారణంగా విడిపోయిన ఈ జంట ప్రస్తుతం స్నేహితులుగా మెలుగుతున్నారని అతడి మేనేజర్ పేర్కొన్నాడు. View this post on Instagram @mumbaipolice @cybercrime_cell A post shared by Akshara Haasan (@aksharaa.haasan) on Nov 7, 2018 at 6:49am PST -
హుందాగా ఉండండి
కమల్‌హాసన్ చిన్న కుమార్తె, నటి అక్షరాహాసన్ పర్సనల్ ఫొటోలు ఇటీవల లీక్ అయ్యాయి. ఓ ఫొటోషూట్‌కి సంబంధించి అక్షర దిగిన ఫొటోలను ఆమె ఫోన్లో నుంచి ఎవరో అజ్ఞాత వ్యక్తి హ్యాక్ చేసి ఇంటర్నెట్లోకి వదిలాడు. నెట్లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న ఆ హాట్ హాట్ ఫొటోలు అక్షరని వార్తల్లో నిలిచేలా చేశాయి. ఈ విషయం గురించి అక్షర స్పందించారు. ‘‘ఇటీవల నా పర్సనల్ ఫొటోలు కొన్ని ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. అది ఎవరు చేశారు? ఎందుకు చేశారో ఇంకా తెలియదు. కామాంధుడైన ఒక సైకోను అతడి ఆలోచనలు ఒక అమ్మాయి పర్సనల్ విషయాల్ని లీక్ చేయమని ప్రేరేపిస్తే.. ఇతరులు ఆమెను బాధితురాలిగా నిలబెట్టడం, ఆ ఫొటోలకు ఏదో ఓ హెడ్డింగ్ పెట్టి షేర్ చేయడం నన్ను ఇంకా భయానికి గురిచేసింది. అలాగే నన్ను వేధించడంలో, నిస్సహాయురాలిని చేయడంలో మీ (ఫొటోలు షేర్ చేసిన వ్యక్తులు) అందరూ పాల్గొన్నారనిపిస్తోంది. తాజాగా ‘మీటూ’ అనే ఉద్యమం ద్వారా దేశం మొత్తం స్త్రీల సంరక్షణ విషయంలో జాగ్రత్తపడుతుంటే.. ఇంకా కొంతమంది వ్యక్తులు అమ్మాయిల పర్సనల్ ఫొటోలు షేర్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులకు తెలియజేశాను. త్వరలోనే అతణ్ని ఎలాగూ పట్టుకుంటారు. అప్పటివరకూ నేను అందర్నీ వేడుకునేది ఒక్కటే.. ‘లివ్ అండ్ లెట్ లివ్’. మీరు హుందాగా బతకండి.. మరొకర్ని బతకనివ్వండి’’ అని అక్షర ఆగ్రహావేదన వ్యక్తం చేశారు. -
నా గుండె బద్దలైపోయిందే!
సినిమా: అయ్యయ్యో నా హృదయం బద్దలైపోయిందే అంటూ గుండెలు బాదుకుంటోంది నటి అక్షరహాసన్. నటుడు కమలహాసన్ రెండవ కూతురైన ఈ బ్యూటీ తొలుత కెమెరా వెనుక రాణించాలని భావించి బాలీవుడ్లో సహాయదర్శకురాలిగా కెరీర్‌ను మొదలు పెట్టినా, ఆ తరువాత షమితాబ్ అనే చిత్రం హిందీ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసింది. అయితే అలా కూడా బిజీ కాలేకపోయింది. ఆ తరువాత లాలీ షాది మే లడ్డూ దివానా అనే చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగ పడలేదు. ఇక కోలీవుడ్‌లో అజిత్ హీరోగా నటించిన వివేగం చిత్రంలో ఒక గెస్ట్ పాత్రలో మెరిసింది. ఆ తరువాత ఇక్కడా అవకాశాలు లేవు. దీంతో తన తండ్రి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న శభాష్‌నాయుడు చిత్రానికి సహాయ దర్శకురాలిగా బాధ్యతలను చేపట్టింది. ఆ చిత్రం కూడా కడ చేరలేదు. షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. ఇకపోతే కమలహాసనే అక్షరహాసన్‌ను నటిగా ప్రోత్సహించాలని భావించి విక్రమ్ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. అందులో నటి అక్షరహాసన్ నటించనున్నట్టు వెల్లడించారు. ఆ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో అక్షరహాసన్ తన గుండె బద్దలైపోయింది. తన లేత పరువం ముగిసిపోయింది లాంటి వ్యాఖ్యలు చేసింది. అక్షరహాసన్ తన ట్విట్టర్లో పేర్కొన్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంతగా కొంపలేం మునిగిపోయాయి అన్నది తెలుసుకోవాలనుందా? అయితే రండి చూద్దాం అక్షరహాసన్ ఇటీవల హాలీవుడ్ చిత్రం లోగన్‌ను చూసే అలా రియాక్ట్ అయింది. ఆ చిత్రంలో ప్రఖ్యాత నటుడు వోల్వేరిన్ హీరోగా నటించారు. ఆయన చిత్ర తుదిఘట్టంలో మరణిస్తారట. ఆ సన్నివేశాన్ని చూసిన నటి అక్షరహాసన్ తట్టుకోలేక గుండె బద్దలైపోయిందే అంటూ తన ఆవేదనను ట్విట్టర్లో పోస్ట్ చేసి అందరిని కంగారు పెట్టేసింది. -
కమల్‌కు ఇష్టమైన కోట్తో....
సాక్షి, చెన్నై: సీనియర్నటుడు, విలక్షణ హీరో కమల్‌హాసన్ రాజకీయ పార్టీ ప్రకటనపై ఆయన కుమార్తెలు, సినీహీరోయిన్లు శృతి, అక్షర స్పందించారు. రాజకీయ నాయకుడిగా ఆయన తన కొత్త ప్రయాణంలో విజయం సాధించాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రపంచంలో మార్పును కోరుకుంటే.. ఆ మార్పు నువ్వే కావాలన్న కమల్ కు ఇష్టమైన గాంధీ సూక్తిని కోట్ చేసింది. మక్కళ్ నీది మయ్యమ్ పార్టీని ప్రకటించినందుకు గర్వంగా ఉందంటూ కుట్టి హాసన్ సంతోషం వ్యక్తం చేశారు. ''పురోగతి అనేది వ్యక్తిగత ప్రయాణం.. కానీ ప్రజల ఐక్యతతో సమాజం భవిష్యత్తు కోసం బాధ్యత వహించే ప్రయాణం మాత్రం గొప్ప పురోగతిని సాధిస్తుంది. లవ్ యూ బాపూజీ'' అంటూ ట్విట్ చేశారు. -
అక్షరహాసన్‌కు అవార్డు
చెన్నై ,కొరుక్కుపేట: నటి అక్షరహాసన్‌కు ఉత్తమ వర్ధమాన నటి అవార్డును గెలుచుకుంది. ఒలివా స్కిన్ అండ్ హెయిర్ క్లి్లనిక్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ప్రోవోక్ అవార్డుల ప్రదానోత్సవంలో ఒలివా అడిషనల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేత డమిశెట్టి చేతులమీదుగా అక్షరహాసన్ అవార్డు అందుకున్నారు. ఇందులో ఒలివా ఎండీ డాక్టర్ సోమప్రశాంత్, సీఓఓ ప్రకాష్ చారి ఉన్నారు. -
అర్జున్ కాదలి యార్?
... అర్జున్ కాదలి యార్? ఇప్పుడు తమిళ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. కాదలి అంటే ప్రేయసి. యార్ అంటే ఎవరు అని అర్థం. అర్జున్‌రెడ్డిగా విజయ్ దేవరకొండ, ప్రీతీగా షాలినీ పాండే నటించిన ‘అర్జున్‌రెడ్డి’ సెన్సేషనల్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళ రీమేక్ ద్వారా హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం కానున్నారు. ఇందులో అక్షరా హాసన్ లేదా శ్రియా శర్మను హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నారట. అక్షరాహాసన్ అంటే కమల్‌హాసన్ చిన్న కూతురనీ, హీరోయిన్ శ్రుతీహాసన్ చెల్లెలని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శ్రియా శర్మ ఎవరంటే.. 12 ఏళ్ల క్రితం వచ్చిన ‘జై చిరంజీవ’లో చిరంజీవి మేనకోడలు లావణ్య పాత్రలో శ్రియా శర్మ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. గతేడాది వచ్చిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో శ్రియా శర్మనే కథానాయిక. అలా చైల్డ్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరోయిన్ వరకు చేరుకున్నారామె. మరి... చిరంజీవి రీల్ లైఫ్ మేనకోడలా? కమల్‌హాసన్ రియల్ డాటరా? ఈ ఇద్దరూ కాకుండా ‘అర్జున్‌రెడ్డి’తో లవ్‌లో పడేది ఎవరు? వెయిట్ అండ్ సీ. అన్నట్లు... తెలుగులో కాబట్టి ‘అర్జున్‌రెడ్డి’ అని పెట్టారు... మరి తమిళంలో? ‘అర్జున్ గౌండర్’ అనీ, ‘అర్జున్ ముదలియార్’ అనీ.. ఇలా అక్కడికి తగ్గట్టు టైటిల్ పెడతారేమో? లేక అర్జున్ కాకుండా వేరే పేరేమైనా పెడతారేమో? -
తమిళ 'అర్జున్ రెడ్డి'కి జోడి ఎవరు..!
తెలుగులో సంచలన విజయం సాదించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను బాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్టుగా ఇటీవలే విక్రమ్ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటులు ఎంపిక జరుగుతోంది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర్ హాసన్ తో పాటు బాలనటిగా సత్తా చాటి ఇటీవల నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రియ శర్మల్లో ఒకరిని హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం జ్యోతిక, జీవి ప్రకాష్ కాంబినేషన్ లో రూపొందుతున్న నాచియార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న బాలా, ఆ సినిమా రిలీజ్ తరువాత డిసెంబర్ నుంచి అర్జున్ రెడ్డి రీమేక్ పై దృష్టి పెట్టనున్నాడు. ఈ లోగా హీరోయిన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. -
వివేకంపై విమర్శలా?
తమిళసినిమా: వివేకం చిత్రంపై నెటిజన్ల విమర్శలను సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం వివేకం. కాజల్‌అగర్వాల్ నాయకిగా కమలహాసన్ రెండవ కూతురు అక్షరహాసన్ కీలక పాత్రలో నటించిన వివేకం చిత్రాన్ని శివ దర్శకత్వంలో సత్యజ్వోతి ఫిలింస్ సంస్థ నిర్మించింది. చిత్రం గత 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందనతోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వివేకం చిత్రం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూల్ చేసినట్లు సమాచారం. చిత్రంలో కొన్ని అసహజ సన్నివేశాలు చోటుచేసుకున్నా, నటుడు అజిత్ ఈ చిత్రంలో అంకిత భావంతో నటించిన తీరును, అందుకు పడిన కఠిన శ్రమను అందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తున్నారు.అదే విధంగా ఛాయాగ్రాహకుడి నైపుణ్యం, గ్రాఫిక్స్ సన్నివేశాలు, పోరాట దృశ్యాలు, ఛేజింగ్ దృశ్యాలు హాలీవుడ్ చిత్రాల స్థాయిల్లో ఉన్నాయంటూ పలువురు అభినందిస్తున్నారు. కలెక్షన్ల రికార్డులు : ఇక వివేకం చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ చిత్రం విడుదలైన తొలిరోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.33 కోట్లు వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడులోనే రూ. 17 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా చెనైలో వివేకం చిత్రం కబాలి చిత్ర రికార్డును బద్దలు కొట్టిందని సమాచారం. రెండు రోజుల్లో రూ.66 కోట్లు, మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిందంటున్నారు. తీవ్ర విమర్శలు: అయితే ఇప్పుడు చిత్రం విడుదలైన కొన్ని గంటలకే విమర్శల పేరుతో నెటిజన్లు వీడియో రూపంలో ఏకిపారేస్తున్నారు. కొందరైతే చిత్రాలను చూడకుండానే నటులపైనో, చిత్ర యూనిట్పైనో వ్యక్తిగత ద్వేషాలతో తీవ్రంగా విమర్శలు చేయడం ప్రారంభించారు. అలాంటి విమర్శకులు వివేకం చిత్రాన్ని వదలలేదు. కొందరు చిత్రాన్ని చూడకుండానే అజిత్‌ను, చిత్ర యూనిట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు విమర్శించిన వీడియోలను చూసిన సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అజిత్ శ్రమకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను వివేకం చిత్రంపై వస్తున్న విమర్శలకు స్పందించిన నటుడు, నృత్యదర్శకుడు లారెన్స్ వివేకం చిత్రానికి అజిత్ పడిన శ్రమకు శిరసు వంచి నమస్కరిస్తున్నాన్నన్నారు. వివేకం చిత్రంపై కొందరు కావాలనే విమర్శనలు చేస్తుండడం బాధ కలిగిస్తోందన్నారు. చిత్రంలో అబ్బురపరచే పలు సన్నివేశాల గురించి వారు మాట్లాడలేదని, అలాంటి వారికి విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లారెన్స్ అన్నారు. అదే విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చిత్రాలను నిర్మిస్తున్నారని, అలాంటి చిత్రాలను చూడాలా? వద్దా?అన్నది ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేయాలని నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.దర్శకుడు, ఛాయాగ్రాహకుడు విజయ్ మిల్టన్ కూడా వివేకం చిత్రంపై విమర్శలను ఖండిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. -
కూతురు మతం మారడంపై స్పందించిన హీరో
చెన్నై: మతం మారానంటూ తన రెండో కూతురు అక్షరహాసన్ చేసిన సంచలన ప్రకటనపై ఆమె తండ్రి, సీనియర్ హీరో కమల్ హాసన్ స్పందించారు. 'హాయ్ అక్షు. నువ్వు మతం మార్చుకున్నావా? నువ్వు మతం మారినా సరే నాకు నువ్వంటే ఇష్టమే. మతంతో సంబంధంలేని ప్రేమ నిస్వార్ధమైనదని నేను నమ్ముతాను. నీ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయ్. ప్రేమతో మీ బాపు (నాన్న)' కమల్ ట్వీట్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్షర హాసన్ మాట్లాడుతూ.. ఆస్తికత్వంపై నమ్మకం లేదంటూనే బౌద్ధమతానికి మారానని చెప్పింది. తనకు అక్క శృతీహాసన్ మాదిరిగా దేవుడిపై నమ్మకం లేదని, అయితే ఆసక్తితోనే బౌద్దమతం స్వీకరించినట్లు అక్షర వివరించింది. శివ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న వివేగం చిత్రం ద్వారా ఆమె కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. సంబంధిత కథనం అందుకే మతం మారాను: నటి Hi. Akshu. Have you changed your religeon? Love you, even if you have. Love unlike religeon is unconditional. Enjoy life . Love- Your Bapu — Kamal Haasan (@ikamalhaasan) 28 July 2017 -
అందుకే మతం మారాను: నటి
చెన్నై: ఆస్తికత్వంపై నమ్మకం లేదంటూనే బౌద్ధమతానికి మారానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ రెండో కూతురు అక్షరహాసన్ చెప్పింది. ఆ మధ్య షమితాబ్ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన ఈ బ్యూటీ తాజాగా స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న వివేగం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ నేపథ్యంలో అక్షరహాసన్ ఇటీవల చెన్నైలో విలేకరులతో మాట్లాడింది. చిన్ననాటి నుంచే దర్శకత్వంపై ఆసక్తి ఉందని ఆమె తెలిపింది. ముంబయిలో కొన్ని చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పని చేశానని చెప్పింది. 'ప్రస్తుతం నటనపై ఆసక్తి కలగడంతో అటుగా దృష్టి సారిస్తున్నాను. అమ్మా, నాన్న, అక్క, ఇతర బంధువులు అందరూ ఈ రంగంలోనే ఉన్నారు. వారందరితో ఒక మూవీ చేయాలనుంది. ముందు దర్శకురాలిగా ఓ విజయం సాధించిన తరువాత అమ్మానాన్న, అక్క కాల్షీట్స్ తీసుకుని వారితో సినిమా చేస్తాను. నాకు అక్క మాదిరి దేవుడిపై నమ్మకం లేదు. అయితే ఆసక్తితోనే బౌద్దమతం స్వీకరించాను. నాన్న కమల్‌హాసన్ గురించి చాలా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా.. లేదా.. అన్నది ఆయన ఇష్టం. దాని గురించి మాట్లాడబోనని' నటి అక్షరహాసన్ స్పష్టం చేసింది. -
అక్క బాటలోనే చెల్లి అక్షర..
చెన్నై: నటుడు కమల్‌హాసన్ రెండో వారసురాలు అక్షరహాసన్ కూడా హీరోయిన్ అవుతున్నారు. తన అక్క శ్రుతీహాసన్‌లా వృత్తిపరంగా కోరుకున్నది ఒకటి, జరిగింది మరోకటి. అక్క సింగర్ కావలనుకొని హీరోయిన్ అయితే చెల్లి అక్షర డైరెక్టర్ కావలనుకొని హీరోయిన్ కాబోతుంది. శ్రుతీహాసన్‌కు సంగీతంపై మక్కవతో సంగీత రంగంలో రాణించాలని ఆశ పడిందన్న విషయం తెలిసిందే. కేరీర్ తొలి రోజుల్లో పలు ప్రైవేట్ సంగీత ఆల్బమ్‌లు చేసింది ఈ అమ్మడు. ఇక తన తండ్రి కమలహాసన్ ఉన్నైపోల్ ఒరువన్ చిత్రంతో సంగీత దర్శకురాలిగాను సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే అనూహ్యంగా హిందీ లక్ చిత్రంతో హీరోయిన్గా అవాతారమెత్తింది ఈ చైన్నై భామ. తెలుగు చిత్రం గబ్బర్‌సింగ్‌తోనే స్టార్డంను కూడా సంపాదించుకుంది. ఇక అక్షరహాసన్ కెమెరా వెనుక కెప్టెన్ కావాలని ఆశించారు. అందుకు దర్శకుడు బాల్కీ వద్ద సహాయదర్శకురాలిగా పని చేశారు కూడా. అయితే యాదృశ్చికంగానే హిందీ చిత్రం షమితాబ్ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసింది ఈ పిల్లికల్ల సుందరీ. తాజాగా అజిత్ హీరోగా నటిస్తున్న వివేగం చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ అక్షరహాసన్ కథానాయకి కాదు. కాగా తాజాగా హీరోయిన్ అవకాశం ఈమెను వరించిందని సమాచారం. అయితే ఈ అవకాశం అక్షరకు శాండల్‌వుడ్‌లో రావడం విశేషం. కన్నడంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్ వారసుడు విక్రమ్ చంద్రన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో అక్షరహాసన్ ఆయనకు జంటగా నటించనున్నారని సినీవర్గాల సమాచారం. -
అజిత్ కంటే ముందే..
విజయాల క్రెడిట్‌ను ఓన్ చేసుకోవడం, అపజయాలకు ఇతరులను బాధ్యుల్ని చేయడం తెలివైన వారి పని. కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారనిపిస్తోంది. ఈ బ్యూటీ తన అక్క శ్రుతీహాసన్ మాదిరిగానే నటిగా తొలుత బాలీవుడ్లో పరిచయం అయ్యారు. ఆ తరువాతనే ఇప్పుడు వివేకం చిత్రంతో కోలీవుడ్‌కు రానున్నారు. ఇందులో అజిత్ కథానాయకుడు, కాజల్‌అగర్వాల్ నాయకి. కాగా ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మూడు రోజుల్లోనే కోటి మంది వీక్షకులను ఆకట్టుకుంది. ఇది ప్రపంచ రికార్డు అట. దీంతో అజిత్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. వారితో పాటు సంతోషాన్ని పంచుకుంటున్న నటి అక్షరహాసన్. ఈ అమ్మడు తన ప్రపంచ రికార్డు సాధించిన చిత్రం తనదే అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. తన చిత్రం ఈ రికార్డును సాధించడం ఆశ్చార్యాన్ని కలిగిస్తోందని, ఇందుకు కారణం అయిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ చిత్ర కథానాయకుడు అజిత్, కథానాయకి కాజల్‌అగర్వాల్‌ల కంటే ముందే తాను వివేగం చిత్ర టీజర్ రికార్డును ఓన్ చేసుకునే ప్రయత్నంలో పడ్డారు.ఈ విధంగా పాపులర్ అవ్వాలనుకుంటున్నారని భావించవచ్చు. ఈ భామకు తమిళంలో వివేగం తొలి చిత్రం అన్నది గమనార్హం. -
సంచలన వ్యాఖ్యలు చేసిన బ్యూటీ..
విజయాల క్రెడిట్‌ను ఓన్ చేసుకోవడం, అపజయాలకు ఇతరులను బాధ్యుల్ని చేయడం తెలివైన వారి పని. కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారనిపిస్తోంది. ఈ బ్యూటీ తన అక్క శ్రుతీహాసన్ మాదిరిగానే నటిగా తొలుత బాలీవుడ్లో పరిచయం అయ్యారు. ఆ తరువాతనే ఇప్పుడు వివేగం చిత్రంతో కోలీవుడ్‌కు రానున్నారు. ఇందులో అజిత్ కథానాయకుడు, కాజల్‌అగర్వాల్ నాయకి. కాగా ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మూడు రోజుల్లోనే కోటీ మంది వీక్షకులను ఆకట్టుకుంది. ఇది ప్రపంచ రికార్డు అట. దీంతో అజిత్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. వారితో పాటు సంతోషాన్ని పంచుకుంటున్న నటి అక్షరహాసన్. ఈ అమ్మడు తన ప్రపంచ రికార్డు సాధించిన చిత్రం తనదే అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. తన చిత్రం ఈ రికార్డును సాధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఇందుకు కారణం అయిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ చిత్ర కథానాయకుడు అజిత్, కథానాయకి కాజల్‌అగర్వాల్‌ల కంటే ముందే తాను వివేగం చిత్ర టీజర్ రికార్డును ఓన్ చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈ విధంగా పాపులర్ అవ్వాలనుకుంటున్నారని భావించవచ్చు. ఈ భామకు తమిళంలో వివేగం తొలి చిత్రం అన్నది గమనార్హం. -
తల్లిగా ఎలా నడుచుకోవాలో మా అమ్మ నేర్పించింది!
పెళ్లికి ముందే గర్భవతి అయితే? అప్పటివరకూ ప్రేమగా ఉన్న ప్రియుడు తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టపడకపోతే.. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ బాధ ఎలా ఉంటుందో అక్షరా హాసన్ అనుభవించారు. అయితే రియల్ లైఫ్‌లో కాదు. ‘లాలీ కీ షాదీ మే లడ్డూ దీవానా’ అనే హిందీ చిత్రంలో అక్షర ఈ పాత్ర చేశారు. కెరీర్ ఆరంభించిన తక్కువ సమయంలో, అది కూడా పాతికేళ్ల వయసులో ఇలాంటి పాత్ర చేయడానికి చాలామంది నాయికలు ఇష్టపడరు. కానీ, ఈ క్యారెక్టర్ ద్వారా మంచి సందేశం ఇచ్చే వీలు ఉందని అక్షర ఒప్పుకున్నారు. ఆ విషయం గురించి ఆమె చెబుతూ – ‘‘పెళ్లికి ముందే తల్లయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనేది చూపించే చిత్రం ఇది. ప్రెగ్నెంట్ లేడీస్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అందుకని ఈ పాత్ర ఎలా చేయాలా? అని ఆలోచించాను. లక్కీగా తల్లిగా ఎలా నడుచుకోవాలో మా అమ్మ (నటి సారిక) నేర్పించింది. కచ్చితంగా నా నటన అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా’’ అన్నారు. -
నాన్న అలాంటివి చాలా చూశారు
తన తండ్రి వివాదాంశ సంఘటనలను చాలా ఎదుర్కొన్నారని విశ్వనటుడు కమలహాసన్ రెండవ కూతురు అక్షరహాసన్ పేర్కొన్నారు. నిజమే కమలహాసన్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాంశంగా మారాయి. ఇటీవల ఒక చానల్‌కిచ్చిన భేటీలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి అడిగిన ప్రశ్నకు కమల్ మహాభారతంలోని ఒక అంశాన్ని ఉదాహరణగా చూపారు. ఇందుకు హిందు మక్కల్ కట్చి తీవ్రంగా ఖండించింది. కమలహాసన్ వ్యాఖ్యలు పురాణాలు కించపరచేవిగా ఉన్నాయంటూ ఆరోపించారు. అదే ఇదే అంశంపై వళ్లియూర్, కుంభకోణం ప్రాంతాల్లో కమల్‌పై కోర్టులో పిటిషన్లు నమోదయ్యాయి. బెంగళూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.ఈ అంశంపై కమలహాసన్ రెండవ కూతురు అక్షరహాసన్ స్పందిస్తూ ఇలాంటి వివాదాస్పదమైన సంఘటనలను తన తండ్రి చాలా ఎదుర్కొన్నారన్నారు. ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు తన తండ్రి చాలా ఆలోచిస్తారని అన్నారు. అది చాలా అర్ధవంతంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం నాన్న శభాష్‌నాయుడు చిత్రంలో నటిస్తున్నారని, అందులో తన అక్క కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు.ఈ చిత్రంలో నటించాలని తనకూ ఆశగా ఉందని, అలా కథలో అవకాశం ఉంటే తప్పకుండా నటిస్తానని అక్షరహాసన్ అన్నారు. అదే విధంగా హిందీలో ఒక చిత్రం చేస్తున్నానని, ఈ చిత్రంలో మంచి సందేశం ఉంటుందని అక్షరహాసన్ చెప్పారు. -
75 కోట్లతో... 12 దేశాల్లో...
కోలీవుడ్‌లో ఫుల్ ఫాంలో ఉన్న స్టార్ హీరో అజిత్. అభిమానులు తలా అని ప్రేమగా పిలుచుకునే అజిత్.. ఏ మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా వరుసగా మాస్ మసాలా ఎంటర్టైనర్లతో అలరిస్తున్నాడు. అజిత్ తాజా చిత్రం వేదలం కూడా వంద కోట్ల కలెక్షన్లు సాధించి అజిత్ మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. వీరం, వేదలం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన అజిత్, శివల కాంబినేషన్లో ప్రస్తుతం మరో సినిమా రూపొందుతోంది. ఈ కాంబినేషన్‌పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అజిత్ సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్న ఈ సినిమాను 12 దేశాల్లో షూట్ చేస్తున్నారు. ఇప్పటికే బల్గేరియాతో పాటు యూరప్ లోని మరికొన్ని దేశాల్లో షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలోనూ ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలో మరికొన్ని దేశాల్లో షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టిజీ త్యాగరాజన్ నిర్మాత. అజిత్ సరసన కాజల్ అగర్వాల్‌తో పాటు అక్షర హాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. -
ఏకే 57లో అక్షరాహాసన్
కమల్‌హాసన్.. తిరుగులేని కథానాయకుడు. ఈ లోకనాయకుడికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కూతుళ్లిద్దరూ ముంబైలో పెరగడం వలనో ఏమో మాతృభాష తమిళంలో కాకుండా హిందీ సినిమాలతో తెరంగేట్రం చేశారు. అక్క శ్రుతీహాసన్‌లా చెల్లెలు అక్షరాహాసన్కీ తొలి చిత్రంతో హిందీలో చుక్కెదురైంది. అమితాబ్ బచ్చన్, ధనుష్ హీరోలుగా నటించిన ‘షమితాబ్’తో అక్షరాహాసన్ హీరోయిన్గా పరిచయమయ్యారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దాంతో సినిమాల ఎంపిక విషయంలో ఈ బ్యూటీ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. తాజాగా ఓ తమిళ చిత్రం అంగీకరించారు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో అక్షరాహాసన్ నటిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ ఓ కథానాయిక. అక్షర మరో నాయిక. తమిళంలో తనకిది మొదటి చిత్రం. అజిత్‌కి ఇది 57వ చిత్రం. ఇంకా పేరు ఖరారు చేయలేదు కాబట్టి, వర్కింగ్ టైటిల్‌గా ‘ఏకే 57’ అంటున్నారు. తెలుగులో ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ అజిత్ హీరోగా ‘వీరమ్’, ‘వేదాళం’ వంటి రెండు హిట్ చిత్రాలిచ్చారు. కాబట్టి.. హ్యాట్రిక్ ఖాయం అనే నమ్మకంతో అజిత్ ఫ్యాన్స్ ఉన్నారు. -
ఆటోలో...అలా.. అలా...!
‘చల్లో.. చల్లో.. హవా మే గాడీ చల్లో. హమారే సాత్ చల్లో..’ అంటూ ‘బెంగాల్ టైగర్’లో రవితేజ, రాశీఖన్నా కారు, బైక్.. ఇలా పలు వాహనాల్లో వెళుతూ పాట పాడుకున్నారు. ఇప్పుడు రియల్‌గా శ్రుతీహాసన్, ఆమె చెల్లెలు అక్షరా హాసన్ కూడా ఈ పాటలో ఉన్నట్లే చేశారు. కాకపోతే ఆ జంట కారు, బైక్‌లో వెళితే ఈ అక్కాచెల్లెళ్లు ఆటోలో జర్నీ చేశారు. చెన్నై సిటీ అంతా మూడు చక్రాల వాహనంలో ఆనందంగా చక్కర్లు కొట్టేశారు. ఈ ఆనందం వెనక కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! గత వారం కమల్ కాలికి గాయమైనప్పుడు శ్రుతీహాసన్ నార్వేలో ఉన్నారు. నాగచైతన్య సరసన నటిస్తున్న ‘ప్రేమమ్’ పాటల చిత్రీకరణ నిమిత్తం అక్కడ ఉండాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు తండ్రికి ఎలా ఉందోనని ఫోన్ చేసి తెలుసుకుంటూనే ఉన్నారట. నార్వేలో షూటింగ్ పూర్తయిన వెంటనే చెన్నైకి వచ్చిన శ్రుతి నేరుగా తండ్రి దగ్గరికి వెళ్లారు. హాస్పిటల్లో కమల్‌ను చూసిన తర్వాత గానీ శ్రుతి మనసు కుదుట పడలేదట. తండ్రి కోలుకోవడం చూసి రిలీఫ్ అయిపోయారు. ఆ తర్వాత చెల్లెలు అక్షరాహాసన్తో కలసి ఆటోలో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోలో తిరగడం శ్రుతీకి అలవాటు. ఈ ఏడాది మార్చిలో స్నేహితులతో అర్ధరాత్రి ఆటోలో చక్కర్లు కొట్టారు. -
చెల్లెలి కోసం శృతి రికమండేషన్
లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త ఇబ్బంది పడినా తరువాత సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే అదే బాటలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అమితాబ్ లాంటి లెజెండరీ యాక్టర్‌తో షమితాబ్ సినిమాలో పరిచయం అయిన అక్షర తనని తాను ప్రూవ్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యింది. తొలి సినిమాతో ఫెయిల్ అయిన ఈ బ్యూటికి తరువాత ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. దీంతో తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శభాష్ నాయుడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది అక్షర. అయితే తాజాగా ఈ నీలికళ్ల సుందరికి ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అక్షరకు ఛాన్స్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో ఇదే కాంబినేషన్లో తెరకెక్కిన వేదలం సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇప్పుడు శృతి రికమండేషన్‌తోనే అక్షరకు ఛాన్స్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో అక్షర హాసన్‌ది హీరోయిన్ పాత్ర మాత్రం కాదట. అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా కావటంతో సపోర్టింగ్ రోల్‌కు కూడా ఒకే చెప్పేసింది ఈ స్టార్ వారసురాలు. -
ఏకే 57లో అక్షరహాసన్?
అజిత్ 57వ చిత్రంలో కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ నటించే అవకాశం ఉందన్నది తాజా సమాచారం. వేదాళం వంటి విజయవంతమైన చిత్రం తరువాత అజిత్ తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ఇది ఆయన నటించే 57వ చిత్రం అవుతుంది. దీనికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు వీరం, వేదాళం చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పడు ముచ్చటగా మూడో చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై త్యాగరాజన్ నిర్మింస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే నిరాడంబరంగా ప్రారంభం అయ్యాయి. ఇందులో కాథానాయకిగా అనుష్క నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమెకు సంబంధించిన అంశాన్ని నిర్మాతలు ఇప్పటికీ ప్రస్తావించ లేదు. ఇందులో కాజల్‌అగర్వాల్ ఒక నాయకిగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ అతిథిగా కీలక పాత్రలో నటించే అవకాశం ఉందనే కోలీవుడ్ వర్గాల ప్రచారం. అక్షర ప్రస్తుతం తన తండ్రి కమలహాసన్,అక్క శ్రుతిహాసన్‌లు కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్నారు. అజిత్ చిత్రంలో నటించే విషయం నిజమైతే ఇదే అక్షరహాసన్ తొలి తమిళ చిత్రం అవుతుంది.ఇక పోతే అజిత్ ఇందులో హీరోతో పాటు విలన్ పాత్రను తనే పోషించనున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ చిత్రంలో అజిత్‌తో కలిసి నటుడు కరుణాస్ తొలిసారిగా నటించనున్నారు.ఈ చిత్రం ఆగస్ట్ మొదటి వారంలో బల్గేరియాలో చిత్రీకరణకు శ్రీకారం చుట్టనుందని సమాచారం. -
మీ ప్రేమను బ్రేకప్ చేసుకోండి
సాధారణంగా యువతీయువకులు ప్రేమించుకోవడం ఆ తరువాత ఏదో కారణంగా విడిపోవడం ఇప్పుడు విరివిగా జరుగుతున్న విషయమే. అదేవిధంగా ప్రేమికులను విడదీయడానికి వారి తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. ఇక సినిమా రంగంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. నటుడు కమలహాసన్ మొదటి భార్య, సీనియర్ నటి సారికకు తన కూతురు ప్రేమకు విలన్‌గా మారక తప్పలేదు.ఈమె పెద్ద కూతురు, నేటి టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్ అసలు పెళ్లితో పనేంటి అన్నట్లుగా మాట్లాడుతుంటే, రెండో కూతురు, వర్ధమాన నటి అక్షరహాసన్ ప్రేమలో మునిగితేలుతుండడం గమనార్హం. షమితాబ్ అనే ఒకేఒక్క హిందీ చిత్రంతో తెరపైకి వచ్చిన అక్షరహాసన్ అంతకు ముందు తెర వెనుక సహాయదర్శకురాలిగా కొన్ని రోజులు పని చేశారు.అయితే అప్పటి నుంచే అక్షరహాసన్ సీనియర్ నటి రతి కొడుకు తనుజ్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరి డేటింగ్ విషయం మీడియాలో హల్చల్ చేసింది. తనుజ్ నటించిన లవ్ యూ సానియో చిత్రం విజయ తీరం చేరలేదు. అటు అక్షరహాసన్ నటించిన షమితాబ్ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో వీరిద్దరూ ప్రేమలో మునిగి నటనపై దృష్టిసారించడం లేదన్న విషయాన్ని వారి తల్లులకు సన్నిహితులు ఉప్పందించడంతో నటి సారిక, రతి ఇద్దరూ తమ వారసుల్ని పిలిచి కొంత కాలం మీ ప్రేమకు బ్రేక్ అప్ చెప్పి నటనపై ఏకాగ్రత చూపండి అని హితవు పలికారట. దీంతో అక్షరహాసన్, తనుజ్ తమ ప్రేమను బ్రేక్అప్ చెసుకున్నారని సినీ వర్గాల సమాచారం. -
'తను నా రాజకుమారి'
అందాల తార శృతి హాసన్ తన సోదరి అక్షర హాసన్ మీద ఉన్న ప్రేమంతా ట్వీట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఇవాళ (సోమవారం) అక్షర హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తూ శృతి ట్వీట్ చేశారు. అక్షర గురించి శృతి మాట్లాడుతూ.. తను నా రాజకుమారి అని, చెల్లెలి సంరక్షణ విషయంలో ఎప్పుడూ జాగ్రత్త తీసుకుంటానని, అక్షర సాధిస్తున్న విజయాలు చూసి గర్వపడుతుంటానని చెప్పుకొచ్చారు. అలాగే విషెస్ చెప్తూ తన పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేసిన అభిమానులందరికీ థ్యాంక్యూ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు అక్షర హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారికల ముద్దుల తనయలు శృతి, అక్షర.. ఇద్దరూ కూడా నాన్నలానే బహు ముఖ ప్రజ్ఞాశాలులు. శృతి నటనతోపాటు సంగీతంలో కూడా ప్రావీణ్యురాలన్న విషయం తెలిసిందే. ఇక అక్షర విషయానికొస్తే.. 'షమితాబ్' చిత్రం ద్వారా తొలిసారి బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన అక్షర మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలందుకుంది. తెర మీద కనబడకముందు ఆమె అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారు. Happy birthday @AksharaHaasan1 love -
ఆ టైం ఇంకా రాలేదు
సినిమానే శ్వాసగా జీవిస్తున్న కుటుంబానికి చెం దిన నటి అక్షరహాసన్. ఈ బ్యూటీఫుల్ వర్ధమానతార గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. పులి కడుపున పిల్లి పుడుతుందా? అన్న సామెతను నిజం చేస్తూ తొలి చిత్రం తోనే నటిగా తానేమిటో నిరూపించుకున్నారు అక్షరహాసన్. నటననే నడకలు నే ర్పే విశ్వనాయకుడు కమలహాసన్, సారికల రెండవ కూతురు అక్షర. పెద్ద కూతురు శ్రుతిహాసన్ అనతికాలంలో నే భారతీయ సినిమాలో తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు అక్షర ఆ ప్రయత్నంలో ఉన్నారు. సోదరీమణులలోనే వీరిద్దరి మధ్య సామిప్యం ఏమిటంటే శ్రుతి మొదట సంగీ త రంగంలో రాణించాలని భావించారు. అటుగా తొలి అడుగులు వేశారు కూడా. ఉన్పైల్ ఒరువన్ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలని ముద్ర వేసుకున్నారు. తండ్రి నటించిన చిత్రానికి తనయ సంగీతం అందించడం అరుదైన విషయమే. ఆ తరువాత శ్రుతి నటనపై దృష్టి సారించి నేడు ప్రముఖ హీరోయిన్గా విరాజిల్లుతున్నారు. ఇక అక్షరహాసన్ విషయానికొస్తే ఈమె తొలుత తెరవెనుక రాణించాలని కోరుకున్నారు. అలా దర్శకత్వ శాఖలో ఓనమాలు దిద్దారు కూడా. అయితే అనూహ్యంగా అక్క శ్రుతి మాదిరిగానే అక్షర కూడా కెమెరా ముందు కొచ్చేశారు. హిందీ చిత్రం షమితాబ్లో బాలీవుడ్ బిగ్ బీ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ల మధ్య నటించి శభాష్ అనిపించుకున్నారు. దీంతో ఇటు దక్షిణాదిలోను అటు ఉత్తరాదిలోను అవకాశాలు తలుపుతడుతున్నాయి. తమిళంలో ధనుష్‌కు జంటగా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నటి అక్షరహాసన్ ఎలా స్పం దించారో చూద్ధాం. నాకు తమిళం, తెలుగు చిత్రాల్లో నటించాలని ఆశగానే ఉంది. అయితే అందుకు తగిన సమయం ఇంకా రాలేదని భావిస్తున్నాను. మొదట హిందీ చిత్ర సీమలో నటిగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం అక్కడ సాధించిన తరువాత ఖచ్చితంగా తమిళం, తెలుగు భాషలలో నటిస్తాను. నా తల్లిదండ్రులు కమలహాసన్, సారిక గొప్ప నటులని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వారు స్వేచ్ఛ నిచ్చారు. నన్ను నేను మం చి నటిగా తీర్చిదిద్దుకోవడానికి కృషి చేస్తున్నాను. ప్రస్తుతం నూతన చి త్రాలేమీ అంగీకరించలేదు. కథలు వింటున్నాను. -
నా పెళ్లి డ్రెస్ కూడా ఇలానే ఉండాలి!
మేని ఛాయకు రెట్టింపు అందం చేకూర్చే లేలేత గులాబీ రంగు గాగ్రా చోళీలో అక్షరా హాసన్ ఎర్ర తివాచీపై ప్రత్యక్షం కాగానే, ఒక్కసారిగా అందరి చూపులూ ఆమెపైనే పడ్డాయి. చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వి, సుతిమెత్తగా అడుగులేస్తూ, వయ్యారంగా అక్షర నడుస్తుంటే చూపులు తిప్పుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. ఇటీవల అక్షర చేసిన ఓ ర్యాంప్ వాక్‌లో ఇలా జరిగింది. డిజైనర్ రీనా ధాకా కోసమే అక్షర ఈ వాక్ చేశారు. ఆమె డిజైన్ చేసిన లేలేత గులాబీ రంగు గాగ్రా చోళీలో అక్షర మెరిసిపోయారు. ఆ డిజైనర్ వేర్ చాలా సౌకర్యవంతంగా అనిపించిందని, చాలా నచ్చిందని అక్షర పేర్కొన్నారు. ఆ డ్రెస్ ఆమెకు ఎంతగా నచ్చిందంటే, తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఈ డిజైనర్ వేర్లాంటిదే డిజైన్ చేసివ్వమని రీనాని అడుగుతానని అంటున్నారు. ఫ్యాషన్ గురించి అక్షర మాట్లాడుతూ - ‘‘ఎంత ఖరీదు గల డ్రెస్ వేసుకున్నా, అది శరీర కొలతలకు తగ్గట్గుగా లేకపోతే వేస్ట్. అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, మనసంతా ఆ డ్రెస్ మీదే ఉంటుంది. నా మటుకు నేను ఏ డ్రెస్ వేసుకున్నా కంఫర్ట్‌గా ఉండాలనుకుంటాను. ఆ తర్వాతే ఫ్యాషన్ గురించి ఆలోచిస్తాను’’ అన్నారు. ఇదిలా ఉంటే, ‘షమితాబ్’ చిత్రం ద్వారా అక్షర కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలై, ఆరు నెలలవుతున్నా ఆమె వేరే చిత్రం అంగీకరించలేదు. ప్రస్తుతం కొన్ని చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, తాను చేయబోయే చిత్రం గురించి త్వరలో ప్రకటిస్తానని అక్షర పేర్కొన్నారు. తండ్రి కమల్‌హాసన్, అక్క శ్రుతీహాసన్‌తో కలిసి నటించే అవకాశం వస్తే, తప్పకుండా చేస్తానని కూడా ఆమె అన్నారు. -
అక్కని ఫాలో అవుతున్న చెల్లెలు
-
సమంత ప్లేస్‌లో...!
అక్క బాటలో చెల్లెలు అన్నట్లుగా.. శ్రుతీ హాసన్‌లానే అక్షరాహాసన్ కూడా హిందీ చిత్రంతోనే నాయికగా పరిచయమయ్యారు. అక్షర నటించిన తొలి చిత్రం ‘షమితాబ్’ ఆశించిన ఫలితం సాధించలేదు. జయాప జయాల సంగతెలా ఉన్నా, నటిగా అక్షర మంచి మార్కులే సంపాదించుకున్నారు. ‘షమితాబ్’ తర్వాత ఈ క్యూట్‌గాళ్ వేరే చిత్రాలేవీ అంగీకరించలేదు. అయితే తాజాగా విశాల్ హీరోగా రూపొందనున్న ‘పందెం కోడి’ సీక్వెల్ ‘పందెం కోడి 2’లో నటించడానికి అంగీకరించారట. ఈ చిత్రంలో ముందు సమంతను తీసుకున్నారనే వార్త ప్రచారమైంది. తాజాగా అక్షర పేరు వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే.. ‘పందెం కోడి’ తొలి భాగంలో నటించిన మీరా జాస్మిన్ ఈ సీక్వెల్లో కీలక పాత్ర చేయనున్నారని భోగట్టా. -
నటించాలన్నది నా నిర్ణయమే
ఒక స్టార్ కుటుంబం నుంచి వచ్చే నటి కథానాయికగా పరిచయ చిత్రం అనగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.ఆ చిత్రంలో నాయకి పాత్రను ఎలివెట్ చేసే సన్నివేశాలుండాలి, నటనకు అవకాశం ఉండాలి, యువతను ఆకర్షించే సన్నివేశాలుండాలి, గ్లామర్ ఉండాలి, టాప్ దర్శకుడై ఉండాలి, పెద్ద నిర్మాణ సంస్థ అయ్యుండాలి లాంటి పలు అంశాల గురించి ఆలోచిస్తారు. అలాంటిది ఒక గొప్ప నట కుటుంబం నుంచి వచ్చే అమ్మాయి అయితే ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే అలాంటి నరనరాల్లో నటనే ప్రవహించే కుటుంబం నుంచి వచ్చి అక్షరహాసన్ తెరంగేట్రం గురించి అంత పరిశీలన జరిగిందా? అన్న విషయాన్ని పక్కన పెడితే ఆమె నటించిన తొలి చిత్రాన్ని గమనిస్తే ఒక్క నటన కు తప్ప మరే అంశానికి ప్రాముఖ్యతనిచ్చినట్లు కనిపించదు. అక్షర పాత్రకు ఒక్క పాట ఉండదు. రొమాన్స్ ఉండదు. హాస్యపు పాళ్లు కూడా కనిపించవు. ఒక్క నటన పైనే ఆధారపడ్డ పాత్ర. పైగా బాలీవుడ్ మహానటుడు అమితాబ్‌బచ్చన్, కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ సహనటులు. అలాంటి పాత్రను అవలీలగా చేసి సకలకళావల్లభుడు కమలహాసన్ వారసురాలనిపించుకున్నారు అక్షరహాసన్. ఆ చిత్రమే షమితాబ్ అసలు నటనే వద్దు తెర వెనుక సాధిస్తానన్న అక్షర నటిగా తెరంగేట్రం చేయడానికి కారణం ఏమిటీ?అసలు నటిగా ఆమె అరంగేట్రం సినీ రంగమే నా?వీటి వెనుక గల ఆసక్తికర అంశాలేమిటో చూద్దాం ప్ర: నటనే వద్దనుకున్న మీరు నటిగా ప్రవేశించడానికి కారణం? జ:నిజం చెప్పాలంటే నటినవ్వాలని నాపై ఎవరి ఒత్తిడి లేదు. అలాగే నటుడి కూతురు నటి అవ్వాలనీ లేదు. నా తల్లిదండ్రుల బలవంతం అస్సలు లేదు. నటించాలన్నది పూర్తిగా నా నిర్ణయమే. ఇక నటినవ్వాలనే నిర్ణయానికి రావడానికి కారణం లేకపోలేదు. నృత్యం, ఫుట్‌బాల్ క్రీడలంటే నాకెంతో ఆసక్తి. వాటిలో శిక్షణ పొందాను. అలాంటి సమయంలో అనూహ్యంగా ఏర్పడ్డ విపత్తులో రెండు కాళ్లు బాధింపునకు గురయ్యాయి. దీంతో చికిత్సానంతరం ఏడాదిన్నర పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. దాంతో నృత్యం, ఫుట్‌బాల్ క్రీడలను పక్కన పెట్టి దర్శకత్వంపై దృష్టి సారించాలనుకున్నాను.అలా సహాయ దర్శకురాలి అవతారం ఎత్తాను. ప్ర: మరి మీలో నటి ఉన్నారన్న విషయాన్ని ఎప్పుడు గ్రహించారు? జ: కాళ్లగాయాలతో ఏడాదిన్నర విరామంతో చాలా మనోవేదనకు గురయ్యాను. చెన్నైలో కృతిక అనే స్నేహితురాలుంది. తను మంచి నాట్య కళాకారిణి, రంగస్థల నటి. ఒక నాటకంలో నన్ను నాట్యం చేయమని అడిగింది. నా ఆసక్తిని ఆమెకు చెప్పడంతో సరే నటించూ అని అంది. అలా ఆ నాటకంలో నటించాను. అంతేకాదు నటనలో అంత సంతోషం ఉంటుందని అప్పుడే అర్థమైంది. నటనపై ఆసక్తి పెరిగింది. ప్ర: షమితాబ్లో నటించే అవకాశం ఎలా వచ్చింది? జ; నటనపై ఆసక్తి కలిగిన తరువాత నేను విన్న తొలి కథ షమితాబ్. కథ నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పాను. ప్ర: ఆ చిత్రంలో అమితాబ్, ధనుష్ లాంటి సీనియర్ నటులు నటించారుగా? జ; అవును. నేనాచిత్రంలో నటించడానికి అదీ ఒక కారణం ప్ర: మీ తల్లిదండ్రులిచ్చిన సలహా? జ:ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో పూర్తిగా దృష్టి సారించి కఠినంగా శ్రమించాలని చెప్పారు. ఏదీ అరకొరగా చేయకుండా పూర్తి ఏకాగ్రతతో కృషి చెయ్యాలని సలహా ఇచ్చారు. ప్ర:మీ నాన్న నటనలో మీకు నచ్చిన అంశం? జ:నాన్న నటనలో నచ్చింది హాస్యమే. నవ్వించడం చాలా కష్టం.అదీ ఒక కథానాయకుడిగా నవ్వించడం ఇంకా కష్టం. ఆ విధంగా నాన్న హాస్యం నాకెప్పుడూ ఆశ్చర్యమే. -
గ్లామర్‌కు మెరుగులు
విశ్వనాయకుడు కమలహాసన్ కుటుంబం నుంచి ప్రస్తుత చివరి నట పయనం అక్షరహాసన్. ఈమె కూడా తన అక్క శ్రుతిహాసన్ మాదిరిగానే తన నట జీవితానికి బాలీవుడ్ నుంచే శ్రీకారం చుట్టారు. అయితే శ్రుతిహాసన్‌లా కాకుండా అక్షర తొలి చిత్రంతోనే పలువురు ప్రశంసల్ని, మంచి విజయాన్ని అందుకున్నారు. షమితాబ్లో ఒక సహాయ దర్శకురాలిగా సహజమైన నటనను ప్రదర్శించి ఆ పాత్రకు జీవం పోశారు. బాలీవుడ్ బిగ్‌బి, కోలీవుడ్ సీనియర్నటుడు ధనుష్‌ల మధ్య నటించడం అంత అషామాషి విషయం కాదు. అయినా అక్షర తన పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఫలితం కోలీవుడ్, బాలీవుడ్‌లలో పలు అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయట. అయితే చిత్రాల ఎంపిక విషయంలో ఏ మాత్రం తొందరపడని అక్షరహాసన్ తన అందాన్ని పెంచుకునే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం. తొలి చిత్రం సమయంలో తన రూపంలోను, ధరించే దుస్తులపైనా ప్రత్యేక దృష్టి సారించని అక్షర చుట్టూ ప్రస్తుతం శారీరక కసరత్తులు, శిక్షకులు, కేశాలంకారణ నైపుణ్యాలు అందాన్ని మెరుగులు దిద్దే నిపుణులు అంటూ ఒక పెద్ద బృందమే చేరిపోయిందట. వీరంతా అక్షరను బాలీవుడ్ ఇండస్ట్రీకి తగ్గ ఫిగర్‌గా మార్చి చూపిస్తామని వాగ్దానాలు కూడా చేసేశారట. సమీప కాలంలో ఈమె ముంబయిలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రముఖ మోడల్స్‌తో కలిసి కవాత్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరచారట. ఈ విషయం గురించి అక్షర తెలుపుతూ ఒక నటికి దుస్తులు, అలంకార వస్తువులపై శ్రద్ధ ఎంత అవసరం అన్నది తెలుసుకున్నానన్నారు. ఒకపక్క గ్లామర్‌లో తన సోదరి శ్రుతి దుమ్మురేపుతుండడంతో అక్షరకు అలాంటి ఆశ పుట్టడమే మార్పుకు కారణం కావచ్చునంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
కమలహాసన్ చిత్రంలో అక్షర
అందరికీ ఆసక్తిని రేకెత్తించే ఒక క్రేజీ కాంబినేషన్లో చిత్రం రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. విశ్వనాయకుడు కమలహాసన్ చిత్రం అంటేనే అందులో అనేక విశేషాలు పొందుపరచి ఉంటాయని అంటుంటారు. మరి అలాంటి నటుడితో ఆయన రెండో కూతురు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోరుమీదున్న నటుడు ధనుష్ లాంటి వారు కలిస్తే ఇది నిజంగా క్రేజీ చిత్రమే అవుతుంది కదు. మరి ఈ భారీ చిత్రాన్ని నిర్మించేదెవరు? దర్శకత్వం చేపట్టేదెవరు? లాంటి వివరాలు తెలుసుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటుందికదా.. కమలహాసన్ చిత్రంలో నటించాలనే ఆసక్తిని ఆయన పెద్ద కూతురు నేటి క్రేజీ హీరోయిన్ శ్రతిహాసన్ చాలా కాలంగా వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య అలాంటి ఒక అవకాశం వచ్చినా ఆమె ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇటీవల హిందీ చిత్రం షమితాబ్ ద్వారా నాయకిగా తెరంగేట్రం అయిన తొలి చిత్రంతోనే చక్కని అభినయంతో ప్రతిభను చాటుకున్న కమల్ రెండో కూతురు అక్షర ఆయనతో నటించే అవకాశం కలిగే తరుణం ఆసన్నమైందన్నది తాజా సమాచారం. ఈ సంచలన చిత్రాన్ని యువ నటుడు ధనుష్ నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన ఒక ముఖ్య భూమికను పోషించనున్నారు. నటి అక్షరహాసన్‌కు కూడా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
లిప్‌కిస్‌కు ఓకే
పెదవి ముద్దుకైనా, ఈత దుస్తులకయినా రెడీ అంటోంది వర్ధమాన తార అక్షర హాసన్. ఈ బ్యూటీ నేపథ్యం గురించి కొత్తగా ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు. నటనకు నడకలు నేర్పిన కుటుంబం నుంచి వచ్చింది అక్షర. విశ్వనాయకుడు కమలహాసన్ వారసురాలు అక్షర అక్క శ్రుతిహాసన్ ఇప్పటికే నాయకిగా దూసుకుపోతున్నారు. హీరోయిన్ పాత్రల్లో శ్రుతిమించిన రొమాన్స్, ఐటమ్ సాంగ్స్ అంటూ ఎడాపెడా నటించేస్తున్నారు. అక్షర కూడా అక్కబాటలోనే పయనించడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. తొలి చిత్రం షమితాబ్ (హిందీ)లో చక్కని పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నారు. అమితాబ్ లాంటి లెజెండ్, ధనుష్ లాంటి అనుభవజ్ఞుడైన నటులు మధ్య పరిచయ నటిగా మెప్పించడం అంత సులభమైన పని కాదు. అయితే అక్షర తన పాత్రను సమర్థవంతంగా పోషించి ప్రశంసలు అందుకుంటున్నారు. షమితాబ్ చిత్రం షూటింగ్ దశలోనే అక్షరకు పలు అవకాశాలు వచ్చినా తొలి చిత్రం విడుదల అనంతరమే అంగీకరిస్తానంటూ చెప్పుకుంటూ వస్తున్నారట. మరి ఇప్పుడెలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అక్క మాదిరిగా గ్లామర్ పాత్రలు పోషిస్తారా? అన్న ప్రశ్నలకు అక్షర బదులిస్తూ అవార్డు కోసం నటించాలన్న ఆశ లేదన్నారు. కమర్షియల్ కథా నాయకిగానే ఎదగాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. కథ డిమాండ్ చేస్తే ఈత దుస్తులు ధరించడానికైనా, లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి కైనా రెడీ అంటూ కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడించారు. -
ఆకాశమే హద్దురా..
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. అంటే ఇదేనేమో..! ఓ సినిమాలో కమల్‌హాసన్ ఆడిన ‘ఆకాశం నీ హద్దురా.. అవకాశం వదలొద్దురా..’ అనే పాటను సీరియస్‌గా తీసుకుందే ఏమో ఆన్ స్క్రీన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతానంటోంది కమల్ చిన్న కూతురు అక్షర హాసన్. నటనలో బౌండరీలు పెట్టుకుంటే అనుకున్నది సాధించలేమని బడాయిపోతోంది. అంతటితో ఆగకుండా.. ‘నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు చాన్స్ వచ్చినప్పుడు నేనెందుకు వెనక్కి తగ్గాలి’ అంటూ తెగేసి చెప్పింది. ఇకముందు సిల్వర్ స్క్రీన్‌పై ఈ ముద్దుగుమ్మ ఎలా చెలరేగిపోతుందో చూడాలి మరి. -
నేను ఎటువంటి హద్దులు పెట్టుకోలేదు:అక్షర
ముంబై:అక్షర్ హాసన్.. ఈ మధ్యనే షమితాబ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తాను ఇండస్ట్రీలో ఎటువంటి హద్దులు పెట్టుకోలేదని అంటోంది.చిత్ర సీమలో ఎదగాలంటే ఫలనా మూవీనే చేయాలంటూ నియమాలు పెట్టుకోకూడదని స్పష్టం చేసింది.' మీరు హద్దులు ఏర్పరుచుకుంటే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టం. ఏ పాత్ర వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటాం' అని అక్షర తెలిపింది. తానైతే ఎటువంటి హద్దు ఏర్పరుచుకోకుండానే రాణిస్తానని పేర్కొంది. తనకు గత కొంత కాలంగా నటించే అవకాశాలు వస్తున్నా సరైన సమయం కోసం వేచి చూశానని తెలిపింది.తాను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కావడం వల్ల ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పోయానని పేర్కొంది. ధనుష్-అమితాబ్ బచ్చన్ లు నటించిన షమితాబ్ సినిమాలో తనకు అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. -
పవన్ కల్యాణ్ సరసన నటించనన్న హీరోయిన్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? అదీ టాలీవుడ్ ఎంట్రీకే అటువంటి బంపర్ ఆఫర్ వస్తే ఎవరైనా తిరస్కరిస్తారా? కానీ ఓ నూతన నటి అటువంటి అవకాశాన్ని వదులుకుంది. ఇది అక్షరాల నిజం. వెతుక్కుంటూ వచ్చిన అటువంటి అవకాశాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్, సారికల రెండవ కుమార్తె అక్షర హాసన్ వదులుకున్నారు. పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ మూవీ గబ్బర్‌సింగ్ 2లో హీరోయిన్గా నటించే అవకాశం అక్షరని వరించింది. అయితే ఈ నీల కళ్ల సుందరి ఆ బంపర్ ఆఫర్‌ని తిరస్కరించింది. టాలీవుడ్లో తన డెబ్యూ మూవీ అంతటి స్టార్ హీరో సరసన ఉంటే, ఇక తరువాతి సినిమాలపై భారీగా అంచనాలు పెరిగిపోతాయన్న భయాన్ని అక్షర వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతోంది. గబ్బర్‌సింగ్ పార్ట్ వన్‌లో అక్షర అక్క శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అక్షర హాసన్ నటించిన తొలి చిత్రం షమితాబ్ (హిందీ) చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఆర్.బల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న షమితాబ్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అలనాటి బాలీవుడ్ హీరోయిన్ రేఖ, తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
బంపర్ ఆఫర్ వచ్చినా నో చెప్పిన అక్షర
-
అతడితో డేటింగ్ చేశా
అమ్మానాన్నలు విడిపోవడం, వారి మధ్య దూరం నాకు ధైర్యానిచ్చిందంటోంది నవనటి అక్షర. ప్రఖ్యాత కమలహాసన్ చిన్న కూతురు అక్షర, అక్క శ్రుతిహాసన్ మాదిరిగానే తొలుత బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తోంది. అక్షర అక్కడ నటిగా నిలదొక్కుకున్న తరువాత తమిళ చిత్రాలు చేస్తానంటున్నారు. ఈమె ధనుష్ సరసన నటించిన హిందీ చిత్రం షమితాబ్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అక్షర తన మనోభావాలను పంచుకంటూ తన పదేళ్ల ప్రాయంలోనే అమ్మా నాన్న విడిపోయారని చెప్పారు. దాంతో తాను, అక్క శ్రుతి అమ్మ వద్దే పెరిగామని తెలిపారు. అయినా నాన్నతో సన్నిహితంగానే మెలిగామని చెప్పారు. తనకు మాత్రం అమ్మనే రాణి అని నాన్న తమతో చాలా సరదాగా ప్రవర్తిస్తారన్నారు. అమ్మనాన్నల ముద్దుబిడ్డగా తాను పెరిగానని తెలిపారు. దేవాలయాలు, చర్చిలను మాత్రం దర్శిస్తానని చెప్పారు. అక్కడ ఏదో ఒక శక్తి ఉంటుందనిపిస్తుందన్నారు. చిన్న వయసు నుంచే నృత్యం అంటే ఆసక్తి అని అందుకే సంప్రదాయ నృత్యం భరత నాట్యం నుంచి పాశ్చాత్య నృత్యాల వరకు నేర్చుకున్నానని తెలిపారు. అమ్మానాన్నలు విడిపోవడం వల్ల తాను ఎవరన్న విషయాన్ని అర్థం అయ్యేలా చేసిందన్నారు. అదే తనకు ధైర్యాన్ని కలిగించిందని చెప్పారు. అక్క శ్రుతిహాసన్ తన కెప్పుడూ రక్షణగానే నిలుస్తుందన్నారు. దర్శకత్వం చేయాలనే ఆశ తగ్గలేదని, కథలు కూడా సిద్ధం చేసుకుంటున్నానని చెప్పారు. ఈ ప్రతిభ నాన్న నుంచే అబ్బిందని చెప్పారు. తమిళ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నా ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా నిలదొక్కుకోవాలన్నారు. తాను హిందీనటుడు వివన్షాతో డేటింగ్ చేశానని, అయితే ప్రస్తుతం స్నేహితులుగా మాత్రమే నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. తాను కఠిన శ్రమ జీవి అని ఆత్మవిశ్వాసం అధికం అని అక్షర పేర్కొన్నారు. -
ఇళయరాజాకు ఘన సత్కారం
నేనెప్పటికీ ఇళయరాజానే అందులో ఏమార్పూ ఉండదు అంటున్నారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజ. ఈ సంగీత మాంత్రికుడిని ఇప్పటికే పలు అవార్డులు వరించాయి. తాజాగా తరైతప్పట్టై చిత్రంతో వెయి చిత్రాలకు సంగీతా న్ని అందించి అసాధారణ రికార్డును సాధించి ఘన సత్కారాన్ని అందుకున్నారు. ప్రఖ్యాత నటుడు అమితాబ్‌బచ్చన్, ధనుష్, అక్షరహాసన్ జంటగా నటించిన హిందీ చిత్రం షమితాబ్కు సంగీతాన్ని అందించారు. వెయ్యి చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమితాబ్ బచ్చన్ మంగళవారం ముంబయిలో ఇళయరాజాను ఘనంగా సత్కరించారు. షమితాబ్ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఈ అభినందన వేడుకకు వేదికైంది. బుధవారం చెన్నైకి తిరిగి వచ్చిన ఇళయరాజా చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో ముచ్చటిస్తూ తనకు తెలియకుండానే బాలీవుడ్ బిగ్‌బి ముంబయిలో అభినందన సభ ఏర్పాటు చేశారని తెలిపారు. వేదికపైన తనకంటే ముందే రజనీకాంత్, కమలహాసన్ లాంటి ప్రఖ్యాత నటులు ఆశీస్సులైవున్నారని తెలిపారు. వాళ్లంతా తనను ప్రశంసిస్తూ మాట్లాడడం సంతోషం కలిగించిందన్నారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇళయరాజా ఇలా బదులిచ్చారు. ప్రశ్న: నేటి తరం సంగీత దర్శకులు చాలామంది రాత్రి 11 గంటలకు సంగీతాన్నిఅందిస్తున్నారు. ఇకపై మీరు ఈ తరహా బాణిని అవలంభిస్తారా? జవాబు: నేనెప్పుడూ ఇళయరాజానే. నాలో ఎలాంటి మార్పు ఉండదు. నాకంటూ కొందరు నిర్మాతలు ఉన్నారు. ఇంతకుముందు ఎలాగైతే వేకువజామును నాలుగు లేక ఐదుగంటలకు సంగీతాన్ని మొదలెట్టే వాడినో ఇకపై కూడా తన దినచర్య అలానే కొనసాగుతుంది. -
శృతీహాసన్ సోదరి ప్రేమ!
ముంబై: టాలీవుడ్ - కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకొని హిందీలో కూడా నటిస్తున్న శృతీహాసన్ తన సోదరి అక్షర హాసన్‌పై అమితమై ప్రేమ వ్యక్తం చేస్తోంది. తన సోదరి అక్షర హాసన్ నటించిన తొలి చిత్రం 'షమితాబ్' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. షమితాబ్ ట్రైలర్ తనకు బాగా నచ్చిందన్నారు. శృతీహాసన్ నటించిన ఆరు చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వాటిలో నాలుగు హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఒక్కో చిత్రం ఉన్నాయి. ఆర్.బల్కీ దర్శకత్వంలో రూపొందుతున్నఅక్షర హాసన్ ప్రారంభ చిత్రం షమితాబ్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అలనాటి బాలీవుడ్ హీరోయిన్ రేఖ, తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. సోదరి అక్షర హాసన్‌తోపాటు ఈ సినిమా యూనిట్ మొత్తానికి శృతీహాసన్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. -
నాకే దక్కనిది..
‘నాకే దక్కనిది నా కూతురుకు దక్కింది. ఇది చాలా గొప్ప విషయంగా భావించాలి’ అంటున్నారు నటుడు కమలహాసన్ మాజీ భార్య, నటి సారిక. వీరి కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరహాసన్. ఈ నట కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తిగానే ఉంటుంది. శ్రుతిహాసన్ తమిళం, తెలుగు, హిందీ లాంటి భాషల్లో నటిగా దుమ్ము రేపుతుంటే తాజాగా ఆమె చెల్లెలు అక్షరహాసన్ నటిగా రంగ ప్రవేశం చేశారు. శ్రుతి తొలుత లక్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్గా రంగ ప్రవేశం చేసినట్లే అక్షర కూడా అక్క బాటలోనే పయనిస్తూ షమితాబ్ అనే హిందీ చిత్రంలోనే హీరోయిన్గా పరిచయమవుతున్నారు. వీరి సినీ పయనం వెనుక వాళ్ల తల్లి సారిక పాత్ర చాలా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం శ్రుతి తనీగా నివసిస్తోంది. అక్షర మాత్రం తల్లితోనే ఉంటున్నారు. అక్షర తొలుత దర్శకత్వ శాఖపై మొగ్గు చూపారు. ఆ విధంగా బాలీవుడ్ దర్శకుడు రాహుల్ దొలాక్య వద్ద శిష్యరికం కూడా చేశారు. అలాంటిది ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఆమె తల్లి సారిక స్పందిస్తూ దర్శకత్వంపై ఆసక్తి చూపిన అక్షర కథానాయకిగా మారడంతో తనకేమి ఆశ్చర్యం అనిపించలేదన్నారు. హిందీ చిత్రం షమితాబ్లో నటించే అవకాశం రాగానే తను ఒక విశ్వ విద్యాలయంలో చేరుతున్న భావం తనకు కలిగిందన్నారు. కారణం జాతీయ అవార్డు గ్రహీతలు అమితాబ్ బచ్చన్, ధనుష్‌లు ఆ చిత్రంలో నటించడమేనని అన్నారు. అక్షర గురించి ఒక్క విషయం చెప్పాలి. తను భయం అంటే ఏమిటో తెలియని వ్యక్తి. అయినా అమాయకురాలని అన్నారు. ఏవిషయమైనా అనుభవపూర్వకంగా చేస్తుందని తెలిపా రు. తన కళ్లకు చిన్నపిల్ల అనిపించినా ఎప్పటికైనా ఆమె జీవతం గురించి తనే నిర్ణయం తీసుకోవాలి కదా అని నటి అవ్వాలనే నిర్ణయాన్ని తనకే వదిలేశానని అన్నారు. షమితాబ్ షూటింగ్ మొదలైన నాటి నుంచి ప్రతిరోజూ ఆమె కోసం తాను ఇంట్లో ఎదురు చూస్తుంటానని తెలిపా రు. నటిగా ఆమె పని గురించి తనకు బాగానే తెలుసన్నారు. ఇకపోతే అమితాబ్‌బచ్చన్ లాంటి నటుడితో తనకు బుల్లితెరపైనే నటించే అవకాశం వచ్చిందని, అలాంటిది అక్షరకు తొలి చిత్రంలోనే ఆయనతో కలిసి నటించే అవకాశం కలగడం చాలా గొప్ప విషయమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
కమలహాసన్ రెండవ కూతురు ప్రేమ బ్రేక్అప్
ప్రేమించుకోవడం ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోవడం ఈ తరం యువతలో సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితి లోకమంతా ఉన్నా సినిమా రంగంలో కాస్త అధికమనే చెప్పాలి. తాజాగా నటి శ్రుతిహాసన్ చెల్లెలు, కమలహాసన్ రెండవ కూతురు అక్షర ప్రేమ కథ ఇలానే ముగిసింది. ప్రేమించుకోవడం ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోవడం ఈ తరం యువతలో సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితి లోకమంతా ఉన్నా సినిమా రంగంలో కాస్త అధికం అనే చెప్పాలి. శింబు, నయనతార, ప్రభుదేవ, నయనతార, శింబు, హన్సిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రేమ కథలు కంచికే చేరాయి. తాజాగా నటి శ్రుతిహాసన్ చెల్లెలు, కమలహాసన్ రెండవ కూతురు అక్షర ప్రేమ కథ సేమ్ తంతే. అక్షరకు మొదట్లో హీరోయిన్గా చాలా అవకాశాలు వచ్చినా ఆమె నిరాకరించి కెమెరావెనుక ఉండటానికి ఆసక్తి చూపారు. ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడివద్ద సహాయ దర్శకురాలిగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే నటుడు నసిరుద్దిన్షా కొడుకు వివాన్షాతో ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారాన్ని వీరిద్దరూ ఖండించలేదు. అయితే అక్షర తల్లి సారిక మాత్రం వీళ్ల వ్యవహారాన్ని కనిపెట్టి ప్రేమ, దోమ అంటూ జులాయిగా తిరగకుండా పనిమీద దృష్టి సారించు అంటూ చీవాట్లు పెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. ఏదేమైనా అప్పటి వరకు నటనకు దూరంగా ఉంటూ వచ్చిన అక్షర అక్క శ్రుతిహాసన్ సక్సెస్ జోరు చూసిన తరువాత తనూ హీరోయిన్గా నటించాలనే నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా బాలీవుడ్ దర్శకుడు బాల్కి తెరకెక్కిస్తున్న షమితాబ్ చిత్రంలో నటుడు ధనుష్ సరసన నటించే అవకాశం కొట్టేశారు. ఈ చిత్రంలో అమితాబ్ కూడా ఒక ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఈ కథ అటుంచితే అక్షర, వివాన్‌షాల ప్రేమకు చిల్లులు పడ్డాయన్నది తాజా సమాచారం. ఇప్పటివరకు తమ ప్రేమ వ్యవహారం గురించి నోరు మెదపని వివాన్‌షా ఇప్పుడు పెదవి విప్పారు. అక్షరహాసన్‌తో తన రెండేళ్ల ప్రేమకు ఫుల్స్టాప్ పడిందని ఇకపై తమ మధ్య ఎలాంటి బంధం లేదని మూడు ముక్కల్లో చెప్పేశాడు. -
కమల్ హాసన్ రెండవ కుమార్తె అక్షర హాసన్ తెరంగేట్రం
దేశం గర్వించదగ్గ హీరో కమల్ హాసన్, ప్రముఖ బాలీవుడ్ నటి సాగరికల రెండో కుమార్తె అక్షర హాసన్ వెండితెర పరిచయానికి సిద్ద అయ్యింది. తొలి అడుగు బాలీవుడ్లో వేసింది. మొదట దర్శకత్వ విభాగంలో పనిచేయాలని అక్షర ఆశించింది. అయితే చివరకు అమ్మ, అక్కలాగా హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించే హిందీ చిత్రంలో అతనికి జోడీగా నటిస్తోంది. 'షమితాబ్' అన్న పేరు ఖరారు చేసి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవల విడుదల చేశాడు. సోదరి శృతిహాసన్ ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఓ వెలుగు వెలుగుతుండటంతో అక్షర హాసన్‌కు కూడా మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు. అయితే ధనుష్, శృతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన '3' సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఇప్పుడు ధనుష్ - అక్షర జంటగా నటిస్తున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల ఆదరణ పొందగలదో విడుదల తర్వాత గానీ తెలియదు. షూటింగ్లో అక్షర పనితీరును గమనించిన సినీ పండితులు కోలీవుడ్, టాలీవుడ్‌లలో అక్క శృతి హాసన్‌కు పోటిగా నిలుస్తుందని అంటున్నారు. - శిసూర్య -
అక్క బాటలో అక్షర!
‘‘మా అమ్మాయిల ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనను. వాళ్లు ఏ కెరీర్‌ని సెలక్ట్ చేసుకుంటే దాన్ని ఆమోదిస్తా’’ అని కమల్‌హాసన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆ మేరకు పెద్ద కుమార్తె శ్రుతిహాసన్ హీరోయిన్ అవ్వాలనుకుంటే ‘ఎస్’ అన్నారు. ఇప్పుడు రెండో కుమార్తె అక్షరహాసన్ కథానాయిక అవ్వాలని తీసుకున్న నిర్ణయానికి కూడా ఆయన ఆమోదముద్ర వేశారు. ఆ మధ్య శ్రుతిలా అక్షర కథానాయిక అవాలనుకోవడం లేదనే వార్తలు వచ్చాయి. తను డెరైక్షన్ డిపార్ట్మెంట్లో పని చేయడం ఆ మాటలకు ఊతం ఇచ్చింది. అయితే, ఇప్పుడు అక్షర మనసు మార్చుకుంది. చీనీ కమ్, పా చిత్రాలతో మంచి దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న బాల్కీ దర్శకత్వం వహించనున్న చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం కాబోతోంది అక్షరహాసన్. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్‌బచ్చన్ నటించనుండగా, ‘రాన్‌జనా’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన తమిళ హీరో ధనుష్ కూడా నటించబోతున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు స్వరపరుస్తారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. శ్రుతిహాసన్ కూడా ముందుగా బాలీవుడ్ చిత్రం ద్వారానే కథానాయిక అయ్యి, దక్షిణాది సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అక్క బాటలో అక్షర కూడా ముందు ఉత్తరాదివారికి పరిచయం కానుంది. సో.. ఈ తేనెకళ్ల సుందరి సౌత్‌కి కూడా వస్తుందని ఊహించవచ్చు. ఇక, అక్షర వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. మాజీ తార రతి అగ్నిహోత్రి తనయుడు తనుజ్ వీర్వాణీతో ప్రేమాయణం సాగిస్తోందని సమాచారం.