సాక్షి, తాడేపల్లి: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. "లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి" అన్న స్వామి వివేకానంద ప్రేరణాత్మక పిలుపు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ యువతీ యువకులందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు.
"లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి" అన్న స్వామి వివేకానంద గారి ప్రేరణాత్మక పిలుపు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ యువతీ యువకులందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2025
లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకూ ఆగకండి..’ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన మహోన్నతమైన సందేశం ఇది. అనేక రకాల వైఫల్యాలు, వైకల్యాల నడుమ బందీ అయిన జీవితాన్ని సమున్నతమైన లక్ష్యం, ఆశయం దిశగా ముందుకు నడిపించేందుకు యువతకు ఆయన ఒకే ఒక ఆయుధాన్ని అందజేశాడు. అదే ధైర్యం.. సాహసం.. నిస్వార్థంగా.. నిర్భయంగా జీవించడం. భయపడకుండా బతకడమే దైవత్వమని చెప్పారు. వివేకానంద చెప్పిన మాటలను నేడు ఆయన జయంతి సందర్భంగా గుర్తుచేసుకుంటూ.. మరిన్ని విశేషాలకు క్లిక్ చేయండి.. గమ్యం.. చేరే వరకూ..!
Comments
Please login to add a commentAdd a comment