సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ చరిష్మా ఏపాటిదో గురువారం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సీఎం పుట్టినరోజునాడు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రపంచ వ్యాప్తంగా అభినందల వెల్లువతో రికార్డులు సృష్టించింది. హెచ్‌బీడీ వైఎస్ జగన్ పేరుతో ఏర్పాటు చేసిన హ్యాష్ ట్యాగ్ ద్వారా ఎక్స్ (ట్విటర్) వేదికగా 3.50 లక్షల మందికి పైగా శుభాకాంక్షలు తెలుపడం ద్వారా ఇండియా ట్రెండింగ్‌లో తొలి స్థానంలో నిలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా వైఎస్ జగన్ పుట్టిన రోజు సందేశం 18.1 కోట్ల మందికి చేరినట్లు ఎక్స్ గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డంకీ, సలార్ వంటి సినిమాలు విడుదల అవుతున్న సమయంలో ఒక రాజకీయ పార్టీ అధినేత పుట్టిన రోజు ఇంత ట్రెండింగ్ కావడం విశేషం. 2 గంటల పాటు ఎక్స్ ఇండియా సర్వర్ షట్‌డౌన్ అయినప్పటికీ ఈ స్థాయిలో ట్వీట్లు రావడం గమనార్హం. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి పోస్ట్‌లు వెల్లువెత్తాయి.
Twitter Is Back 😎
— Satish Reddy (@ReddySatish4512) December 21, 2023
Lets Fill This TL With @ysjagan Anna Videos 🔥
Mine 👇👇 Qoute Yours 🫡#HBDYSJagan pic.twitter.com/SZjyPSiOmf
దీంతో ప్రపంచ వ్యాప్తంగా 5వ స్థానం, ఆసియాలోనూ 5వ స్థానంలో హ్యాపీ బర్త్‌డే వైఎస్ జగన్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ 55 నెలల పాలనలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు చూపేలా రూపొందించిన ఫొటోను వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా గురువారం విడుదల చేసింది.
ఓ వైపు పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలతో ఈ ఫొటో ఆకర్షణీయంగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్రం వైరల్ అయ్యింది.
Next Level..🙏🏻 #HBDYSJaganpic.twitter.com/9RJbOHNZEU
— 𝐴𝑎𝑛𝑎𝑛𝑦𝑎 𝑅𝑒𝑑𝑑𝑦 (@Ananyareddy_law) December 21, 2023
Comments
Please login to add a commentAdd a comment