ఆటోలో...అలా.. అలా...! | shruti haasan akshara haasan Auto Journey in Chennai City | Sakshi
Sakshi News home page

ఆటోలో...అలా.. అలా...!

Published Tue, Jul 19 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

ఆటోలో...అలా.. అలా...!

ఆటోలో...అలా.. అలా...!

 ‘చల్లో.. చల్లో.. హవా మే గాడీ చల్లో. హమారే సాత్ చల్లో..’ అంటూ ‘బెంగాల్ టైగర్’లో రవితేజ, రాశీఖన్నా కారు, బైక్.. ఇలా పలు వాహనాల్లో వెళుతూ పాట పాడుకున్నారు. ఇప్పుడు రియల్‌గా శ్రుతీహాసన్, ఆమె చెల్లెలు అక్షరా హాసన్ కూడా ఈ పాటలో ఉన్నట్లే చేశారు. కాకపోతే ఆ జంట కారు, బైక్‌లో వెళితే ఈ అక్కాచెల్లెళ్లు ఆటోలో జర్నీ చేశారు.
 
 చెన్నై సిటీ అంతా మూడు చక్రాల వాహనంలో ఆనందంగా చక్కర్లు కొట్టేశారు. ఈ ఆనందం వెనక కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! గత వారం కమల్ కాలికి గాయమైనప్పుడు శ్రుతీహాసన్ నార్వేలో ఉన్నారు. నాగచైతన్య సరసన నటిస్తున్న ‘ప్రేమమ్’ పాటల చిత్రీకరణ నిమిత్తం అక్కడ ఉండాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు తండ్రికి ఎలా ఉందోనని ఫోన్ చేసి తెలుసుకుంటూనే ఉన్నారట. నార్వేలో షూటింగ్ పూర్తయిన వెంటనే చెన్నైకి వచ్చిన శ్రుతి నేరుగా తండ్రి దగ్గరికి వెళ్లారు.
 
  హాస్పిటల్‌లో కమల్‌ను చూసిన తర్వాత గానీ శ్రుతి మనసు కుదుట పడలేదట. తండ్రి కోలుకోవడం చూసి రిలీఫ్ అయిపోయారు. ఆ తర్వాత చెల్లెలు అక్షరాహాసన్‌తో కలసి ఆటోలో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోలో తిరగడం శ్రుతీకి అలవాటు. ఈ ఏడాది మార్చిలో స్నేహితులతో అర్ధరాత్రి ఆటోలో చక్కర్లు కొట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement