అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Wishes To Occasion Of Andhra Pradesh Formation Day | Sakshi
Sakshi News home page

అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం: వైఎస్‌ జగన్‌

Published Fri, Nov 1 2024 1:54 PM | Last Updated on Fri, Nov 1 2024 4:51 PM

Ys Jagan Wishes To Occasion Of Andhra Pradesh Formation Day

సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వైఎస్సార్ నేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములుతో పాటు ఎందరో త్యాగాలు చేస్తే ఆంధ్రరాష్ట్రం అవతరించిందన్నారు. 2019-24 మధ్య పొట్టిశ్రీ రాములు ఆశయాలకు వైఎస్‌ జగన్‌ జీవం పోశారన్నారు. ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను వైఎస్‌ జగన్‌ చేసి చూపించారన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలు జరగకపోవడం బాధాకరమని  దేవినేని అవినాష్‌ అన్నారు.

YS Jagan: అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement