'తను నా రాజకుమారి'
అందాల తార శృతి హాసన్ తన సోదరి అక్షర హాసన్ మీద ఉన్న ప్రేమంతా ట్వీట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఇవాళ (సోమవారం) అక్షర హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తూ శృతి ట్వీట్ చేశారు. అక్షర గురించి శృతి మాట్లాడుతూ.. తను నా రాజకుమారి అని, చెల్లెలి సంరక్షణ విషయంలో ఎప్పుడూ జాగ్రత్త తీసుకుంటానని, అక్షర సాధిస్తున్న విజయాలు చూసి గర్వపడుతుంటానని చెప్పుకొచ్చారు. అలాగే విషెస్ చెప్తూ తన పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేసిన అభిమానులందరికీ థ్యాంక్యూ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు అక్షర హాసన్.
ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారికల ముద్దుల తనయలు శృతి, అక్షర.. ఇద్దరూ కూడా నాన్నలానే బహు ముఖ ప్రజ్ఞాశాలులు. శృతి నటనతోపాటు సంగీతంలో కూడా ప్రావీణ్యురాలన్న విషయం తెలిసిందే. ఇక అక్షర విషయానికొస్తే.. 'షమితాబ్' చిత్రం ద్వారా తొలిసారి బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన అక్షర మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలందుకుంది. తెర మీద కనబడకముందు ఆమె అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారు.
Happy birthday @AksharaHaasan1 love